Jump to content

భివాని జిల్లా

అక్షాంశ రేఖాంశాలు: 28°47′00″N 76°08′00″E / 28.7833°N 76.1333°E / 28.7833; 76.1333
వికీపీడియా నుండి
భివాని జిల్లా
హర్యానాలో జిల్లా స్థానం
హర్యానాలో జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంహర్యానా
డివిజనుహిసార్
ముఖ్య పట్టణంభివాని
విస్తీర్ణం
 • Total3,432 కి.మీ2 (1,325 చ. మై)
జనాభా
 (2011)
 • Total16,34,445
 • జనసాంద్రత480/కి.మీ2 (1,200/చ. మై.)
Time zoneUTC+05:30 (IST)
Websitehttps://bhiwani.gov.in/

హర్యానా రాష్ట్రం లోని 22 జిల్లాలలో భివాని జిల్లా ఒకటి. ఈ జిల్లాను 1972 డిసెంబరు 22 న ఏర్పాటు చేసారు. జిల్లా వైశాల్యం 5,140 చ.కి.మీ. 28.05 నుండి 29.05 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 75.26 నుండి 76.28 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లాలో 442 గ్రామాలు ఉన్నాయి. జనసంఖ్య 14,25,022. భివాని పట్టణం ఈ జిల్లాకు కేంద్రం.[1] 2011 గణాంకాలను అనుసరించి హర్యానా రాష్ట్రంలో అత్యధిక జనసంఖ్య కలిగిన జిల్లాలలో భివాని జిల్లా మూడవ స్థానంలో ఉంది.[2]

పేరువెనుక చరిత్ర

[మార్చు]

జిల్లా కేంద్రం పేరు జిల్లాకు నిర్ణయించబడింది. భివాని నగరాన్ని రాజపుత్రుడు నిర్మించి నగరానికి ఆయన భార్య భాని పేరును నిర్ణయించాడు. భాని తరువాత భియాని ఆతరువాత భివాని అయింది.

చరిత్ర

[మార్చు]

జిల్లాలోని మిటాతై గ్రామంలో 1968-73, 1980-86 మద్య నిర్వహించిన త్రవ్వకాలలో హరప్పన్ ముందు కాలం, హరప్పా నాగరికత (సింధు లోయ నాగరికత) సంబంధిత ఆధారాలు లభించాయి. భివానికి 10 కి.మీ. దూరంలో ఉన్న నౌరంగాబాద్ గ్రామం సమీపంలో ప్రాథమిక త్రవ్వకాలు సాగించిన సమయంలో 2500 సంవత్సరాలకు పూర్వం నాటి నాణ్యాలు, పనిముట్లు, జల్లెడ, బొమ్మలు, శిల్పాలు మొదలైనవి లభించాయి. పురావస్తు నిపుణులు నాణ్యాలు, నాణ్యపు అచ్చులు, శిల్పాలు, నివాసగృహాల డిజైన్లు ఇక్కడ ఒకప్పుడు పట్టణం (కుషాన్, గుప్త, యుధేయ) ఉందని తెలియజేస్తున్నాయి. అయిన్- ఇ - అక్బారి గ్రంథంలో భివాని నగర ప్రస్తావన ఉంది. మొఘల్ సాంరాజ్యకాలంలో భివాని ప్రముఖ వాణిజ్యకేంద్రంగా ఉండేది.

విభాగాలు

[మార్చు]
  • జిల్లా 6 ఉప విభాగాలుగా (భివాని, దాద్రి, లోహరు, శివాని, బధ్రా, తొష్రం) విభజించబడింది.
  • ఉపవిభాగాలు అదనంగా 7 తాలూకాలుగా (భివాని, దాద్రి, లోహరు, శివాని, బవాని ఖెరా, బధ్రా, తొష్రం) విభజించబడ్డాయి.
  • జిల్లాలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు (భివాని, దాద్రి-1, దాద్రి-2, లోహరు, బధ్రా, బవాని ఖెరా, తొష్రం ) ఉన్నాయి.
  • భివాని ఖెరా : హిసార్ పార్లమెంటరీ నియోజకవర్గం.
  • మిగిలినవి భివాని- మహేంద్రగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నాయి.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,629,109,[2]
ఇది దాదాపు. గునియా బిస్సూ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. ఇండాహో నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 306 వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 341 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 14.32%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 884:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 76.7%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

