దుంగర్‌పూర్
దుంగర్‌పూర్ | |
---|---|
Coordinates: 23°50′N 73°43′E / 23.84°N 73.72°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | రాజస్థాన్ |
జిల్లా | దుంగర్‌పూర్ |
Founded by | రాజా దుంగార్ సింగ్ |
Named for | దుంగార్ సింగ్ |
Government | |
• Body | దుంగర్‌పూర్ మున్సిపల్ కౌన్సిల్ |
Elevation | 225 మీ (738 అ.) |
జనాభా (2011) | |
• Total | 47,706 |
భాషలు | |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
ప్రాంతీయ ఫోన్‌కోడ్ | 02964 ****** |
Vehicle registration | RJ-12 |
లింగ నిష్పత్తి | 1:1 |
దుంగర్‌పూర్ భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్ర దక్షిణ భాగంలో ఉన్న ఒక నగరం. దుంగర్‌పూర్ జిల్లాకు ఇది ప్రధాన పరిపాలనా కేంద్రం. ఇది రాజస్థాన్ దక్షిణ భాగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం. దీనిలో అస్‌పూర్ తాలూకా కలిసి ఉంది.
చరిత్ర
[మార్చు]దుంగర్‌పూర్ మేవార్ గుహిలోట్ కుటుంబానికి చెందిన పెద్ద శాఖ స్థానం.చిన్నశాఖ స్థానం ఉదయపూర్ మహారాణా.ఈ నగరాన్నిసా.శ. 1282 లో మేవార్ పాలకుడు కరణ్ సింగ్ పెద్ద కుమారుడు రావల్ వీర్ సింగ్ స్థాపించాడు.[1] అతను గుహిలోట్ రాజవంశం ఎనిమిదవ పాలకుడు, మేవార్ రాజవంశం స్థాపకుడు (పాలన 734-753) బప్పా రావల్ వారసుడు.
12 వ శతాబ్దంలో మేవార్ చీఫ్ కరణ్ సింగ్ పెద్ద కుమారుడు మహూప్ వారసులు కావడంతో దుంగర్‌పూర్ ముఖ్యులు మహారావాల్ బిరుదును పొందాడు.మేవార్ పెద్ద శ్రేణి గౌరవాలను పొందాడు. తన తండ్రిచేత నిరాకరింపబడిన మహూప్ అతని తల్లి కుటుంబంలో ఆశ్రయం పొందాడు. బాగర్ (రాజస్థాన్) చౌహాన్లు, బిల్ నేతలు ఖర్చుతో తనను తాను ఆదేశానికి అధిపతిగా చేసుకున్నాడు.[2] అతని తమ్ముడు రాహుప్ ప్రత్యేక సిసోడియా రాజవంశాన్ని స్థాపించాడు.
దుంగర్‌పూర్ పట్టణం రాష్ట్ర రాజధాని. 14 వ శతాబ్దం ముగింపులో రావల్ బిర్ సింగ్ చేత స్థాపించబడింది. మేవార్ కు చెందిన సావంత్ సింగ్ ఆరవ వంశస్థుడు రావల్ ఉదయ్ సింగ్ ను స్వతంత్ర బిల్ సేనాపతి హత్య చేసిన తరువాత దీనికి దుంగారియా అని పేరు పెట్టారు.1527 లో ఖాన్వా యుద్ధంలో బాబర్కు చెందిన రావల్ ఉదయ్ సింగ్ మరణం తరువాత, అక్కడ అతను బాబర్కు వ్యతిరేకంగా రానా సంగ్ తో కలిసి పోరాడాడు.అతని భూభాగాలు దుంగర్‌పూర్,బన్స్వారా రాష్ట్రాలుగా విభజించారు.మొఘల్, మరాఠా కింద విజయవంతంగా పాలించబడి, 1818 లో ఒప్పందం ద్వారా బ్రిటిష్ రాజ్ నియంత్రణలోకి వచ్చింది.ఇది 15-గన్ సెల్యూట్ స్టేట్ గా మిగిలిపోయింది.
1901 లో, దుంగర్‌పూర్ పట్టణ జనాభా 6094.దుంగర్‌పూర్ చివరి రాచరిక పాలకుడు రాయ్-ఇ-రాయన్ మహారావాల్ శ్రీ లక్ష్మణ్ సింగ్ బహదూర్ (1918-1989). ఇతనికి కెసిఎస్ఐ (1935), జిసిఐఇ (1947) లభించింది. స్వాతంత్ర్యం తరువాత రెండుసార్లు రాజ్యసభ సభ్యుడయ్యాడు. 1952, 1958, తరువాత 1962,1989లో రాజస్థాన్ శాసనసభ (ఎమ్మెల్యే ) సభ్యుడుగా ఎన్నికైయ్యాడు.[3]
జనాభా
[మార్చు]2011 భారత జనాభా లెక్కలు ప్రకారం దుంగర్‌పూర్ పట్టణ జనాభా 47,706. అందులో పురుషులు 52% మంది ఉండగా, స్త్రీలు 48% మంది ఉన్నారు.[4] దుంగర్‌పూర్ పట్టణ సరాసరి అక్షరాస్యత 76%, ఇది జాతీయ సరాసరి అక్షరాస్యత శాతం 59.5 కన్నా ఎక్కువ.పురుషులు అక్షరాస్యత శాతం 83%,స్త్రీల అక్షరాస్యత శాతం 69%. దుంగర్‌పూర్ పట్టణ మొత్తం జనాభాలో 13 శాతం మంది 42 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు.
వాతావరణం
[మార్చు]దుంగర్‌పూర్ పట్టణ వాతావరణం చాలా పొడిగా ఉంటుంది. వేసవి కాలం వేడిగా ఉంటుంది. కానీ ఇతర రాజస్థాన్ నగరాల కంటే చాలా తక్కువగా ఉంటుంది.వేసవిలో సగటు ఉష్ణోగ్రత 43 °C (గరిష్ఠంగా) నుండి 26 °C వరకు వస్తుంది. శీతాకాలం చాలా చల్లాగా ఉంటుంది.సగటు ఉష్ణోగ్రత 25 °C (గరిష్ఠంగా) నుండి 9 °C మధ్య ఉంటుంది. దుంగర్‌పూర్‌లో సగటు వార్షిక వర్షపాతం 47 సెం.మీ.మధ్య ఉంటుంది. దుర్గాపూర్‌లో సగటు ఉష్ణోగ్రత 76 సె.మీ వరకు ఉంటుంది. నవంబరులో 23 °C, ఉంటుంది. తేమ శాతం 68 ఉంటుంది.[5]
గుర్తింపు ఉన్న వ్యక్తులు
[మార్చు]- రాజ్ సింగ్, దుంగర్‌పూర్, క్రికెటర్, అడ్మినిస్ట్రేటర్
మూలాలు
[మార్చు]- ↑ "DUNGARPUR". web.archive.org. 2011-09-05. Archived from the original on 2011-09-05. Retrieved 2021-02-28.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Dungarpur State The Imperial Gazetteer of India, 1908, v. 11, p. 379.
- ↑ Dungarpur, History and Genealogy Archived 5 సెప్టెంబరు 2011 at the Wayback Machine |Queensland University]].
- ↑ "Census of India 2011 - Dungarpur". Retrieved 15 Apr 2018.
- ↑ "Climate and Weather Average in Durgapur". Retrieved 18 Nov 2020.