సవై మధోపూర్
సవై మధోపూర్
మధోపూర్ | |
---|---|
Nickname: టైగర్ సిటీ | |
Coordinates: 25°59′N 76°22′E / 25.983°N 76.367°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | రాజస్థాన్ |
జిల్లా | సవై మధోపూర్ |
Founded by | సవై మధోపూర్ సింగ్ 1 |
Named for | సవై మధోపూర్ పేరుతో |
Government | |
• Type | మునిసిపల్ కౌన్సిల్ |
• Body | సవై మధోపూర్ పురపాలక సంఘం |
విస్తీర్ణం | |
• Total | 59 కి.మీ2 (23 చ. మై) |
Elevation | 257 మీ (843 అ.) |
జనాభా (2011)[2] | |
• Total | 1,21,106 |
• జనసాంద్రత | 2,100/కి.మీ2 (5,300/చ. మై.) |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్‌కోడ్ | 322001 |
ప్రాంతీయ ఫోన్‌కోడ్ | 07462 |
Vehicle registration | RJ-25 |
లింగ నిష్పత్తి | (పురుషులు) 1000:922 (స్త్రీలు) |
సవై మధోపూర్, భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన సవై మధోపూర్ జిల్లాలోని ఒక నగరం. ఇది నగరపాలక సంస్థ నిర్వహణలోఉంది. ఇది రాజస్థాన్ లోని సవై మధోపూర్ జిల్లాకు ప్రధాన పరిపాలనా కేంద్రస్థానం. సవౌ మధోపూర్ రైల్వే స్టేషన్ నుండి 7 కి.మీ దూరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన రణతంబోర్ కోట, రణతంబోర్ జాతీయ ఉద్యానవనం ఉన్నాయి. సవై మధోపూర్ లో త్రినేత్ర గణేష్ ఆలయం ఉంది. నగర సమీపం చుట్టూ 40 కి.మీ. ప్రాంతంలో జామ పంటను పండిస్తారు.సవై మధోపూర్ నుండి 11-12 కిలోమీటర్ల దూరంలోని ఇటావా గ్రామంలో బాలాజీ ఆలయం ఉంది.ఇది చాలా పేరుపొందిన ఆలయం.దేవ్‌పురా రైల్వే స్టేషన్‌కు ఇది 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది.
స్థానం
[మార్చు]సవై మధోపూర్ ఆగ్నేయ రాజస్థాన్‌లో ఉంది.ఇది సంక్లిష్ట భూగర్భ శాస్త్రంలో వింధ్యన్ పీఠభూమి ఉత్తర విస్తరణపై ఉంది. నగరం సుమారు 121 కిలోమీటర్లు (75 మై.) విస్తరించి ఉంటుంది.దీనికి ఆగ్నేయంగా జైపూర్ ఉంది.[3] పట్టణానికి ఉత్తరాన బనాస్ నది ఉంది. తూర్పున పర్బాటి నది అడ్డంగా, మధ్యప్రదేశ్ లోని పెద్ద కునో వన్యప్రాణుల అభయారణ్యం హద్దులుగా ఉన్నాయి.
చరిత్ర
[మార్చు]సవై మధోపూర్ జైపూర్ మహారాజా మాధో సింగ్ I (1751–1768) చేత ప్రణాళికాబద్ధమైన నగరంగా నిర్మించబడింది.1763 జనవరి 19 న నిర్మాణం ప్రారంభించబడింది.అతని మరణం తరువాత దీనికి అతని పేరు పెట్టబడింది.సవై మధోపూర్ ప్రతి సంవత్సరం దాని పునాది దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 1936లో మహారాజా మన్ సింగ్ II (1912–1971) నిర్మించిన, హోటల్ సవై మధోపూర్ లాడ్జ్ పులి వేట రోజుల అవశేషంగా మిగిలిపోయింది.అతని మరణం వరకు దీనిని వేట లాడ్జిగా ఉపయోగించారు. ఇది రెండు అంతస్తుల భవనం. పొడవైన వరండాతో నెలవంక ఆకారంలో నిర్మించబడింది.ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ 1961 జనవరిలో ఈ లాడ్జిని సందర్శించింది.
వాతావరణం
[మార్చు]సవై మధోపూర్ శీతాకాలం, వేసవి, వర్షాకాలంతో ఉపఉష్ణమండల పొడివాతావరణాన్ని కలిగి ఉంటుంది. మే, జూన్ మధ్య అత్యధిక ఉష్ణోగ్రత 49 °C (120 °F) ఉంటుంది.అతి తక్కువ ఉష్ణోగ్రత డిసెంబరు, జనవరి మధ్య 2 °C (36 °F) వరకు తగ్గుతుంది.
