పల్వల్ జిల్లా

వికీపీడియా నుండి
(పాల్వాల్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పల్వల్ జిల్లా
पलवल जिला
హర్యానా పటంలో పల్వల్ జిల్లా స్థానం
హర్యానా పటంలో పల్వల్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంహర్యానా
ముఖ్య పట్టణంపల్వల్
Government
 • శాసనసభ నియోజకవర్గాలు4
విస్తీర్ణం
 • మొత్తం1,359 కి.మీ2 (525 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం10,40,493
 • జనసాంద్రత770/కి.మీ2 (2,000/చ. మై.)
 • Urban
2,35,663
జనాభా వివరాలు
 • అక్షరాస్యత70.32%
 • లింగ నిష్పత్తి879
ప్రధాన రహదార్లు2(NH-2), KMP Expressway.
సగటు వార్షిక వర్షపాతం60-100 మి.మీ.
Websiteఅధికారిక జాలస్థలి

పల్వల్ జిల్లా (హిందీ : पलवल जिला ) హర్యానా రాష్ట్రం లోని 22 జిల్లాల్లో 21 వది. పల్వల్ పట్టణం ఈ జిల్లాకు ముఖ్యపట్టణం.ఈ జిల్లా ఢిల్లీ - మధుర హైవే మీద ఢిల్లీ నుండి 60 కిలోమీటర్ల ( NH -2) దూరంలో ఉంది. పట్టణం 28° 40' ఉత్తర అక్షాంశం, 76 ° 59' రేఖాంశాల మధ్య ఉంది.[1] ఇతిహాస కాలం నుండి దీని ప్రస్తావన ఉంది.[2] ఆనాటి పాండవ రాజ్యంమయిన ఇంద్రప్రస్థలో భాగంగా వుండేది. విక్రమాదిత్యుడు దీన్ని పునరుద్ధరించాడు.

భౌగోళికం

[మార్చు]

పల్వల్ జిల్లాలో హౌసింగ్ బోర్డ్ కాలనీ, న్యూ కాలనీ, మైన్ మార్కెట్టు, షివపురి, కృష్ణా కాలనీ, కేంప్ కాలనీ, హుడా సెక్టర్ మొదలైనవి ఉన్నాయి. ఇది ఢిల్లీ, గుర్‌గావ్,నోయిడా,ఫరీదాబాద్,మథుర వంటి నగరాలకు సమానదూరంలో ఉంది కనుక భారతప్రభుత్వం పల్వల్ నగరాభివృద్ధి కొరకు ప్రత్యేకశ్రద్ధ వహిస్తుంది. పల్వల్ నగరం వ్యవసాయ, వాణిజ్య పరంగా ప్రాధాన్యత కలిగి ఉంది.

చరిత్ర

[మార్చు]

పేరువెనుక చరిత్ర

[మార్చు]

బలరాముడు ఒకప్పుడు ఈ ప్రాంతానికి పాలకుడైన పాల్వాసురుడిని సంహరించిన ప్రదేశం కనుక ఈ ప్రాంతానికీ పేరు వచ్చింది. అందుకు గుర్తుగా పల్వల్‌లో " బలదేవ్ చాట్ కా మేళా " నిర్వహిస్తారు. మునిసిపల్ ఆఫీస్ చౌక్ వద్ద " బలరాముని ఆలయం " ఉంది. పల్వల్ రైల్వే స్టేషను వద్ద మహాత్మా గాంధీని మొదటి సారిగా అరెస్టు చేసారు. దీనికి గుర్తుగా నగరంలో "గాంధి ఆశ్రమం" అనే భవనాన్ని నిర్మించారు.

