మోహన్ చరణ్ మాఝీ మంత్రివర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మోహన్ చరణ్ మాఝీ 11 జూన్ 2024 న ఒడిశా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. 2024 ఒడిశా శాసనసభ ఎన్నికల్లో నాలుగు దశల్లో జరిగిన ఎన్నికలలో 147 స్థానాలకు గాను 78 స్థానాలను బిజెపి గెలుచుకున్న ఫలితంగా ప్రభుత్వం ఏర్పడింది. జూన్ 4 న ఫలితాలు ప్రకటించబడ్డాయి, 17వ ఒడిశా అసెంబ్లీ ఏర్పడటానికి దారితీసింది. ఈ ప్రభుత్వానికి 3 స్వతంత్రుల మద్దతు కూడా ఉంది.

మంత్రుల మండలి

[మార్చు]

భువనేశ్వర్‌లోని జనతా మైదాన్‌లో 12 జూన్ 2024న ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీతో[1] పాటు అతని ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, 8 మంది క్యాబినెట్ మంత్రులు & 5 మంది స్వతంత్ర బాధ్యతలు కలిగిన రాష్ట్ర మంత్రులు ప్రమాణం చేశారు.[2][3] గవర్నర్ రఘుబర్ దాస్ వారి ప్రమాణం చేయించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు 10 బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, గోవా సీఎం ప్రమోద్ సావంత్ హాజరయ్యారు.[4]

క్యాబినెట్ మంత్రులు

[మార్చు]
మంత్రిత్వ శాఖలు[5] మంత్రి పదవీ బాధ్యతలు నుండి పదవీ బాధ్యతలు వరకు పార్టీ
ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ 12 జూన్ 2024 ప్రస్తుతం బీజేపీ
ఉప ముఖ్యమంత్రులు
ఉపముఖ్యమంత్రి &

వ్యవసాయం & రైతుల సాధికారత, ఇంధన శాఖ

కనక్ వర్ధన్ సింగ్ డియో 12 జూన్ 2024 ప్రస్తుతం బీజేపీ
ఉపముఖ్యమంత్రి &

మహిళా శిశు అభివృద్ధి, మిషన్ శక్తి, పర్యాటక శాఖ

ప్రవటి పరిదా 12 జూన్ 2024 ప్రస్తుతం బీజేపీ
కేబినెట్ మంత్రులు
రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ సురేష్ పూజారి 12 జూన్ 2024 ప్రస్తుతం బీజేపీ
పంచాయతీరాజ్‌, తాగునీటి, గ్రామీణాభివృద్ధి శాఖ రబీ నారాయణ్ నాయక్ 12 జూన్ 2024 ప్రస్తుతం బీజేపీ
పాఠశాల & సామూహిక విద్య, ఎస్టీ & ఎస్సీ అభివృద్ధి,

మైనారిటీలు & బీసీ సంక్షేమ, సామాజిక భద్రత & వికలాంగుల సాధికారత శాఖ

నిత్యానంద గోండ్ 12 జూన్ 2024 ప్రస్తుతం బీజేపీ
ఆహార సరఫరాలు, వినియోగదారుల సంక్షేమం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ కృష్ణచంద్ర పాత్ర 12 జూన్ 2024 ప్రస్తుతం బీజేపీ
లా, ఎక్సైజ్ & పబ్లిక్ వర్క్స్ శాఖ పృథ్వీరాజ్ హరిచందన్ 12 జూన్ 2024 ప్రస్తుతం బీజేపీ
ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ, పార్లమెంటరీ వ్యవహారాలు

ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) శాఖ

ముఖేష్ మహాలింగ్ 12 జూన్ 2024 ప్రస్తుతం బీజేపీ
ఉక్కు & గనుల, వాణిజ్యం & రవాణా శాఖ బిభూతి భూసన్ జేనా 12 జూన్ 2024 ప్రస్తుతం బీజేపీ
హౌసింగ్ & అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ శాఖ కృష్ణ చంద్ర మహాపాత్ర 12 జూన్ 2024 ప్రస్తుతం బీజేపీ

రాష్ట్ర మంత్రులు (స్వతంత్ర బాధ్యత)

