Jump to content

నవరంగపూర్ జిల్లా

వికీపీడియా నుండి
నవరంగపూర్ జిల్లా
జిల్లా
నబరంగ్‌పూర్ సరస్సు దృశ్యం
నబరంగ్‌పూర్ సరస్సు దృశ్యం
ఒడిశా పటంలో జిల్లా స్థానం
ఒడిశా పటంలో జిల్లా స్థానం
దేశం India
రాష్ట్రంఒడిశా
ప్రధాన కార్యాలయంనవరంగపూర్
Government
 • కలెక్టరుSibabrata Dash
విస్తీర్ణం
 • Total5,294 కి.మీ2 (2,044 చ. మై)
Elevation
195 మీ (640 అ.)
జనాభా
 (2001)
 • Total10,18,171
 • జనసాంద్రత192/కి.మీ2 (500/చ. మై.)
భాషలు
 • అధికారఒరియా
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
764 xxx
Vehicle registrationOD-24
లింగ నిష్పత్తి1.007 /
లోక్‌సభ నియోజకవర్గంNabarangpur
శీతోష్ణస్థితిAw (Köppen)
అవపాతం1,691 మిల్లీమీటర్లు (66.6 అం.)
సగటు వేసవి ఉష్ణోగ్రత40 °C (104 °F)
సగటు శీతాకాల ఉష్ణోగ్రత12 °C (54 °F)

ఒడిషా రాష్ట్రం లోని జిల్లాలలో నబరంగ్‌పూర్ (నవరంగ్‌ పూర్) జిల్లా ఒకటి. నవరంగ్‌పూర్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లా ప్రజలలో గిరిజనులు అధికంగా ఉన్నారు. జిల్లాలో అత్యధికభూభాగం అటవీప్రాంతంగా ఉంది. 19.14’ అక్షాంశం, 82.32 రేఖాంశంలో ఉంది. జిల్లా సముద్రమట్టానికి 1876 మీటర్ల ఎత్తున ఉంది..

చరిత్ర

[మార్చు]

1992 అక్టోబరు 2 న మునుపటి కోరాపుట్ జిల్లాలోని ఉపభాంగా ఉన్న నబరంగ్‌పూర్‌కు జిల్లా అంతస్తు ఇవ్వబడింది. అప్పటి వరకు కోరాపుట్ జిల్లా రాష్ట్రంలో వైశాల్యపరంగా 2 వ స్థానంలో ఉంది. నబరంగ్‌పూర్ జిల్లాతో అనివార్యమైన సంబంధబాంధవ్యాలు ఉన్నాయి. నబరంగ్‌పూర్ జిల్లాకు భాష, వారసత్వం, జీవనశైలి, వృక్షజాలం, జంతుజాలం, ఆహ్లాదకరమైన వాతావరణం వంటి పలు విషయాలలో కోరాపుట్ జిల్లాతో సంబంధాలు ఉన్నాయి.

కోరాపుట్

[మార్చు]

కోరాపుట్ ప్రాతం శక్తివంతమైన కళింగ సామ్రాజ్యంలోని అవంతికా రాజ్యానికి చెందింది. క్రీ.పూ 3 వ శతాబ్దంలో కళింగ యుద్ధంలో వీరు వీరోచితంగా యుద్ధం చేసారు. క్రీ.పూ 1 వ శతాబ్ధానికి మహామేఘబాహన్ పాలనాకాలంలో కళింగ సామ్రాజ్యం తన పూర్వపు వైభవం సంతరించుకుంది. కళింగ సామ్రాజ్యం 3 వ రాజైన కరవేల సామ్రాజ్యాన్ని విస్తరించి అవంతికా దేశాన్ని శక్తివంతం చేసాడు.

పాలకులు

[మార్చు]

2వ శతాబ్దంలో శాతవాహనులు, 3వ శతాబ్దంలో ఆధునిక నగరమైన ఉమర్కోట సమీపంలో ఉన్న పుష్కరిని రాజధానిగా చేసుకుని ఇక్ష్వాకులు పాలించారు. కేసరిబేడా త్రవ్వకాలలో రాజా భబదట్ట వర్మ, రాజా ఆరాధపట్టి గురించిన ఆధారాలు లభ్యమయ్యాయి. పోడాగర్ శిలాశాసనాలు రాజా స్కందవర్మ గురించి వివరణ ఇస్తున్నాయి. నలా రాజులు గ్వాలియర్‌ను రాజధానిగా చేసుకుని మద్యప్రదేశ్‌ను పాలించారు. ప్రస్తుత కోరాపుట్, గంజాం జిల్లాల ప్రాంతాన్నిక్రీ.పూ నలా రాజా భీంసేన్ పాలించాడు.