ఆరంభకాలం

[మార్చు]

ముహమ్మద్ అజం షా పల్వల్‌ను పాలిస్తున్న సమయంలో సయ్యద్ యూసఫ్ అలి పాల్వాలి నగరప్రముఖులాలో ఒకడుగా ఉంటూ ఉండేవాడు. 1707 జూన్ 19లో జజువాన్ యుద్ధంలో సయ్యద్ యూసఫ్ అలి పాల్వాలి మరణించాడు.[3][4] 17వ శతాబ్దంలో పల్వల్ వాసి ఖాన్ మొహమ్మద్ కుమార్తెతో క్వాజి సయ్యద్ ముహమ్మద్ రఫితో వివాహం జరిగింది. క్వాజి సయ్యద్ ముహమ్మద్ రఫి కుమారుడు ముహమ్మద్ బాక్వర్ పల్వల్ వాసి అయిన సుల్తాన్ బీబిని వివాహం చేసుకున్నాడు. మొహమ్మద్ బాకర్ కుమార్తె " ఖైరన్ నిస్సాన్ " పల్వల్ వాసి అయిన ముహమ్మద్ ఇక్రం ఇబ్న్ సుల్తాన్ ముహమ్మద్ ( పాల్వాన్ ప్రధాన క్వాజీ) ని వివాహం చేసుకున్నది. కైరన్ నిస్సాన్, మొహమ్మద్ ఇక్రం కుమార్తె నూరన్ నిస్సాన్ క్వాజీ సయ్యద్ హయతుల్లా కుమారుడు మొహమ్మద్ మురీడ్‌ను వివాహం చేసుకుంది. క్వాజీ సయ్యద్ ముహమ్మద్ రఫి పల్వల్ వాసి అయిన ఫాజల్ నిసాన్‌ను వివాహం చేసుకుంది. మొహమ్మద్ సయ్యద్ ఇబ్న్ కుమార్తె ముహమ్మద్ హుస్సేన్ ఇబ్న్ మౌలానా అబ్దుల్ ఖైర్‌ను వివాహం చేసుకుంది. పల్వల్, సక్రాల మద్య వివాహ సంబంధాలు ఈ రెండు ప్రదేశాలమద్య ఉన్న సంబంధాలను తెలుపుతుంది.

Palwal part of Punjab Province in 1903.

బ్రిటిష్ పాలన

[మార్చు]

బ్రిటిష్ పాలనా కాలంలో పల్వల్ పంజాబు ప్రోవింస్‌లో, గుర్‌గావ్ జిల్లాలో భాగంగా ఉంది. 1857లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటుకు పల్వల్ ప్రజలలో చాలా మంది మద్దతు తెలిపారు. ఈ తిరుగుబాటులో పల్వల్‌లో మాత్రం హయత్ అలి, కైరత్ అలి మరొక 17 మందితో బలయ్యారు. ఉరితీయబడడానికి ముందు హయత్ అలి గృహంర్భంధంలో ఉంచబడి తరువాత ఢిల్లీకి తీసుసుకు పోబడి తరువాత ఉరితీయబడ్డాడు. అంతేకాక ఆయన కుటుంబంలోని పురుషులందరూ ఉరితీతకు గురైయ్యారు. అత్యధిక సంఖ్యలో ఖైదుకు గురైయ్యారు. పల్వల్ తాసిల్దార్ గాజుల వ్యాపారిగా హయత్ అలి ఇంటికి వెళ్ళి ఆయన 2 సంవత్సరాల మనుమడు నాజీర్ అలిని గాజుల బుట్టలో పెట్టుకుని రక్షించాడు. తరువాత తాసిల్దార్ పిల్లవాడిని నాగీనా అరణ్యాలలో వదిలాడు. ఆయనను అనుసరించి వెళ్ళిన హయ్యత్ అలి కుటుంబంలోని స్త్రీలు అరణ్యం నుండి పిలావాడిని తీసుకుని సురక్షితంగా తిజరాకు చేరారు. ఉరితీసిన 17 మంది సభ్యులలో హయత్ అలి అల్లుడు ఇరాదత్ అలి బిన్ రుస్తం అలి ఉన్నాడు. బ్రిటిష్ సైన్యం పింగ్వాన్ కుటుంబాన్ని వేటాడినప్పుడు ఇరాదత్ అలి సోదరుడు కరామత్ అలి మాత్రం ప్రాణాలతో తప్పించుకుని తిజరా చేరుకున్నాడు. తరువాత కరామత్ తన పేరును జమిన్ అలిగా మార్చుకున్నాడు.[5]

