సంతోషం (1955 సినిమా)
సంతోషం (1955 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సి.పి.దీక్షిత్ |
---|---|
నిర్మాణం | ఎం. సోమసుందరం |
తారాగణం | నందమూరి తారక రామారావు, అంజలీదేవి, జమున, జగ్గయ్య, రాజసులోచన, రేలంగి |
సంగీతం | విశ్వనాథన్ - రామమూర్తి |
నిర్మాణ సంస్థ | జుపిటర్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
జుపిటర్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించబడిన ఈ సినిమాకు "వెలైకరి" అనే తమిళ హిట్ సినిమా మాతృక. 'సంతోషం 'తెలుగు చలన చిత్రం 1955 డిసెంబర్ 24 న విడుదల . సి. పి. దీక్షిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం లో నందమూరి తారక రామారావు, అంజలీదేవి, జమున,జగ్గయ్య ,రాజసులోచన , మొదలగు వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతం విశ్వనాథన్, రామమూర్తి అందించారు.
కథ
[మార్చు]తన కొడుకు ఆనంద్ (ఎన్.టి.రామారావు) పై చదువులకోసం జమీందార్ దయానిధి (ఆర్.నాగేంద్రరావు) వద్ద చేసిన అప్పును తీర్చలేక సుందరయ్య (వడ్లమాని విశ్వనాథం) ఆత్మహత్య చేసుకుంటాడు. తండ్రి మరణానికి కారణమైన జమీందార్‌పై పగ తీర్చుకోవడానికి ఆనంద్ ఇంగ్లాండు నుండి తిరిగివచ్చిన తన మిత్రుడు మదన్ మోహన్ (జగ్గయ్య) సహాయంతో అతని స్థానంలో మదన్ మోహన్‌గా వెళతాడు. మోహన్ గ్రుడ్డి తల్లి (కాకినాడ రాజరత్నం) ఆనంద్‌ను మోహన్‌గా భ్రమించి దయానిధి గారాల కూతురు సరస (జమున)తో పెళ్ళి జరిపిస్తుంది. దయానిధి తన కొడుకు మూర్తి (రామశర్మ) పనిమనిషి అమృతం (అంజలీదేవి)ని పెళ్లాడటాన్ని జీర్ణించుకోలేక ఆమెను చంపడానికి ప్రయత్నిస్తాడు. ఆనంద్ అమృతాన్ని దయానిధి నుండి ఎలా కాపాడింది, సరస తన తండ్రిలో ఎలా మార్పును తీసుకొచ్చింది అనేది మిగతా కథ[1].
నటీనటులు
[మార్చు]- నందమూరి తారకరామారావు - ఆనంద్
- జమున - సరస
- కొంగర జగ్గయ్య - మదన్ మోహన్
- రాజ సులోచన - శాంత
- ఆర్.నాగేంద్రరావు - జమీందార్ దయానిధి
- రామశర్మ - మూర్తి
- అంజలీదేవి - అమృతం
- వడ్లమాని విశ్వనాథం - సుందరయ్య
- కాకినాడ రాజరత్నం - మదన్ మోహన్ తల్లి
- పొదిలి కృష్ణమూర్తి - హరిహరదాసు (దొంగస్వామి)
- హెలెన్ - నర్తకి
- బొడ్డపాటి
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకుడు - సి.పి.దీక్షిత్
- సహాయ దర్శకుడు - టి.హనుమంతరావు
- సంగీతం - విశ్వనాథన్ - రామమూర్తి
- మాటలు,పాటలు, స్క్రీన్ ప్లే - సముద్రాల రాఘవాచార్య
- నేపథ్యగానం - జి.కె.వెంకటేష్, పి.సుశీల, ఘంటసాల, పిఠాపురం, జిక్కి, కె.రాణి, రఘునాథ్ పాణిగ్రాహి
- నిర్మాత: ఎం.సోమ సుందరం
- నిర్మాణ సంస్థ: జుపిటర్ పిక్చర్స్
- విడుదల:24:12:1955.
విశేషాలు
[మార్చు]ఈ సినిమా పేరును మొదట అందరికోసం అని అనుకున్నారు. తర్వాత సంతోషంగా మార్చారు. ఇదే చిత్రాన్ని హిందీలో నయా ఆద్మీ పేరుతో తెలుగు సినిమాతో పాటుగా అదే తారాగణంతో నిర్మించారు. కాకపోతే హిందీ సినిమాలో జగ్గయ్య స్థానంలో అన్వర్ హుసేన్, రేలంగి స్థానంలో గోపి నటించారు. హిందీ నర్తకి హెలెన్‌కు తెలుగులో ఇది మొదటి చిత్రం. ఈ సినిమా డిసెంబర్ 24, 1955న విడుదలైంది. ఇదే సినిమాను 1963లో మల్లి మదువె పేరుతో కన్నడ భాషలో రాజకుమార్ హీరోగా పునర్నిమించారు.
పాటలు
[మార్చు]- ఎటులా బ్రతికేనో నేను జాలేలేని భువిలోన ఎటుల బ్రతికేనో - ఘంటసాల - రచన: సముద్రాల
- గాలివలె తేలి విరబాలవలె సోలి ఈలీల పరుగేల ఓ బేలమనసా - జిక్కి
- చిన్నారి దానరా నిన్నేలు జాణరా కన్నార చూడరా నాకన్నా సుందరి - సుశీల
- నిలుపరా మదిలోన హరిని నిరామయుని దయాకరుని నిలుపరా - రఘునాధ్ పాణిగ్రాహి
- నీ పాకట్‌లో రూకుంటే పరువునీదెరో - ఘంటసాల, పిఠాపురం బృందం - రచన: సముద్రాల
- రూపాయి కాసులోనే ఉన్నది తమాషా ఈ పూట
- యువతి మోహన మూర్తి: జిక్కి, రఘనాద పాణిగ్రహి.రచన: సముద్రాల.
- తీయని ఈనాటి రేయీ హాయిని గొలిపేనే తీయని_పి.సుశీల, జి. కె. వెంకటేష్ . రచన :సముద్రాల
- ఉన్నారున్నారున్నారు నరులున్నారు ఈ లోకంలో_పి.సుశీల
- యమునా వాటికి నీటికి... గోపాలుడు బాలగోపాలుడు_పి సుశీల బృందం
- నవ్వవోయి రాజా రాజా నవయవ్వనము ఆనాటి రాజా
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతమ 9. తీయని ఈనాటి రేయీ హాయిని గొలిపేనే తీయని _పి. సుశీల, రచన:సముద్రాల ు బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)