గంగాలు

[మార్చు]

ప్రస్తుత నబరంగ్‌పూర్‌తో చేర్చిన కోరాపుట్ జిల్లా త్రికళింగాకు చెందిన చిన్న రాజ సంస్థానం. ఇది 5వ శతాబ్దం నుండి గంగా రాజుల ఆధీనంలో ఉంది. ఉత్కల, కళింగ, కోసలరాజ్యాలలోని భూభాగాలు కొన్ని గంగారాజుల ఆధీనంలో ఉండేవి. 11వ శతాబ్ధానికి ఈ ప్రాంతం ప్రాముఖ్యత సంతరించుకుంది. గంగా రాజ్యం ఆధునిక సంబల్పూర్, సోనేపూర్ (ఒడిషా)]], బస్తర్ రాజాస్థానం, కోరాపుట్ భూభాగాలు వరకు విస్తరించింది. 14వ శతాబ్దం ఆరంభం వరకు ఇవి గంగారాజుల ఆధిక్యంలోనే ఉన్నాయి.

మత్స్య

[మార్చు]

ఆధునిక జాజ్‌పూర్ ప్రాంతం మునుపటి ఒద్దాడ ప్రాంతాన్ని మత్స్యరాజులు పాలించారు. వీరిలో రాజా భానుదేవ, నరసింగదేవ సుపరిపాలన అందించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని విశాఖపట్నం జిల్లాలని సింహాచలంలో ఒరియా భాషలో లభిస్తున్న శిలాశాసనాలు ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి.

శాలివాహనులు

[మార్చు]

తరువాత ఈ ప్రాంతాన్ని శాలివాహనులు పాలించారు. వీరు 14 వ శతాబ్దంలో వింధ్యపర్వతాల వరకు పాలించారు. ఆరంభకాల గంగారాజులు జాజ్‌పూర్‌ను రాజధానిగా చేసుకుని నదపూర్ వరకు పాలించారు. ఉజ్జయిని రాజు విక్రమాదిత్యుడు నిర్మించిన 32 మెట్లున్న సింహాసనం నదపూరుకు ప్రఖ్యాతి తెచ్చిపెట్టింది. నందపూర్ రాజ్యంలో జైనమతం, శాక్తేయం అభివృద్ధి చెందాయి.

ప్రతాప్ గంగ

[మార్చు]

సైలవంశానికి చెందిన రాజు ప్రతాప్ గంగరాజు తరువాత వినాయక్‌దేవ్ రాజ్యానికి పాలకుడయ్యాడు. బ్రిటిష్ రాజ్యం ఈ ప్రాంతం మీద ఆధిపత్యం సాధించే వరకు వినాయక్‌దేవ్ వంశస్థుల పాలన కొనసాగింది. వినాయక్‌దేవ్ ప్రతాప్ గంగరాజు కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వినాయక్‌దేవ్, ఆయన తరువాత ఆరు వారసులకు ఒకేఒక వారసుడు ఉండడం వలన జ్యోతిష్కుల సలహా మీద రాజధానిని నందపూర్‌ నుండి జాజ్‌పూర్‌కు మార్చబడింది.

విక్రందేవ్

[మార్చు]

ఆంగ్లో -ఫ్రెంచ్ కలహం సమయంలో విక్రందేవ్ (1758-1781) విజయవంతంగా ఫ్రెంచ్ సైన్యాలను మల్కంగిరి, మరాఠీ ప్రాంతాల నుండి తరిమికొట్టాడు. వారి తరువాత రెండవ రాజా రామచంద్ర దేవ్ (1781-1825) పాలకుడయ్యాడు. ఆయన కుమారులు జగన్నాథ్, నరసింగదేవ్ నబరంగ్‌పూర్, గుడారి భూభాగలకు పాలకులయ్యారు. జగనాథ్ సింగ్ అర్జునదేవ్, నరసింగదేవ్‌లకు సంతానం లేదు. వారి తరువాత ఈ ప్రాంతం నబరంగ్‌పూర్, గుడారి జాజ్‌పూర్ సామ్రాజ్యంలో విలీనం అయ్యాయి.

