ఖరీఫ్ పంట



ఖరీఫ్ పంట అనగా వర్షంపై ఆధారపడి రుతుపవనముల రాక నుంచి రుతుపవనముల తిరోగమనం వరకు పండించే పంటలని చెప్పవచ్చు. ఆసియా ఉపఖండంలో ఈ పద్ధతిని అవలంభిస్తున్నారు. మొక్కలు నాటడం, సాగు చేయడం, నూర్పిళ్లు అన్ని ఈ ఖరీఫ్ లోనే జరుగుతాయి. శరదృతువులో కోతకు వచ్చే ఇటువంటి పంటలను భారతదేశం, పాకిస్తాలలో వేసవి లేదా రుతుపవన పంట అని కూడా పిలుస్తారు. ఖరీఫ్ పంటలు సాధారణంగా జూలై నెలలో ప్రారంభమయ్యే తొలకరి వర్షాలలో నాటుతారు. ఈ కాలాన్ని నైరుతి రుతుపవనకాలం అంటారు. పాకిస్తాన్ లో ఖరీఫ్ సీజన్ ఏప్రిల్ 16 న ప్రారంభమై అక్టోబరు 15 వరకు ఉంటుంది. భారతదేశంలో రాష్ట్రాల వారిగా పండించే పంట, ఖరీఫ్ సీజన్ మారుతుంది. మొత్తం మీద ఖరీఫ్ సీజన్ మే నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తుంది. కాని ప్రముఖంగా ఈ ఖరీఫ్ సీజన్ జూన్ నెలలో ప్రారంభమై అక్టోబరు నెలతో ముగుస్తుందని అత్యధికులు భావిస్తారు.
వరి
[మార్చు]ఖరీఫ్ లో పండించే పంటలలో ముఖ్యమైనది వరి.