రేవారీ జిల్లా
రెవారీ జిల్లా
रेवाड़ी जिला | |
---|---|
Coordinates (రెవారీ): 27°57′N 76°17′E / 27.95°N 76.28°E - 28°28′N 76°51′E / 28.47°N 76.85°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | హర్యానా |
డివిజను | గురుగ్రామ్ |
స్థాపన | 1989 నవంబరు 1 |
ముఖ్య పట్టణం | రెవారీ |
విస్తీర్ణం | |
• Total | 1,594 కి.మీ2 (615 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 9,00,332 |
• జనసాంద్రత | 560/కి.మీ2 (1,500/చ. మై.) |
• Urban | 25.93% |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 80.99% |
• లింగనిష్పత్తి | 898 |
Time zone | UTC+05:30 (IST) |
Vehicle registration | HR-36 |
Website | http://rewari.gov.in/ |
హర్యానా రాష్ట్రం లోని 22 జిల్లాలలో రెవారీ జిల్లా ఒకటి. గుర్‌గావ్ జిల్లా న్ండీ ఈ జిల్లాను ఏరపరచారు. రెవారీ పట్టణం ఈ జిల్లాకు కేంద్రం. జిల్లా వైశాల్యం 1,268 చ.కి.మీ.
చరిత్ర
[మార్చు]మహాభారతం లోని బలరాముడి భార్య రేవతి పేరిట ఆమె తండ్రి ఈ పట్టణాన్ని రేవా వాడీ అనే పేరుతో నిర్మించాడని ఐతిహ్యం. కూతురిని బలరామునికి ఇచ్చి పెళ్ళి చేసేటపుడు ఈ పట్టణాన్ని కట్నంగా చదివించాడు.[1]
1962 రెజాంగ్ లా యుద్ధం
[మార్చు]1962 భారత చైనా యుద్ధంలో రెజాంగ్ లా వద్ద 13 కుమావో దళం చైనా సైన్యంతో తలపడింది.[2] నవంబరు 18 న రెజాంగ్ లా వద్ద జరిగిన పోరులో భారత దళం లోని 13 మందిలో 114 మంది మరణించారు. వీళ్ళలో దాదాపుగా అందరూ రెవారీకి చెందినవారే. ఈ దళ నాయకుడు సైతాన్ సింగ్‌కు మరణానంతర పరమ వీర చక్ర పతకం లభించింది. వీరి స్మారకార్థం పట్టణంలో ఒక స్మారకాన్ని నిర్మించారు. ఈ దళం 1300 మంది సినికులను చంపిందని ఆ స్మారకంపై రాసారు.[3] ఏటా ఇక్కడ స్మారక ఉత్సవం జరుపుతారు.
జనాభా వివరాలు
[మార్చు]చారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% p.a. |
1951 | 2,59,847 | — |
1961 | 3,14,793 | +1.94% |
1971 | 3,90,351 | +2.17% |
1981 | 4,86,084 | +2.22% |
1991 | 6,10,611 | +2.31% |
2001 | 7,65,351 | +2.28% |
2011 | 9,00,332 | +1.64% |
source:[4] |
2011 జనాభా లెక్కల ప్రకారం, రేవారి జిల్లాలో 9,00,332 జనాభా ఉంది, జనాభా పరంగా ఇది భారతదేశ జిల్లాల్లో 466 వ స్థానంలో ఉంది. జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 565 మంది. 2001-2011 దశాబ్దంలో జిలా జనాభా వృద్ధి రేటు 17.09%. రేవారిలో ప్రతి 1000 మంది పురుషులకు 898 మంది స్త్రీలు ఉన్నారు. అక్షరాస్యత 80.99%. మగవారిలో అక్షరాస్యత 91.44% కాగా, ఆడవారిలో ఇది 69.57%. జనాభాలో హిందువులు అధికం (98.76%).మిగతావారిలో ఇస్లాం (0.63%), సిక్కు మతం (0.20%), జైన మతం (0.17%), ఇతర మతాలనూ (0.24%) ఆచరిస్తారు.
ఆర్థిక వ్యవస్థ
[మార్చు]ఢిల్లీకి దగ్గరగా ఉండడం వలన, ఖనిజాల లభ్యత వలనా జిల్లాలో ఆర్థిక వ్యవస్థ పరిశ్రమల దిశగా పురోగమించింది. 1989 లో జిల్లా ఏర్పాటైన తరువాత, రెవారీ జిల్లాలో వ్యవసాయం ఉపాధిగా కలిగిన వారి సంఖ్య 54.7% నుండ్ 2011 నాటికి 33.8% కి పడిపోయింది.ద్వితీయ తృతీయ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభించాయి.[5]
జిల్లాలో వ్యవసాయం ప్రధానంగా బోరుబావుల ద్వారా జరుగుతుంది. ఎత్తిపోతలపథకం ద్వారా జవహర్ లాల్ నెహ్రూ కాలువ ద్వారా కూడా సాగునీరు అందిస్తున్నారు.మొత్తం 1,59,400 హెక్టార్ల భూమిలో 1,20,897 హెక్టార్లలో (83.79%) సాగు చేస్తున్నారు.
చారిత్రికంగా రెవారీ, ఇత్తడి సమానుల తయారీకి ప్రసిద్ధి. 1989 లో జిల్లా ఏర్పడిన సమయంలోనే ఆర్థిక సరళీకరణ మొదలవడం ఢిల్లీ నుండి పరిశ్రమలను దూరంగా జాతీయ రాజధాని ప్రాంతం లోకి తరలించడంతో రెవారీలో పారిశ్రమల స్థాపన పెరిగిపోయింది. కేవలం 2 మధ్య తరహా పరిశ్రమలున్న స్థాయి నుండి కొద్ది సంవత్సరాల లోనే 168 పరిశ్రమల స్థాయికి అభువృద్ధి చెందింది. ఇత్తడి సామాను, కాగితం, బీరు, విద్యుత్ కేబుళ్ళు, సింథటిక్ నూలు వగైరాలు ఇక్కడి పరిశ్రమల్లో ప్రధానమైనవి
వెలుపలి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "History | District Rewari, Government of Haryana | Veer Bhoomi | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-03-04.
- ↑ Guruswamy, Mohan (20 November 2012). "Don't forget the heroes of Rezang La". The Hindu. Retrieved 7 July 2018.
- ↑ Gupta, Shekhar (30 October 2012). "Nobody believed we had killed so many Chinese at Rezang La. Our commander called me crazy and warned that I could be court-martialled". The Indian Express. Retrieved 7 July 2012.
- ↑ Decadal Variation In Population Since 1901
- ↑ District Census Handbook 2011 (Part A) (PDF). Office of the Registrar General & Census Commissioner, India. 2011.