Jump to content

స్వయం ప్రతిరక్షక వ్యాధి

వికీపీడియా నుండి
స్వయం ప్రతిరక్షక వ్యాధి
ఇతర పేర్లుఆటోఇమ్మ్యూన్ వ్యాధి
మలార్ దద్దుర్లు ఉన్న యువతి, సాధారణంగా దైహిక లూపస్ ఎరిథెమాటోసస్ (SLE)లో కనిపిస్తుంది
ప్రత్యేకతరుమటాలజీ, ఇమ్యునాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, నాడీ వ్యాధులు, చర్మ వ్యాధులు, ఎండోక్రినాలజీ
లక్షణాలుజ్వరం, అలసట, సాధారణ అనారోగ్యం, కీళ్ల నొప్పులు, చర్మపు దద్దుర్లు లేదా నరాల లక్షణాలు
సాధారణ ప్రారంభంయువతలో
కాల వ్యవధిదీర్ఘ కాలం
రకాలుఅలోపేసియా అరేటా, బొల్లి, ఉదరకుహర వ్యాధి, డయాబెటిస్ మెల్లిటస్ టైప్ 1, హషిమోటోస్ వ్యాధి, గ్రేవ్స్ వ్యాధి, ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి, మల్టిపుల్ స్క్లెరోసిస్, సోరియాసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, దైహిక లూపస్ ఎరిథెమాటోసస్ వంటివి
కారణాలుపర్యావరణ,జన్యు పరమైన అంశాలు
రోగనిర్ధారణ పద్ధతిలక్షణాలు,రక్త పరీక్షలు, మెడికల్ ఇమేజింగ్ పరీక్షలు
ఔషధంనాన్‌స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDలు), రోగనిరోధక శక్తి అణిచే మందులు (ఇమ్యునోసప్రెసెంట్స్
రోగ నిరూపణసాధారణ జీవిత కాలం
తరుచుదనము10%

స్వయం ప్రతిరక్షక వ్యాధి అంటే అలవాటు పడిన రోగ నిరోధక వ్యవస్థకు (అడాప్టివ్ ఇమ్యూన్ సిస్టమ్) మీద క్రమరహిత ప్రతిస్పందన ఫలితంగా ఏర్పడే ఒక శారీరక అనారోగ్య పరిస్థితి. దీనిని వైద్య పరిభాషలో ఆటోఇమ్మ్యూన్ వ్యాధి అంటారు. దీనిలో ఇది పొరపాటుగా బయట జీవుల లాగ, శరీరంలోని ఆరోగ్యకరమైన భాగాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తుంది.[1] ఆటో ఇమ్యూన్ వ్యాధులు 80 కంటే ఎక్కువ ఉన్నట్లు అంచనా వేశారు, ఇటీవలి శాస్త్రీయ అధ్యయనాలు ఈ వ్యాధుల ఉనికిని 100 కంటే ఎక్కువ అని సూచిస్తున్నాయి. [2] [3] [4]. ఈ వ్యాధి ఏశరీర భాగాన్నైనా ప్రభావితం చేయవచ్చు. [5]

లక్షణాలు

[మార్చు]

ఆటోఇమ్యూన్ వ్యాధులు వేరు. ఆటోఇన్‌ఫ్లమేటరీ వ్యాధులు వేరే ప్రత్యేక రకం. రెండూ రోగనిరోధక వ్యవస్థ పనిచేయకపోవడం ద్వారా వచ్చినవి కాబట్టి ఒకే రకంగా అనిపిస్తాయి. ఆటోఇన్‌ఫ్లమేటరీ వ్యాధులలో సహజమైన రోగనిరోధక వ్యవస్థ పనిచేయకపోవడం (దెబ్బతినడం) వలన ఈ వ్యాధులు వస్తాయి. అయితే స్వయం ప్రతిరక్షక వ్యాధులలో అనుకూల రోగనిరోధక వ్యవస్థ ఆ శరీర భాగాల మీద దాడి చేయడం వలన ఈ వ్యాధులు ఏర్పడతాయి. సాధారణంగా ఇవి దద్దుర్లు, వాపు లేదా అలసట వంటి ఒకే రకమైన లక్షణాలను కలిగిస్తాయి, అయితే వ్యాధుల ప్రధాన కారణం లేదా యంత్రాంగం భిన్నంగా ఉంటుంది .[6]