నాలుగవ రామచంద్రదేవ్

[మార్చు]

20వ శతాబ్దంలో 4వ రామచంద్రదేవ్ (1920-1931) రెండవ ప్రపంచ యుద్ధంలో విశ్వసనీయమైన సైన్యాద్యక్షత వహించాడు. ఆయనకు వారసులు లేరు. ఆయన తరువాత కృష్ణదేవ్ కుమారుడు 5వ విక్రమదేవ్ రాజ్యానికి పాలకుడయ్యాడు. ఈ సమయంలో ఓ డానియేల్ నాయకత్వంలో " బౌండరీ కమీషన్ " ఒడిషా మాట్లాడే భూభాగం నిర్ణయించడానికి నియమించబడ్డాడు. బౌండరీ కమిషన్ తమ నిఋనయం ప్రకటించే ముందుగా జాజ్‌పూర్, పరలఖుమెండి, గంజాం, విశాఖపట్నం పర్యటించింది. 1936 ఏప్రిల్ 1 ఒడిషా రాష్ట్రం రూపొందించబడింది. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 6 జిల్లాలలో కోరాపుట్ ఒకటి. 1951లో తన 82వ సంవత్సరంలో విక్రందేవ్సింగ్ మరణించాడు. తరువాత సంవత్సరం రాజాస్థానాలు రద్దు చట్టం అమలయింది. జాజ్‌పూర్ రాజాస్థానం ఒడిషా రాష్ట్రంలో విలీనం అయింది. ప్రస్తుతం ఈ జిల్లా " రెడ్ కార్పెట్ "లో భాగంగా ఉంది.[1]

స్వాతంత్ర్య ఉద్యమం

[మార్చు]

1940లో కాలనీ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య సమరం తీవ్రమైంది. అవిభాజిత కోరాపుట్ జిల్లాలోని నాయకులు ఆదివాసీలు " ఇండియన్ నేషనల్ నాయకత్వంలో " ర్యాలీ నిర్వహించి ఖైదు చేయబడ్డారు. క్విట్ ఇండియా ఉద్యమానికి మహాత్మాగాంధీ పిలుపు ఇచ్చాడు. 1942లో నబరంగ్‌పూర్‌, కోరాపుట్, మాల్కంగ్రిలలో క్విట్ ఇండియా ఉద్యమం ప్రతిధ్వనించింది. నబరంగ్‌పూర్‌లో ఆధిక్యతలో ఉన్న గిరిజనులు ఈ జాతీయఉద్యమంలో ప్రధాన పాత్ర వహించారు. మాల్కంగిరి ఉపవిభాగంలోని తెంతులిగుమ్మాకు చెందిన గిరిజన నాయకుడు లక్ష్మణ్ నాయక్ సహాయనిరాకరణోద్యంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న తరుణంలో హత్యకేసులో ఇరికించబడి 1943 ఆగస్టు 29న విచారణ రహితంగా ఉరితీయబడ్డాడు.

మహాదేవ్ ప్రధాని

[మార్చు]

1942 ఆగస్టు 24 న మహాదేవ్‌ప్రధాని నాయకత్వంలో గుమ్మగూడాకు చెందిన దాదాపు 6000 మంది ఆదివాసీలు సమఖ్యమై జిల్లా నాయకుల ఖైదు గురించి తమ భష్యత్తు కార్యాచరణ వ్యూహం గురించి చర్చించారు. పాపబహంది సమీపంలో ఉన్న వంతెన వద్ద ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. మునుదుగా ప్రకటినకుండా జరిగిన లాఠీ చార్జ్, తుపాకి కాల్పుల నుండి తప్పించుకోవడానికి చాలామంది వరద ఉధృతంలో ప్రవహిస్తున్న నదిలోకి దూకారు. ఈ సంఘటనలో 19 మంది మరణించారు, పలువురు మరణించారు. కోరాపుట్ జైలు సామధ్యానికి 3-4 రెట్లు అధింకంగా ఖైదీలతో నిండిపోయింది. జైలులోని అనారోగ్య పరిస్థితులు, అధికారుల హింసలతో పలువురు బాధలను అనుభవించారు. క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో పలువురు మహిళా ఉద్యమకారులు అత్యాచారానికి గురైయ్యారు. వారిలో కొందరిని పోలీసులు చంపగా మిగిలిన వారు ఆత్మహత్య చేసుకున్నారు. స్వాత్రంసమర కాలంలో సరికొత్తగా ఆర్.కె.సాబు, ఆర్.కె. బిస్వాస్‌ రే, సదాశివ త్రిపాఠీ వంటి నాయకులు నాగపూర్ పట్టణం నుండి ఉద్భవించారు. తరువాతి కాలంలో వారు ఒడిషా ముఖ్యమంత్రి పదవుని అధిష్ఠించారు.

