Jump to content

కెందుఝార్ జిల్లా

వికీపీడియా నుండి
(కెందుజహర్ నుండి దారిమార్పు చెందింది)
కెందుఝర్
కేవుంఝర్
జిల్లా
ఎగువ: ఘట్‌గావ్‌లోని మా తారిణి ఆలయం దిగువ: ఖండధర్ జలపాతం
ఒఢిశా(భారతదేశం)లో నెలకొన్నదిఒడిశా పటంలో జిల్లా స్థానం
ఒఢిశా(భారతదేశం)లో నెలకొన్నదిఒడిశా పటంలో జిల్లా స్థానం
దేశం India
జిల్లాఒడిషా
జిల్లా కేంద్రంకెందుఝర్
Government
 • కలెక్టర్దెబ్జనీ చక్రబర్తి, ఐఎఎస్
 • పార్లమెంటు సభ్యుడుశకుంతలా లాగురి, బిజు జనతాదళ్
విస్తీర్ణం
 • Total8,240 కి.మీ2 (3,180 చ. మై)
Elevation
480 మీ (1,570 అ.)
జనాభా
 (2011)
 • Total18,02,777
 • Rank8
 • జనసాంద్రత217/కి.మీ2 (560/చ. మై.)
భాషలు
 • అధికారికఒరియా, హిందీ, ఇంగ్లీష్
Time zoneUTC+5:30 (ఐ.ఎస్.టి.)
పిన్
758 xxx
Vehicle registrationOD-09
లింగ నిష్పత్తి0.987 /
అక్షరాస్యత69%
లోక్‌సభ నియోజకవర్గంKeonjhar
శాసనసభ నియోజకవర్గాలు6
శీతోష్ణస్థితిAw (Köppen)
అవపాతం1,535.5 మిల్లీమీటర్లు (60.45 అం.)

కెందుఝార్ జిల్లా (మరొక పేరు కెవుంఝర్ జిల్లా) అనేది తూర్పు భారతంలోని ఒడిషాలోని జిల్లా. కెందుఝర్ లేదా కెందుఝార్ ఘర్ అనే పట్టణం దీనికి జిల్లా కేంద్రం.

ఈ జిల్లా 8240 km² పాటు, 21°1' N, 22°10' N లాటిట్యూడ్, 85°11' E నుంచి 86°22' E వరకు లాంగిట్యూడ్ ల మధ్య విస్తరించింది. తూర్పున మయూర్‌భంజ్, భద్రక్ జిల్లాలు, దక్షిణాన జాజ్‌పూర్ జిల్లా, పశ్చిమాన ధెంకనల్, సుందర్‌గఢ్ జిల్లాలు, ఝార్ఖండ్ రాష్ట్రంలోని పశ్చిం సింగ్‌భుం జిల్లా మధ్య నెలకొంది.

చరిత్ర

[మార్చు]

కెందుఝార్ జిల్లా చరిత్ర భౌగోళికంగా, మానవశాస్త్రం దృక్కోణం నుంచి వేలయేళ్ళ పొడవునా విస్తరించింది. జలపాతాల హోరు మొదలుకొని ఖనిజాలు, కొండలతో మొత్తంగా ఒడిషా ఎంత వైవిధ్యభరితంగా ఉంటుందో అంత భౌగోళిక వైవిధ్యమూ జిల్లాలో కనిపిస్తుంది. ప్రకృతి సౌందర్యంతో రాష్ట్రంలోనే ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ ప్రాంతంలో జుయాంగ్, భుయాన్లు అనే ఆదిమ వాసులు నివసించారని భావిస్తున్నారు. జుయాన్లు తమకుతాము ప్రపంచంలో అతిప్రాచీన ఆదిమవాసి తెగగా భావిస్తున్నారు. వారు ఇప్పుడు ఆధునిక జీవనవిధానాలను అనుసరిస్తున్నా వారిలో ఇంకా పలు ఆదిమజీవితాచారాలు వాడుకలో ఉన్నాయి. 1948 జనవరి 1 న రాజాస్థానాలు భారతదేశంలో విలీనం చేయబడిన తరువాత కెయోంజహర్ పట్టణం కేంద్రంగా కెయాంజహర్ ఒడిషాలో ఒక జిల్లాగా అవతరించింది. తరువాతి కాలంలో ఈ జిల్లాకు కెందుజహర్ అని పేరు మార్చబడింది.

