నిత్యానంద గోండ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిత్యానంద గోండ్
నిత్యానంద గోండ్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
12 జూన్ 2024 - ప్రస్తుతం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019 - ప్రస్తుతం
ముందు సుబాష్ గోండ్
నియోజకవర్గం పొలాసర

వ్యక్తిగత వివరాలు

జననం 1976
బాలుగూడ, ఉమర్‌కోట్, నబరంగపూర్ జిల్లా, ఒడిశా
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు సమరు గోండ్
జీవిత భాగస్వామి చైతీ గోండ్
నివాసం భువనేశ్వర్, ఒడిశా
వృత్తి రాజకీయ నాయకుడు

నిత్యానంద గోండ్ భారతదేశంలోని ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఉమర్‌కోట్ నియోజకవర్గం నుండి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై మోహన్ చరణ్ మాఝీ మంత్రివర్గంలో జూన్ 12న పాఠశాల & సామూహిక విద్య, ఎస్టీ & ఎస్సీ అభివృద్ధి, మైనారిటీలు & బీసీ సంక్షేమ, సామాజిక భద్రత & వికలాంగుల సాధికారత శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1][2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

నిత్యానంద గోండ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి 2014 ఎన్నికలలో పొలాసర నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2019 శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బిజెడి అభ్యర్థి సుభాష్ గోండ్‌పై 9,922 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

నిత్యానంద గోండ్ 2024 శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బిజెడి అభ్యర్థి నబీనా నాయక్ పై 10373 ఓట్ల మెజారిటీతో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[4][5] జూన్ 12న పాఠశాల & సామూహిక విద్య, ఎస్టీ & ఎస్సీ అభివృద్ధి, మైనారిటీలు & బీసీ సంక్షేమ, సామాజిక భద్రత & వికలాంగుల సాధికారత శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[6][7]

మూలాలు

[మార్చు]
  1. The New Indian Express (13 June 2024). "Odisha: Team Mohan Majhi takes charge" (in ఇంగ్లీష్). Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
  2. The Week (12 June 2024). "Mohan Majhi sworn in as Odisha CM; 2 Dy CMs, 8 cabinet ministers, 5 MoS also take oath" (in ఇంగ్లీష్). Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
  3. The New Indian Express (4 November 2020). "Nityananda Gond: Donning two caps with equal ease" (in ఇంగ్లీష్). Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
  4. Election Commision of India (4 June 2024). "2024 Odisha Assembly Election Results - Umerkote". Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
  5. The Indian Express (5 June 2024). "Full list of Odisha Assembly elections 2024 winners" (in ఇంగ్లీష్). Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
  6. EENADU (15 June 2024). "సమితి అధ్యక్షుడి నుంచి మంత్రిగా..." Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
  7. EENADU (15 June 2024). "10 మంది కొత్తవారే". Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.