జనాభా
[మార్చు]సంవత్సరం | జనాభా |
---|---|
1991 | 72,165
|
2001 | 1,01,997
|
2011 | 1,21,106
|
2011 భారత జనాభా లెక్కలు ప్రకారం సవై మధోపూర్ పట్టణ జనాభా మొత్తం 121,106 అందులో పురుషులు 53 శాతం మంది ఉండగా, స్త్రీలు 47 శాతం మంది ఉన్నారు. పట్టణ సరాసరి అక్షరాస్యత రేటు 79.44 ఉంది. ఇది జాతీయ సగటు అక్షరాస్యత కన్నా74.04%కన్నా ఎక్కువ. పురుషులు అక్షరాస్యత 90.09 శాతం ఉండగా, స్తీల అక్షరాస్యత పురుషులుకన్నా తక్కువుగా (67.98) ఉంది. పట్టణ జనాభాలో 6 సంవత్సరాలు అంతకంటే తక్కువ వయస్సుగల పిల్లలు 12.89 శాతంమంది ఉన్నారు.[4][5] సవై మధోపూర్ జనాభాలో, జాట్, అహిర్, గుర్జార్, మీనా వర్గాలుకు చెందిన జనాభా విలీనమైఉన్నారు.
మతం
[మార్చు]సవై మధోపూర్‌లో జనాభాలో ఎక్కువమంది హిందువులు ఉన్నారు.20 శాతానికి పైగా ముస్లింలు, క్రైస్తవులు చాలా తక్కువ శాతం మంది ఉన్నారు.[5]
పాలన
[మార్చు]సవై మధోపూర్ నగరపాలక సంస్థ పట్టణం. పౌర సేవలుకు, పట్టణ అభివృద్ధి పనులుకు, పరిపాలనకు బాధ్యత వహిస్తుంది.నగరపాలక సంస్థ చైర్మన్ నేత్రత్వంలో పరిపాలన సాగుతుంది.
ఆర్థిక వ్యవస్థ
[మార్చు]సవై మధోపూర్ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం, ఆతిథ్యంపై ఆధారపడి ఉంది.సవై మధోపూర్ చుట్టూ జామ పంట పండిస్తారు.జామ పంట చిల్లర, ఏక మొత్త వ్యాపారాల ద్వారా 2015 లో 5 బిలియన్ రూపాయలకు పైగా ఆదాయం సమకూరినట్లు అంచనా. 2015 లో ఐదువేల హెక్టార్ల భూమిని జామ పంట సాగుకు అంకితం చేశారు.[6] ఈ ప్రాంతం నుండి ఉత్పత్తులు, ముఖ్యమైన నూనెలు, సాంప్రదాయ ఔషధాల వెలికితీత కోసం ఉపయోగిస్తారు.
ఉత్సవాలు, పండుగలు
[మార్చు]సవై మధోపూర్ ఉత్సవ్
[మార్చు]సవై మధోపూర్ ఉత్సవ్ అనేది ప్రతి సంవత్సరం జనవరి 19 న సవై మధోపూర్ నగరం పునాది రోజున జరిగే వార్షిక వేడుక.1763 లో మహారాజా సవై మధో సింగ్ I చే సవై మధోపూర్ నగరాన్ని స్థాపించిన రోజు సందర్భంగా ఇది జరుగుతుంది.[7]
గణేష్ చతుర్థి పండగ
[మార్చు]సవై మధోపూర్ ఉత్సవాలలో గణేష్ చతుర్థి పండగ అతిపెద్దది. రణతంభోర్ కోటలోని గణేష్ ఆలయంలో భాద్రపద శుక్ల చతుర్థిలో దీనిని మూడు రోజులుగా జరుపుకుంటారు.
దసరా
[మార్చు]అక్టోబరు నెలలో 10 రోజులు సవై మధోపూర్‌లో దసరా జరుపుకుంటారు.
చౌత్ మాతా మేళా
[మార్చు]చౌత్ మాతా మేళా ఉత్సవం జనవరి నెలలో చౌత్ కా బార్వారాలోని చౌత్ మాతా ఆలయంలో జరుగుతుంది.
సంస్కృతి
[మార్చు]భాష
[మార్చు]సవై మధోపూర్‌లో సాధారణంగా మాట్లాడే భాషలు ఇంగ్లీష్, హిందీ, హడోటి.
స్థానిక నృత్యాలు
[మార్చు]సవై మధోపూర్‌లో ప్రదర్శించిన నృత్యాలలో ఘూమర్ నృత్యం,సవై మధోపూర్ నృత్యం, కల్బెలియా నృత్యం ఉన్నాయి.
పర్యాటక ప్రదేశాలు
[మార్చు]రణతంబోర్ కోట
[మార్చు]సవై మధోపూర్ చరిత్ర రణతంబోర్ కోటతో ముడిపడి ఉంది. దాని నిర్మాణ తేదీ తెలియదు.ఈ కోట శుష్క భూమిలో ఒక ఒయాసిస్ను అందిస్తుంది.
