సి.వి.శ్రీధర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సి.వి.శ్రీధర్
2013లో విడుదలైన తపాలా బిళ్ళపై శ్రీధర్
జననం
చిట్టమూరి విజయరాఘవులు శ్రీధరకృష్ణన్

(1933-07-22)1933 జూలై 22
చిట్టమూరు, చెంగల్పట్టు, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
మరణం2008 అక్టోబరు 20(2008-10-20) (వయసు 75)
చెన్నై
వృత్తి
  • సినిమా దర్శకుడు
  • నిర్మాత
  • సినిమా రచయిత
క్రియాశీల సంవత్సరాలు1959–1991
జీవిత భాగస్వామిదేవసేన
తల్లిదండ్రులువిజయరాఘవులు రెడ్డియార్r
తాయారమ్మాళ్

చిట్టమూరి విజయరాఘవులు శ్రీధర్ (సి.వి.శ్రీధర్) (23 జూలై 1933 - 20 అక్టోబర్ 2008) ఒక భారతీయ చలన చిత్ర దర్శకుడు. ఇతడు తమిళ, తెలుగు, హిందీ భాషలలో 60కిపైగా సినిమాలకు దర్శకత్వం వహించాడు.


జీవిత విశేషాలు

[మార్చు]

శ్రీధర్ తమిళనాడు రాష్ట్రంలోని మధురాంతకం సమీపంలోని చిట్టమూర్ అనే గ్రామానికి చెందినవాడు. ఇతడు చెంగల్పట్టులోని సెయింట్ జోసెఫ్ హైస్కూలులో చదివాడు. ఇతడు 7వ తరగతి చదివే సమయం నుండే రచనలు చేయడం, నాటకాలలో నటించడం ప్రారంభించాడు.

వృత్తి

[మార్చు]

ఇతడు తన 18వ యేట రక్తపాశం అనే తమిళ నాటకాన్ని వ్రాయగా టి.కె.షణ్ముగం దానిని అనేక చోట్ల ప్రదర్శించాడు. తరువాత ఈ నాటకాన్ని జుపిటర్ పిక్చర్స్ సినిమాగా తీసింది. ఆ సినిమాకు శ్రీధర్ సంభాషణలు వ్రాశాడు. పిమ్మట 1956లో ఈ చిత్రాన్ని ఎ.వి.యం. ప్రొడక్షన్స్ అశోక్ కుమార్, కిశోర్ కుమార్ నటులుగా భాయి భాయి అనే పేరుతో హిందీలో నిర్మించింది. ఆ చిత్రానికి కూడా ఇతడు స్క్రీన్ ప్లే, సంభాషణలను సమకూర్చాడు. తరువాత ఇతడు మాడరన్ థియేటర్స్, వీనస్ పిక్చర్స్ మొదలైన సంస్థలకు పనిచేశాడు. తరువాత చిత్రాలయ అనే స్వంత సంస్థను ప్రారంభించి కొన్ని సినిమాలను నిర్మించాడు.

మరణం

[మార్చు]

ఇతడు తన 75వ యేట 2008, అక్టోబర్ 20న చెన్నైలో గుండెపోటుతో మరణించాడు.[1]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

శ్రీధర్ దర్శకత్వం వహించిన తెలుగు సినిమాల జాబితా:[2]

సంవత్సరం సినిమా పేరు పాత్ర వివరాలు
దర్శకుడు నిర్మాత కథ స్క్రీన్ ప్లే/సంభాషణలు
1954 జ్యోతి Green tickY కె.బి.తిలక్‌తో కలిసి
1960 పెళ్ళికానుక Green tickY Green tickY
1961 కష్టసుఖాలు Green tickY Green tickY విదివెల్లి తమిళ సినిమా డబ్బింగ్
1961 విరిసిన వెన్నెల Green tickY తెన్ నిలవు తమిళ సినిమా డబ్బింగ్
1961 స్త్రీ హృదయం Green tickY Green tickY మీంద సొర్గమ్‌ తమిళ సినిమా డబ్బింగ్
1964 మాస్టారమ్మాయి Green tickY Green tickY సుమైతాంగి తమిళ సినిమా డబ్బింగ్
1965 మారని మనసులు Green tickY Green tickY Green tickY నెంజం మరప్పతిల్లై తమిళ సినిమా డబ్బింగ్
1966 మనసే మందిరం Green tickY Green tickY నెంజిల్ ఒరు ఆలయం తమిళ సినిమా డబ్బింగ్
1969 ఆదర్శ పెళ్ళిళ్ళు Green tickY Green tickY ఊటీ వరై ఉరవు తమిళ సినిమా డబ్బింగ్
1970 విప్లవం వర్ధిల్లాలి Green tickY Green tickY Green tickY శివంద మన్ తమిళ సినిమా డబ్బింగ్
1975 లక్ష్మి నిర్దోషి Green tickY
1976 హీరో - 76 Green tickY వైర నెంజమ్ తమిళ సినిమా డబ్బింగ్
1977 మనసున్న మనిషి Green tickY
1977 సీత గీత దాటితే Green tickY Green tickY
1978 వయసు పిలిచింది Green tickY Green tickY Green tickY
1979 ఊర్వశీ నీవే నా ప్రేయసి Green tickY Green tickY Green tickY
1980 జన్మహక్కు Green tickY
1980 హరే కృష్ణ హలో రాధ Green tickY
1984 ప్రేమ సంగమం Green tickY
1984 రౌడీలకు సవాల్ Green tickY తడిక్కుం కరంగళ్ తమిళ సినిమా డబ్బింగ్
1985 ఆలయదీపం Green tickY
1987 అందరికంటే ఘనుడు Green tickY Green tickY
1987 పొగరుబోతు Green tickY
1988 ప్రేమాయణం Green tickY
1990 మొగుడికి తగ్గ పెళ్ళామ్ Green tickY

పురస్కారాలు

[మార్చు]

ఇతడు అనేక పురస్కారాలకు ప్రతిపాదించబడ్డాడు. అనేక పురస్కారాలను స్వీకరించాడు. ఇతడు అందుకున్న కొన్ని పురస్కారాలు:

మూలాలు

[మార్చు]
  1. Dore, Shalini. "Indian director C.V. Sridhar dies". వెరైటీ. Retrieved 19 August 2012.
  2. web master. "All Movies C.V. Sridhar". ఇండియన్ సినిమా. Archived from the original on 20 September 2022. Retrieved 20 September 2022.
  3. "7th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Archived (PDF) from the original on 26 March 2015. Retrieved 20 September 2022.
  4. "10th National Film Awards". International Film Festival of India. Archived from the original on 29 సెప్టెంబరు 2015. Retrieved 9 సెప్టెంబరు 2011.

బయటి లింకులు

[మార్చు]