స్వతంత్రం తరువాత

[మార్చు]

1979 ఆగస్టు 15 గుర్‌గావ్ జిల్లా అదనంగా విభజించబడి ఫరీదాబాద్ జిల్లా ఏర్పాటు చేయబడింది. పల్వల్ ఫరీదాబాద్ జిల్లాలో భాగంగా ఉండేది. [6] 2008 ఆగస్టు 15న పల్వాల్ హర్యానా రాష్ట్రంలో 21వ జిల్లాగా చేయబడింది.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,040,493,[7]
ఇది దాదాపు. సప్రస్ దేశ జనసంఖ్యకు సమానం.[8]
అమెరికాలోని. రోడో ఐలాండ్ నగర జనసంఖ్యకు సమం.[9]
640 భారతదేశ జిల్లాలలో. 436వ స్థానంలో ఉంది.[7]
1చ.కి.మీ జనసాంద్రత. 716 [7]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 25.49%.[7]
స్త్రీ పురుష నిష్పత్తి. 879:1000 [7]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 70.3%.[7]
జాతియ సరాసరి (72%) కంటే.

2011 గణాంకాలను అనుసరించి [10] పల్వల్ జనసంఖ్య 235663, పురుషుల 53%, స్త్రీలశాతం 47%, సరాసరి అక్షరాస్యత 71%, పురుషుల అక్షరాస్యత 78%, స్త్రీల అక్షరాస్యత 67%., 6 వయసు లోబడిన పిల్లల శాతం 20%. హర్యానాలో అత్యంత అభివృద్ధి చెందిన గ్రామంగా పల్వల్‌కు గుర్తింపు ఉంది.

విద్య

[మార్చు]

పల్వల్ పాఠశాలలకు ప్రఖ్యాతి చెందినది. జిల్లాలో పలు పాఠశాలలు ఉన్నాయి:

పాఠశాలలు

[మార్చు]
  • జె 'బొద్దు అక్షరాలు' ఎల్..జె కాన్సెప్ట్ స్కూల్,మిత్రోల్, పల్వల్ [1] Archived 2014-12-17 at the Wayback Machine
  • ధరమ్ పబ్లిక్ స్కూల్ రైల్వే రోడ్ పల్వాల్
  • గవర్నమెంట్ సీనియర్ సెకండరీ స్కూల్ ఖంబి (హర్యానా)
  • కేంద్రీయ విద్యాలయ, కర్ణుడు, పల్వాల్
  • సెయింట్. జాన్ యొక్క బాప్టిస్ట్ పబ్లిక్ స్కూల్
  • ప్రభుత్వ. బాయ్స్ సీనియర్ సెకండరీ స్కూల్
  • ఎస్.పి.ఎస్ అంతర్జాతీయ అకాడమీ
  • డి.జి.ఖాన్ హిందూ మతం ఎస్.ఆర్.సెకండరీ. స్కూల్
  • స్వామి వివేకానంద్ ఎస్.ఆర్. క్షణ. స్కూల్
  • సంస్కృత విద్యాపీఠం (గడ్పురి)
  • ప్రభుత్వ. హై స్కూల్ కులెనా
  • ఎస్.వి.ఎన్ సీనియర్ క్షణ. స్కూల్ కులెనా
  • జె.ఎల్.ఎం సీనియర్ సెకండరీ. స్కూల్ కులెనా
  • ప్రభుత్వ మోడల్ సంస్కృతి స్కూల్ ధతిర్ (పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటు స్కూల్. 2007)
  • సరస్వతి సీనియర్ సెకండరీ స్కూల్
  • హర్యానా సీనియర్ సెకండరీ పాఠశాల
  • గొలయా ప్రోగ్రెసివ్ స్కూల్
  • ఢిల్లీ పబ్లిక్ స్కూల్
  • షెఫీల్డ్ అకాడమీ డే కేర్, ప్లే స్కూల్
  • డి.ఎ.వి పబ్లిక్ స్కూల్
  • ఠాగూర్ అకాడమీ ప్రభుత్వ పాఠశాల
  • కె.సి.ఎం వరల్డ్ స్కూల్ పల్వాల్
  • కె.సి.ఎం స్కూల్ బంచరి
  • కె.సి.ఎం ప్రైమరీ స్కూల్ హసన్పూర్
  • కె.సి.ఎం ప్రైమరీ స్కూల్ హోడాల్
  • ప్రభుత్వ సీనియర్ సెకండరీ డెవ్లి
  • స్వామి వివేకానంద్ సీనియర్ సెకండరీ స్కూల్ పెలక్
  • ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్, పల్వాల్
  • రాజ్ పబ్లిక్ స్కూల్ మంద్నక పల్వాల్
  • ప్రభుత్వ సీనియర్ సెకండరీ పెలక్
  • స్వీట్ ఏంజిల్స్ సీనియర్ సెకండరీ .స్కూల్, పల్వాల్
  • జీవన్ జ్యోతి .సీనియర్ సెకండరీ స్కూల్, పల్వాల్
  • ధరమ్ పబ్లిక్ స్కూల్, పల్వాల్

