వేణు (హాస్యనటుడు)
వేణు | |
---|---|
జననం | వేణు ఎల్దండి 1980 జూన్ 2[1] సిరిసిల్ల |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2004–ప్రస్తుతం |
తల్లిదండ్రులు | వెంకటయ్య, మాలవ్వ |
వేణు ఒక హాస్యనటుడు, దర్శకుడు.[2] తేజ దర్శకత్వంలో వచ్చిన జై సినిమాతో సినీ రంగంలో ప్రవేశించాడు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమంలో వేణు వండర్స్ అనే పేరుతో ఒక బృందం నడిపాడు. 200 పైగా సినిమాల్లో నటించాడు. 2023 లో బలగం అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు.[3]
వ్యక్తిగత జీవితం
[మార్చు]వేణు స్వస్థలం తెలంగాణాలోని సిరిసిల్ల. తల్లిదండ్రులకు వేణు తొమ్మిదో సంతానం.[4] వీరు కూరగాయల వ్యాపారం చేసేవారు. వాళ్ళకి ఆ పనుల్లో సాయపడుతూ చదువుకున్నాడు. అదే పనిలో వాగుడుకాయ అని పేరు కూడా తెచ్చుకున్నాడు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని రెండు సార్లు స్టేట్ ఛాంపియన్ కూడా అయ్యాడు. కానీ ఆ తర్వాత సినిమాల మీద ఆసక్తి కలిగి ఇంటి నుంచి బయటికి వచ్చాడు.[5]
కెరీర్
[మార్చు]ప్రారంభంలో నవకాంత్ అనే రచయిత దగ్గర మూడు నెలలు సహాయకుడిగా పనిచేశాడు. సినిమా రంగంలో ఉన్నవారికి దగ్గరగా ఉంటే అవకాశాలు తొందరగా వస్తాయని భావించి నటుడు చిత్రం శ్రీను దగ్గర రెండు సంవత్సరాలు సహాయకుడిగా ఉన్నాడు. నటుడిగా ప్రయత్నించడం కోసం అక్కడి నుంచి కూడా బయటికి వచ్చేశాడు. పని లేకపోవడంతో పూట గడవడం కూడా కష్టమైంది. అదే సమయంలో దర్శకుడు తేజ తాను తీస్తున్న జై సినిమా కోసం నూతన నటులను అన్వేషిస్తున్నాడని తెలుసుకుని ఆడిషన్ కి హాజరై అందులో చిన్న పాత్ర చేజిక్కించుకున్నాడు. ఆ తరువాత 2000 దశాబ్దం నుంచి వేణు చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ ఉన్నాడు. సుమారు 200కి పైగా చిత్రాల్లో నటించాడు. కానీ కమర్షియల్ గా అంత గుర్తింపు రాలేదు. ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమంలో వేణు వండర్స్ అనే పేరుతో ఒక బృందాన్ని నడిపాడు. కొంతకాలం తర్వాత మళ్ళీ సినిమాల మీదనే దృష్టి సారించాడు. తాను పుట్టిన ప్రాంతం, మనుషులు, సంస్కృతి నేపథ్యంలో బలగం సినిమా కథ రాసుకుని తానే దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2023 లో విడుదలై మంచి స్పందన లభించింది.[4]
వివాదం
[మార్చు]జబర్దస్త్ కార్యక్రమంలో ఒక ప్రదర్శనలో తమ కులాన్ని అవమానించారంటూ కొంతమంది ఇతని మీద దాడి చేశారు.[6] ఈ దాడిని తెలుగు సినీ నటుల సంఘం ఖండించింది. దాడికి చేసిన వారిపై చర్య తీసుకోవాలని పోలీసులకు రిపోర్టు చేశారు.[7]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | శీర్షిక | పాత్ర(లు) | గమనికలు | Ref. |
---|---|---|---|---|
2004 | జై | విద్యార్థి | ||
2005 | ధైర్యం | ప్రకాష్ | ||
2006 | రణం | భగవతి అనుచరులు | ||
కేడి | రఘు స్నేహితుడు | తమిళ సినిమా | ||
సీతకోక చిలుక | ||||
2007 | జగడం | నల్ల మహేష్ | ||
మున్నా | టిల్లు | |||
టక్కరి | తిరుపతి స్నేహితుడు | |||
గోదావ | కాలేజీ విద్యార్థి | |||
2008 | కంత్రి | |||
కథానాయకుడు | ||||
సికాకుళానికి చెందిన సిద్దు | దోసె బాబు | |||
అంకిత్, పల్లవి & స్నేహితులు | సునీల్ | |||
