కొండూరి రవీందర్ రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొండూరి రవీందర్ రావు

తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు లిమిటెడ్‌ (టెస్కాబ్‌) చైర్మన్‌
పదవీ కాలం
2015 - 1 జూన్ 2024[1]
తరువాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు

వ్యక్తిగత వివరాలు

జననం 1963
గజసింగారం, గంభీరావుపేట మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ

కొండూరి రవీందర్‌రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు లిమిటెడ్‌ (టెస్కాబ్‌) చైర్మన్‌గా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

కొండూరి రవీందర్‌రావు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేశాడు. ఆయన 2005లో గంభీరావుపేట మండలం గజసింగవరం నుంచి డైరెక్టర్‌గా, సింగిల్‌విండో చైర్మన్‌గా ఎన్నికై కరీంనగర్‌ సహకార కేంద్ర బ్యాంక్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. ఆయన 2013లో గంభీరావుపేట సింగిల్‌ విండో చైర్మన్‌గా ఎన్నికై రెండోసారి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కేడీసీసీబీ చైర్మన్‌గా నియమితుడయ్యాడు.

కొండూరి రవీందర్‌రావు 2014లో తెలంగాణ  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున సిరిసిల్ల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు, ఆయన అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చేరి లో 2015లో తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్‌ (టెస్కాబ్‌) చైర్మన్‌గా నియమితుడయ్యాడు. రవీందర్‌రావు 2019లో అంతర్జాతీయ సహకార బ్యాంక్‌ల సమాఖ్య ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. దేశవ్యాప్తంగా సహకార రంగంలో పనిచేసే ఉద్యోగుల హెచ్‌ఆర్‌ పాలసీ అమలు కమిటీకి చైర్మన్‌గా ఉన్నారు.

మూలాలు

[మార్చు]
  1. Eenadu (1 June 2024). "TSCAB: టెస్కాబ్‌ ఛైర్మన్‌ పదవికి రవీందర్‌రావు రాజీనామా". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
  2. Sakshi (2 March 2020). "హ్యాట్రిక్‌ 'కొండూరి'..!". Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.
  3. Sakshi (10 February 2020). "దిగ్గజ నాయకులను అందించిన సహకార ఎన్నికలు". Archived from the original on 12 April 2022. Retrieved 12 April 2022.