భౌగోళికం

[మార్చు]

జిల్లా వైశాల్యం 5294.5 చ.కి.మీ. జిల్లా ఉత్తర సరిహద్దులో కలహంది జిల్లా, పశ్చిమ సరిహద్దులో చత్తిస్‌ఘర్ రాష్ట్రానికి చెందిన జగదల్‌పూర్ జిల్లా, తూర్పు సరిహద్దులో కలహంది జిల్లా, రాయగడ జిల్లా, దక్షిణ సరిహద్దులో కోరాపుట్ జిల్లా ఉన్నాయి. కోరాపుట్ జిల్లాకు, నబరంగ్‌పూర్ జిల్లాలకు మద్య సరిహద్దుగా ఇంద్రావతి నది ప్రవహిస్తుంది. జిల్లా కేంద్రం నబరంగ్‌పూర్ సముద్రమట్టానికి 2000 అడుగుల ఎత్తులో ఉంది. ఉత్తరాన ఉన్న పనబెడా సమీపకాలంలో చందహండి ఉంది. ఇది సముద్రమట్టానికి 500 అడుగుల ఎత్తులో ఉంది. జిల్లాలో వాతావరణం, సాంఘిక జీవితం పక్కన ఉన్న కలహంధి జిల్లాలో ఉన్నట్లు ఉంది. మిగిలిన నబరంగ్‌పూర్ జిల్లా కొన్ని దిగువ ప్రాంతాలతో దాదాపు మైదానంగా ఉంటుంది. పొడఘర్ శిఖరం 3050 అడుగుల ఎత్తులో జిల్లాలో ఎత్తైన శిఖరంగా గుర్తించబడుతుంది. దట్టమైన అరణ్యాలలో విస్తారంగా లభిస్తున్న సాల విత్తనాలు సమీపంలో ఉన్న గ్రామీణ ప్రజలకు జీవనాధారంగ ఉంది.

వాతావరణం

[మార్చు]

నబరంగ్‌పూర్ జిల్లాలో సమీపంలోని కోరాపుట్ జిల్లాలో ఉన్నట్లు వర్షపాతం ముందుగానే ఉంటుంది. జిల్లాలో ఆగ్నేయం నుండి వీస్తున్న చల్లని గాలులు వర్షపాతానికి కారణమౌతూ ఉంటాయి. నబరంగ్‌పూర్ జిల్లా చాలినంత వర్షపాతాన్ని అందుకుంటుంది. ఇక్కడ కరువు అరుదుగా మాత్రమే సంభవిస్తుంది. మైదానంలో సంవత్సరం అంతా చల్లగా ఉంటుంది.

నదులు

[మార్చు]

నబరంగ్‌పూర్ జిల్లాకు ఉత్తరంలో ప్రవహిస్తున్న తెలెన్ నది కలహంది జిల్లాకు సరిహద్దుగా ఉంటూ సోనేపూర్ పట్టణంలో మహానదిలో ప్రవహిస్తుంది. ఈ నదీజలాలు వేసవిలో ఇంకి పోతుంటాయి. నబరంగ్‌పూర్ జిల్లా ప్రవహిస్తున్న ఇంద్రావతి నది తెలంగాణా లోని గోదావరి నదిలో సంగమిస్తుంది. ఈ నది పొడవు మొత్తం 530 కి.మీ ఉండగా అందులో 130 కి.మీ కోరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాలలో ప్రవహిస్తుంది. నరంగ్‌పూర్ వద్ద ఉన్న పురాతనమైన బస్ఖల్ వంతెన సమీపకాలంలో పునరుద్ధరించబడింది. ఈ నదికి వరదలు సంభవించిన తరుణంలో ఇంద్రావతి నది 450 అడుగుల వెడల్పు, 24 అడుగుల లోతున విస్తరించింది. వరదలను కట్టుబాటు చేయడానికి, జలవిద్యుత్తు ఉత్పత్తి కొరకు ఆనకట్ట నిర్మించబడింది.

