అక్షాంశ రేఖాంశాలు: 26°30′N 77°01′E / 26.5°N 77.02°E / 26.5; 77.02

కరౌలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కరౌలి
కరౌలి is located in Rajasthan
కరౌలి
కరౌలి
భారతదేశంలో రాజస్థాన్ రాష్ట్ర పటం
కరౌలి is located in India
కరౌలి
కరౌలి
కరౌలి (India)
Coordinates: 26°30′N 77°01′E / 26.5°N 77.02°E / 26.5; 77.02
దేశం భారతదేశం
రాష్ట్రంరాజస్థాన్
జిల్లాకరౌలి
Founded byరాజా బిజాజిపాల్
Government
 • Bodyనగరపాలక సంస్థ
విస్తీర్ణం
 • Total33 కి.మీ2 (13 చ. మై)
Elevation
275 మీ (902 అ.)
జనాభా
 (2011)
 • Total82,960
 • జనసాంద్రత2,500/కి.మీ2 (6,500/చ. మై.)
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్‌కోడ్
322241
Vehicle registrationRJ 34

కరౌలి, దీనిని పూర్వం కరోలి లేదా కెరోవ్లీ అని కూడా పిలిచారు.ఇది భారతదేశం, రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ఒక నగరం.ఇది కరౌలి జిల్లా, పరిపాలనాకేంద్రంగా ఉంది.గతంలో అప్పటి రాచరిక కరౌలి రాజ్యానికి రాజధానిగా ఉండేది.ఇది భరత్‌పూర్ విభాగం పర్వేక్షణాధికారి పరిధిలోని, కరౌలి జిల్లా పరిధిలో ఉంది.

భౌగోళికం

[మార్చు]

కరౌలి 26°30′N 77°01′E / 26.5°N 77.02°E / 26.5; 77.02 వద్ద ఉంది.[2] ఇది 275 మీటర్లు (902 అడుగులు) సగటు ఎత్తులో ఉంది.

చరిత్ర

[మార్చు]

ఆధునిక రాచరిక రాజ్యం కరౌలిని సుమారు 995 లో రాజా బిజై పాల్ స్థాపించాడు.అతను అహిర్ పాలకుడు.అతని హైనెస్ మహారాజా 281 అశ్వికదళం,1640 పదాతిదళం, 56 తుపాకుల సైనిక దళాన్ని నిర్వహించాడు.892 నాటికి 17 తుపాకుల వందనం స్వీకరించటానికి అతనికి అర్హత ఉంది. బ్రిటీషర్లు తరువాత దీనిని ఆక్రమించి, 1947 వరకు వారు దీనిని పరిపాలించారు. మహారాజా ప్యాలెస్ భవనాలలో కొన్ని 18 వ శతాబ్దం మధ్యవరకు ఉన్నాయి.1346 లో మహారాజా అర్జున్ దేవ్ పాల్ చేత కరౌలి రాజ్యం స్థాపించబడింది.

జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[3] కరౌలి జనాభా 82,960.అందులో పురుషులు 53% మంది, స్త్రీలు 47% మంది ఉన్నారు.కరౌలి సగటు అక్షరాస్యత 53%,ఇది జాతీయ సగటు అక్షరాస్యత 59.5% కంటే తక్కువ పురుషుల అక్షరాస్యత 65%,స్త్రీల అక్షరాస్యత 41% మంది ఉన్నారు.6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు కరౌలి మొత్తం జనాభాలో 19% మంది ఉన్నారు.కరౌలి నగరంలో మతాల ప్రకారం హిందూవులుకు చెందిన జనాభా 76.90% మంది, ముస్లింలకు చెందిన జనాభా 22.54% మంది ఉన్నారు.

స్మారక కట్టడాలు

[మార్చు]

శ్రీ మహావీర్జీ

[మార్చు]
శ్రీ మహావీర్జీ జైన దేవాలయం, కరౌలి

జైనుల అద్భుత తీర్థయాత్రలలో శ్రీ మహావీర్జీ కట్టడ ప్రాంతం ఒకటి.కరౌలి జిల్లాలోని హిందాన్ బ్లాక్ వద్ద ఉన్నఈ తీర్థయాత్రా ప్రదేశం ఒకనది ఒడ్డున నిర్మించిన ఈ తీర్థయాత్ర జైన భక్తులకు భక్తి కేంద్రంగా ఉంది.ఆలయ ప్రధాన దేవత మహావీరుడి విగ్రహానికి చెందింది.ఈ ఆలయ నిర్వహణకు జైపూర్ పాలకులు ఆర్థిక సహాయం అందించారు.శ్రీ మహావీర్జీ భక్తి కేంద్రం అనేక శిఖరాలతో నిర్మించబడింది.ఈఆలయం చుట్టూ ధర్మశాలలు ఉన్నాయి.ఆలయం బాహ్య, లోపలి గోడలు శిల్పాలు బంగారు చిత్రాలతో అలంకరించబడి ఉంటాయి.ఈ ఆలయానికి సమీపంలో శాంతినాథ్ జినాలయం ఉంది.ఈ ఆలయం ప్రధాన ఆకర్షణ 16 వ జైన తీర్థంకర్ శాంతినాథ్ 32 అడుగుల ఎత్తైన చిత్రం ప్రధాన ఆకర్షణగా ఉంది.

కైలా దేవి ఆలయం

[మార్చు]
కైలాదేవి ఆలయం

కరౌలి జిల్లాలోని కలిసిల్ నది ఒడ్డున కైలా దేవి (దేవత) ఆలయం ఉంది.ఈ ఆలయం పూర్వ కరౌలి రాజ్యంలోని, పూర్వపు రాచరిక పాలకుల కైలా దేవతకి అంకితం చేయబడింది.ఇది పెద్ద ప్రాంగణంతో పాలరాయితో నిర్మించిన అంతస్తు నిర్మాణం.ఒకే చోట భక్తులు నాటిన ఎర్ర జెండాలు చాలా ఉన్నాయి.చైత్ర (మార్చి-ఏప్రిల్) చీకటి సగం సమయంలో ఇక్కడ ఒక ఉత్సవం జరుగుతుంది. ఇది పక్షం రోజులు ఉంటుంది.

మూలాలు

[మార్చు]
  1. "Karauli Info". Archived from the original on 2020-12-12. Retrieved 2021-01-29.
  2. "Maps, Weather, and Airports for Karauli, India".
  3. "Karauli District Population Census 2011, Rajasthan literacy sex ratio and density".

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కరౌలి&oldid=4185912" నుండి వెలికితీశారు