Jump to content

క్షేత్ర అగాథం

వికీపీడియా నుండి
క్షేత్ర అగాథాన్ని బాగా తగ్గించి తీసిన ఒక అతి సమీప ఛాయాచిత్రం
క్షేత్ర అగాథం పరిమితులలో గల ప్రదేశం స్పష్టంగా కనబడగా, దాని పరిమితులు దాటి ఉన్న ముందు/వెనుకలు మసకబారినట్టు కనబడతాయి.

క్షేత్ర అగాథం (Depth of Field) అనునది చలనచిత్రాలలో, ఛాయాచిత్రకళలో ఉపయోగించబడు ఒక సాంకేతిక అంశం. క్షేత్ర అగాథం అనగా ఒక దృశ్యంలో అతి సమీప వస్తువు నుండి అతి దూర వస్తువు వరకు ఏర్పడే స్పష్టాస్పష్ట భాగాలు. ఒక కటకం ఒక సమయంలో సాధారణంగా ఒకే దూరం పై దృష్టి సారించగల్గిననూ దృష్టిని కేంద్రీకరించిన దూరానికి ఇరువైపులా ఉన్న పోనుపోను స్పష్టత తగ్గుతూ వస్తుంది.

కొన్ని సందర్భాలలో కనబడే చిత్రం అంతా స్పష్టంగా ఉండవలసిన అవసరం ఉంటుంది. అనగా క్షేత్ర అగాథం ఎక్కువగా ఉండవలసి వస్తుంది. ఇతర సందర్భాలలో తక్కువ క్షేత్ర అగాథాన్ని ఉపయోగించి కోరుకొన్న వస్తువు పై మాత్రమే స్పష్టమైన దృష్టిని కేంద్రీకరించి వస్తువుకి ముందు వెనుకలను తగ్గించబడిన స్పష్టతతో చూపించవలసి వస్తుంది.

గందరగోళ వృత్తం పై ఆధారపడే క్షేత్ర అగాథం

[మార్చు]

ఒక కటకంతో స్పష్టమైన దృష్టి కేవలం ఒక దూరం పైనే సాధ్యమవుతుంది. ఆ దూరంలో ఉన్నపుడు మాత్రమే మూల బిందువు చిత్రంలో కూడా బిందువుగా కనబడుతుంది. ఇతర దూరాలలో మూల బిందువు అస్పష్ట దృష్టితో కనబడి సూక్ష్మరంధ్రపు ఆకారంలో కళంకాలని తెస్తుంది. సాధారణంగా సూక్ష్మరంధ్రం వృత్తాకారంలో ఉండటం వలన ఈ కళంకాలు కూడా వృత్తాకారంలోనే ఉంటాయి. ఈ వృత్తాకారపు కళంకం కావలసినంత చిన్నదిగా (మూల బిందువుకి సమానంగా) ఏర్పడితే ఛాయాచిత్రంలో స్పష్టత ఏర్పడుతుంది. కాంతికిరణాలు స్పష్టమైన దృష్టికి వచ్చిన బిందువు నుండి దూరం పెరిగే కొద్దీ ఈ కళంక వృత్తాల వ్యాసాలు పెరిగి స్పష్టత లోపిస్తుంది.

క్షేత్ర అగాథం పై ప్రభావం చూపే కారకాలు

[మార్చు]
దృష్టి కేంద్రీకరించబడని ప్రాంతాలు ఛాయాచిత్రంలో సూక్ష్మరంధ్రపు ఆకారంలో చూపించబడతాయి. ఇలాంటి అస్పష్టతలని కావాలనే తీసుకురావటాన్ని బొకే అని సంబోధిస్తారు.

సబ్జెక్టు, కదలిక, కెమెరా-సబ్జెక్టుల మధ్య దూరం, కటకపు నాభ్యంతరం, కటకం యొక్క ఎఫ్-సంఖ్య, చిత్ర సంవేదిక యొక్క ఫార్మాట్, గందరగోళ వృత్తాలు వంటివి క్షేత్ర అగాథం పై ప్రభావం చూపుతాయి. వీటిలో నాభ్యంతరం, సబ్జెక్టు దూరం, ఫార్మాట్ పరిమాణాలు ఫిలిం లేదా సెన్సర్ ల పై విస్తరించి చూపటానికి దోహద పడతాయి.

విస్తరణ పెరిగే కొద్దీ క్షేత్ర అగాథం తగ్గుతూ వస్తుంది. విస్తరణ తగ్గే కొద్దీ క్షేత్ర అగాథం పెరుగుతూ వస్తుంది. విస్తరణ స్థిరంగా ఉంటే ఎఫ్-సంఖ్య పెరిగే కొద్దీ (అనగా సూక్ష్మరంధ్రపు వ్యాసం తరిగే కొద్దీ) క్షేత్ర అగాథం పెరుగుతూ వస్తుంది. ఎఫ్-సంఖ్య తగ్గే కొద్దీ క్షేత్ర అగాథం తగ్గుతూ వస్తుంది.

క్షేత్ర అగాథపు కొలమానాలు

[మార్చు]

దూర:సమీపాల పంపకం

[మార్చు]

సరైన ఎఫ్-సంఖ్య

[మార్చు]