ఖనిజాలు

[మార్చు]

నబరంగ్‌ జిల్లాలో పలు గనులు ఉన్నాయి. ఇనుము, క్లోరైట్, మైకా, క్వార్టజ్, ఇతర ఖనిజాలు లభమౌతున్నాయి. ఉమర్‌కోటేలో ఉన్న హీరాపుట్ గ్రామంలో హీమాటైట్, లిమోనైట్ నిలువలు ఉన్నాయి. ఒక్కొక గనిలో దాదాపు 60% ఇనుము ఉంది. తెంతుల్‌కుంతిలో గ్రానైట్ నిలువలు అధికంగా ఉన్నాయి. జిల్లా ఉత్తర భూభాగంలో ఉన్న రాళ్ళలో కోయర్స్ వైట్ క్వార్టెజ్ నిలువలు ఉన్నాయి.

ఆర్ధికం

[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో నబరంగ్‌పూర్ జిల్లా ఒకటి అని గుర్తించింది. .[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఒడిషా రాష్ట్ర 19 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[2]

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,218,762,[3]
ఇది దాదాపు. బహ్రైన్ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. న్యూహాంప్ షైర్ నగర జనసంఖ్యకు సమం..[5]
640 భారతదేశ జిల్లాలలో. 390వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 290 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 18.81%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 1008:1000,[3]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 48.2%.[3]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

భాషలు

[మార్చు]

జిల్లాలో ప్రజల మద్య ఒరియా భాష వాడుకలో ఉంది. జిల్లాలో నివసిస్తున్న ప్రజలలో గిరిజన ప్రజలు అధికంగా ఉన్నారు. ప్రజలు ఆధినిక జీవితానికి, విద్యాలకు అలవాటుపడుతున్నారు. ఇక్కడ నగరప్రజలు అధికంగా నివసిస్తున్న కారణంగా గిరిజనులలో క్రమంగా మార్పులు సంభవిస్తున్నాయి. పరజ, కొండా, గడవ ప్రజలు ఇప్పటికీ మొదలైన స్థానిక ప్రజలు వారి సంప్రదాయజీవితాన్ని కొనసాగిస్తున్నారు. వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణ వారి జీవితంలో భాగంగా ఉన్నాయి. గిరిజన ప్రజలలో ఒరియా భాష వాడుకలో ఉంది.

జిల్లాలో పలు మతాలు ఉన్నాయి. జిల్లాలో హిందువులు, క్రైస్తవులు, ముస్లిములు ఉన్నారు. గిరిజనులు హిందూ దైవాలను అధికంగా ఆరాధిస్తుంటారు. ప్రజలలో స్వల్పంగా ముస్లిములు ఉన్నారు. గోలకొండ సైనికులు పరజ స్త్రీలను వివాహం చేసుకుని ఇక్కడ స్థిరపడ్డారని భావిస్తున్నారు. మిషనరీ కార్యకలాపాల వలన క్రైస్తవులు ఉత్పన్నమైయ్యారు. బ్రిటిష్ పాలనా సమయంలో యు.కె, యు.ఎస్.ఎ మిషనరీలు బోర్డింగ్ పాఠశాలలు, వైద్యశాలలు, చర్చిలు స్థాపించారు. ప్రొటెస్టెంట్లు, కాథలిక్‌కు చెందిన క్రైస్తవులు ఇక్కడ నివసిస్తున్నారు. నబరంగ్‌పూర్‌లో ఉన్న క్రిస్టియన్ హాస్పిటల్ దూరంగా ఉన్న రోగులకు కూడా వైద్య సేవలు అందిస్తున్నారు.

స్థానికులు

[మార్చు]

