Jump to content

ప్లూరసి

వికీపీడియా నుండి
ప్లూరిసి
ఇతర పేర్లుప్లూరిటిస్
చిత్రం A సాధారణ శరీర నిర్మాణ శాస్త్రాన్ని చూపుతుంది. చిత్రం B, కుడివైపు ఊపిరితిత్తులు ప్లూరిసీతో ను, ఎడమ వైపు ఊపిరితిత్తులు న్యూమోథొరాక్స్‌ను చూపుతుంది.
ప్రత్యేకతపల్మోనాలజీ
లక్షణాలుపదునైన ఛాతీ నొప్పి
కారణాలువైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, న్యుమోనియా, పల్మనరీ ఎంబోలిజం
రోగనిర్ధారణ పద్ధతిఛాతీ ఎక్స్-రే, ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ECG), రక్త పరీక్షలు
భేదాత్మక రోగనిర్థారణ పద్ధతిపెరికార్డియాటిస్, మయోకార్డియా, కొలిసిస్టిస్
చికిత్సఅంతర్గత కారణాలననుసరించి
ఔషధంపారాసెటమాల్, ఎసిటమినోఫెన్, ఇబుప్రోఫెన్
తరుచుదనముసంవత్సరానికి 1 మిలియన్ కేసులు

ప్లూరిసి ని, ప్లూరిటిస్ అని కూడా పిలుస్తారు, ఇది ఊపిరితిత్తులను చుట్టుముట్టే పొరల, ఛాతీ కుహరం (ప్లురే) వాపు. ఇది శ్వాస సమయంలో తీవ్రమైన ఛాతీ నొప్పికి కారణమవుతుంది.[1] అప్పుడప్పుడు నొప్పి స్థిరంగా నిస్తేజంగా ఉంటుంది. ఇతర లక్షణాలలో అంతర్లీన కారణాన్ని బట్టి శ్వాస ఆడకపోవడం, దగ్గు, జ్వరం లేదా బరువు తగ్గడం వంటివి ఉండవచ్చు[2]. వైరల్ లేదా బాక్టీరియల్ సంక్రమణాలు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ పల్మోనరీ ఎంబోలిజంతో సహా అనేక రకాల పరిస్థితుల వల్ల ప్లూరిసి సంభవించవచ్చు.

అత్యంత సాధారణ కారణం వైరల్ సంక్రమణాలు. ఇతర కారణాలలో బాక్టీరియల్ సంక్రమణాలు, న్యుమోనియా, పల్మనరీ ఎంబోలిజం, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె శస్త్రచికిత్స తర్వాత, ప్యాంక్రియాటైటిస్, ఆస్బెస్టాసిస్ ఉన్నాయి. ఒక్కొక్కసారి కారణం తెలియదు.[3] అంతర్లీన మెకానిజం మృదువైన కదలికల బదులుగా ప్లూరే బలమైన కదలికలు కావచ్చు. [1] పెర్కిర్డిటిస్, గుండెపోటు, కోలిసైస్టిటిస్, పల్మనరీ ఎంబోలిజం, న్యూమోథొరాక్స్ వంటి లక్షణాలను కనపరచుతాయి. [4] రోగనిర్ధారణ పరీక్షలో ఛాతీ ఎక్స్-రే, ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ECG), రక్త పరీక్షలు ఉండవచ్చు. [4] [5]

చికిత్స అంతర్గత కారణంపై ఆధారపడి ఉంటుంది.[4] నొప్పిని తగ్గించడానికి పారాసెటమాల్ (ఎసిటమైనోఫెన్), ఇబుప్రోఫెన్ ఉపయోగీస్తారు. [6] శ్వాసను పెంచడానికి ప్రోత్సహించడానికి స్పిరోమెట్రీని సిఫార్సు చేస్తారు. అమెరికాలో ప్రతి సంవత్సరం సుమారు ఒక మిలియన్ మంది ప్రజలు ఈ వ్యాధికి గురి ఆవుతున్నా రు.[7] హిప్పోక్రేట్స్ క్రీస్తు పూర్వం 400 నాడు ఈ వ్యాధి పరిస్థితి గుర్తించారు [8]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "What Are Pleurisy and Other Pleural Disorders?". NHLBI. 21 September 2011. Archived from the original on 8 November 2016. Retrieved 1 November 2016.
  2. "What Are the Signs and Symptoms of Pleurisy and Other Pleural Disorders". NHLBI. 21 September 2011. Archived from the original on 8 October 2016. Retrieved 1 November 2016.
  3. "What Causes Pleurisy and Other Pleural Disorders?". NHLBI. 21 September 2011. Archived from the original on 8 October 2016. Retrieved 1 November 2016.
  4. 4.0 4.1 4.2 Ferri, Fred F. (2016). Ferri's Clinical Advisor 2017: 5 Books in 1 (in ఇంగ్లీష్). Elsevier Health Sciences. p. 981. ISBN 9780323448383. Archived from the original on 3 November 2016.
  5. Kass, SM; Williams, PM; Reamy, BV (1 May 2007). "Pleurisy". American Family Physician. 75 (9): 1357–64. PMID 17508531.
  6. "How Are Pleurisy and Other Pleural Disorders Treated?". NHLBI. 21 September 2011. Archived from the original on 3 November 2016. Retrieved 1 November 2016.
  7. Disease & Drug Consult: Respiratory Disorders (in ఇంగ్లీష్). Lippincott Williams & Wilkins. 2012. p. Pleurisy. ISBN 9781451151947. Archived from the original on 3 November 2016.
  8. Light, Richard W.; Lee, Y. C. Gary (2008). Textbook of Pleural Diseases (in ఇంగ్లీష్) (2nd ed.). CRC Press. p. 2. ISBN 9780340940174. Archived from the original on 3 November 2016.
"https://te.wikipedia.org/w/index.php?title=ప్లూరసి&oldid=4283745" నుండి వెలికితీశారు