బలగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బలగం
బలగం సినిమా పోస్టర్
దర్శకత్వంవేణు ఎల్దండి
రచనరమేష్‌ ఎగిలేటి, నాగరాజు మడూరి
నిర్మాతహర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి
తారాగణంప్రియదర్శి
కావ్య కళ్యాణ్ రామ్
సుధాకర్‌ రెడ్డి
మురళీధర్‌ గౌడ్‌
ఛాయాగ్రహణంఆచార్య వేణు
కూర్పుమధు
సంగీతంభీమ్స్ సిసిరోలియో
పాటలుకాసర్ల శ్యామ్
నిర్మాణ
సంస్థ
దిల్ రాజు ప్రొడక్షన్స్‌
విడుదల తేదీs
3 మార్చి 2023 (2023-03-03)(థియేటర్)
20 మార్చి 2023 (2023-03-20)( అమెజాన్ ప్రైమ్ వీడియో, సింప్లీ సౌత్ ఓటీటీల్లో)
దేశం భారతదేశం
భాషతెలుగు

బలగం 2023లో విడుదలైన తెలుగు సినిమా. శిరీష్‌ సమర్పణలో దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై హర్షిత్‌ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ సినిమాకు వేణు ఎల్దండి దర్శకత్వం వహించాడు.[1] ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 మార్చి 3న విడుదలై,[2] మార్చి 24న అమెజాన్ ప్రైమ్ వీడియో, సింప్లీ సౌత్ ఓటీటీల్లో విడుదలైంది.[3][4]

థియేటర్లలో గొప్ప హిట్‌గా నిలిచిన ఈ సినిమాకు గ్రామాల్లో ప్రత్యేక షోల ద్వారా ప్రజల ఆదరణ లభిస్తుండడడంతో ప్రజల ఆసక్తిని చూసిన గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, యువజన సంఘాలు బలగం సినిమాను పంచాయతీల ఆవరణలో, స్కూల్‌ ఆవరణల్లో ప్రదర్శన వేసి ఉచితంగా చూపించారు.[5][6]

సాయిలు (ప్రియదర్శి) అప్పు చేసి అనేక వ్యాపార ప్రయత్నాలు చేసి విజయం సాధించలేక పోతుంటాడు. అయితే పెళ్లి చేసుకొని వచ్చిన కట్నం డబ్బుతో అప్పు తీర్చేయాలి అనుకుంటాడు. ఈ క్రమంలో అతడి తాతయ్య కొమురయ్య (సుధాకర్ రెడ్డి) చనిపోవడంతో చావు ఇంట్లో జరిగిన గొడవ కారణంగా నిశ్చితార్థం రద్దు అవుతుంది. సాయిలు తండ్రి (జయరాం)కి, మావయ్య (మురళీధర్)కు మధ్య గొడవలు ఉంటాయి. ఆ గొడవలకు కారణం ఏమిటి? దూరంగా ఉండే అత్త కుటుంబాన్ని, తన తండ్రికి ఎలా దగ్గర చేశాడు? అసలు రెండు కుటుంబాలకు మధ్య దూరం ఎందుకు పెరిగింది? మరి సాయిలు తన అప్పు తీర్చాడా? చివరకు ఆ కుటుంబం అంతా ఎలా ఒక్కటి అయింది? అనేదే మిగతా సినిమా కథ.[7][8]

