బరన్
బరన్ | |
---|---|
Coordinates: 25°06′N 76°31′E / 25.1°N 76.52°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | రాజస్థాన్ |
జిల్లా | బరన్ |
విస్తీర్ణం | |
• Total | 72.36 కి.మీ2 (27.94 చ. మై) |
Elevation | 262 మీ (860 అ.) |
జనాభా (2011) | |
• Total | 1,17,992 |
• జనసాంద్రత | 1,600/కి.మీ2 (4,200/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్‌కోడ్ | 325205 |
ప్రాంతీయ ఫోన్‌కోడ్ | 07453 |
Vehicle registration | RJ-28 |
బరన్, భారత రాష్ట్రమైన రాజస్థాన్ లోని బరాన్ జిల్లాలోని ఒక నగరం.ఇది పురపాలక సంఘం, బరన్ జిల్లాకు ఇది ప్రధాన పరిపాలనా కేంద్రం.[2]
చరిత్ర
[మార్చు]బరన్ నగరానికి పాత పేర్లు వరహ్ నగరి, అన్నపూర్ణ నగరి అనే పేర్లు ఉన్నాయి. గుప్తా సామ్రాజ్యం సమయంలో, తరువాత, ఇది యౌదేయ పాలకులు, తోమర్ పాలకుల పాలనలో ఉంది. ఉత్తర ప్రదేశ్‌లోని ఆధునిక బులాండ్‌షహర్‌లోని బారన్ కోట నుండి పాలించబడింది.ఈ పాలకులు, వారి సైనికుల నుండి వచ్చిన బరన్వాల్ అనే కులం ఉంది.17 వ శతాబ్దం నాటికి, మొఘలులు నగరంపై నియంత్రణ సాధించారు.బరన్ నగరంలో మొఘల్ పాలకులు సహబాద్ అనే కోటను నిర్మించారు. ఔరంగజేబు ఈ కోటను సందర్శించాడు.ఇది ఉత్తర భారతదేశంలోని ఆగ్నేయ రాజస్థాన్‌లో ఉన్న ఒక నగరం. 1948 ఏప్రిల్ 10 న ఏర్పడిన కొత్త ఉమ్మడి రాజస్థాన్‌లోని జిల్లాల్లో బరాన్ జిల్లా ఒకటి. ఇది రాష్ట్ర రాజధాని జైపూర్‌కు దక్షిణాన 300 కి.మీ. దూరంలో ఉంది.[2]
భౌగోళికం
[మార్చు]బరన్ నగరం 25°06′N 76°31′E / 25.1°N 76.52°E వద్ద ఉంది.[3] ఇది 262 మీటర్లు (859 అడుగులు) సగటు ఎత్తులో ఉంది.దీని చుట్టూ కలిసింద్, పార్వతి, పర్బన్ అనే మూడు నదులు ఉన్నాయి.బరన్ నగరం రాజస్థాన్, మధ్య ప్రదేశ్ సరిహద్దులలో ఉంది.
వర్షాకాలంలో మినహా నగరంలో వాతావరణం పొడిగా ఉంటుంది.శీతాకాలం నవంబరు మధ్య నుండి ఫిబ్రవరి వరకు, వేసవి కాలం మార్చి నుండి జూన్ మధ్య వరకు ఉంటుంది. జూన్ మధ్య నుండి సెప్టెంబరు వరకుగల కాలం రుతుపవనాల కాలం. తరువాత అక్టోబరు నుండి నవంబరు మధ్య రుతుపవనాల తిరోగమనం చెందుతాయి.జిల్లాలో సగటు వర్షపాతం 895.2 మి.మీ.సగటు రోజువారీ గరిష్ఠ ఉష్ణోగ్రత 24.3గా ఉంటుంది. జనవరి నెల అత్యంత శీతల నెల °C, సగటు రోజువారీ కనిష్ఠ ఉష్ణోగ్రత 10.6. నమోదవుతుంది.
సంస్కృతి
[మార్చు]రాజస్థాన్ సంస్కృతి ఈ నగరంలో వారసత్వంగా వచ్చింది. " తేజ్-తయోహార్స్ ", " గ్యాంగోర్-గ్యారాస్ ", "రంగ్-రేంజెలో రాజస్థాన్", అనే పండుగలు ముఖ్యంగా జరుపుకుంటారు. కార్నివాల్ లేదా డాల్ మేళా అనే పేరుతో జరిగే మేళా బరన్ నగరం ప్రత్యేకం. దీనిని 15 నుండి 20 రోజుల వరకు జరుపుకుంటారు.