కళాశాలలు

[మార్చు]

జిల్లాలో పలు కళాశాలలు ఉన్నాయి. పల్వల్ రాష్ట్రంలో విద్యాకేంద్రగా అభివృద్ధిచెందుతుంది. జిల్లాలో 12 ఇంజనీరింగ్ కాళాశాలలు, మేనేజ్మెంటు కాళాశాలలు, డీగ్రీ కాళాశాలలు ఉన్నాయి.

  • నగరంలో ఉన్న గుర్తింపు పొందిన కళాశాలలు:
  • ఎల్ టెక్నాలజీ & మేనేజ్మెంట్ విల్ ఇన్స్టిట్యూట్.డీఘాట్ పల్వాల్ మోబ్.
  • కృష్ణుడు కళాశాల సమీపంలో సరస్వతి కళాశాల టెక్నాలజీ & మేనేజ్మెంట్
  • డిసి.టి.ఎం ఢిల్లీ కాలేజీ జి.ఎస్.ఎం.వి.ఎన్.ఐ.ఇ.టి - ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ
  • గోపాల్ శర్మ ఆధునిక విద్యా నికేతన్ ఇన్స్టిట్యూట్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ
  • లెస్ ఫిల్స్ ఎం.వి.ఎన్ ఇన్స్టిట్యూట్ ఇంజనీరింగ్, టెక్నోలాగ్ యొక్క 6.ఎన్.జి.ఎఫ్ కాలేజ్
  • సరస్వతి కాలేజీ ఇంజనీరింగ్ & మేనేజ్మెంట్
  • శ్రీ రామ్ కాలేజ్
  • జి.జి.డి ఎస్.డి కాలేజ్, పల్వల్ (మహేష్ శర్మ) ఎం.జి.టి. & ఇంజనీరింగ్
  • అప్లైడ్ కళాశాల. ఇంజనీరింగ్ & టెక్నాలజీ
  • ఆర్.ట్.ఎం కాలేజ్ టెక్ యొక్క
  • ఎ.ఐ.టి.ఎం అధునాతన ఇన్స్టిట్యూట్. & ఎ.జి.ఎం.టి. టెక్ యొక్క
  • ఆర్.ఐ.టి.ఎం రత్తన్ ఇన్స్టిట్యూట్. & ఎం.జి.టి. ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ
  • ఎస్.సి.ఇ.టి సత్య కాలేజ్.

ప్రయాణ సౌకర్యాలు

[మార్చు]

రైల్వే

[మార్చు]

పల్వల్‌ నుండి పలు రైళ్ళు అందుబాటులో ఉన్నాయి. పల్వల్ రైల్వే స్టేషను నుండి ఢిల్లీ వరకు పలు రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ- పల్వల్ మద్య మహిళా ప్రత్యేక రైలు ఆరంభించబడింది. దూరప్రాంతాలకు చేరడానికి పలు సూపర్ ఫాస్ట్ రైళ్ళు అందుబాటులో ఉన్నాయి.

