వాషిమ్ జిల్లా
వాశిమ్ జిల్లా
वाशिम जिल्हा | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
డివిజను | అమరావతి |
ముఖ్య పట్టణం | Washim |
మండలాలు | 1. Malegaon, 2. Mangrulpir, 3. Karanja, 4. Manora, 5. Washim, 6. Risod |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | 1. Yavatmal-Washim shared with Yavatmal district, 2. Akola (shared with Akola District) (Based on Election Commission website) |
• శాసనసభ నియోజకవర్గాలు | 4 |
విస్తీర్ణం | |
• మొత్తం | 5,150 కి.మీ2 (1,990 చ. మై) |
జనాభా (2001) | |
• మొత్తం | 10,20,216 |
• జనసాంద్రత | 200/కి.మీ2 (510/చ. మై.) |
• Urban | 17.49% |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 74.02% |
• లింగ నిష్పత్తి | 939 |
ప్రధాన రహదార్లు | - |
సగటు వార్షిక వర్షపాతం | 750-1000 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
వాషిమ్ జిల్లా | |
---|---|
మహారాష్ట్ర లోని జిల్లాలలో వాశిమ్ జిల్లా (హిందీ:) ఒకటి. వాశిం పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 5,150 చ.కి.మీ.
భౌగోళికం
[మార్చు]2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,020,216. వీరిలో 17.49% నగరాలలో నివసిస్తున్నారు. వాశిమ్ జిల్లా విదర్భ రీజన్ తూర్ప భూభాగంలో ఉంది.
సరిహద్దులు
[మార్చు]సరిహద్దు వివరణ | జిల్లా |
---|---|
ఉత్తర సరిహద్దు | అకోలా జిల్లా |
ఈశాన్య సరిహద్దు | అమరావతి జిల్లా |
దక్షిణ సరిహద్దు | హింగోలి జిల్లా |
పశ్చిమ సరిహద్దు | బుల్ఢానా జిల్లా |
తూర్పు సరిహద్దు | యావత్మల్ జిల్లా |
నదులు
[మార్చు]జిల్లాలో ప్రధానంగా పెంగంగా నది ప్రవహిస్తుంది. పెంగంగానది జిల్లాలోని రిసొద్ తాలూకాలో ప్రవహిస్తుంది. ఇది వాశిం, హింగోలి జిల్లాల సరిహద్దులో ప్రవహిస్తుంది. పెంగంగా నదికి కాస్ నది ప్రధాన ఉపనదిగా ఉంది. కాస్ నది షెల్గాగ్ గ్రామానికి 1 కి.మీ దూరంలో పెంగంగా నదిలో సంగమిస్తుంది. అరుణావతి నది దాని ఉపనదులు వాశిం తాలూకాలో జన్మిస్తున్నాయి. తరువాత మంగ్రులి పిర్, మనొరా తాలూకాలలో ప్రవహించి యావత్మల్ జిల్లాలో ప్రవేశిస్తున్నయి. కతేపుర్నా జిల్లాలోని కొండ ప్రాంతాలలో జన్మించి ఉత్తరంగా ప్రవహించి మాలేగావ్ తాలూకాలో ప్రవహించి అకోలా జిల్లాలో ప్రవేశిస్తుంది.
నైసర్గికం
[మార్చు]జిల్లాలో మాలేగావ్, వాషిం, మంగ్రూల్ పీర్, మనోరా తాలూకాలలో కొండ పర్వతాల వరుస ఉంది. పెంగంగా నదీముఖద్వారంలో మైదానాలు ఉన్నాయి. జిల్లాలో ప్రధానంగా వాషిం, రిసొద్, కరంజ, మాలేగావ్, మంగ్రుల్ పీర్, మనోరా, షిర్పుర్ మొదలైన పట్టణాలు ఉన్నాయి. జిల్లాలో ఆసుపత్రులు, స్కూల్స్, కాలేజులు, బ్యాంకులు ఉన్నాయి. జిల్లాలో ప్రముఖ బాలాజీ ఆలయం ఉంది. జిల్లాలో రైల్వే జంక్షన్ ఉంది. జిల్లాలో కొంత భూభాగం అరణ్యాలు వ్యాపించి ఉన్నాయి. జిల్లాలో రెండు అభయారణ్యాలు (కతేపురా వన్యప్రాణి అభయారణ్యం, కరంజ వన్యప్రాణి అభయారణ్యం) ఉన్నాయి.[1]
చరిత్ర
[మార్చు]అయిన్-ఐ- అక్బరి (1596-97) లలో బేరర్ గురించిన వివరణలు ఉన్నాయి. అకోలా జిల్లాలోని అత్యధికభాగం అక్బర్ సొర్కార్ లేక రెవెన్యూ జిల్లా నర్నాలాలో చేర్చబడ్డాయి. సర్కార్‌లోని కొన్ని పరగణాలు బుల్ఢానా జిల్లాలో చేర్చబడ్డాయి. అక్బర్ రెవెన్యూ జిల్లా బైషిం నుండి మూడు పరగణాలు అంకోలా జిల్లాలో చేర్చబడ్డాయి. ప్రస్తుతం అక్బర్ రెవెన్యూ భూభాగం అంకోలా జిల్లాలో ఉంది. రెవెన్యూ దాదాపు 24 లక్షల రూపాయలు. జిల్లాలోని బలపుర్, షాపూర్, బషిం ప్రాంతాలు ప్రత్యేకత కలిగి ఉన్నాయి. రాజధాని సుల్తాన్ మురద్ సమీపంలో ఉన్న ప్రాంతం షహ్పూర్ పేరుతో నగరంగా మారింది. భాషిం ప్రాంతం స్థానిక ప్రజల నివాసంగా ఉండేది. హత్కారి లేక ధంగర్ లేక రాజపుత్రులు అనబడే ఇక్కడి ప్రజలు గర్వంగా, ఎవరికి లొంగని మొడితనం కలిగి ఉండేవారని వ్రాయబడింది.
