బస్తర్ జిల్లా

వికీపీడియా నుండి
(బస్తర్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బస్తర్ జిల్లా
बस्तर जिला
ఛత్తీస్‌గఢ్ పటంలో బస్తర్ జిల్లా స్థానం
ఛత్తీస్‌గఢ్ పటంలో బస్తర్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఛత్తీస్‌గఢ్
డివిజనుబస్తర్
ముఖ్య పట్టణంజగదల్‌పుర్
మండలాలు4
Government
 • లోకసభ నియోజకవర్గాలు1
 • శాసనసభ నియోజకవర్గాలు7
విస్తీర్ణం
 • మొత్తం10,755 కి.మీ2 (4,153 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం14,11,644
 • జనసాంద్రత130/కి.మీ2 (340/చ. మై.)
 • Urban
1,93,328
జనాభా వివరాలు
 • అక్షరాస్యత54.94 %
 • లింగ నిష్పత్తి1000:1024
Websiteఅధికారిక జాలస్థలి

బస్తర్ జిల్లా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఒక జిల్లా. ఈ జిల్లా కేంద్రం జగదల్‌పుర్. ఇది నక్సలైట్ ప్రాబల్యం గల ప్రాంతం.

పరిపాలనా విభాగాలు

[మార్చు]

పరిపాలనా సౌలభ్యం కొరకు జిల్లాను జగదల్‌పుర్, బస్తర్ అనే రెండు తెససీల్లుగా విభజించారు. జిల్లా కేంద్రమైన జగదల్‌పుర్ మునిసిపల్ పట్టణం. అందమైన ఈ పట్టణంలో దాదాపు 1,50,000 జనాభా ఉంది.

జిల్లా జనాభా

[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం ఈ జిల్లా జనాభా 14,11.644 గా ఉంది. ఇది స్వాజిలాండ్ లేదా హవాయి దేశ జనాభాతో సమానము. ఇది భారతదేశంలో 348 వ స్థానంలో ఉన్నది (మొత్తం స్థానాలు 640 ). జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 140 నివాసులు (360 / sq mi) గా కలిగి ఉంది. దీని జనాభా పెరుగుదల రేటు దశాబ్దం 2001-2011 పైగా 17,83% ఉంది. లింగ నిష్పత్తి ప్రతి 1000 పురుషులకు 1024 స్త్రీలు, అక్షరాస్యత రేటు 54,94%.

ఆర్థిక స్థితి

[మార్చు]

వ్యవసాయం

[మార్చు]

ఖరీఫ్ సీజన్ లో వరి విస్తారంగా సాగుచేస్తారు. 2.39 హెక్టార్ల వ్యవసాయభూమి ఉన్న ఈ జిల్లాలో వరి ఉత్పాదకత మాత్రం చాలా తక్కువగా, అంటే హెక్టారుకు 08.53 క్వింటాలుగా ఉంది. 1.7% మాత్రమే సాగునీటి ప్రాంతము, ఎరువుల వాడకం అతి తక్కువగా, అంటే హెక్టారుకు 4.6 కిలోగ్రాములు మాత్రం ఉండటంతో పంటకు తగిన పోషకాలు అందక, దిగుబడి తక్కువగా వస్తున్నది.

చిత్రకూట జలపాత దృశ్యమాలిక

[మార్చు]

జిల్లా లోని చిత్రకూట జలపాతము ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ఈ జలపాతx కొన్ని చిత్రాలని ఈ దిగువ చూడవచ్చు.

మూలాలు

[మార్చు]


బయటి లంకెలు

[మార్చు]