కుడ్లి- మనేశ్వర్-పల్వల్- ఎక్స్‌ప్రెస్ వే

[మార్చు]
  • ఢిల్లీ వెస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ వే లేక కుడ్లి- మనేశ్వర్-పల్వల్- ఎక్స్‌ప్రెస్ వే (కె.ఎం.పి ఎక్స్‌ప్రెస్ వే) 135 .6 కి.మీ పొడవు.
  • కుండ్లి-మనెశ్వర్- పల్వల్ (కె.ఎం.పి) ఎక్స్‌ప్రెస్ వే . ఇది నార్త్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ బైపాస్ మార్గంగా ఉపయోగపడుతుంది.
  • అతివేగ రైళ్ళు రహదారిని దాటుతున్న ప్రదేశాలలో 4 ఫ్లై ఓవర్లు నిర్మించబడ్డాయి: కుండలి (సోనేపట్) సమీపంలో జాతీయరహదారి 1, బహదుర్గ సమీపంలో జాతీయరహదారి 10, సమీపంలో జాతీయరహదారి, మానేసర్ ( గురుగావ్) సమీపంలో జాతీయరహదారి 8, . పల్వల్ ఫరీదాబాద్ సమీపంలో జాతీయరహదారి 2.
  • మేవాత్ జిల్లాలోని రోజ్కా మేయో పారిశ్రామిక వాడ సమీపంలో నిర్మించబడిన రాష్ట్రీయ రహదారిలో ఒక ఫ్లై ఓవర్లు ఒకటి.
  • రాష్ట్రీయ, జిల్లా రహదార్లు రైలు మార్గాల కూడళ్ళ వద్ద 16 ఓవర్, ఉండర్ మార్గాలు నిర్మించబడ్డాయి.
  • 7 ఓవర్ పాస్ మర్గాలు, 9 అండర్ పాస్ మార్గాలు, గ్రామాల రహదారి మార్గాలలో 27 అండర్ పాస్ మార్గాలు, వ్యవసాయ వాహనాలు దాటడానికి 33 అండర్ పాస్ మార్గాలు, పశువులు దాటడానికి 31 మార్గాలు, పాదచారులు దాట్డానికి 61 మార్గాలు, 4 రైల్వే ఓవర్ బ్రిడ్జులు, 18 మేజర్, మైనర్ బ్రిడ్జులు, డ్రైనేజ్ క్రాసింగులు 292, 4 ట్రక్ పార్కింగులు, 4 బస్ బేలు నిర్మించబడ్డాయి.
  • 2010 డిసెంబరు 21 న హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హూడ కుండలి - పల్వల్ ప్రాంతాలలో విహంగ వీక్షణం చేసి నిర్మాణాల అభివృద్ధిని పరిశీలించాడు.

ఆలయాలు

[మార్చు]

పలు మతాలకు చెందిన ఆలయాలు ఉన్నాయి.

  • భగవాన్ పరశురామ్ మందిర్ (కులెనా) '
  • జగదీశ్వర్ మందిర్ '
  • దు జీ మందిర్ '
  • దేవి ఆలయం కమేటి చౌక్ వద్ద '
  • దాల్చిన పంచవటి ఆలయం 'హౌసింగ్ బోర్డు
  • జైన దేవాలయం
  • బాబా ఉదాష్ నాథ్ మందిర్ అలవాల్పూర్
  • భుర, గిరి మందిర్ రసూల్పూర్ రోడ్ పల్వాల్
  • శ్రీ కృష్ణ దేవాలయం డెల్వి
  • పహాడీ వాలా మందిర్ మంద్నక పల్వాల్
  • హరి బోల్ మందిర్, మోహన్ నగర్ పల్వాల్

ఆసుపత్రులు

[మార్చు]

పల్వల్‌లో అధునాతన సాంకేతిక వసతులు కలిగిన ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో అత్యధికభాగం నగరసరిహద్దులలో ఉన్నాయి.