జిల్లా రూపకల్పన
[మార్చు]వాశిమ్ జిల్లా 1998 జూలై 1 న రఒందించబడింది. గతంలో వాశిం వత్సగుల్మా అని పిలువబడేది. వత్సగుల్మాకు రాజ్యానికి ఒకతక రాజధానిగా ఉండేది. 1905లో బ్రిటిష్ పాలనలో వాశిమ్ జిల్లా రెండుగా (అకోలా జిల్లా, యావత్మల్ జిల్లా) విభజించబడింది. 1998లో తిరిగి వాశిమ్ జిల్లా రఒందించబడింది.
విభాగాలు
[మార్చు]విభాగాల వివరణ
[మార్చు]విషయాలు | వివరణలు |
---|---|
2 వాశిం, మాగ్రులిపిర్ | |
తాలూకాలు | 6 మాలేగావ్, వాషిం, తేదీత, కరంజ లాడ్, మనోరా (వాషిం), వాషిం, రిసొద్. .[2] |
శాసనసభ నియోజక వర్గం | రిసొద్ (విధాన సభ నియోజకవర్గం), వాషిం (విధాన సభ నియోజకవర్గం), కరంజ (విధాన సభ నియోజకవర్గం). |
పార్లమెంటు నియోజక వర్గం | అంకోలా లోక్ సభ నియోజకవర్గం (రిసొద్), యావత్మల్-వాషిం లోక్ సభ నియోజకవర్గం (వాషిం, కరంజ) .[3] |
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,196,714,[4] |
ఇది దాదాపు. | తైమొర్ - లెస్టే దేశ జనసంఖ్యకు సమానం.[5] |
అమెరికాలోని. | రొలె ఐలాండ్ నగర జనసంఖ్యకు సమం..[6] |
640 భారతదేశ జిల్లాలలో. | 398 వ స్థానంలో ఉంది..[4] |
1చ.కి.మీ జనసాంద్రత. | 244 .[4] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 17.23%.[4] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 926:1000 [4] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 81.7%.[4] |
జాతియ సరాసరి (72%) కంటే. |
రితాద్
[మార్చు]రితాద్ వాశిమ్ జిల్లాలోని ఒక గ్రామం. తితాద్ వాశిం పట్టణానికి 17 కి.మీ, రిసోద్‌కు 23 కి.మీ దూరంలో ఉంది. రితాద్ జనసంఖ్య 4,000. ఇక్కడ అధికంగా మరాఠీ - కుంబి - దేశ్ముఖ్ ప్రజలు అధికంగా ఉన్నారు. వీరికి అధికంగా బోర్కర్, ఆరు, దేశ్ముఖ్, సర్నైక్ అని ఉపనామాలు ఉంటాయి. వీరిలో అధికంగా ఉపాద్యాయులు, వ్యవసాయదారులు ఉన్నారు. ఈ గ్రామంలో 500 మంది ముస్లిములు ఉన్నారు. గ్రామంలో రెండు మసీదులు, ఒక ముస్లీం శ్మశానం ఉన్నాయి. ఇక్కడ ముస్లిములు తోటల పెంపకం, చిన్న తరహా వ్యాపారం చేస్తుంటారు. ఇక్కడ ముస్లిములు తరతరాలుగా జీవిస్తున్నారు. వీధిలో సయ్యద్, పఠాన్, షైక్, షాహ్ ప్రజలు ఉన్నారు
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-25. Retrieved 2014-11-27.
- ↑ Indian Census
- ↑ "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 18 మార్చి 2010. Retrieved 9 September 2010.
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Timor-Leste 1,177,834 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Rhode Island 1,052,567
వెలుపలి లింకులు
[మార్చు]వెలుపలి లింకులు
[మార్చు]- Pages with non-numeric formatnum arguments
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with bad settlement type
- Pages using infobox settlement with no coordinates
- Pages using multiple image with auto scaled images
- Pages using infobox settlement with missing country
- Pages using infobox settlement with no map
- మహారాష్ట్ర జిల్లాలు
- 1998 స్థాపితాలు
- వాషిం జిల్లా
- అమరావతి డివిజన్
- వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు పొందుతున్న జిల్లాలు
- భారతదేశం లోని జిల్లాలు