ఎడ్యుకేషన్

[మార్చు]

భివాని జిల్లాలోని నాలుగు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి:

  • టెక్స్టైల్ & సైన్సెస్, భివాని యొక్క టెక్నలాజికల్ ఇన్స్టిట్యూట్
  • ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ అండ్ సైన్స్ (ITS) భివాని యొక్క
  • B.R.C.M. ఇంజనీరింగ్ & టెక్నాలజీ, Bahal, భివాని కళాశాల.
  • టెక్నాలజీ అండ్ సైన్స్, భివాని యొక్క భివాని ఇన్స్టిట్యూట్
  • ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, భివాని

గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాలలు

[మార్చు]
  • వైష్ పేయింగ్ కాలేజ్ భివాని
  • గవర్నమెంటు . కాలేజ్ భివాని
  • గవర్నమెంటు . బాలికల కాలేజ్ భివాని
  • ఆదర్శ్ పేయింగ్ కాలేజ్ భివాని
  • కిరోరి మల్ బి.ఇ.డి. కాలేజ్ భివాని
  • జనతా విద్యా మందిర్ సి.హెచ్. దాద్రి
  • గవర్నమెంటు కాలేజ్ బౌంద్.
  • బంసిలాల్ గవర్నమెంటు కాలేజ్ తోషం
  • గవర్నమెంటు పి.జి. కాలేజ్, లాహోర్
  • సి.సి.సి. నర్సింగ్ కళాశాల, సింఘాని, (లోహారు)
  • గవర్నమెంటు పాలిటెక్నిక్, లోహారు
  • గవర్నమెంటు కాలేజ్, భివాని ఖేరా

భివానిలో ఎం.కె. హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. ఇందులో హెలికాప్టర్ అంబులెన్స్ సౌకర్యం ఉంది. భవిష్యత్తులో ఇక్కడ వైద్య కళాశాల స్థాపించే యోచన ఉంది.

మత సంబంధ ప్రదేశాలు

[మార్చు]

భివాని జిల్లాలో పలు ఆలయం ఉన్నాయి. ఇది చోటా కాశీ అని ప్రస్తుతించబడుతుంది. [ఆధారం చూపాలి] జిల్లాలో హరిహరాలయం ఉంది. 2003లో ఈ శివాలయానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. భివానీకి 27కి.మీ దూరంలో ఉన్న రనిలాలో జైన మందిరం ఉంది. దేవ్సర్ ధాం వద్ద దుర్గామాత ఆలయం ఉంది. అంతేకాక శివుడు ప్రధాన దైవంగా జోగివాలా మందిర్ ఉంది. దినోడ్ వద్ద నక్షత్ర ఆకారంలో నిర్మించబడిన నక్షత్రాలయం ఉంది. ధరెయు గ్రామంలో ప్రముఖ శ్యామ మందిరం ఉంది.

క్రీడలు

[మార్చు]

భారతీయ బాక్సింగ్ రంగంలో భివాని ప్రధానకేంద్రంగా అభివృద్ధిచెందింది. భివాని నగరం నుండి నలుగురు బాక్సర్లు బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో పాల్గొన్నారు. భివానీలో ఉన్న ఎస్.ఎ.ఐ. బాక్సింగ్ హాస్టల్‌లో శిక్షణపొందిన వారే. వారిలో అహిల్ కుమార్, విజేందర్ కుమార్, జితేందర్ కుమార్ (ఫ్లై వెయిట్ బాక్సర్) వారు ప్రాతినిథ్యం వహించిన క్రీడలలో క్వార్టర్ ఫైనల్ వరకూ చేరుకున్నారు. విజేంద్రకుమార్ మాత్రం సెమీఫైనల్ వరకు చేరుకుని సమ్మర్ ఒలింపిక్స్‌లో భారతదేశానికి మొదటిసారిగా బాక్సుంగ్‌లో కాంశ్యపతకం సాధించాడు. 2010 సి.డబల్యూ.జి క్రీడలలో భీవానిలోని దినోడ్ గ్రామానికి చెందిన పరమజిత్ సమోటా భారతదేశానికి బంగారుపతకం సాధించాడు. ముంబయి ఇంటర్నేషనల్ క్రీడలలో భారతదేశం తరఫున భివానీకి చెందిన సంగం సోని కరాటే క్రీడలో బంగారుపతకం సాధించాడు.