  • సుఖ్రాం ఆసుపత్రి
  • బన్సల్ నర్సింగ్ హోమ్
  • గుప్తా నర్సింగ్ హోమ్
  • సలూజా నర్సింగ్ హోమ్
  • సిటీ ఆస్పత్రి
  • రాహుల్ నర్సింగ్ హోమ్
  • గోయల్ ఆసుపత్రి
  • మిట్టల్ క్లినిక్
  • ఓం ఆసుపత్రి
  • మాలిక్ నర్సింగ్ హోమ్
  • నరేష్ ఠాకూర్ ఆసుపత్రి
  • బాల్చంద్ నర్సింగ్ హోమ్
  • ధరమ్ హాస్పిటల్ అమర్పూర్
  • కిషన్ సింగ్ హాస్పిటల్
  • ఏబిల్ చారిటబుల్ హాస్పిటల్

పూలతోటలు

[మార్చు]

పల్వల్ నగరంలో ప్రజలు గుమికూడాడామికి అనువైన ప్రదేశాలు, పచ్చదనం అధికంగా ఉన్నాయి. ఈ ప్రదేశాలన్నీ ప్రజలలో ఆరోగ్యపరమైన జాగరూకత పెంపొందేలా చక్కగా నిర్వహించబడుతూ ఉండడం విశేషం.

  • నగరంలో ఉన్న పలు పూలతోటలు.
  • టినోకా పార్క్
  • ష్రదానందా పార్క్
  • డీ పార్క్
  • పంచాయతీ భవన్
  • స్వామి దయానంద్ పార్క్ (కెల్లీ వాలా పార్క్)
  • టాంకీ వాలా పార్క్
  • బాల భవన్
  • డి.జి ఖాన్ హిందూ మతం
  • తౌ దేవి లాల్ పార్క్ (టౌన్ పార్క్)
  • పరిష్కారం గ్రౌండ్ పార్క్
  • హుడా పార్క్
  • మహాత్మా గాంధీ పార్క్
  • ఇవి కాక పల్వల్‌లో పలు క్రీడా మైదానాలు ఉన్నాయి.

అరణ్యం

[మార్చు]

ఫారెస్ట్ శాఖ రెండు పథకాలను అమలు చేస్తుంది: అడవులు, మట్టి పరిరక్షణ భూమి పునరుద్ధరణ. ఎంఒఇఎఫ్, ప్రభుత్వ జాతీయ అడవులను విధానం ప్రకారం. 1/3 భారతదేశం భూభాగంలో చెట్లు ఉండాలి. ఈ లక్ష్యం సాధించడానికి భారీ స్థాయి పంచాయితీ, ప్రభుత్వం, ప్రైవేట్ భూమిలో మొక్కల నాటే ప్రాజెక్ట్ చేపట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా గత 20 సంవత్సరాలనుండి రైతులు తమ పొలాలలో నాటడానికి వేప, యూకలిఫ్టస్, షిషాం, ఇతర పండ్ల మొక్కలు ఉచితంగా పంపిణీ చేయబడ్డాయి.

పాలనా నిర్వహణ

[మార్చు]

జిల్లాలో 282 గ్రామాలు, 237 గ్రామ పంచాయతీలు, 1 మునిసిపల్ కౌన్సిల్, 2 మున్సిపల్ కమ్యూనిటీ కమిటీ, 3 సబ్ డివిజన్లు, 4 డెవెలెప్మెంటు బ్లాక్స్, 3 తాలూకాలు. ఇవి ఉంది డివిషనల్ మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో ఉంటుంది. ప్రతి సబ్ డివిజన్ బ్లాక్ డెవెలెప్మెంటు, పనచాయితీ అధికారి అధ్వర్యంలో పనిచేస్తుంది. బ్లాకులు అన్నీ స్వర్ణ జయంతి గ్రాం స్వరోజ్‌ఘర్ యోజనా, ఇతర అభివృద్ధి కార్యక్రాల పరిధిలో ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాలను డెఫ్యూటీ కమీషనర్ - చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పర్యవేక్షణలో నిర్వహించబడుతుంటాయి.

