మీటరింగ్ మోడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డిజిటల్ మీటరింగ్ ఫీడ్‌బ్యాక్
ఎనలాగ్ మీటరింగ్ ఫీడ్‌బ్యాక్

మీటరింగ్ మోడ్ (ఆంగ్లం: Metering mode) లేదా కెమెరా మీటరింగ్ (Camera Metering) లేదా ఎక్స్పోజర్ మీటరింగ్ (Exposure Metering) లేదా మీటరింగ్ (Metering) సెన్సర్ పై ప్రసరించే మొత్తం కాంతి ఆధారంగా షట్టరు వేగం, సూక్ష్మరంధ్రం, ఫిలిం వేగాలను నిర్ధారించే అధునాతన కెమెరాలలో గల ఒకానొక సెట్టింగు. షట్టరు వేగం, సూక్ష్మరంధ్రాల నియంత్రణచే అతితక్కువ శ్రమతో బహిర్గతాన్ని నియంత్రించి అసాధరణ కాంతి గల దృశ్యాలను కూడా ఛాయాచిత్రకారులు సులువుగా చక్కని ఛాయాచిత్రాలుగా తీయటానికి ఉపయోగపడే ఒకానొక అమరిక.

మీటరింగ్ మోడ్ లో రకాలు

[మార్చు]

మీటరింగ్ మోడ్ లలో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి మూడు. అవి:

  • మ్యాట్రిక్స్ మీటరింగ్ (మాత్రిక)
  • సెంటర్-వెయిటెడ్ (కేంద్ర ప్రధాన)
  • స్పాట్ (బిందు) /పార్షియల్ (పార్శ్వ)

మ్యాట్రిక్స్ మీటరింగ్

[మార్చు]

దృశ్యాన్ని మాత్రిక వలె పలు మండలాలు (జోన్ లు) గా విభజిస్తుంది. ఐతే వాటన్నింటినీ కలగలిపి చీకటి-వెలుతురులను విశ్లేషిస్తుంది. రంగు, దూరం, ఎంచుకొనబడ్డ విషయం, ఇతర ముఖ్యాంశాలతో బాటు దృష్టి కేంద్రీకరించబడ్డ అంశం ప్రధానమైనది. ఒక్కొక్క మండలం నుండి వెలుగునీడల విశ్లేషణ సేకరించిన తర్వాత దృష్టి కేంద్రీకరించబడ్డ అంశానికి ఈ మోడ్ అత్యధిక ప్రాముఖ్యతనిస్తుంది. చాలా మటుకు ఛాయాచిత్రాలకు ఈ రకం మీటరింగ్ యే సరియైనది. (ఉదా: రమణీయ ప్రకృతి దృశ్యాలకు, ముఖ చిత్రాలకు)

సెంటర్-వెయిటెడ్

[మార్చు]

మిగతా భాగాలను పరిగణలోకి తీసుకోకుండా ఫ్రేం లోని మధ్యభాగం, దాని చుట్టుప్రక్కల భాగాల వెలుగునీడలను మాత్రం కెమెరా విశ్లేషిస్తుంది. దృష్టి కేంద్రీకరించిన అంశానికి సంబంధం లేకుండా కెమెరా కేవలం మధ్యభాగాన్ని మాత్రం పరిగణలోకి తీసుకొంటుంది. (వెనుక వైపు వెలుతురు ఉన్న మనుషుల ముఖచిత్రాలని చిత్రీకరించేందుకు ఉపయోగపడుతుంది.) సెంటర్-వెయిటెడ్ మీటరింగ్ మోడ్ లో ఫలితాన్ని ఇట్టే అంచనా వేయవచ్చును. మ్యాట్రిక్స్ మీటరింగ్ పని చేసే విధానం కంటే, సెంటర్-వెయిటెడ్ మీటరింగ్ పని చేసే తీరు సులువుగా అర్థం అవుతుంది. కావున చాలా మంది ఛాయాచిత్రకారులు ఎక్కువగా ఈ మోడ్ నే ప్రయోగిస్తుంటారు.

సెంటర్-వెయిటెడ్ కు, స్పాట్/పార్షియల్ కు ఇట్టే పెద్ద తేడా లేదు. కాకపోతే సెంటర్-వెయిటెడ్ మధ్యభాగం కాగా, స్పాట్ మధ్యబిందువు మాత్రమే.

స్పాట్

[మార్చు]

స్పాట్ మీటరింగ్ దృష్టి కేంద్రీకరించిన బిందువు, దాని చుట్టుప్రక్కల భాగాలను తప్పితే మిగతా దేనిని పరిగణలోనికి తీసుకొనదు. ఈ ఒక్క మండలం ప్రకారమే బహిర్గతాన్ని నిర్ధారిస్తుంది. (పక్షులు, చంద్రబింబం ఫ్రేంలో ఒక బిందువు మాత్రమే ఆక్రమిస్తాయి కాబట్టి, వాటిని చిత్రీకరించటానికి). ఒక బిందువు వద్ద వెలుతురు అత్యధికంగా ఉండటం, మూలలకు పోయే కొలది చీకటిగా ఉండే అంశాలను స్పాట్/పార్షియల్ మీటరింగ్ వలన చక్కగా చిత్రీకరించవచ్చును.

ఇవి కూడా చూడండి

[మార్చు]

లాభ నష్టాలు

[మార్చు]
  • మీటరింగ్ మోడ్ ల గురించి తెలియకపోయినా, సరియైన మీటరింగ్ మోడ్ అవలంబించకపోయినచో ఛాయాచిత్రాల్ మరీ చీకటిమయంగా గానీ, లేదా మరీ ప్రకాశవంతంగా గానీ వచ్చే ఆస్కారం కలదు
  • వెనుక వైపు వెలుతురు ఉన్నప్పుడు తీసే ముఖచిత్రాలలో ముఖంలోని భాగాలు రాకుండా నల్లని నీడ వలె ఛాయాచిత్రం వచ్చే ఆస్కారం ఉంది.

మూలాలు

[మార్చు]