కెయోన్‌జహర్

[మార్చు]

కెయోన్‌జహర్ ఒడిషా రాష్ట్రంతో విలీనం చేయబడక ముందు రాజాస్థానంగా ఉండేది. రాజాస్థానం ఆరంభకాల చరిత్ర స్పష్టంగా లభించడంలేదు. ఇది పురాతన కీజ్జింగ్ కోటను రాజధానిగా చేసుకున్న కిజ్జిక్ంగ భూభాగంలో భాగంగా ఉండేదని భావిస్తున్నారు. 12వ శతాబ్ధానికి చెందిన జ్యోతిభంజలో ఒక రాజాస్థానంగా ఉండేది. అప్పుడు కెయోంఝర్ రాజాస్థానంలో ప్రస్తుత కెందుజహర్ జిల్లాలోని ఉత్తర ప్రాంతం మాత్రమే ఉండేది. 15వ శతాబ్దంలో రాజా గోవింద్‌ భంజ మిగిలిన కెందుజహర్ ప్రాంత దక్షిణ భూభాగం కూడా ఆక్రమించబడింది. తరువాత ఉత్తరంలో సింగ్‌భూమ్, దక్షిణంలో కటక్ జిల్లాలోని సుకిందా జమీందారి, తూర్పులో మయూర్భంజ్‌లో కొంతభూభాగం, బొనై, పల్లహర, అంగూల్ సరిహద్దుల వరకు రాజ్యం విస్తరించబడింది. ప్రతాప్ బలభద్రభంజ (1764-1792) టిలో, జుఝ్పద కాంతఝరి జమీందార్ నుండి కొనుగోలు చేసి రాజ్యంలో కలుపబడింది. 1804లో ఈస్టిండియా కంపనీ రాజా జనార్ధన్ భంజ్‌కు మంజూరు చేసిన కెయాంఝర్ భూభాగంలో ఇవి భాగం అయ్యాయి. తరువాత ఈ ప్రాంతం ఒడిషా భూభాగంలో విలీనం చేసేవరకు భాభాగపరమైన మార్పులు ఏమీ జరగలేదు. విలీనం తరువాత పరిపాలనా సౌలభ్యం కొరకు టిలో (7.51 చ.కి.మీ), జుఝ్పద (9.06 చ.కి.మీ) భూభాగాలు వరుసగా బలేశ్వర్, కటక్ జిల్లాలలో మార్చబడ్డాయి. అదే సమయం బాలాసోర్ అంబో గ్రూఫ్ అనబడే పలు గ్రామాలు (14.84 చ.కి.మీ) కెయాంఝర్ జిల్లాకు మార్చబడ్డాయి.

కెందుఝార్ భూభాగాన్ని పాలించిన రాజుల కాలానుగత జాబితా :-

  • శ్రీ జగన్నాథ భంజ (1688-1700)
  • శ్రీ రఘునాథ్ భంజ (1700-1719)
  • శ్రీ గోపీనాథ్ భంజ (1719-1736)
  • శ్రీ నరసింఘ నారాయణ్ భంజ (1736-1757)
  • శ్రీ ఢనెష్వర్ నారాయణ్ భంజ (1757-1758)
  • శ్రీ ఝగతెష్వర్ నారాయణ్ భంజ (758-1762)
  • శ్రీ ప్రతాప్ బలభద్ర భంజ (1764-1792 / 1762-1797)
  • శ్రీ జనార్దన్ భంజ (1794-1825 / 1797-1832) ఒ
  • శ్రీ ఘదధర్ నారాయణ్ భంజ దేవ్ (1825-1861 / 1832-1861)
  • శ్రీ ఢనుర్జయ్ నారాయణ్ భంజ దేవ్ (1861-1905)
  • శ్రీ గోపీనాథ్ నారాయణ్ భంజ దేవ్ (1905-1926)
  • శ్రీ బలభద్ర నారాయణ్ భంజ దేవ్ (1926-1948)