జిల్లా వీక్షణ

[మార్చు]

జిల్లా గణాంకాల ప్రత్యేక వీక్షణ.

(ఏ) భౌగోళిక వివరణ

[మార్చు]
  • అక్షాంశం 28 ఉ 40’ఉ
  • రేఖాంశం 76 తూ 59 తూ
  • భౌగోళిక వైశాల్యం 136803 హెక్టార్లు.

(బి) అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్

[మార్చు]
  • సబ్ డివిజన్లు 3
  • తాలూకాలు 3
  • సబ్ తెహసిల్ -
  • పత్వర్ సర్కిల్ -
  • పంచాయతీ సమితులు 237
  • నగర్ నిగమ్ -
  • నగరపాలికాలు 3
  • గ్రామ పంచాయతీ 282
  • ఒకవేళ రెవెన్యూ గ్రామాలు 1246
  • శాసనసభ ఏరియా

2. ప్రజలు

[మార్చు]
  • పురుషులు 2011లో 5,53,704
  • పురుషులు 2011లో 4,86,789
  • గ్రామీణ ప్రజల సంఖ్య 2011 8,04,830

3. వ్యవసాయం

[మార్చు]

ఎ. భూమి ఉపయోగం

  • 2010-2011 మొత్తం వ్యవసాయ భూముల 136000 హెక్టార్లు.
  • 2010-2011 అరణ్య ప్రాంతం 100 హెక్టార్లు
  • 2010-2011 వ్యవసాయేతర భూమి - 18000 హెక్టార్లు
  • 2010-2011 పంటకు అనుకూలమైన భూమి 1000 హెక్టార్లు

అరణ్యాలు

[మార్చు]
  • అరణ్యాలు వైశాల్యం 2010-2011లో ;హెక్టార్లు 1368.

5. పశువుల & పౌల్ట్రీ

[మార్చు]
  • A. పశువులు
  • ఆవులు 2007 పోస్టులు. 41694
  • గేదెలు- 2007 పోస్టులు. 279560
  • బి ఇతర పశువుల
  • గోట్స్ 2007 పోస్టులు. 11983
  • పిగ్స్ 2007 పోస్టులు. 3593
  • డాగ్స్ & bitches 2007 పోస్టులు. 13564
  • రైల్వే
  • రైలు లైన్ 2010-11 & nbsp పొడవు కిమీ 110
  • వి) రోడ్స్
  • (అ) నేషనల్ హైవే 2010-11 & nbsp; 100 కిమీ
  • (బి) స్టేట్ హైవే 2010-11 & nbsp కిమీ 79
  • (సి) ప్రధాన జిల్లా హైవే 2010-11 & nbsp కిమీ 77
  • (డి) ఇతర జిల్లా & గ్రామీణ రోడ్లు 2010-11 & nbsp కిమీ 93
  • (ఇ) గ్రామీణ రహదారి / వ్యవసాయం
  • మార్కెటింగ్ బోర్డు రోడ్స్ 2010-11 & nbsp కిమీ 82
  • (ఎఫ్) Kachacha రోడ్ 2010-11 & nbsp; km -
  • (VI) కమ్యూనికేషన్
  • (అ) టెలిఫోన్ కనెక్షన్ 2010-11 9102
  • (బి) పోస్ట్ కార్యాలయాలు 2010-11 సంఖ్యలు. 70
  • (సి) టెలిఫోన్ సెంటర్ 2010-11 సంఖ్యలు. 20

టెలిఫోన్ 2010-11 * (డి) సాంద్రత సంఖ్యలు. / 1000

  • మీర 9
  • కిలో మీటర్కు టెలిఫోన్ 2010-11 నం (ఇ) సాంద్రత. 6
  • (ఎఫ్) PCO రూరల్ 2010-11 నం 113
  • (గ్రా) PCO ఎస్టీడీ 2010-11 నం 602
  • (H) మొబైల్ 2010-11 నం 45720
  • (VII) పబ్లిక్ Health7
  • (అ) అల్లోపతిక్ హాస్పిటల్