జిల్లాలో అదనంగా భూమియా, డోంబులు గిరిజన ప్రజలు నివసిస్తున్నారు. డోంబు ప్రజలు జిల్లా అంతటా అధికంగా నివసిస్తున్నారు. జిల్లాలో వీరి సంఖ్య కొండాలకు తరువాత స్థానంలో ఉంది. వారు నేత, డ్రమ్ము వాయించడం వంటి వృత్తులను చేస్తూ మిగిన ప్రజల కంటే ఆధిక్యతను అనుభవిస్తుంటారు. వారు పెంపుడు జంతువుల వ్యాపారానికి సహకారం అందిస్తుంటారు. మిర్గానీలు డోంబుల ఉపశాఖ అని భావిస్తున్నారు. వారు డోంబుల మాదిరిగా జంతువులను ఆహారం కొరకు చంపరు అయినప్పటికీ సహజంగా చనిపోయిన జంతువుల మాంసాన్ని మాత్రం ఆహారంగా తీసుకుంటారు. వారు ఒరియా డోంబుల కంటే తాము అధికులమని భావిస్తుంటారు. వారికి నేత, వ్యవసాయం జీవనాధారంగా ఉంది. లక్క పని చేసే శంకరీలు సాంఘికంగా ఉన్నత వర్గీయులుగా భావించబడుతున్నారు. వీరు లక్క నుండి బుట్టలు, గొలుసులు, బొమ్మలు తయారు చేయబడుతుంటాయి. మాల్స్ సాధారణంగా ఆలయానికి అవసరమైన పూలను సేకరిస్తుంటారు. క్రమంగా వారు చెరుకు, పొగాకు మొదలైన పంటలు పండించడానికి అలవాటు పడుతున్నారు. ఇంద్రావతి నది తీరంలో సుంధీలు ఒరియా బైష్యా జాతికి చెందిన వారు. వీరు సారాయి తయారీ, లిక్కర్ అమ్మకం వంటివి చేస్తుంటారు. వీరు బ్రాహ్మణ తండ్రి, రాచరిక స్త్రీ కుటుంబానికి చెందిన వారమని విశ్వసిస్తున్నారు. వారు సామాన్యంగా సంపన్నులై ఉంటారు.

సంస్కృతి

[మార్చు]

పండుగలు

[మార్చు]

జిల్లా లోని ఒడిషా ప్రజలు రథయాత్ర, దసరా, హోలి, మహాశివరాత్రి పండుగలు నగరవాసులను గిరిజనులను ఏకం చేస్తాయి. వసంతకాల ఆరంభంలో వచ్చే హోలీని మూడు రోజులపాటు ఉత్సాహంగా నిర్వహిస్తారు. మొదటి రెండు రోజులు పూజలు నిర్వహించి మూడవ రోజు యువతీ యువకులు ఒకరి మీద ఒకరు వర్ణాలను జల్లుకుని ఆనందిస్తారు. కులం, మతం, వయసు, స్త్రీపురుష తారతమ్యాలు లేకుండా ఈ సంబరంలో అందరూ పాల్గొంటారు. రథయాత్ర పట్టణాలు, గ్రామాలను దాటుతూ ఈ రథయాత్ర చాలా బ్రహ్మాండంగా నిర్వహించబడుతుంది. ఈ రథయాత్రలో జగన్నథుడు సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రలతో రథం మీద 9 రోజులపాటు ఉరేగింపుకు బయలు దేరుతాడు. భక్తులు ఈ రథాన్ని పెద్ద త్రాడు సాయంతో లాగుతూ ముందుకు నడుపుతుంటారు. బహుద యాత్రతో రథయాత్ర ముస్తుంది.

జగన్నాథ ఆలయం

[మార్చు]

జిల్లా అంతటా చెదురు మదురుగా జగన్నాథ ఆలయాలు ఉన్నాయి. వీటిలో నవరంగపూర్ ఆలయం పురాతనమైనది. ఈ ఆలయానికి వెలుపలి అలంకరణలు ఏమీ ఉండవు. గర్భగుడి, ద్వారంలో గడుగస్తంభం ఉంటుంది. 1980 వరకు ఆలయంలో జగన్నాథుని మూర్తి మాత్రమే ఉంది. పురాణకథనాలను అనుసరించి బలభద్ర, సుభద్రల ఆలయ మూర్తులను బస్తర్ పాలకుడు ఎత్తుకు పోయి జగదలపూర్‌లో స్థాపించి పూజించాడనీ, మూడు మూర్తులను తీసుకువెళ్ళే సమయంలో జగన్నాథ మూర్తి ఏనుగు మీద నుండి కిందకు జాతిందని దానిని తిరిగి తీసుకు వచ్చి ఆలయంలో ప్రతిష్ఠించి పూజిస్తున్నారని విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం ఆలయంలో 3 మూర్తులు ఒక పెద్ద పీఠం మీద ఉన్నాయి. ఒక్కో ఆలయ పైకప్పు మీద మనుషులు, జంతువులు, పక్షులు, పూల వంటి అందమైన బొమ్మలను మలచిన కొయ్య చెక్కడాలు ఉన్నాయి. ఇవి చాలా అందంగా ఉన్నాయి. మిగిలిన ఆలయాలలో రాతిమీద చెక్కినట్లు ఇక్కడ కొయ్యతో మలిచారు. వీటికి నల్లని వర్ణాలను పూసి చక్కాగా పరిరక్షిస్తున్నారు.

