తెలుగు సినిమాలు 1955
ఈ యేడాది 20 చిత్రాలు వెలుగు చూశాయి. అక్కినేని ఆరు చిత్రాల్లోనూ, నందమూరి ఆరు చిత్రాల్లోనూ, ఇద్దరూ కలసి ఒక చిత్రంలోనూ నటించారు. సారథి వారి 'రోజులు మారాయి', యన్. ఏ.టి.వారి 'జయసింహ' అఖండ విజయం సాధించి, రజతోత్సవాలు జరుపుకున్నాయి. రాష్ట్రపతి బహుమతులలో బి.యన్. రెడ్డి రూపొందించిన 'బంగారుపాప' సత్యజిత్ రే తొలి చిత్రం 'పథేర్ పాంచాలి'తో పోటీపడి రజత పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. అన్నపూర్ణ సంస్థ తొలి చిత్రంగా కె.వి.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'దొంగరాముడు' ఘనవిజయం సాధించింది. దీంతో పాటు 'అర్ధాంగి', 'అనార్కలి', 'సంతానం', 'మిస్సమ్మ', 'సంతోషం', 'రేచుక్క', 'శ్రీకృష్ణతులాభారం' చిత్రాలు కూడా శతదినోత్సవం జరుపుకున్నాయి. 'రోజులు మారాయి'లో "ఏరువాకా సాగారో... పాటలో నర్తించిన వహిదా రెహమాన్, 'జయసింహ'లో నాయికగా నటించి, ఆ తరువాత హిందీరంగంలో అగ్రతారగా వెలుగొందారు. మాయలు, మంత్రాలు లేకుండా విజయం సాధించిన తొలి జానపద చిత్రంగా 'జయసింహ' చరిత్రకెక్కింది. గురజాడ అప్పారావు విఖ్యాత నాటిక 'కన్యాశుల్కం'ను వినోదావారు సినిమాగా రూపొందించారు. మొదట సరైన విజయాన్ని చేజిక్కించుకోలేకపోయినా ఈ సినిమా తరువాతి కాలంలో విశేషాదరణ చూరగొంది. యమ్.జి.రామచంద్రన్ నటించిన ఏకైక తెలుగు చిత్రం 'సర్వాధికారి' ఈ యేడాదే విడుదలై ప్రజాదరణ పొందింది.
- అనార్కలి
- ఆడబిడ్డ
- అంతా ఇంతే (డబ్బింగ్?)
- అంతే కావాలి
- అతనెవరు
- అర్థాంగి
- బీదల ఆస్తి
- చెరపకురా చెడేవు
- దొంగరాముడు
- జయసింహ
- కన్యాదానం
- కన్యాశుల్కం
- మిస్సమ్మ
- పసుపు కుంకుమ
- రోజులు మారాయి
- సంతానం
- సంతోషం
- శ్రీజగన్నాథ మహాత్యం
- శ్రీకృష్ణ తులాభారం
- వదిన
- వదినగారి గాజులు
- రేచుక్క (1955 సినిమా)
- విజయగౌరి
తెలుగు సినిమాలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | |