ప్లవ
స్వరూపం
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
సా.శ. 1841-42, 1901-1902, 1961-1962, 2021- 2022 లో వచ్చిన తెలుగు సంవత్సరానికి ప్లవ అని పేరు. ఇది 60 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది.
సంఘటనలు
[మార్చు]- క్రీ. శ. 1901 : శ్రావణ బహుళ తదియ : శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం స్థాపించబడింది.
- 1962 మార్చి 29: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి రెండో పర్యాయం పదవిని చేపట్టాడు.
జననాలు
[మార్చు]1841-1842
[మార్చు]- సా.శ.1841 భాద్రపద బహుళ నవమి : ముడుంబ నృసింహాచార్యులు - సంస్కృతాంధ్ర కవి.
- 1901 జూలై 15: వేముల కూర్మయ్య, స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు. (మ.1970)
- 1901 జూలై 25: కలుగోడు అశ్వత్థరావు, స్వయంకృషితో తెలుగు కన్నడ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. (మ.1972)
- 1901 మార్చి 16: పొట్టి శ్రీరాములు, ప్రత్యేకాంధ్ర రాష్ట్రాన్ని సాధకుడు. (మ.1952)
- 1901 ఏప్రిల్ 30: సైమన్ కుజ్నెట్స్, ఆర్థికవేత్త.
- 1901 మే 1: పి.వి.రాజమన్నార్, న్యాయవాది, పండితుడు, భారత రాజకీయనాయకుడు. (మ.1979)
- 1901 జూలై 15: చెలికాని రామారావు, స్వాతంత్ర్య సమరయోధులు, 1వ లోక్‌సభ సభ్యులు. (మ.1985)
- 1901 సెప్టెంబర్ 29: ఎన్రికో ఫెర్మి, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- 1901 అక్టోబరు 1: ప్రతాప్ సింగ్ ఖైరాన్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి.
- 1901 అక్టోబరు 1: మసూమా బేగం, సంఘ సేవకురాలు, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకురాలు. (మ.1990)
- 1901 అక్టోబరు 17: జి.ఎస్.మేల్కోటే, స్వాతంత్ర్య సమరయోధులు, వైద్యులు. (మ.1982)
- 1901 అక్టోబరు 22: కొమురం భీమ్, హైదరాబాదు విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఒక గిరిజన నాయకుడు. (మ.1940)
- 1901 నవంబర్ 16: జవ్వాది లక్ష్మయ్యనాయుడు, కళాపోషకులు, శాసనసభ సభ్యులు. (మ.1978)
- 1901 నవంబర్ 18: వి. శాంతారాం, భారతీయ సినిమారంగంలో చిత్రనిర్మాత, దర్శకుడు, నటుడు. (మ.1990)
- 1901 నవంబర్ 29: శోభా సింగ్, పంజాబ్ ప్రాంతానికి చెందిన చిత్రకారుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.1986)
- 1901 డిసెంబరు 25: తుమ్మల సీతారామమూర్తి, ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడు, జాతీయోద్యమ కవి, పండితుడు. (మ.1990)
- 1902 జనవరి 5: ఆర్. కృష్ణసామి నాయుడు, రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1937)
- 1902 ఫిబ్రవరి 8: ఆండ్ర శేషగిరిరావు, కవి, నాటకకర్త, పత్రికా సంపాదకులు. (మ.1965)
- 1961 ఆశ్వయుజ బహుళ ఏకాదశి : గణపతి అశోకవర్మ - అవధాని, అధ్యాపకుడు, పరిశోధకుడు, రచయిత.[5]
- 1961 మే 21: జ్యేష్ఠ శుద్ధ సప్తమి : రాళ్ళబండి కవితాప్రసాద్ - కవి, రచయిత, ద్విశతావధాని (మ.2015).[6]
- 1961 జూన్ 2: యలమంచిలి సుజనా చౌదరి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యాపారవేత్త, తెలుగుదేశం పార్టీ నాయకుడు.
- 1961 జూన్ 5: రమేశ్ కృష్ణన్, భారత టెన్నిస్ క్రీడాకారుడు.
- 1961 జూలై 4: ఎం.ఎం.కీరవాణి, తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు, గాయకుడు.
- 1961 జూలై 18: అందెశ్రీ, వరంగల్ జిల్లాకు చెందిన తెలుగు కవి, సినీగేయ రచయిత.
- 1961 జూలై 21: అమర్ సింగ్ చంకీలా, పంజాబీ గాయకుడు, గేయ రచయిత, సంగీత వాద్యకారుడు, సంగీత దర్శకుడు. (మ.1988)
- 1961 ఆగష్టు 15: సుహాసిని, దక్షిణ భారత సినిమా నటి.