జనాభా
[మార్చు]బరన్ నగర పరిపాలనను మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది.భారత జనాభా లెక్కలు ప్రకారం బరన్ నగర జనాభా మొత్తం 117,992 మంది ఉండగా, వీరిలో పురుషులు 61,071 మంది కాగా, స్తీలు 56,921 మంది ఉన్నారు.[4]
రవాణా
[మార్చు]ఈ నగరం పొరుగు జిల్లాలతో, రాష్ట్రానికి వెలుపల ఉన్న ప్రధాన నగరాలతో ప్రయాణ సౌకర్యాలుకు వసతులు ఉన్నాయి.
త్రోవ
[మార్చు]జాతీయ రహదారి 76 (ఇప్పుడు జాతీయ రహదారి 27) బరన్ జిల్లా గుండా వెళుతుంది. జాతీయ రహదారి 76 (ఇప్పుడు జాతీయ రహదారి 27) తూర్పు- పడమర కారిడార్‌లో ఒక భాగం.
రైలు
[మార్చు]వెస్ట్రన్ సెంట్రల్ రైల్వేలోని కోటా-బినా విభాగంలో బరన్ స్టేషన్ ఉంది. ఇది కోటా జంక్షన్ నుండి 67 కి.మీ దూరంలో ఉంది.
గాలి
[మార్చు]జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఉదయపూర్ విమానాశ్రయం, జోధ్‌పూర్ విమానాశ్రయం దీనికి సమీపంలో ఉన్న ప్రధాన విమానాశ్రయాలు.ఈ విమానాశ్రయాలు రాజస్థాన్‌ను భారతదేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబైలతో కలుపుతాయి.
పర్యాటక రంగం
[మార్చు]షెర్ గఢ్ కోట, రామ్‌గఢ్ బిలం, కపిల్థార్ జలపాతం పర్యాటక ప్రదేశాలు చాలా మంది పర్యాటకులను ప్రతి సంవత్సరం ఆకర్షిస్తాయి.అంతేకాకుండా సీతాబాది (కైల్వాడ) బరన్ లోని హిందూధర్మ ప్రదేశం యాత్రికులకు చాలా స్వచ్ఛమైన నీరు నీటి తోట్టెలలో లభిస్తాయి.సీతాదేవి వనవాసం చేసే సమయంలో ఈ ప్రదేశంలో లవకుశలు పుట్టుక జరిగిందని భావిస్తారు.
హడోతి చరిత్రను ప్రదర్శించడానికి బరన్ సమీపంలోని గజన్‌పురా గ్రామంలో హడౌటి పనోరమా సముదాయ భవనం నిర్మించబడింది. కరౌలి పర్వతం ఎర్ర రాయి, బుంది తెల్ల రాయిని నిర్మాణ సామగ్రిగా ఉపయోగిస్తారు.జరోఖా, ఛత్రిలను కరౌలికి చెందిన హస్తకళాకారుడు నిర్మించాడు. కోటా, బుంది, జహల్వార్, బరాన్ అనే నాలుగు జిల్లాల అభివృద్ధిలో చరిత్ర, సహకారం అక్కడ ప్రదర్శించబడుతుంది. జిల్లా చారిత్రక ప్రదేశాలైన కాకోని, బిలాస్‌గఢ్, భండ్-దేవ్రా, గార్గాచ్ ఆలయం, హడోటి కోటలు దానిలో ప్రదర్శించబడతాయి.
వంటకాలు
[మార్చు]విలక్షణమైన వంటలలో దాల్ బాతి చుర్మా, రోటీ (చపాతీ) సమోసాలు వాడకం ఎక్కువుగా వాడతారు.
మూలాలు
[మార్చు]- ↑ "District Census Handbook - Baran" (PDF). Census of India. pp. 11, 24. Retrieved 19 January 2015.
- ↑ 2.0 2.1 "Home". rajasthan.gov.in.
- ↑ "Maps, Weather, and Airports for Baran, India". fallingrain.com.
- ↑ "Baran City Population Census 2011-2021 | Rajasthan". www.census2011.co.in. Retrieved 2021-02-27.