కెందుజహర్ జిల్లా ప్రస్తుతం రెడ్‌కార్పెట్‌లో భాగంగా ఉంది.[1]

భౌగోళికం

[మార్చు]

కెందుజహర్ భూ అంతర్గత జిల్లా, వైశాల్యం 8240 చ.కి.మీ. ఇది ఒడిషా ఉత్తర ప్రాంతంలో ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న సింగ్‌భుం జిల్లా, దక్షిణ సరిహద్దులో జాజ్‌పూర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో ధేన్‌కనల్, సుందర్‌గఢ్ జిల్లా, తూర్పు సరిహద్దులో భద్రక్ జిల్లా ఉన్నాయి.

పర్వతాలు

[మార్చు]

జాతీయరహదారి - 215 కెందుజహర్ జిల్లాను దాదాపు రెండు భాగాలుగా చేస్తూ జిల్లా మధ్య నుండి పయనిస్తుంది. ఈ రహదారి తూర్పున ఆనందపూర్ మైదానాలు, సాదర్ ఉపవిభాగంలో కొంత భాగం ఉన్నాయి. పశ్చిమంలో గంభీరమైన పర్వతావళి ఉంది. ఈ కొండల వరుసలో గంధమర్ధన్ (3477 అడుగులు), మంకద్నచ (3639 అడుగులు), గొనశిఖ (3219 అడుగులు), తకురాని (3003 అడుగులు) మొదలైన ఒడిషా రాష్ట్రంలోని ఎత్తైన శిఖరాలు ఉన్నాయి. జిల్లాలో సగభాగం (4043) చ.కి.మీ ప్రాంతం " నార్తన్ ట్రాపికల్ డెసిడ్యుఎస్ టైప్ " అరణ్యం విస్తరించి ఉంది. ఇందులో రాబస్టా, అసన్, పియాసల్ మొదలైన చెట్లు ఉంటాయి.

నదులు, ఖనిజాలు

[మార్చు]

బైతరిణీనది గోనసిక కొండలలో జన్మించి ఉత్తరానికి ప్రవహించి జార్ఖండ్ రాష్ట్రంలోని సింఘ్భుం జిల్లా సరిహద్దులను తాకుతుంది. తరువాత తూర్పుకు ప్రవహించి ఆనందపూర్ ఉపవిభాగంలోకి ప్రవేశించి భద్రక్ జిల్లాను చేరుకుంటుంది. జిల్లా అంతటా ఎర్రమట్టి ఉంటుంది. దక్షిణంలో స్వల్పంగా కొంతభూభాగం నల్లరేగడి మట్టి ఉంటుంది. జిల్లాలో ఇనుము, మాంగనీస్, క్రోమియం వంటి ప్రధాన్యత కలిగిన ఖనిజాలు విస్తారంగా లభిస్తున్నాయి.[2] కెందుజహర్ జిల్లాలో అసన్‌పాట్ వద్ద 100కి.మీ వైశాల్యంలో అతిపురాతనమైన రాళ్ళు ఉన్నాయి. వీటి వయసు దాదాపు 38,000 సంవత్సరాలు ఉంటుంది. జిల్లాలో రాష్ట్రంలోనే అతిపురాతనమైన శిలాశాసనాలు కనిపెట్టబడ్డాయి. భౌగోళిక శాస్త్రం అనుసరించి ఇవి గుప్తసామ్రాజ్యానికి చెందినవని భావిస్తున్నారు. 5వ శతాబ్ధానికి చెందిన రావణా కేవ్‌షెల్టర్‌లో ఫ్రెస్కో పెయింటింగ్స్ ఉన్నాయి. కెందుజహర్ జిల్లా ఖనిజవనరులతో సంపన్నమై ఉంది. ఇనుము, మాగనీస్, క్రోమియం నిలువలు విస్తారంగా ఉన్నాయి. జిల్లాలో 30% భూమి దట్టమైన అరణ్యాలతో నిండి ఉంది. జిల్లాలో విస్తారంగా ఖనిజాలు, అరణ్యాలు ఉన్నా జిల్లా ఇంకా వెనుకబడిన జిల్లాల జాబితాలో ఉంది.

నైసర్గికం

[మార్చు]

జిల్లా ఉత్తర దక్షిణాలుగా 145కి.మీ పొడవు ఉంటుంది. తూర్పు, పడమర వెడల్పు 65కి.మీ ఉంటుంది. ఇది రెండు విభిన్న భూభాగాలు కలిగి ఉంటుంది. దిగువ కెందుజహర్, ఎగువ కెందుజహర్. దిగువ భూభాగంలో లోయలు, దిగువ భూములు ఉంటాయి. ఎగువ భూభాగంలో పర్వతాలు ఎగువభూములు ఉంటాయి. పరవతాలు సాధారణంగా ఉత్తరం నుండి దక్షిణానికి ఏటవాలుగా ఉంటాయి. ఎగువభూములలో కఠిన శిలలు ఉంటాయి. ఇక్కడి నువసించే వారికి ఇవి కొంచం అసౌకర్యం కలిగిస్తుంటాయి. దిగువభూభాగంలో ఉండే పర్వతాలు నిటారుగా లేక శిఖరాలుగా ఉంటాయి. అయినప్పటికీ వీటిలో అత్యధికంగా చదునైన మైదానాలు ఉంటాయి. ఇక్కడ పసరిక కలిగిన మేత భూములు, వ్యవసాయభూములు ఉన్నాయి. మైదానాలో కొన్ని చోట్ల విడివిడిగా కొండలు దాదాపు 500 మీ ఎత్తున ఉన్నాయి. జ్జిల్లా సముద్రమట్టానికి 600మీ ఎత్తున ఉంది. ఇక్కడ కొన్ని నదులకు వాటర్ షెడ్లు ఉన్నాయి.జిల్లా వాయవ్య దిశ నుండి బైతరణీ నది ప్రవహిస్తుంది. సహజసిద్ధమైన ఈ రెండు విభాగాల మధ్యన జాతీయరహదారి (చైబాస నుండి జాజ్‌పూర్ ) పయనిస్తుంది..

వాతావరణం

[మార్చు]

జిల్లా వాతావరణం అత్యధిక తేమతో కూడిన వేసవి. మార్చి నుండి వేసవి ఆరంభం ఔతుంది. మే మాసంలో ఉష్ణోగ్రత గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 38.2 ° సెల్షియస్ ఉంటుంది. జూన్ మాసం నుండి వర్షాలు ఆరంభం ఔతాయి. అక్టోబరు వరకు వర్షపాతం కొనసాగుతుంది. డిసెంబరు మాసానికి ఉష్ణోగ్రత 11.7 డిగ్రీల సెల్షియస్‌కు చేరుకుంటుంది. కొన్ని సమయాలలో ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్షియస్‌కు పతనం ఔతుంది. వార్షిక వర్షపాతం 1534.5 మి.మీ.