దసరా

[మార్చు]

దసరా 10 రోజులపాటు నిర్వహించే హిందూ పండుగ. ఇది దుర్గాదేవిని ఆరాధించే పండుగ. జైపోర్ మహారాజా దీనిని విజయానికి గుర్తుగా జరుపుకుంటాడు. అన్ని గ్రామాలు, పట్టణాల నుండి దేవతలను మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకు వస్తారు. రైతులు అంతా ఈ ఉత్సవంలోఆందోత్సాహాలతో పాల్గొంటారు. 10వ రోజు దుర్గాదేవికి ఘనంగా కానుకలు సమర్పిస్తారు. జంతుబలి కూడా ఉంటుంది. ప్రజలు వర్ణరంజితమైన వస్త్రాలను ధరించి ఉత్సవంలో పాల్గొంటారు.

మా భందర్ఘరంజి

[మార్చు]

మా భందర్ఘరంజి నబరంగ్పూర్ ప్రాంతానికి గ్రామదేవత. మా భందర్ఘరంజి ప్రజల సంపదను, ప్రాణాలను కాపాడుతుందని ప్రజలు విశ్వసిస్తారు. సమీపగ్రామాల ప్రజలు కూడా మా భందర్ఘరంజి దేవిని ఆరాధిస్తుంటారు. ఇక్కడ మంగళవారం, శనివారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి ప్రత్యేకసందర్భంలోనూ దేవి దీవెనలు అందుకోవడానికి దేవతను ఆలయ ఆవరణకు తీసుకు వస్తారు.

మా పెంద్రాణి

[మార్చు]

ఉమర్‌కోట లోని మా పెంద్రాణి పుట్టుక గురించి పౌరాణిక కథనం ఉంది. ఉమర్‌కోట సమీపంలో ఉన్న పెంద్రా (పెద్రహండి) గ్రామంలో ఒక పేద ఇల్లాలు పెంద్రాణి తన సోదరుల ఈర్ష్యకు బలైంది. ఆమె భర్తను ఆమె తల్లీతండ్రులు అపరిమితంగా అభిమానించి వారిని తమతోనే ఉంచుకుని గారాబం చేసారు. పనిపాటలు లేకుండా జీవిస్తున్న అతని మీద ఈర్ష్యపడిన సోదరులు అతనిని చంపి తమ పొలములో పూడ్చి పెట్టారు. అది తెలుసుకున్న పెంద్రాణి భర్తచితిలో దూకి ప్రాణాలను త్యజించింది. తరువాత ఆమె ఆత్మ గ్రామంలో తిరుగుతూ తనను నమ్మినవారిని ఆపదలనుండి కాపాడుతూ ఉందని ప్రజలు విశ్వసిస్తూ ఆమెకు ఆలయం కట్టి పూజిస్తున్నారు. ప్రాంతీయ కాలేజీకి ఈ దేవత పేరు పెట్టారు.

మాహాశివరాత్రి

[మార్చు]

మహాశివరాత్రి అన్ని వర్గాలకు చెందిన ప్రజలనూ ఒకేలా ఆకర్షిస్తుంది. పరమశివుడు దేవుళ్ళకే దేవుడని ఆయన సృష్టినంతటినీ పోషిస్తాడని భక్తుల విశ్వాసం. క్షీరసాగర మథనం సమయంలో శివుడు వాసుకి నుండి ఉద్భవించిన విషాన్ని ప్రాణులను రక్షించడానికి మింగాడని భక్తులు విశ్వసిస్తారు. ఈశ్వరుడు విషం స్వీకరించినరోజే శివరాత్రి అని భక్తుల విశ్వాసం. పాపదహండి ఆలయంలో శివరాత్రి వైభవోపేతంగా నిర్వహించబడుతుంది. .

ఇతర పండుగలు

[మార్చు]

జిల్లాలో మొహరం పండుగ ఉత్సాహంగా జరుపుకుంటారు. పట్టణమంతా పెద్ద ఎత్తున ఊరేగింపులు జరుగుతుంటాయి. ప్రజలు మసీదులలో చేరి ప్రార్థనలు చేస్తారు.ఒకరికి ఒకరు అభినందనలు చెప్పుకుంటారు. క్రిస్తవులు క్రిస్మస్ నుండి న్యూ ఇయర్ వరకు కోలాహలంగా పండుగలను జరుపుకుంటారు. ఈ రెండు పండుగలో క్రైస్తవులు గృహాలలో చర్చిలలో విశేష ప్రారధనలు చేస్తుంటారు.