ఆటో ఇమ్యూన్ వ్యాధుల లక్షణాలు గణనీయంగా మారవచ్చు, ఎందుకంటే ప్రాథమికంగా నిర్దిష్ట వ్యాధి రకం అది ప్రభావితం చేసే శరీర భాగం బట్టి లక్షణాలు కూడా విభిన్నంగా ఉంటాయి. లక్షణాలు తేలికపాటి నుండి తీవ్రం వరకు ఉండి, ఎక్కువ తక్కువలకు కూడా గురవుతాయి. సాధారణంగా కొంచెం జ్వరం, అలసట, సాధారణ అనారోగ్యం ఉంటుంది. [1] అయినప్పటికీ, కొన్ని స్వయం ప్రతిరక్షక వ్యాధులు కీళ్ల నొప్పులు, చర్మపు దద్దుర్లు (ఉదా, ఉర్టికేరియా ) లేదా నరాల నొప్పి లక్షణాలు ఇంకా ఏమైనా నిర్దిష్ట లక్షణాలు ఉండవచ్చు.

కారణాలు

[మార్చు]

స్వయం ప్రతిరక్షక వ్యాధులకు స్పష్టమైన కారణాలు లేవు. జన్యు, పర్యావరణ కారణాల వంటివి అనేక ప్రభావాలు మిళితమై ఉండవచ్చు.[5] లూపస్ వంటి కొన్ని వ్యాధులు కుటుంబ సముదాయాలలో కనపడుతాయి. ఇక్కడ జన్యు పరమైన కారణాలు సూచిస్తాయి, ఇతర కేసులు సంక్రమణాలకు గురికావడంతో లేదా పర్యావరణ కారకాల సంబంధం ఉంటుంది. ఇవి జన్యువులు, పర్యావరణం మధ్య పరస్పర సంక్లిష్ట చర్యను సూచిస్తాయి.

సాధారణంగా ఈ స్వయం ప్రతిరక్షక వ్యాధులలో కొన్ని - ఉదరకుహర వ్యాధి, టైప్ 1 మధుమేహం, గ్రేవ్స్ వ్యాధి, ఇన్‌ఫ్లమేటరీ ప్రేగు వ్యాధులు ( క్రోన్'స్ వ్యాధి, వ్రణోత్పత్తి పెద్దప్రేగు శోథ వంటివి), మల్టిపుల్ స్క్లెరోసిస్, అలోపేసియా అరేటా, [7] అడిసన్స్ వ్యాధి, హానికరమైన రక్తహీనత, సోరియాసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, దైహిక లూపస్ ఎరిథెమాటోసస్ మొదలయినవి. స్వయం ప్రతిరక్షక వ్యాధిగ్రస్తులలో వారి విభిన్నలక్షణాల కారణంగా వ్యాధి నిర్ధారణ, చికిత్స ఎప్పుడు సవాలుగా ఉంటుంది.[1]

చికిత్స

[మార్చు]

ఆటో ఇమ్యూన్ వ్యాధులకు చికిత్స విధానాలు వ్యాధి రకాన్ని దాని తీవ్రతను బట్టీ మారుతూ ఉంటాయి. [1] ఇవి ప్రధానంగా రోగి లక్షణాలను బట్టి ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థ కార్యకలాపాలను తగ్గించడం, వ్యాధులతో పోరాడే శరీర సామర్థ్యాన్ని పెంచడము. స్టెరాయిడ్ కాని నొప్పి నివారణ మందులు (నాన్‌స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDలు), రోగనిరోధక శక్తి అణిచే మందులు (ఇమ్యునోసప్రెసెంట్స్), వాపును తగ్గించడానికి అతి చురుకైన రోగనిరోధక ప్రతిస్పందనను నియంత్రించడానికి వాడతారు. కొన్ని సందర్భాల్లో, రోగనిరోధక వ్యవస్థను నియంత్రించడానికి ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్‌ని అందించవచ్చు.[8] ఈ చికిత్సలు తరచుగా లక్షణాల మెరుగుదలకు దారితీసినప్పటికీ, అవి పూర్తి నివారణను అందించవు, కాబట్టి దీర్ఘకాలిక చికిత్స తరచుగా అవసరమవుతుంది.[1]

