2012 భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు
| |||||||||||||||||||||||
| |||||||||||||||||||||||
|
2012 భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు, 2012 ఆగస్టు 7 [1] న భారత ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడానికి జరిగాయి. మహ్మద్ హమీద్ అన్సారీ ని యూపీఎ రెండవసారి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ జస్వంత్ సింగ్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. [2] [3]
ముహమ్మద్ హమీద్ అన్సారి రెండవ సారి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. [4] 1957 లో సర్వేపల్లి రాధాకృష్ణన్ తర్వాత రెండుసార్లు భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తిగా మహమ్మద్ హామీద్ అన్సారీ నిలిచాడు.
నేపథ్యం
[మార్చు]భారత ఉపరాష్ట్రపతి పదవీకాలం 5 సంవత్సరాలు. ఉపరాష్ట్రపతిగా ఉన్న మహమ్మద్, హమీద్ అన్సారీ, ఆగస్టు 11న ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు, అందువల్ల అతని పదవీకాలం 10 ఆగస్టు 2012తో ముగిసింది. భారత ఎన్నికల సంఘం ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నగారా మోగించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా టికె విశ్వనాథన్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా విఆర్ రమేష్ నియమితులయ్యారు. [5]
ఎలక్టోరల్ కాలేజీ
[మార్చు]ఎలక్టోరల్ కాలేజీలో 245 మంది రాజ్యసభ సభ్యులు 545 మంది లోక్‌సభ సభ్యులు, మొత్తం 790 మంది ఓటర్లు ఉన్నారు. [5]
కాలక్రమం
[మార్చు]2012 జూలై 3న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది, [5]
- నోటిఫికేషన్ - జూలై 6.
- నామినేషన్లకు చివరి తేదీ - జూలై 20.
- నామినేషన్ల పరిశీలన - జూలై 21.
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ - జూలై 23
- తేదీ ఓటింగ్ గంటలు - 7 ఆగస్టు ఉదయం 10:00 నుండి సాయంత్రం 5:00 వరకు. 6:00 గంటలకు ఫలితాల ప్రకటన.
అభ్యర్థులు
[మార్చు]ఈ ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో 34 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. వీరిలో ఏడుగురు చివరి రోజు నామినేషన్ దాఖలు చేశారు. నాలుగు నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. [6]
జస్వంత్ సింగ్
[మార్చు]జస్వంత్ సింగ్ జూలై 20న నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమి తరపున నామినేషన్ దాఖలు చేశారు జస్వంత్ సింగ్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఎల్‌కే అద్వానీ, సుమిత్రా మహాజన్ యశ్వంత్ సిన్హా ముగ్గురు మూడు సెట్ పేపర్‌లను రిటర్నింగ్ అధికారి విశ్వనాథన్‌కు సమర్పించారు. [7] జస్వంత్ సింగ్ అభ్యర్థిత్వాన్ని ఎన్‌డిఎ జూలై 16న ప్రకటించింది. [8] అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం అధినేత్రి జయలలిత, బిజూ జనతాదళ్‌కు చెందిన నవీన్ పట్నాయక్‌లు జస్వంత్ సింగ్ కు మద్దతు తెలిపారు. [9]
హమీద్ అన్సారీ
[మార్చు]యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, ప్రధాని, మన్మోహన్ సింగ్ సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శరద్ పవార్, రాష్ట్రీయలోక్ దళ్ నాయకుడు అజిత్ సింగ్, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా., ఆర్థిక మంత్రి పి చిదంబరం, రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ ఆర్‌జెడి నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్‌లు సమక్షంలో మహమ్మద్ హమీద్ అన్సారి నామినేషన్ దాఖలు చేశాడు. [10]
ఫలితాలు
[మార్చు]అన్సారీ రెండవసారి ఉపరాష్ట్రపతిగా ఎన్నికలలో గెలుపొందాడు. 1957లో ఎన్నికైన సర్వేపల్లి రాధాకృష్ణన్ తర్వాత రెండుసార్లు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక వ్యక్తిగా నిలిచారు. [11]
మూలాలు
[మార్చు]- ↑ "BJP to field candidate for vice-president against Hamid Ansari". NDTV. 15 July 2012. Retrieved 3 August 2012.
- ↑ "Jaswant Singh to give stature to vice-president poll contest". DNA India. 16 July 2012. Retrieved 3 August 2012.
- ↑ "Ansari may write to MPs of UPA and supporting parties". DNA India. 3 August 2012. Retrieved 3 August 2012.
- ↑ "Hamid Ansari gets second term as vice president". Hindustan Times. August 7, 2012. Archived from the original on 8 August 2012. Retrieved 22 August 2014.
- ↑ 5.0 5.1 5.2 PRESS NOTE Subject: Election to the Office of the Vice-President, 2012 (14th Vice-Presidential Election), ELECTION COMMISSION OF INDIA
- ↑ "Hamid Ansari, Jaswant Singh among 34 in fray for Vice Presidential poll". 20 July 2012. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 4 August 2012.
- ↑ "Jaswant Singh files nomination for Vice Presidential poll". The Economic Times. 20 July 2012. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 3 August 2012.
- ↑ "Jaswant Singh is NDA nominee for Vice Presidential election". The Indian Express. 16 July 2012. Retrieved 4 August 2012.
- ↑ "Vice-Presidential poll: Jaswant Singh to seek J Jayalalithaa, BJD support". The Economic Times. 3 August 2012. Archived from the original on 3 నవంబర్ 2015. Retrieved 4 August 2012.
{{cite web}}
: Check date values in:|archive-date=
(help) - ↑ "Vice-presidential poll: Hamid Ansari files nomination papers". The Times of India. 18 July 2012. Archived from the original on 3 February 2014. Retrieved 3 August 2012.
- ↑ "Hamid Ansari re-elected vice-president in one-sided contest". The Times of India. August 8, 2012. Retrieved May 25, 2016.