దొంగల బండి | ||||
రాజు | బొట్టు శీను అనుచరుడు | |||
2009 | కుర్రాడు | కుమార్ | ||
2010 | సాధ్యం | |||
మరో చరిత్ర | బాలు మరియు సంధ్య సహోద్యోగి | |||
డాన్ శీను | బార్ వెయిటర్ | |||
కత్తి కాంత రావు | నల్ల శ్రీను | |||
2011 | నాకు ఓ లవర్వుండి | |||
పిల్ల జమీందార్ | బ్యాంకాక్ | |||
2012 | నీకు నాకు డాష్ డాష్ | బాపినీడు పక్కవాడు | ||
దరువు | ||||
సుడిగాడు | ఆటో డ్రైవర్ | |||
అదృష్టవంతుడు | లక్కీ స్నేహితుడు | |||
2013 | జబర్దస్త్ | డాన్స్ మాస్టర్ | ||
జఫ్ఫా | వేణు బొంగుల | |||
నీడ | తాగుబోతు | |||
1000 అబద్దాలు | సత్య స్నేహితుడు | |||
అడ్డా | ||||
అత్తారింటికి దారేది | శశి కిడ్నాపర్ | |||
మధుమతి | ||||
2014 | జాతి గుర్రం | తాగుబోతు | ||
బిల్లా రంగ | ||||
గలాటా | ||||
రా రా కృష్ణయ్య | ||||
అల్లుడు శీను | లుంగీ బాబా స్నేహితుడు | |||
బూచమ్మ బూచోడు | ||||
దిక్కులు చూడకు రామయ్య | ||||
ది ఎండ్ | వాచ్ మాన్ | |||
లక్ష్మి రావే మా ఇంటికి | ||||
2015 | బీరువా | |||
పులి | టైగర్ స్నేహితుడు | |||
మంత్రం 2 | ||||
మిర్చి లాంటి కుర్రాడు | ||||
బ్రూస్ లీ: ది ఫైటర్ | బ్రూస్ లీ స్నేహితుడు | |||
భలే మంచి రోజు | ఈసు | |||
2016 | సర్దార్ గబ్బర్ సింగ్ | |||
ఒక్క అమ్మాయి తప్పా | ||||
బాబు బంగారం | ||||
2017 | కిట్టు ఉన్నాడు జాగ్రత్త | |||
నక్షత్రం | ||||
మహానుభావుడు | ||||
గల్ఫ్ | సోములు | |||
ప్రేమతో మీ కార్తీక్ | ||||
2018 | రా రా | |||
బ్రాండ్ బాబు | డైమండ్ బాబు అసిస్టెంట్ | |||
నన్ను దోచుకుందువటే | గిరి | |||
అనగనగా ఓ ప్రేమకథ | ||||
2019 | ఒకటే లైఫ్ | విక్కీ | ||
వజ్ర కవచధార గోవిందా | ||||
రాజ్‌దూత్ | డొంక | |||
2020 | భార్య, ఐ | వర్మ స్నేహితుడు | ||
2021 | దృశ్యం 2 | ఆటో డ్రైవర్ | ||
2023 | రంగ మార్తాండ | |||
నిరీక్షణ | చీను | డబ్బింగ్ వెర్షన్ మాత్రమే విడుదలైంది | ||
బలగం | దర్శకుడు కూడా | |||
భోలా శంకర్ | శంకర్ స్నేహితుడు | |||
2024 | డార్లింగ్ | బాబా |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | పని | పాత్ర | నెట్‌వర్క్ |
---|---|---|---|
2013 | జబర్దస్త్ | ETV | |
2023 | సేవ్ ది టైగర్స్ | రాఘవ | హాట్‌స్టార్ |
మూలాలు
[మార్చు]- ↑ "Tollywood Movie Actor Nalla Venu Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2023-03-29.
- ↑ "Jabardasth 'Venu' arrested". aptoday.com. Archived from the original on 20 మే 2016. Retrieved 5 October 2016.
- ↑ "బలగం తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అలా పిలవట్లేదు: వేణు". Sakshi. 2023-03-16. Retrieved 2023-03-28.
- ↑ 4.0 4.1 "Venu Tillu: కొత్తగా ఉంది.. ఆ గౌరవం". EENADU. Retrieved 2023-03-28.
- ↑ "Venu: అలా అనుకొనే వారికి సమాధానమే 'బలగం'..: వేణు యెల్దండి". EENADU. Retrieved 2024-02-05.
- ↑ "Telugu TV actor Venu of Jabardasth fame attacked in Hyderabad". deccanchronicle.com. వెంకట్రామి రెడ్డి. Retrieved 5 October 2016.
- ↑ "'నవ్విస్తున్న మమ్మల్ని కొట్టడం అమానుషం'". sakshi.com. జగతి ప్రచురణలు. Retrieved 5 October 2016.