ఆర్ధికం

[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో కెందుజహర్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[3] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఒడిషా రాష్ట్రజిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3]

సహజ వనరులు, సంబంధిత పరిశ్రమలు

[మార్చు]

కెందుజహర్ జిల్లా ఖనిజ సంపద అధికంగా ఉంది. జిల్లాలో విస్తారంగా ఇరన్, మాంగనీస్, క్రోమియం గనులు ఉన్నాయి. జిల్లాభూభాగంలో 30% దట్టమైన అరణ్యాలతో నిండి ఉంది. జిల్లాలో విస్తారంగా ఖనిజ వనరులు, అటవీ సంపద ఉన్నప్పటికీ జిల్లా వెనుకబడి ఉంది. ఒడిషాలో రాష్ట్రంలో ఖనిజాలు అధికంగా ఉత్పత్తి చేయబడుతున్న జిల్లాలలో కెందుజహర్ ఒకటి. ఒడిషా మినరల్ రంగంలో కెందుజహర్ ప్రధానపాత్ర వహిస్తుంది. జిల్లాలో అత్యధికభాగం ఇనుప గనులు ఆక్రమించి ఉన్నాయి. ఈ గనులు ఉత్తరంగా జార్ఖండ్ సరిహద్దు, దక్షిణంగా జాజ్‌పూర్ సరిహద్దు వరకు విస్తరించి ఉన్నాయి. జిల్లాలో తకురాని, తూర్పు కొండలలోని బరండిలలో విస్తారంగా మాంగనీస్ నిలువలు ఉన్నాయి. ఆనందపూర్ ఉపవిభాగంలో ఉన్న నౌషాహి గ్రామం వద్ద ఉన్న బౌలా ప్రాంతంలో ఉన్న క్రోమైట్ నిలువలు ఉన్నాయి. జిల్లాలో అదనంగా ఇతర ఖనిజ నిలువలు ఉన్నాయి. జిల్లాలో క్వార్టైజ్, బాక్సైట్, బంగారం, ఫిరోఫిలైట్, లైస్టోన్ నిలువకు కూడా ఉన్నాయి. జిల్లాలో " కళింగ ఇరన్ వర్క్స్ ", (బర్బిల్), " ది ఫెర్రో - మాంగనీస్ ప్లాంట్ " (జోడా) వంటి ఖనిజ ఆధారిత పరిశ్రమలు ఉన్నాయి.

కళింగ ఐరన్ వర్క్స్

[మార్చు]

" కళింగ ఐరన్ వర్క్స్ " తరువాత కళింగ ఇండస్‌ట్రీస్ " గా పేరు మార్పిడి చేయబడింది.

ఫెర్రో మాంగనీస్

[మార్చు]

1957 డిసెంబర్‌లో జోడా వద్ద ఉన్న " ఫెర్రో - మాంగనీస్ " ప్లాంట్‌ను టాటా ఇరన్ అండ్ స్టీల్ కొ-లిమిటెడ్ " కంపనీ స్వంతం చేసుకుంది. 1985లో 300 మిలియన్ల ప్రణాళికతో ఇది విస్తరించబడింది. ప్రస్తుతం ఈ యూనిట్‌లో 391 మంది పనిచేస్తున్నారు. ఈ ప్లాంట్ శాశ్వతంగా టిస్కో కమపనీకి ఫెర్రో- మాంగనీస్ ఉత్పత్తి కొరకు పనిచేస్తుంది.

కింద మద్య తరహా, చిన్న తరహా పరిశ్రమల జాబితా ఉంది :

పరిశ్రమ పేరు ప్రాంతం పెట్టుబడి ఉపాధి సామర్ధ్యం ఉత్పత్తి
ఎమ్/ఎస్ స్పన్ పైప్ ప్లాంట్ మత్కంబెడా, బార్బిల్ 3,00,090 391 సి.ఐ పైప్
ఎమ్/ఎస్ ఒడిషా స్పాంజ్ ఐరన్ లిమిటెడ్ పలస్పంగ 3,22,200 383 స్పాంజ్ ఐరన్
ఎం/ఎస్ డ్యూటీ ఇండస్ట్రియల్ బార్బిల్ ప్రాజెక్ట్స్ (పి) లిమిటెడ్ Barbil 23,892 27 లిక్విడ్ ఆక్సిజన్
ఎం.ఎస్. ