Jump to content

అజ్హగీయ మనవాళ్ పెరుమాళ్ ఆలయం

అక్షాంశ రేఖాంశాలు: 10°29′N 78°25′E / 10.49°N 78.41°E / 10.49; 78.41
వికీపీడియా నుండి
ఉరైయూరు
ఉరైయూరు is located in Tamil Nadu
ఉరైయూరు
ఉరైయూరు
తమిళనాడు పటంలో స్థానం
భౌగోళికాంశాలు :10°29′N 78°25′E / 10.49°N 78.41°E / 10.49; 78.41
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తమిళనాడు
జిల్లా:తిరుచిరాపల్లి
ప్రదేశం:ఉరైయూర్
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:అళగియ మణవాళ పెరుమాల్
ప్రధాన దేవత:నాచ్చియార్
దిశ, స్థానం:ఉత్తరముఖం
పుష్కరిణి:కళ్యాణ పుష్కరిణి
విమానం:కళ్యాణ విమానం
కవులు:తిరుమంగై యాళ్వార్
ప్రత్యక్షం:ధర్మవర్మ, రవివర్మ
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :ద్రవిడ శిల్పకళ

ఉరయూరు, ఉఱైయూరు లేదా ఉరైయూరు, ఇది ప్రస్తుతం తిరుచిరాపల్లిలో భాగంగా ఉన్న ఒక ప్రాంతం . మొదటి నుండి 8వ శతాబ్దం వరకు పూర్వ ఆరంభ చోళుల రాజధాని. ఉరయూర్ అనే పదానికి తమిళంలో నివాసం అని అర్ధం. ఇక్కడ కావేరీ నది దక్షిణ తీరంలో ప్రాచీనమైన కోట ఉంది. తరువాత పాలించిన చోళులు 9వ శతాబ్దం నుండి తంజావూరును రాజధానిగా చేసుకున్నారు.

ఇక్కడ ప్రముఖ దేవాలయాలలో నాచ్చియార్ దేవాలయం వైష్ణవ దివ్యదేశాలలో ఒకటిగా భారతదేశంలో ప్రసిద్ధిచెందింది. ధర్మవర్మ పుత్రికగా లక్ష్మీదేవి అవతరించి వాసలక్ష్మి అనే పేరుతో శ్రీ రంగనాథుని పరిణయమాడిన స్థలమిది. శ్రీరంగములో జరిగే ఆది బ్రహ్మోత్సవం మూడవనాడు శ్రీ రంగనాథుడు ఉరైయూరు వేంచేసి వాసలక్ష్మితో ఏకాసనాసీనులై భక్తకోటిని అనుగ్రహిస్తాడు.

వివరణ

[మార్చు]

అళగియ మణవాళన్ - వాసలక్ష్మి (ఉరైయూర్‌వల్లి నాచ్చియార్) - కల్యాణ పుష్కరిణి - కుడమురుట్టి నది - కల్యాణ విమానము - ఉత్తర ముఖము - నిలచున్న సేవ - ముప్పది మూడు కోట్ల దేవతలకు ధర్మవర్మకు, రవివర్మకు ప్రత్యక్షం - తిరుమంగై యాళ్వార్ కీర్తించింది.

విశేషాలు:

[మార్చు]

ధర్మవర్మ పుత్రికగా లక్ష్మీదేవి అవతరించిన వాసలక్ష్మి అను పేరుతో శ్రీరంగనాధుని పరిణయమాడిన స్థలం. మీన మాసములో శ్రీరంగములో జరుగు ఆది బ్రహ్మోత్సవం మూడవనాడు శ్రీరంగనాథులు ఉరైయూరు వేంచేసి వాసలక్ష్మితో ఏకాసనాసీనులై భక్తకోటికి అనుగ్రహిస్తాడు. శ్రీరంగనాథుడు మేష మాసం, ఉత్తరా నక్షత్రాన అవతరించాడు. ఇచట స్వామి ప్రయాగ చక్రముతో వేంచేసిఉంటాడు తిరుప్పాణి ఆళ్వార్లు ఈ క్షేత్రముననే అవతరించాడు. ఈ క్షేత్రమునకు "కోళి" యని "నాచ్చియార్ కోయిల్" అని తిరునామాలు ఉన్నాయి. ఇది తిరుచ్చిలో ఒక భాగం. తిరుచ్చి నుండి 2 కి.మీ. టౌన్ బస్ సర్వీసులు ఉన్నాయి.

సాహిత్యంలో ఉరైయూర్

[మార్చు]

శ్లోకం:
లక్ష్మీ చరణ ళాక్షాంక సాక్షి శ్రీవత్స వక్షసే
క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళమ్‌ |

శ్లోకం:
శుభే కల్యాణ్యాఖ్యాప్రథిత వర తీర్థేషు నిచుళా
పురే పారే రమ్యే శుభ కుడమురుట్ట్యాఖ్య సరితః
విమానే కల్యాణే ధనపతి దిశావక్త్ర రుచిరః
స్థితో భాతి శ్రీమాన్ వరవర సమాఖ్యో మధురపుః

శ్లోకం:
త్రయస్త్రింశత్కోటిదేవ రవిధర్మాది గోచరః
కలిధ్వంసి ముని స్తుత్యో వాసలక్ష్మీ సమంవితః

పాశురము :
కోళయం కూడలుమ్‌ కోయిల్ కొణ్డ కోవలరే యొప్పర్; కున్ఱమన్న
పాళయమ్‌ తోళుమోర్ నాన్గుడైయర్ పణ్డివర్‌తమ్మైయుం కణ్డఱియోమ్;
వాళయరో వివర్‌వణ్ణ మెణ్ణిల్ మా కాడల్ పోన్ఱుళర్; కైయిల్ వెయ్య
ఆళయొన్ఱేన్దియోర్ శజ్గు పత్తియచ్చో వొరువ గియవా. తిరుమంగై ఆళ్వార్ - పెరియతిరుమొల్ 9-2-5.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • Nilakanta Sastri, K.A. (1935). The CōĻas, University of Madras, Madras (Reprinted 1984).

బయటి లింకులు

[మార్చు]