- 1961 ఆగష్టు 15: పందిళ్ళ శేఖర్‌బాబు, రంగస్థల (పౌరాణిక) నటులు, దర్శకులు, నిర్వాహకులైన తెలుగు నాటకరంగంలో పేరొందిన వ్యక్తి. (మ.2015)
- 1961 ఆగష్టు 25: బిల్లీ రే సైరస్, అమెరికా సంగీత గాయకుడు, గీత రచయిత, నటుడు.
- 1961 సెప్టెంబర్ 9: సీమా ప్రకాశ్ బయోటెక్నాలజీ శాస్త్రవేత్త. టిష్యూకల్చర్‌లో నిపుణురాలు.
- 1961 సెప్టెంబర్ 15: పాట్రిక్ ప్యాటర్సన్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- 1961 సెప్టెంబర్ 30: చంద్రకాంత్ పండిత్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- 1961 నవంబర్ 17: చందా కొచ్చర్, ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకుకు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా, నిర్వహణ అధ్యక్షురాలు.
- 1961 అక్టోబరు 2: సోలిపేట రామలింగారెడ్డి, పాత్రికేయుడు, రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే (మ.2020)
- 1961 నవంబర్ 24 : అరుంధతీ రాయ్, భారతీయ రచయిత్రి, ఉద్యమకారిణి.
- 1962 జనవరి 1: మారొజు వీరన్న, తెలంగాణ మహాసభ స్థాపకుడు, సి.పి.ఐ. (యం.యల్) జనశక్తి కార్యకర్త. (మ.1999)
- 1962 జనవరి 12: రిచీ రిచర్డ్సన్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- 1962 ఫిబ్రవరి 12: జగపతిబాబు, తెలుగు సినిమా నటులు.
- 1962 ఫిబ్రవరి 12: ఆశిష్ విద్యార్థి, తెలుగు సినిమా ప్రతినాయకుడు.
- 1962 మార్చి 2: యాకూబ్ (కవి), కవి, అంతర్జాలంలో బహుళ ప్రాచుర్యం పొందుతున్న తెలుగు కవిత్వ వేదిక కవిసంగమం నిర్వాహకుడు.
- 1962 మార్చి 4: బుర్రా విజయదుర్గ, రంగస్థల నటీమణి.
- 1962 మార్చి 17: కల్పనా చావ్లా, ఇండియన్ -అమెరికన్ వ్యోమగామి, వ్యొమనౌక యంత్ర నిపుణురాలు. (మ.2003)
- 1962 ఏప్రిల్ 3: జయప్రద, తెలుగు సినీనటి.
మరణాలు
[మార్చు]- 1961 మార్చి 17: నాళం కృష్ణారావు, సంఘ సంస్కర్త, గ్రంథాలయ స్థాపకుడు, పత్రిక సంపాదకులు, స్వాతంత్ర్య సమరయోధుడు, భాషావేత్త. (జ.1881)
- 1961 ఏప్రిల్ 15: రాచాబత్తుని సూర్యనారాయణ, సాతంత్ర్యసమయోధుడు. (జ.1903)
- 1961 జూన్ 14: కె శ్రీనివాస కృష్ణన్, భారతీయ భౌతిక శాస్త్రవేత్త. పద్మభూషణ్ గ్రహీత. (జ.1898)
- 1961 జూన్ 30: లీ డి ఫారెస్ట్, తెర మీది బొమ్మకు తగ్గట్లుగా శబ్దాన్ని జతచేసే 'ఫోనో ఫిల్మ్' ప్రక్రియను కనుగొన్న అమెరికన్ ఆవిష్కర్త. (జ.1873)
- 1961 అక్టోబర్ 2: శ్రీరంగం నారాయణబాబు, తెలుగు కవి. (జ.1906)
- 1962 ఫిబ్రవరి 26: అయ్యదేవర కాళేశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1882)
- 1962 మార్చి 28: కోరాడ రామకృష్ణయ్య, భాషావేత్త, తెలుగు-సంస్కృత భాషా నిపుణులు. (జ.1891)
పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ LLP, Adarsh Mobile Applications. "1901 Ugadi | Yugadi Date for New Delhi, NCT, India". Drikpanchang (in ఇంగ్లీష్). Retrieved 2021-04-11.
- ↑ LLP, Adarsh Mobile Applications. "1902 Ugadi | Yugadi Date for New Delhi, NCT, India". Drikpanchang (in ఇంగ్లీష్). Retrieved 2021-04-11.
- ↑ "Telugu Calendar March, 1961 | మార్చి, 1961 క్యాలెండర్". www.prokerala.com. Retrieved 2021-04-11.
- ↑ "Telugu Calendar April, 1962 | ఎప్రిల్, 1962 క్యాలెండర్". www.prokerala.com. Retrieved 2021-04-11.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యా సర్వస్వము (1 ed.). హైదరాబాద్: రాపాక రుక్మిణి. p. 760.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యా సర్వస్వము (1 ed.). హైదరాబాద్: రాపాక రుక్మిణి. p. 755.