సంపూర్ణ వర్ణపట ఛాయాగ్రహణం
సంపూర్ణ వర్ణపట ఛాయాగ్రహణం బహుళవర్ణపట ఛాయాచిత్రీకరణలో ఒక భాగం. వినియోగదారుని కెమెరాతో సంపూర్ణ, విస్తృత వర్ణపట బ్యాండ్ విడ్త్ గల ఫిలిం /ఇమేజ్ సెన్సర్తో ఛాయాచిత్రాలని చిత్రీకరించే ప్రక్రియని సంపూర్ణ వర్ణపట ఛాయాగ్రహణంగా పేర్కొంటారు. వాడుకలో ప్రత్యేకమైన ఫుల్ స్పెక్ట్రం ఫిలిం దృశ్యమాన వర్ణపట (కంటికి కనిపించే) కాంతిని, సమీప పరారుణ (నియర్ ఇన్ఫ్రారెడ్) కాంతిని బంధిస్తుంది.
సవరించబడ్డ డిజిటల్ కెమెరాలలోని ఇమేజ్ సెన్సర్లు 350 ఎన్ ఎం నుండి 100 ఎన్ ఎం వరకూ కాంతిని గుర్తించగలగటంతో కొంత అతినీలలోహిత కాంతి ని, కంటికి కనిపించే కాంతినంతటినీ, సమీప పరారుణ కాంతిని చాలావరకూ బంధిస్తాయి. ఒక ప్రామాణికి డిజిటల్ కెమెరాలో పరారుణ కాంతిని చాలామటుకు వారించి, అతినీలలోహిత కాంతిని కొంత వరకు వారించే ఒక ఇన్ఫ్రారెడ్ హాట్ మిర్రర్ ఉంటుంది. ఈ హాట్ మిర్రర్ గనుక లేకపోతే సెన్సర్ ఈ కాంతిని గుర్తించి అనుమతించబడే కాంతిని 400 ఎన్ ఎం నుండి 700 ఎన్ ఎం వరకూ తగ్గిస్తుంది.