[మార్చు]
మంత్రిత్వ శాఖలు[6][7] మంత్రి పదవీ బాధ్యతలు నుండి పదవీ బాధ్యతలు వరకు పార్టీ
అటవీ, పర్యావరణం & వాతావరణ మార్పులు, కార్మిక, ఉద్యోగుల రాష్ట్ర బీమా శాఖ గణేష్ రామ్ సింగ్ ఖుంటియా 12 జూన్ 2024 ప్రస్తుతం బీజేపీ
ఉన్నత విద్య, క్రీడలు & యువజన సర్వీసులు, ఒడియా భాషా సాహిత్యం & సాంస్కృతిక శాఖ సూర్యబంషి సూరజ్ 12 జూన్ 2024 ప్రస్తుతం బీజేపీ
సహకార, చేనేత & జౌళి, హస్తకళ శాఖ ప్రదీప్ బాల్ సమంత 12 జూన్ 2024 ప్రస్తుతం బీజేపీ
మత్స్య, జంతు వనరుల అభివృద్ధి, సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమల శాఖ గోకులానంద మల్లిక్ 12 జూన్ 2024 ప్రస్తుతం బీజేపీ
పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి & సాంకేతిక విద్య శాఖ సంపద్ చంద్ర స్వైన్ 12 జూన్ 2024 ప్రస్తుతం బీజేపీ

డెమోగ్రాఫిక్స్

[మార్చు]
జిల్లా మంత్రులు మంత్రుల పేరు
బార్గర్ 0
ఝర్సుగూడ 1 సురేష్ పూజారి
సుందర్‌గర్ 0
సంబల్పూర్ 1 రబీ నారాయణ్ నాయక్
దేబాగర్ 0
కెందుఝర్ 1 మోహన్ చరణ్ మాఝీ (ముఖ్యమంత్రి)
మయూర్భంజ్ 2 గణేష్ రామ్ సింగ్ ఖుంటియా

కృష్ణ చంద్ర మహాపాత్ర

బాలాసోర్ 0
భద్రక్ 1 సూర్యబంషి సూరజ్
జాజ్పూర్ 1 ప్రదీప్ లాల్ సమంత
దెంకనల్ 1 కృష్ణ చంద్ర పాత్ర
అంగుల్ 0
సుబర్ణపూర్ 0
బలంగీర్ 2 కనక్ వర్ధన్ సింగ్ డియో (ఉప ముఖ్యమంత్రి)

ముఖేష్ మహాలింగ్

నువాపడ 0
కలహండి 0
కంధమాల్ 0
బౌధ్ 0
కటక్ 0
కేంద్రపారా 0
నబరంగపూర్ 1 నిత్యనాద్ గోండ్
జగత్‌సింగ్‌పూర్ 1 సంపద్ చంద్ర స్వైన్
పూరి 1 ప్రవతి పరిదా (ఉపముఖ్యమంత్రి)
ఖుర్దా 1 పృథ్వీరాజ్ హరిచంద్రన్
నయాగర్ 0
గంజాం 2 గోకుల్ నంద మల్లిక్

బిభూతి భూషణ జేనా

గజపతి 0
రాయగడ 0
కోరాపుట్ 0
మల్కన్‌గిరి 0

మూలాలు

[మార్చు]
  1. The Hindu (12 June 2024). "Mohan Charan Majhi sworn in as Odisha's first BJP Chief Minister" (in Indian English). Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
  2. The New Indian Express (13 June 2024). "Odisha: Eight first-time MLAs appointed as ministers" (in ఇంగ్లీష్). Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
  3. The Week (12 June 2024). "Mohan Majhi sworn in as Odisha CM; 2 Dy CMs, 8 cabinet ministers, 5 MoS also take oath" (in ఇంగ్లీష్). Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
  4. The New Indian Express (13 June 2024). "Odisha: Team Mohan Majhi takes charge" (in ఇంగ్లీష్). Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
  5. The Hindu (15 June 2024). "Odisha CM Mohan Majhi keeps Home, Finance. Here are the Ministerial portfolios" (in Indian English). Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
  6. India Today (15 June 2024). "Odisha Chief Minister allocates portfolios, keeps home, finance with himself" (in ఇంగ్లీష్). Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
  7. Hindustan Times (16 June 2024). "Odisha CM Mohan Majhi keeps home, finance; deputy CMs get agriculture, tourism". Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.