నటీనటులు

[మార్చు]
  • ప్రియదర్శి (సాయిలు)
  • కావ్య కళ్యాణ్ రామ్ (సంధ్య, సాయిలు మరదలు)
  • కేతిరి సుధాకర్‌ రెడ్డి (మొగిలయ్య, సాయిలు తాత)
  • కోట జయరాం (ఐలయ్య, సాయిలు తండ్రి)
  • ఐరేని మురళీధర్‌ గౌడ్‌ (నారాయ‌ణ, సాయిలు మామ)[9]
  • రూపలక్ష్మి (లక్ష్మీ, సాయిలు మేన‌త్త)
  • మైమ్ మధు (మొగిలి, సాయిలు బాబాయి)[10]
  • రచ్చ రవి (రాజేష్, సాయిలు ప్నేహితుడు)
  • కీసరి నర్సింగం (సర్పంచ్)
  • వడ్డేపల్లి కృష్ణ (పూజారి)
  • సురభి విజయలక్ష్మి[11]
  • సురభి లలిత (సుజాత, సాయిలు చిన్నమ్మ)[12]
  • అంజి వల్గుమాన్
  • జబర్దస్త్‌ రోహిణి
  • వేణు ఎల్డండి (దర్జీ)
  • కృష్ణ తేజ (రవి ఆర్ఎంపి డాక్టర్, సాయిలు స్నేహితుడు)
  • కొమ్మూరి సుజాత (స్వరూప, సాయిలు త‌ల్లి)
  • మొగిలి
  • విద్యాసాగర్ కారంపూరి
  • సంజయ్ కృష్ణ
  • సౌదామిని[13]
  • కర్తానందం[14]
  • వాసుదేవరావు
  • రవితేజ

పాటల జాబితా

[మార్చు]

బలరామ నరసయో, రచన: కాసర్ల శ్యామ్, గానం.భీమ్ సిసిరొలియో, వేణు ఏలదండి

పొట్టి పిల్లా , రచన: కాసర్ల శ్యామ్ , గానం.రామ్ మిరియాల

ఊరు పల్లెటూరు , రచన: కాసర్ల శ్యామ్, గానం రామ్ మిరియాల, మoగ్లి

తోడుగా మా తోడుండి రచన: కాసర్ల శ్యామ్, గానం.మొగిలి కాంతమ్మ

అయ్యో శివుడా , రచన: కాసర్ల శ్యామ్,గానం. దాసరి కొండప్ప

కొడుకులారా , రచన: కాసర్ల శ్యామ్, గానం.వేణు ఎలదండీ .

సాంకేతిక నిపుణులు

[మార్చు]

చిత్రీకరణ

[మార్చు]

దర్శకుడు వేణు స్వగ్రామం సిరిసిల్ల కావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాలలో (కోనరావుపేట మండలంలోని కొలనూర్‌, కనగర్తి, నాగారం, ధర్మారం, తంగళ్లపల్లి, అగ్రహారం, జిల్లెల్ల) 50 రోజులపాటు ఈ సినిమా షూటింగ్‌ జరిగింది. బంధుత్వాలను కలిపే చిన్నచిన్న డైలాగులతో తొలిసారిగా సుమారుగా 200 మందికి పైగా గ్రామస్తులు ఈ సినిమాలో నటించారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రకృతి అందాలతోపాటు షూటింగ్‌కు అనువుగా ఉన్న ఓ పాత ఇంటిలో చిత్రీకరించారు.[19]

ప్రచారం

[మార్చు]

పాటల విడుదల

[మార్చు]

ఈ సినిమాలోని 'ఊరు పల్లెటూరు' అనే పాట 2023 ఫిబ్రవరి 6న, 'పొట్టి పిల్ల' అనే పాట ఫిబ్రవరి 17న విడుదలయింది.[20] ఫిబ్రవరి 25న 'బలరామ నరసయో' అనే మూడో పాటను తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణ ఆవిష్కరించాడు. 'ఈ సినిమా తెలుగు సినిమా రంగంలో ఒక గేమ్‌ ఛేంజర్‌ అవుతుందని, ప్రధాన స్రవంతి వాణిజ్య చిత్రాల నమూనాలో ఓ చక్కటి బతుకు చిత్రాన్ని తీశారని, దిల్‌రాజు సంస్థలో ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోతుందని, నటుడిగా ఇన్నాళ్ళు నవ్వించిన వేణు దర్శకుడిగా ఈ సినిమాతో కడుపారా ఏడిపిస్తాడని, తెలంగాణ సినిమాకు దిద్దిన తిలకం ఈ బలగం సినిమా అని హరికృష్ణ అన్నాడు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొన్నది.[21][22]

ప్రీ రిలీజ్‌ వేడుక

[మార్చు]