జాతీయ నాయకులు

[మార్చు]

భివాని ప్రముఖ రాజకీయనాయకుడు సాంఘిక సంస్కర్త చౌదరి స్వస్థలం. హర్యానా ముఖ్యమంత్రి, రక్షణ మంత్రి, పార్లమెంటు సభ్యుడు, అసెంబ్లీ సభ్యుడు, హర్యానా అసెంబ్లీ స్పీకర్, హర్యానా క్యాబినెట్ మంత్రి వంటి పదవులను అలంకరించిన బంసీ లాల్ స్వస్థలం భివాని. బంస్లీ లాల్ ఆదర్శ్ మహిళా (హర్యానా రాష్ట్ర ఉత్తమ మహిళాకాలేజ్ అవార్డ్ గ్రహీత), వైష్ ఎజ్యుకేషంస్ ఇన్శ్టిట్యూట్ (పి.జి కాలేజ్, స్కూల్స్), నేచుర్ క్యూర్ హాస్పిటల్ (ప్రకృతి చికిత్సాలయం) స్థాపించాడు.

ప్రముఖ వ్యక్తులు

[మార్చు]
  • రిచ్పాల్ రాం - విక్టోరియా క్రాస్ ప్రపంచ యుద్ధం, రెండో విజేత
  • విజయ్ కుమార్ సింగ్, పి.వి.ఎం, ఎ.వి.ఎస్.ఎం. వై.ఎస్.ఎం. ఎ.డి.సి - ముఖ్యమంత్రి ఆర్మీ స్టాఫ్ (భారతదేశం), భారతీయ ఆర్మీ
  • బాన్సీ లాల్ - హర్యానా మాజీ ముఖ్యమంత్రి
  • విజేందర్ సింగ్ - బాక్సింగ్ లో ఒలింపిక్ కాంస్య పతక విజేత
  • హవా సింగ్ - హర్యానా నుంచి లెజెండరీ బాక్సర్
  • జగదీష్ సింగ్ - బాక్సర్
  • దినేష్ కుమార్ (బాక్సర్) - బాక్సర్
  • జితేందర్ కుమార్ (మిడిల్వెయిట్ బాక్సర్)
  • జితేందర్ కుమార్ (ఫ్లైవెయిట్ బాక్సర్)

భివాని జిల్లా గ్రామాలు

[మార్చు]
  • నీంరివలి
  • భాగం
  • మిలక్పూర్
  • బిద్వాన్
  • బిరన్ (భివాని)
  • చందెని
  • చంగ్‌రోడ్
  • ధబ్ధాని
  • ధాని రివస
  • ధరెరు
  • ఘసొల
  • గొత్రా (లోహారు)
  • ఝింఝర్ (హర్యానా)
  • ఝొఝు కలాన్
  • ఝొఝు ఖుర్ద్
  • ఝుంపా ఖుర్ద్
  • జ్యాని చాపర్
  • లఖ్లన్

లోహారు తహసిల్లో గ్రామాల జాబితా

[మార్చు]
  • సోహంసరా న్
  • మంహెరు
  • పుర్ (హర్యానాలోని భివాని)
  • గురెర
  • కరి తొఖ
  • జెయూఐ ఖుర్ద్
  • బదలకయ్ల
  • తిగ్రన, భివాని
  • బపొరా
  • జెవలి
  • బధుర
  • కయ్ల, భివాని
  • బదెసర
  • రనిల
  • కె.యు.డి.ఎల్
  • ఝింఝర్
  • ఉన్ ( భివాని )
  • బౌండ్ కలాన్
  • సంజరాస్
  • ఖరాక్
  • సాంగా
  • గొరిపూర్
  • ఘసొలు
  • ఝుంపా
  • ధని లక్ష్మణ్
  • మిటతల్
  • కలువాస్
  • ఫొగత్
  • హిందొ
  • సంవర్
  • ధరెదూ

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-03-29. Retrieved 2014-08-25.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Guinea-Bissau 1,596,677 July 2011 est.
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Idaho 1,567,582

బయటి లింకులు

[మార్చు]


28°47′00″N 76°08′00″E / 28.7833°N 76.1333°E / 28.7833; 76.1333