వృక్షజాలం , జంతుజాలం

[మార్చు]

నబరంగ్పూర్ జిల్లా వృక్షజాలం ఉత్తరభరతదేశ భుభాగాన్ని పోలి ఉంటుంది. కొన్ని విషాయాలు మాత్రం దక్షిణ భారతదేశం మాదిరిగానూ ఉంటుంది. సాలవృక్షాలు, వెదురు ఈ ప్రాంతం అంతటా విస్తరించి ఉన్నాయి. వరి పంట భుములు ఈ ప్రదేశన్ని పచ్చదనంతో కప్పుతూ ప్రదేశ సౌందర్యానికి మరింత వన్నె తీసుకు వస్తుంటాయి. అభయారణ్యాలు, సంరక్షిత అరణ్యాలు ఈ ప్రాంత ప్రకృతికి రక్షణగా నిలిచి ఉన్నాయి.

జంతుజాలం

[మార్చు]

వన్యమృగాలలో చిరుతపులులు, పాంథర్, పులులు, హైనా, జకల్, అడవి కుక్కలు ప్రధానమైనవి. మానవ చొరబాటు కారణంగా వన్యజీవుల జీవితానికి ఆటకం కలిగిస్తున్నాయి. ఉమర్‌కోట భూభాగంలో విల్డ్ ఆసియన్ వాటర్ బెఫెల్లో, అసియా నల్లని ఎలుగుబంటు, గౌర్ జంతువులు సహజంగా కనిపిస్తుంటాయి. చందహండి వద్ద బ్లాక్ బక్స్ సాధారణంగా కనిపిస్తుంటాయి. చుక్కల జింక, సాంబార్ జింక, బార్కింగ్ డీర్ జిల్లాలో సాధారణంగా కనిపిస్తుంటాయి. ఇంద్రవతీ నది సమీపంలో సాధారణ మొసళ్ళు కనిపిస్తుంటాయి. పీ ఫౌల్, రెడ్ జంగిల్ ఫౌల్, గ్రే జంగిల్ ఫౌల్ తరచుగా కనిపిస్తుంటాయి. ఇంపీరియల్ పీజియన్, బాతు సమీపకాలంలో ఇక్కడ అంతరించిపోతున్నాయి.

నబరంగ్పూర్ జిల్లా

[మార్చు]

అసెంబ్లీ నియోజకవర్గాలు

[మార్చు]

The following is the 4 Vidhan sabha constituencies[6][7] of Nabarangpur district and the elected members[8] of that area

క్ర.సం నియోజకవర్గం రిజర్వేషను* పరిధి 14 వ శాసనసభ సభ్యులు పార్టీ
73 ఉమర్కొటే షెడ్యూల్డ్ తెగలు రాయగర్, ఉమర్‌కోట (ఎన్.ఎ.చి), ఉమర్‌కొట (భాగం) శ్రీ సుబాష్ గొండ్ (బై) బి.జె.డి]]
74 ఝరిగం షెడ్యూల్డ్ తెగలు ఝరిగం, చందహండి, ఉమర్కోట్ (భాగం) రమేష్ చంద్ర మఝి. BJD
75 నబరంగ్‌పూర్ షెడ్యూల్డ్ తెగలు నబరంగ్పూర్ (ఎం), నబరంగ్పూర్, తెంతులికుంతి, నందహండి,ంకొసగుముడ (భాగం) మనోహర్ రంధారి బి.జె.డి
76 దబుగం షెడ్యూల్డ్ తెగలు దబుగం, పపదహండి, కొసగుముడ (భాగం) బుజబల్ మఝి ఐ.ఎన్.సి

* Since all seats of Nabarangpur district are covered by ST Seats no SC seat is assigned.

మూలాలు

[మార్చు]
  1. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Archived from the original on 2011-10-27. Retrieved 2011-09-17.
  2. 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Bahrain 1,214,705 July 2011 est.
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. New Hampshire 1,316,470
  6. Assembly Constituencies and their EXtent
  7. Seats of Odisha
  8. "List of Member in Fourteenth Assembly". ws.ori.nic.in. Archived from the original on 2 మే 2007. Retrieved 19 February 2013. MEMBER NAME

వెలుపలి లింకులు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]