గోండియా జిల్లా
గోందియా జిల్లా
गोंदिया जिल्हा | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
డివిజను | నాగపూరు విభాగం |
ముఖ్య పట్టణం | గోందియా |
మండలాలు | 1. గోందియా, 2. గోరేగావ్, 3. తిరోరా, 4. అర్జునీ మోరేగావ్, 5. దేవురీ, 6. అమ్‌గావ్, 7. సలేకాసా, 8. సడక్ అర్జునీ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | 1. భండారా-గోందియా ( భండారా జిల్లాతో పంచుకోబడింది), 2. గడ్‌చిరోలీ-చిమూర్ ( గడ్‌చిరోలీ జిల్లా , చంద్రపూర్ జిల్లాతో పంచుకోబడింది) |
• శాసనసభ నియోజకవర్గాలు | 4 |
విస్తీర్ణం | |
• మొత్తం | 4,843 కి.మీ2 (1,870 చ. మై) |
జనాభా (2001) | |
• మొత్తం | 12,00,151 |
• జనసాంద్రత | 250/కి.మీ2 (640/చ. మై.) |
• Urban | 11.95% |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 67.67% |
• లింగ నిష్పత్తి | 1005 |
సగటు వార్షిక వర్షపాతం | 1197 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
గోండియా జిల్లా (మరాఠీ: गोंदिया जिल्हा), భారతదేశంలో మహారాష్ట్రకు చెందిన జిల్లా. ముఖ్యపట్టణం గోండియా. జిల్లా విస్తీర్ణం 5,431కి.మీ.². 2001 జనగణన ప్రకారం జిల్లా జనాభా 1,200,707. అందులో 11.95% పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు (as of 2001).[1] జిల్లా నాగపూరు విభాగంలో ఉంది. ఈ జిల్లాలో (ప్రాంతంలో) గోండియా భాష మాట్లాడేవారు అధికంగా కానవస్తారు. గోండియా పట్టణాన్ని బియ్యపు నగరంగా కూడా అభివర్ణిస్తారు. ఈ పరిసర ప్రాంతాల్లో వరి పండిస్తారు. గోండియా పట్టణం పరిసర ప్రాంతంలో 250కి పైగా బియ్యపు మిల్లులు ఉన్నాయి. ఇది ప్రముఖ వ్యాపారకేంద్రం. జిల్లా గుండా వెళుతున్న ఏకైక జాతీయ రహదారి ముంబై-నాగపూరు-కోల్‌కతా రోడ్డు, జిల్లాలో 99.37 కిలోమీటర్లు మేరకు ఉంది. గోండియా నుండి జబల్పూరు, నాగపూరు, బాలాఘాట్ పట్టణాలకు బస్సు సౌకర్యం ఉంది. జిల్లా రెడ్ కారిడార్లో భాగంగా ఉంది.[2]
పాలనా విభాగాలు
[మార్చు]జిల్లా రెండు రెవెన్యూ విభాగాలు, ఎనిమిది తాలూకాలుగా విభజించబడింది. అవి గోండియా విభాగం, దేవుడీ విభాగం. ఒక్కొక్క విభాగంలో నాలుగు తాలూకాల చొప్పున ఉన్నాయి. గోండియా విభాగంలో గోండియా, గోరేగావ్, తిరోరా, అర్జునీ మోరేగావ్ తాలూకాలు, దేవుడీ విభాగంలో దేవుడీ, అమ్‌గావ్, సలేకాస, సడక్ అర్జునీ తాలూకాలున్నాయి. జిల్లా మొత్తంలో 556 గ్రామ పంచాయితీలు, 8 పంచాయితీ సమితులు, 954 రెవెన్యూ గ్రామాలున్నాయి. జిల్లాలో రెండు పురపాలక సంఘాలున్నవి. అవి గోండియా, తిరోరా.
