అక్షాంశ రేఖాంశాలు: 17°50′10″N 78°29′12″E / 17.8360486°N 78.4865602°E / 17.8360486; 78.4865602

తూప్రాన్ పురపాలకసంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తూప్రాన్ పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
తూప్రాన్ పురపాలకసంఘం is located in తెలంగాణ
తూప్రాన్ పురపాలకసంఘం
తూప్రాన్ పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: 17°50′10″N 78°29′12″E / 17.8360486°N 78.4865602°E / 17.8360486; 78.4865602
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సంగారెడ్డి జిల్లా
మండలం తూప్రాన్
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌ బొంది రవిందర్ గౌడ్
 - వైస్ చైర్‌పర్సన్‌ నందాల శ్రీనివాస్
వైశాల్యము
 - మొత్తం 33.05 km² (12.8 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 23,676
 - పురుషుల సంఖ్య 12,243
 - స్త్రీల సంఖ్య 11,430
 - గృహాల సంఖ్య 6,279
పిన్ కోడ్ - 502334
Area code(s) టెలిఫోన్ కోడ్ - 08452
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

తూప్రాన్ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] తూప్రాన్ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం మెదక్ లోక్‌సభ నియోజకవర్గం లోని గజ్వేల్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

చరిత్ర

[మార్చు]

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న తూప్రాన్, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]

భౌగోళికం

[మార్చు]

తూప్రాన్ 33.05 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 17°50′38″N 78°28′48″E / 17.844°N 78.480°E / 17.844; 78.480 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 55 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం మెదక్ నుండి 54 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 23676 మంది కాగా, అందులో 12243 మంది పురుషులు, 11430 మంది మహిళలు ఉన్నారు. 6279 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 13 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]

పౌర పరిపాలన

[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 16 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం బొంది రవిందర్ గౌడ్ చైర్‌పర్సన్‌గా, నందాల శ్రీనివాస్ వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[5][6] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లు

[మార్చు]
  1. బొంది రవీందర్ గౌడ్
  2. మామిడి వెంకటేష్
  3. ఏర్పుల ఉమ
  4. మామిండ్ల జ్యోతికృష్ణ
  5. చెలిమెల ప్రియాంక
  6. పల్లెర్ల జ్యోతి
  7. జిన్నా భగవాన్ రెడ్డి
  8. బూర్గుల లావణ్యరెడ్డి
  9. బానపురం రాజు
  10. చింత రవీందర్ రెడ్డి
  11. అరుణ వెంకట్ గౌడ్
  12. జమాల్పూర్ లక్ష్మీబాయి
  13. నందాల శ్రీనివాస్
  14. తలారి పద్మ
  15. శ్రీశైలం గౌడ్
  16. కొడిప్యాక నారాయణ గుప్తా

మూలాలు

[మార్చు]
  1. "Thoopran Municipality". thoopranmunicipality.telangana.gov.in. Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 19 April 2021.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 19 April 2021.
  3. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 19 April 2021.
  4. "Basic Information of Municipality, Thoopran Municipality". thoopranmunicipality.telangana.gov.in. Archived from the original on 25 జూన్ 2021. Retrieved 19 April 2021.
  5. సాక్షి, తెలంగాణ (27 January 2020). "తెలంగాణ: మున్సిపల్‌ చైర్మన్లు వీరే". Sakshi. Archived from the original on 27 January 2020. Retrieved 19 April 2021.
  6. నమస్తే తెలంగాణ, తెలంగాణ (27 January 2020). "ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల జాబితా." ntnews. Archived from the original on 3 March 2021. Retrieved 19 April 2021.

వెలుపలి లంకెలు

[మార్చు]