మోహన్ యాదవ్
మోహన్ యాదవ్ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2023 డిసెంబరు 13 | |||
గవర్నరు | మంగూభాయ్ సి. పటేల్ | ||
---|---|---|---|
డిప్యూటీ | * రాజేంద్ర శుక్లా | ||
ముందు | శివరాజ్ సింగ్ చౌహాన్ | ||
ఉన్నత విద్యాశాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2020 జులై 2 – 2023 డిసెంబరు 11 | |||
ముందు | జితు పట్వారీ | ||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2013 డిసెంబరు 6 | |||
ముందు | శివనారాయణ జాగీర్దార్ | ||
నియోజకవర్గం | ఉజ్జయిని దక్షిణ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఉజ్జయిని, మధ్యప్రదేశ్, భారతదేశం | 1965 మార్చి 25||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | సీమా యాదవ్ | ||
సంతానం | 3 | ||
పూర్వ విద్యార్థి | విక్రమ్ యూనివర్సిటీ | ||
వృత్తి | రాజకీయవేత్త, వ్యాపారవేత్త, న్యాయవాది | ||
మూలం | https://mpvidhansabha.nic.in/15thvs/2019_217.pdf |
మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. యాదవ్ మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2023 డిసెంబరు 13 నుండి భారతీయ జనతాపార్టీ తరపున అధికారంలో ఉన్నారు బీజేపీ అధిష్టానం ప్రకటించింది.[1]
జననం, విద్యాభ్యాసం
[మార్చు]మోహన్ యాదవ్ పూనంచంద్ యాదవ్, లీలాబాయి దంపతులకు 1965 మార్చి 25న మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఉజ్జయినిలో జన్మించాడు. ఆయన బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ, ఎం.ఏ, పొలిటికల్ సైన్స్, ఎంబీఏ డిగ్రీలు, పీహెచ్‌డీ పూర్తి చేశాడు. దీనితో పాటు, బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ, పీహెచ్‌డీ డిగ్రీ పట్టాలు కూడా పూర్తి చేశాడు. ఆయనకు భార్య సీమా యాదవ్, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]మోహన్ యాదవ్ 1982లో ఆర్‌ఎస్‌ఎస్ విద్యార్థి విభాగం ఏబీవీపీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, మాధవ్ విజ్ఞాన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ కో-సెక్రటరీగా, ఏబీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆ తర్వాత బీజేపీలో చేరి 2004లో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. మోహన్ యాదవ్ 2004 నుండి 2010 వరకు ఉజ్జయిని డెవలప్‌మెంట్ అథారిటీకి ఛైర్మన్‌గా, 2011 నుండి 2013 వరకు మధ్య ప్రదేశ్ రాష్ట్ర పర్యాటకం డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించాడు.
మోహన్ యాదవ్ 2013లో ఉజ్జయిని దక్షిణ శాసనసభ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2018లో రెండోసారి ఎమ్మెల్యేగా[3] గెలిచి శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు. ఆయన 2023లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి చేతన్ ప్రేమ్‌నారాయణ్ యాదవ్‌పై 12,941 ఓట్ల మెజారితో గెలిచి 2023 డిసెంబరు 11న మధ్యప్రదేశ్ 19వ ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్టానం ప్రకటించింది.[4][5][6]
మూలాలు
[మార్చు]- ↑ Andhrajyothy (11 December 2023). "మధ్యప్రదేశ్ సీఎం ఎవరనే సస్పెన్స్‌కు తెర.. మోహన్ యాదవ్‌కి బీజేపీ పట్టం.. అసలెవరీయన?". Archived from the original on 11 December 2023. Retrieved 11 December 2023.
- ↑ TimesNow (11 December 2023). "Mohan Yadav's Wife, Family: All You Need To Know About New CM Of Madhya Pradesh" (in ఇంగ్లీష్). Archived from the original on 11 December 2023. Retrieved 11 December 2023.
- ↑ India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ Sakshi (11 December 2023). "మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్". Archived from the original on 11 December 2023. Retrieved 11 December 2023.
- ↑ Mana Telangana (11 December 2023). "మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్". Archived from the original on 11 December 2023. Retrieved 11 December 2023.
- ↑ Andhrajyothy (12 December 2023). "మధ్యప్రదేశ్ సీఎం గా మోహన్ యాదవ్". Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.