2023 ఫిబ్రవరి 28న సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాట్‌ లో ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకలో నిర్మాత దిల్‌ రాజు, తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, సినీ దర్శకుడు అనుదీప్ కేవీ, సినీ హీరో సిద్ధు జొన్నలగడ్డ, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్ రావు, చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.[23] 'తెలంగాణ యాస, భాష మాట్లాడటానికి మొహమాట పడ్డ రోజుల నుంచి నేడు టీవీలు మొదలుకొని వెండి తెర వరకు తెలంగాణ యాస వినిపిస్తుందంటే గర్వంగా ఉందని, సిరిసిల్ల గడ్డ మీద జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి, మిద్దె రాములు వంటి లబ్ద ప్రతిష్టులు జన్మించారని, సిరిసిల్లకు సినిమాను తెచ్చి మానవ సంబంధాల్ని చాలా గొప్పగా ఆవిష్కరించేలా ఈ సినిమా తీశారని, ఈ సినిమా ద్వారా తెలంగాణ పల్లెల సంస్కృతిని, తెలంగాణ కళాకారుల అద్భుతమైన ప్రతిభ వెలుగులోకి వస్తుందని, ఈ నెల 3న థియేటర్లు మొత్తం నిండిపోవాలి’ అని కేటీఆర్ అన్నారు.[24]

పురస్కారాలు & సన్మానాలు

[మార్చు]
  1. బలగం సినిమా లాస్‌ ఏంజిల్స్‌ సినిమాటోగ్రఫీ అవార్డులలో రెండు పురస్కారాలను సాధించింది. ఉత్తమ దర్శకుడు (వేణు ఎల్దిండి), ఉత్తమ ఛాయాగ్రహణం (ఆచార్య వేణు) విభాగాల్లో అవార్డులు దక్కాయి.[25]
  2. ఒనికో ఫిలిం ఫెస్టివల్‌లో (ఉక్రెయిన్‌) బెస్ట్‌ డ్రామా ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో ఒనికో ఫిల్మ్‌ అవార్డు గెలుచుకుంది.[26]
  3. ది గోల్డెన్ బ్రిడ్జ్ ఇస్తాన్‌బుల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ 2023లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ లీడ్ యాక్టర్ విభాగాల్లో మూడు అవార్డులను అందుకుంది.
  4. అరౌండ్‌ ఇంటర్నేషనల్‌ అవార్డ్స్‌(ఆమ్‌స్టర్‌డామ్‌) లో ఉత్తమ దర్శకుడి విభాగంలో దర్శకుడు వేణు ఎల్దండి అవార్డును అందుకున్నాడు.[27]
  5. ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో 9 విభాగాల్లో అవార్డులను అందుకుంది.[28]
    1. బెస్ట్ ప్రొడ్యూసర్ ఫీచర్ ఫిలింకు గాను హన్షిత, హర్షిత్
    2. డెబ్యూట్ ఫిలిం మేకర్ క్రిటిక్స్ ఛాయస్ కి గాను డైరెక్టర్ వేణు ఎల్దండి
    3. బెస్ట్ యాక్టర్ ఫీచర్ ఫిలింకుగాను ప్రియదర్శి
    4. బెస్ట్ యాక్ట్రెస్ ఫీచర్ ఫిలింకు గాను కావ్య కళ్యాణ్ రామ్
    5. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఫీచర్ ఫిలింకు గాను రూప లక్ష్మి
    6. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఫీచర్ ఫిలింకు గాను భీమ్స్ సిసిరోలియో
    7. బెస్ట్ ఎడిటర్ ఫీచర్ ఫిలింకుగాను చింతల మధు
    8. బెస్ట్ సినిమాటోగ్రఫీ ఫీచర్ ఫిలింకు గాను ఆచార్య వేణు
  6. తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2023 ఏప్రిల్ 22న ‘బలగం’ చిత్ర బృందానికి సత్కారం జరిగింది.[29][30][31]
  7. 13వ దాదాసాహెబ్‌ ఫాల్కే అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డ్‌.[32]
  8. స్వీడిష్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడు (ప్రియదర్శి), ఉత్తమ సహాయ నటుడు (కేతిరి సుధాకర్‌ రెడ్డి) లకు అవార్డులు వచ్చాయి[33]

ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు

[మార్చు]

69వ శోభ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌ - 2024లో బలగం సినిమా ఉత్త‌మ చిత్రం, ఉత్త‌మ ద‌ర్శ‌కుడు, ఉత్తమ స‌హ‌య నటుడు, ఉత్త‌మ సంగీతం, ఉత్త‌మ లిరిక్స్, ఉత్తమ స‌హ‌య నటితో పాటు ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (మేల్, ఫిమేల్) 8 కేట‌గిరీల్లో నామినేట్‌ అవ్వగా, ఉత్తమ చిత్రంగా, [34] ఉత్తమ దర్శకుడిగా, ఉత్తమ సహాయ నటిగా మూడు అవార్డులను గెలుచుకుంది.[35][36][37]

గ్రామాల్లో ప్రదర్శన

[మార్చు]

పెద్దపెద్ద స్క్రీన్ ఏర్పాటుచేసి వివిధ గ్రామాలలోని పంచాయతీ కార్యాలయాల ముందు, కూడళ్ళముందు ఈ ఈ సినిమాను ప్రదర్శించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను అందరికీ కనెక్ట్ అయ్యేలా ఆవిష్కరించబడిన ఈ సినిమా చూసిన ప్రతిఒక్కరూ భావోద్వేగాలను పంచుకున్నారు. 1997-98 కాలం వరకూ సినిమా చూసేందుకు ఊరంతా ఒకదగ్గర చేరేది. ఇప్పుడు అలాంటి సన్నివేశాలను మరోసారి బలగం సినిమా కళ్ళముందుకు తీసుకువచ్చిందని పలువురు అభిప్రాయపడ్డారు.[38]

బలగం సినిమాని తెలంగాణ గ్రామాల్లో కొన్నిచోట్ల బహిరంగంగా ప్రదర్శించడం పై దిల్ రాజు నిజమాబాద్ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.[39][40] బలగం పబ్లిక్ స్క్రీనింగ్స్ ను ఆపటం తమ ఉద్దేశం కాదని ఓటీటీ సంస్థ తెచ్చిన ఒత్తిడి మేరకే పోలీసులకు నోటిస్ ఇచ్చామని ఆయన తెలిపాడు.