అల్లోపతిక్ లో * (బి) పడకలు

  • ఆస్పత్రులు
  • (సి) ఆయుర్వేద హాస్పిటల్

ఆయుర్వేదలో * (డి) పడకలు

  • ఆస్పత్రులు
  • (ఇ) యునాని ఆసుపత్రుల్లో
  • (ఎఫ్) కమ్యూనిటీ హెల్త్
  • కేంద్రాలు
  • (గ్రా) ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు
  • (H) డిస్పెన్సరీలు
  • (నేను) సబ్ హెల్త్ సెంటర్స్
  • (జె) ప్రైవేట్ ఆస్పత్రులు
  • (VIII) బ్యాంకింగ్ వాణిజ్య
  • (అ) కమర్షియల్స్ బ్యాంక్ సంఖ్యలు. 52
  • (బి) గ్రామీణ బ్యాంకు ఉత్పత్తులు సంఖ్యలు. 29
  • (సి) కో ఆపరేటివ్ బ్యాంకు
  • ఉత్పత్తులు సంఖ్యలు. 23
  • (డి) PLDB శాఖలు సంఖ్యలు. 3
  • (IX) ఎడ్యుకేషన్
  • (అ) ప్రాథమిక పాఠశాల పోస్టులు. 698
  • (బి) మధ్య పాఠశాలలు సంఖ్యలు. 171
  • (సి) ద్వితీయ & సీనియర్
  • ఉన్నత పాఠశాల పోస్టులు. 270
  • (డి) కళాశాలలు సంఖ్యలు. 19
  • (ఇ) టెక్నికల్ విశ్వవిద్యాలయం సంఖ్యలు. -
  • మేజర్ Exportable అంశం: -

హైడ్రాలిక్ టర్బైన్ల ఘర్షణ మెటీరియల్, రియర్ ఆక్సిల్ ఉండడం, ఎలివేటర్లు, భాగంలో లోడ్ చేయాల్సిన యంత్రాలు, క్రేన్లు, పైకెత్తు, రెడీ మేడ్ గార్మెంట్స్, నీడిల్ రోలర్స్. Azoinitiators, డైరీ పరికరాలు, సోఫాలోని పరికరాలు, సారం, చెక్క ఫర్నీచర్, డాగ్ ఫుడ్, GIPipes, పల్ప్, గింజ బోల్టులు CICastings, మిల్క్ పౌడర్, నెయ్యి మొదలైనవి

ఇవి కూడా చూడండి

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Palwal Geography Archived 2009-04-16 at the Wayback Machine Yamuna Action Plan official website.
  2. Palwal Town The Imperial Gazetteer of India, 1909, v. 19, p. 375.
  3. Tarikh Mohammadi by Mirza Mohammad bin Rustam Mukhatib b Mohtamid Khan, Vol 2, No. 6: Ed. Imtiaz Ali Arshi, Department of History, Aligarh Muslim University, Aligarh, 1960. pp28
  4. Hakim Syed Zillur Rahman (2008). "Chapter: Qazi Rafi Mohammad". Ḥayāt-i Karam Ḥusain (2nd ed.). Aligarh, India: Ibn Sina Academy of Medieval Medicine and Sciences. pp. 25–29. OCLC 852404214.
  5. Hakim Syed Zillur Rahman (2008). "1857 ki Jung-e Azadi main Khandan ka hissa". Ḥayāt-i Karam Ḥusain (2nd ed.). Aligarh, India: Ibn Sina Academy of Medieval Medicine and Sciences. pp. 253–258. OCLC 852404214.
  6. History Archived 2007-10-13 at the Wayback Machine Official website Gurgaon.
  7. 7.0 7.1 7.2 7.3 7.4 7.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  8. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Cyprus 1,120,489 July 2011 est.
  9. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Rhode Island 1,052,567
  10. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.