ప్రాబల్యం

[మార్చు]

యునైటెడ్ కింగ్ డమ్ లోని ఒక అధ్యయనం ప్రకారం 10% జనాభా స్వయం ప్రతిరక్షక వ్యాధి వలన బాధ పడుతున్నట్లు కనుగొన్నారు. పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. ఆటో ఇమ్యూన్ వ్యాధులు ప్రధానంగా యుక్తవయస్సులో ప్రారంభమవుతాయి, అయినప్పటికీ అవి ఏ వయసులోవారి నైనా ప్రభావితం చేస్తున్నాయి.[1] 1900 సంవత్సరాల మొదలులో స్వయం ప్రతిరక్షక వ్యాధుల గుర్తింపు జరిగింది. అప్పటి నుండి, ఈ వ్యాధి పరిస్థితి , అవగాహన, నిర్వహణలో గణనీయమైన పురోగతి కనపడుతోంది. అయినప్పటికీ వాటి సంక్లిష్ట రోగనిర్ధారణ, పాథోఫిజియాలజీ పూర్తిగా వివరించడానికి ఇంకా చాలా ఎక్కువ ప్రయత్నం అవసరం.[9]

ప్రస్తావనలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Autoimmune diseases". Office on Women's Health. U.S. Department of Health and Human Services. 22 February 2021. Archived from the original on 5 October 2016. Retrieved 5 October 2016.
  2. "List of Autoimmune Diseases". Autoimmune Registry Inc. (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-06-06.
  3. Angum F, Khan T, Kaler J, Siddiqui L, Hussain A (May 2020). "The Prevalence of Autoimmune Disorders in Women: A Narrative Review". Cureus. 12 (5): e8094. doi:10.7759/cureus.8094. PMC 7292717. PMID 32542149. S2CID 219447364.
  4. "Assessment of NIH Research on Autoimmune Diseases". www.nationalacademies.org. Retrieved 2022-06-13.
  5. 5.0 5.1 Borgelt LM (2010). Women's Health Across the Lifespan: A Pharmacotherapeutic Approach (in ఇంగ్లీష్). ASHP. p. 579. ISBN 978-1-58528-194-7. Archived from the original on 2017-09-08.
  6. Zen M, Gatto M, Domeneghetti M, Palma L, Borella E, Iaccarino L, et al. (October 2013). "Clinical guidelines and definitions of autoinflammatory diseases: contrasts and comparisons with autoimmunity-a comprehensive review". Clinical Reviews in Allergy & Immunology. 45 (2): 227–235. doi:10.1007/s12016-013-8355-1. PMID 23322404. S2CID 23061331.
  7. Erjavec SO, Gelfman S, Abdelaziz AR, Lee EY, Monga I, Alkelai A, et al. (February 2022). "Whole exome sequencing in Alopecia Areata identifies rare variants in KRT82". Nature Communications. 13 (1): 800. Bibcode:2022NatCo..13..800E. doi:10.1038/s41467-022-28343-3. PMC 8831607. PMID 35145093.
  8. Katz U, Shoenfeld Y, Zandman-Goddard G (2011). "Update on intravenous immunoglobulins (IVIg) mechanisms of action and off- label use in autoimmune diseases". Current Pharmaceutical Design. 17 (29): 3166–3175. doi:10.2174/138161211798157540. PMID 21864262.
  9. Ananthanarayan R, Paniker CK (2005). Ananthanarayan and Paniker's Textbook of Microbiology (in ఇంగ్లీష్). Orient Blackswan. p. 169. ISBN 978-81-250-2808-6. Archived from the original on 2017-09-08.