మూలాలు

[మార్చు]
  1. "'బలగం' చిత్రం యూనిట్‌ సందడి". EENADU. 2023-02-24. Archived from the original on 2023-02-27. Retrieved 2023-02-27.
  2. Andhra Jyothy (21 February 2023). "అంతా కొత్తవారితో బలగం". Archived from the original on 23 February 2023. Retrieved 23 February 2023.
  3. 10TV (23 March 2023). "అర్ధరాత్రి సర్‌ప్రైజ్ ఇవ్వనున్న 'బలగం' మూవీ..!". Archived from the original on 23 March 2023. Retrieved 23 March 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "బలగం నటుడు పెద్ద నర్సింగం మృతి". EENADU. Retrieved 2024-04-12.
  5. telugu, NT News (2023-04-17). "Balagam movie | సిల్వర్‌ స్క్రీన్‌ మ్యాజిక్‌కు పల్లె జనం ఫిదా.. బంధాలను తట్టి లేపుతున్న తెలంగాణ సినిమా". www.ntnews.com. Archived from the original on 2023-04-17. Retrieved 2023-04-17.
  6. Eenadu (2 April 2023). "మట్టి పరిమళాలు.. గట్టి బంధాలు". Archived from the original on 22 April 2023. Retrieved 22 April 2023.
  7. Eenadu (3 March 2023). "రివ్యూ: బ‌ల‌గం". Archived from the original on 11 April 2023. Retrieved 11 April 2023.
  8. Andhra Jyothy (2 March 2023). "తెలంగాణ పల్లె జీవనశైలిని కళ్ళకు కట్టినట్టు చెప్పే కథ". Archived from the original on 11 April 2023. Retrieved 11 April 2023.
  9. Sakshi (2 April 2023). "సర్పంచ్‌ క్యారెక్టర్‌ చేయడం నా అదృష్టం". Archived from the original on 27 April 2023. Retrieved 27 April 2023.
  10. TV9 Telugu (8 April 2023). "'బలగం' కొమురయ్య చిన్న కొడుకు చక్రవాకం సీరియల్‌లో నటించాడని తెలుసా.? మనోడిది మాములు ట్యాలెంట్‌ కాదండోయ్‌". Archived from the original on 22 April 2023. Retrieved 22 April 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  11. Sakshi (4 April 2023). "శుభాల్లో, అశుభాల్లో మేనత్త! అచ్చం 'బలగం' సినిమాలో పోచవ్వలాగానే! కరీంనగర్‌ కోడలు." Archived from the original on 4 April 2023. Retrieved 4 April 2023.
  12. TV9 Telugu (18 April 2023). "'పాత్ర కోసమే నటించా, డబ్బుల కోసం కాదు'.. పారితోషికంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన 'బలగం' నటి." Archived from the original on 22 April 2023. Retrieved 22 April 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  13. TV9 Telugu (24 April 2023). "'సిగ్గుపడగానే సెలక్ట్ చేశారు.. సినిమా కోసం పది కేజీలు పెరిగాను'.. బలగం నటి సౌదామిని కామెంట్స్." Archived from the original on 25 April 2023. Retrieved 25 April 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  14. TV9 Telugu (23 April 2023). "చిన్నప్పుడే నాన్న మరణం.. రెక్కలు ముక్కలు చేసుకుని పెంచిన తల్లి.. బలగం నటుడి జీవితంలో కష్టాలు." Archived from the original on 25 April 2023. Retrieved 25 April 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  15. Namasthe Telangana (22 February 2023). "ప్రతిభావంతులను ప్రోత్సహిస్తాం". Archived from the original on 23 February 2023. Retrieved 23 February 2023.
  16. Sakshi (11 March 2023). "కమెడియన్‌ దగ్గర టచప్‌ బాయ్‌గా పని చేశా, అవకాశాల కోసం." Archived from the original on 4 April 2023. Retrieved 4 April 2023.
  17. Eenadu (9 April 2023). "బలగం కోసం... హీరో పాత్రని త్యాగం చేశా". Archived from the original on 9 April 2023. Retrieved 9 April 2023.
  18. Namasthe Telangana (9 April 2023). "తొలి సినిమాకే అంతర్జాతీయ అవార్డు.. ఇదీ వేణు ఆచార్య సక్సెస్‌ వెనుక ఉన్న కథ". Archived from the original on 9 April 2023. Retrieved 9 April 2023.
  19. telugu, NT News (2023-02-28). "Balagam | సిరిసిల్ల జిల్లా నుంచి వస్తున్న పెద్ద సినిమా బలగం.. కొలనూర్‌లోనే షూటింగ్‌ పూర్తి". www.ntnews.com. Archived from the original on 2023-02-28. Retrieved 2023-02-28.
  20. Eenadu (17 February 2023). "'పొట్టి పిల్ల.. నా గుండెకు బొట్టు బిల్ల'". Archived from the original on 23 February 2023. Retrieved 23 February 2023.
  21. ABN (2023-02-26). "బలగం సినిమా కాదు.. జీవితం | Balagam is not a movie Life". Chitrajyothy Telugu News. Archived from the original on 2023-02-27. Retrieved 2023-02-27.