జిల్లాలో 4 విధాన సభ నియోజవర్గాలున్నవి. అవి అర్జునీ-మోరేగావ్ (షె,కు), గోండియా, తిరోరా, అమ్‌గావ్ (షె.తె). మొదటి మూడు నియోజకవర్గాలు భండారా-గోండియా లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైతే, చివరిది ఘడ్చిరోలి-చిమూరు (షె,తె) లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.[3]
శీతోష్ణస్థితి
[మార్చు]గోండియా జిల్లా శీతోష్ణస్థితిలో మార్పులు తీవ్రంగా ఉంటాయి. వేసవికాలం చాలావేడిగానూ, చలికాలంలో చాలా చల్లగాను ఉంటుంది. ఇక్కడ సరాసరి గాలిలో తేమ 62 శాతం. వర్షాకాలంలో ప్రతిసంవత్సరం సాధారణంగా 1200 మి.మీలకు పైగా వర్షాన్ని నమోదు చేసుకుంటుంది. మేనెలలో పగటిపూట ఉష్ణోగ్రతలు 42°సె చేరతాయి. రాత్రి ఉష్ణోగ్రతలు 28°సె వద్ద ఉంటాయి. మే నెలలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 48 °C, అత్యల్ప ఉష్ణోగ్రత 20 °C. డిసెంబరు నెల చివర్లో, జనవరి నెలల్లో ఉష్ణోగ్రత సాధారణంగా గరిష్ఠం 29°సెకు చేరుతుంది. రాత్రిళ్ళు ఉష్ణోగ్రత 13°సెకు పడిపోతుంది. ఇటీవల కాలంలో జనవరి నెలలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 38°సె, అత్యల్ప ఉష్ణోగ్రత 0°సె. ఉంటుంది.
శీతోష్ణస్థితి డేటా - Gondia | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
సగటు అధిక °C (°F) | 27.6 (81.7) |
31.1 (88.0) |
35.2 (95.4) |
39.0 (102.2) |
42.1 (107.8) |
38.1 (100.6) |
30.5 (86.9) |
29.9 (85.8) |
30.8 (87.4) |
31.0 (87.8) |
29.3 (84.7) |
27.9 (82.2) |
32.7 (90.9) |
సగటు అల్ప °C (°F) | 13.3 (55.9) |
15.4 (59.7) |
19.6 (67.3) |
24.6 (76.3) |
28.9 (84.0) |
27.4 (81.3) |
24.3 (75.7) |
24.1 (75.4) |
23.9 (75.0) |
21.2 (70.2) |
15.2 (59.4) |
12.9 (55.2) |
20.9 (69.6) |
సగటు అవపాతం mm (inches) | 18.0 (0.71) |
30.7 (1.21) |
16.0 (0.63) |
16.0 (0.63) |
13.7 (0.54) |
219.2 (8.63) |
503.9 (19.84) |
443.5 (17.46) |
222.3 (8.75) |
66.5 (2.62) |
22.9 (0.90) |
5.8 (0.23) |
1,578.5 (62.15) |
Source: మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం |
ఆర్ధిక రంగం
[మార్చు]2006లో భారతదేశపు పంచాయితీరాజ్ శాఖ గోండియా, దేశంలో కెళ్ళా బాగా వెనుకబడిన 250 జిల్లాలలో (మొత్తం 640 జిల్లాలు) ఒకటిగా ప్రకటించింది.[4] మహారాష్ట్రలో వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్ ఫండ్ కార్యక్రమం (బి.ఆర్.జి.ఎఫ్)లో భాగంగా ఆర్థిక సహాయం అందుకుంటున్న పన్నెండు జిల్లాలలో గోండియా కూడా ఒకటి.[4]
జనాభా గణాంకాలు
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం గోండియా జిల్లా మొత్తం జనాభా 1,322,331,[5] ఇది మారిషస్ దేశపు జనాభాతో [6] లేదా అమెరికాలోని న్యూహాంప్‌షైర్ రాష్ట్రంతో సరిసమానం.[7]. భారతదేశంలో 640 జిల్లాలో జనాభా పరంగా గోండియా 369వది.[5] జిల్లా జనసాంద్రత చ.కి.మీకు 253 .[5] 2001-2011 వరకు సాగిన దశాబ్దంలో జిల్లా జనాభా 10.13%. వృద్ధి చెందింది[5] గోండియా జిల్లాలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 996 మంది స్త్రీలు ఉన్నారు.[5] జిల్లాలో అక్షరాస్యత శాతం 85.41%గా ఉంది.[5]
సరిహద్దులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-25. Retrieved 2014-03-01.
- ↑ "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Archived from the original on 2011-10-27. Retrieved 2011-09-17.
- ↑ "Districtwise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 2010-03-18. Retrieved 2009-03-31.
- ↑ 4.0 4.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
- ↑ 5.0 5.1 5.2 5.3 5.4 5.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Mauritius 1,303,717 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
New Hampshire 1,316,470
వెలుపలి లింకులు
[మార్చు]- Pages with non-numeric formatnum arguments
- Pages using the JsonConfig extension
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with bad settlement type
- Pages using infobox settlement with no coordinates
- Articles containing Marathi-language text
- Commons category link from Wikidata
- మహారాష్ట్ర
- మహారాష్ట్ర జిల్లాలు
- గోందియా జిల్లా