రణతంబోర్ జాతీయ ఉద్యానవనం
[మార్చు]భారతదేశంలో అతిపెద్ద జాతీయ ఉద్యానవనాలలో ఇది ఒకటి.ఇది సుమారు సవై మధోపూర్ నుండి 11 కి.మీ. (6.8 మైళ్లు) దూరంలో ఉంది.1973 లో ఈ భూమి పులుల పెంపకంకానికి కేటాయించబడింది.ఈ ప్రాంతానికి 1980 లో రణతంబోర్ జాతీయ ఉద్యానవనంగా పేరు మార్చారు.
రాజీవ్ గాంధీ ప్రాంతీయ సహజ చరిత్ర ప్రదర్శనశాల
[మార్చు]2007 డిసెంబరు 23 న, సవై మధోపూర్‌లోని రాజీవ్ గాంధీ ప్రాంతీయసహజ చరిత్ర ప్రదర్శనశాల పునాదిరాయి వేడుకను భారత ఉపాధ్యక్షుడు హమీద్ అన్సారీ నిర్వహించారు.ఈ ప్రదర్శశాల భారతదేశంలోని పశ్చిమ శుష్క ప్రాంతం పర్యావరణంపై దృష్టి పెడుతుంది.
చమత్కర్జీ జైన దేవాలయం
[మార్చు]చమత్కర్జీ జైన ఆలయం అలాన్పూర్ గ్రామంలో ఉంది. ఈ ఆలయం మధ్యయుగ కాలం నాటిది. ఈ ఆలయం పంచరత శైలితో నిర్మించబడింది. ప్రధాన మందిరం రిషభనాథ విగ్రహాన్ని కలిగి ఉంది [8]
రవాణా
[మార్చు]గాలి
[మార్చు]సవై మధోపూర్‌లో ఎయిర్‌స్ట్రిప్ ఉంది. ఇది ప్రైవేట్ జెట్స్‌కు ఉపయోగించబడుతుంది. సుప్రీం ఎయిర్‌లైన్స్ 2018 ఏప్రిల్ 11 నుండి సవై మధోపూర్, ఢిల్లీ మధ్య సాధారణ విమాన కార్యకలాపాలను ప్రారంభించింది.[9] సమీప విమానాశ్రయం జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం 132 కిలోమీటర్లు (82 మై.) దూరంలో ఉంది.
రైలు ద్వారా
[మార్చు]సవై మధోపూర్ జంక్షన్ ఢిల్లీ నుండి ముంబై ట్రంకు మార్గంలో ఉంది మైసూర్ ఎక్స్‌ప్రెస్, జైపూర్ - చెన్నై ఎక్స్‌ప్రెస్, జైపూర్ - కోయంబత్తూర్ ఎక్స్‌ప్రెస్, జోధ్పూర్ - పూరి ఎక్స్‌ప్రెస్, జోధ్పూర్ - భోపాల్ ఎక్స్‌ప్రెస్, జోధ్పూర్ - ఇండోర్ ఇంటర్‌సిటీ, ఆగస్టు క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్, ఇంకా ఇంకా ఇతర రైళ్లు ఈ నగరానికి ప్రయాణిస్తాయి.
జైపూర్ - ఇండోర్ సూపర్-ఫాస్ట్ సవై మధోపూర్‌ను మధ్యప్రదేశ్‌లోని ప్రధాన నగరమైన ఇండోర్ జంక్షన్‌తో కలుపుతుంది. సవై మధోపూర్ నుండి దేశ రాజధాని ఢిల్లీ వరకు జాన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు కూడా ఉంది. కోట - పాట్నా ఎక్స్‌ప్రెస్ సవై మధోపూర్, పాట్నా నగరాలను ఆగ్రా, కాన్పూర్, లక్నో, వారణాసి ద్వారా కలుపుతుంది.
రోడ్లు
[మార్చు]జాతీయ రహదారి-116 (టోంక్-సవై మధోపూర్), కోట-లాల్సోట్ మెగా హైవే నగరం గుండా వెళుతున్నాయి.
ఇవి కూడ చూడు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Sawai Madhopur City". Archived from the original on 2021-01-17. Retrieved 2021-02-06.
- ↑ "Census of India Search details". censusindia.gov.in. Retrieved 10 May 2015.
- ↑ Jaipur to Sawai Madhopur Make my trip website, route planner. Accessed 30 September 2017
- ↑ "Name Census 2011, Rajasthan data" (PDF). censusindia.gov.in. 2012. Retrieved 28 February 2012.
- ↑ 5.0 5.1 "Sawai Madhopur City Census 2011 data". www.census2011.co.in. 2013. Retrieved 27 March 2013.
- ↑ "Sawai Madhopur Bhaskar". Dainik Bhaskar. Retrieved 23 November 2015.
- ↑ Sawaimadhopurutsav
- ↑ "ALANPUR JAIN TEMPLE". Archaeological Survey of India. Retrieved October 5, 2020.
- ↑ https://www.hindustantimes.com/jaipur/before-inaugural-delhi-sawai-madhopur-flight-police-say-airport-unfit/story-0rbYHM1EcKUHCN8hDMCaYP.html