  22. telugu, NT News (2023-02-27). "తెలంగాణ సినిమాకు దిద్దిన తిలకం". www.ntnews.com. Archived from the original on 2023-02-27. Retrieved 2023-02-27.
  23. "Balagam: సిరిసిల్లలో 'బలగం' ప్రీ రిలీజ్‌ వేడుకకు ముఖ్య అతిథిగా కేటీఆర్‌". EENADU. 2023-02-28. Archived from the original on 2023-02-28. Retrieved 2023-02-28.
  24. telugu, NT News (2023-03-01). "Balagam movie | సినిమాల్లో తెలంగాణ యాస వింటే గుండెలు ఉప్పొంగుతున్నాయి". www.ntnews.com. Archived from the original on 2023-03-01. Retrieved 2023-03-01.
  25. Namasthe Telangana (1 April 2023). "బలగం సినిమాకు అంతర్జాతీయ పురస్కారాలు". Archived from the original on 1 April 2023. Retrieved 1 April 2023.
  26. 10TV (3 April 2023). "మరో ఇంటర్నేషనల్ అవార్డు గెలుచుకున్న బలగం.. ఇంట గెలిచి రచ్చ గెలుస్తున్నాం.. ప్రియదర్శి స్పెషల్ పోస్ట్." Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  27. T News Telugu (7 April 2023). "'బలగం' ఖతాలో మరో అంతర్జాతీయ అవార్డు..!". Archived from the original on 20 April 2023. Retrieved 20 April 2023.
  28. 10TV Telugu (11 April 2023). "ఒకే ఫిలిం ఫెస్టివల్ లో 9 ఇంటర్నేషనల్ అవార్డులు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిన బలగం." (in telugu). Archived from the original on 20 April 2023. Retrieved 20 April 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  29. Namasthe Telangana (24 April 2023). "'బలగం' చరిత్ర సృష్టించింది". Archived from the original on 24 April 2023. Retrieved 24 April 2023.
  30. Telugu, 10TV; Nill, Saketh (2023-04-24). "Balagam : తెలంగాణ ప్రభుత్వం తరపున బలగం చిత్ర యూనిట్ కు సన్మానం." 10TV Telugu (in telugu). Archived from the original on 2023-04-24. Retrieved 2023-04-24.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  31. Namasthe Telangana (23 April 2023). "తెలంగాణ సినిమా రంగం అభివృద్ధికి ప్రత్యేక పాలసీని తీసుకువస్తాం : ఎఫ్‌డీసీ చైర్మన్‌". Archived from the original on 25 April 2023. Retrieved 25 April 2023.
  32. Namasthe Telangana (2 May 2023). "'బలగం' చిత్ర సంగీత దర్శకుడికి పురస్కారం". Archived from the original on 2 May 2023. Retrieved 2 May 2023.
  33. Andhra Jyothy (9 May 2023). "బలగం చిత్రానికి రెండు అవార్డులు". Chitrajyothy Telugu News. Archived from the original on 9 May 2023. Retrieved 9 May 2023.
  34. "ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల్లో సత్తా చాటిన 'బలగం' మూవీ - ఏకంగా 8 కేటగిరీల్లో నామినేట్‌." 17 July 2024. Archived from the original on 4 August 2024. Retrieved 4 August 2024.
  35. NT News (4 August 2024). "ఉత్తమ చిత్రం బలగం.. బెస్ట్‌ డైరెక్టర్‌ వేణు యెల్దండి". Archived from the original on 4 August 2024. Retrieved 4 August 2024.
  36. Filmfare (4 August 2024). "Full list of Winners of the 69th SOBHA Filmfare Awards South (Telugu) 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 4 August 2024. Retrieved 4 August 2024.
  37. Eenadu (4 August 2024). "2024: ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌: ఉత్తమ చిత్రం బలగం.. ఉత్తమ నటుడు నాని". Archived from the original on 4 August 2024. Retrieved 4 August 2024.
  38. Telugu, TV9 (2023-04-02). "Balagam: మొత్తానికి ఏడిపించావు కదయ్యా వేణు.. 'బలగం' సినిమా చూస్తూ ఊరంతా కన్నీరు పెట్టింది." TV9 Telugu. Archived from the original on 2023-04-02. Retrieved 2023-04-15.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  39. Zee News Telugu (2 April 2023). "బలగం సినిమాపై పోలీసులకు దిల్ రాజు ఫిర్యాదు.. అసలు విషయం ఏమిటంటే?". Archived from the original on 4 April 2023. Retrieved 4 April 2023.
  40. Namasthe Telangana, NT News (9 April 2023). "మట్టికథకు పట్టాభిషేకం". Archived from the original on 9 April 2023. Retrieved 9 April 2023.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బలగం&oldid=4290588" నుండి వెలికితీశారు