Jump to content

కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం

అక్షాంశ రేఖాంశాలు: 18°23′15″N 79°50′22″E / 18.38750°N 79.83944°E / 18.38750; 79.83944
వికీపీడియా నుండి
కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం
ఎక్కడ ఉందీ?చెల్పూర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, తెలంగాణ రాష్ట్రం
అక్షాంశ రేఖాంశాలు18°23′15″N 79°50′22″E / 18.38750°N 79.83944°E / 18.38750; 79.83944
స్థితిOperational
మొదలయిన తేదీయూనిట్ 1: ఫిబ్రవరి 2009
'అమలులో ఉంది'
యూనిట్ 2: 2013
సంచాలకులుTelangana Power Generation Corporation Limited (TSGENCO)

కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని చెల్పూర్ లో నెలకొల్పబడిన విద్యుత్ కేంద్రం. తెలంగాణా పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలోని బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో ఒకటైన ఈ విద్యుత్ కేంద్రం 2 యూనిట్లలో 1,100 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది.[1][2]

ప్రారంభం

[మార్చు]

2006, జూన్ 5న స్థాపించబడిన కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలో 2010 నుంచి ఉత్పత్తి ప్రారంభమైంది. మొదటి దశలో 500 మెగావాట్ల సామర్థ్యంతో ప్రారంభంకాగా, రెండో దశలో 600 మెగావాట్లతో మరో యూనిట్ నిర్మిస్తున్నారు.

సామర్థ్యం

[మార్చు]
దశ యూనిట్ సంఖ్య స్థాపన సామర్థ్యం (మెగావాట్స్) ప్రారంభ తేది స్థితి
దశ I 1 500 మే, 2010 నిర్వహణలో ఉంది
దశ II 2 600 జనవరి, 2016 నిర్మాణంలో ఉంది[3]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. సాక్షి, ఎడ్యుకేషన్ (17 June 2017). "తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగం". Archived from the original on 24 October 2018. Retrieved 31 October 2018.
  2. ఈనాడు, టీఎస్‌పీఎస్సీ. "తెలంగాణలో విద్యుత్‌ ప్రాజెక్టులు". Archived from the original on 29 October 2018. Retrieved 31 October 2018.
  3. "BHEL commissions 600 MW Thermal Unit in Telangana | Central Chronicle". www.centralchronicle.com (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 25 April 2018. Retrieved 31 October 2018.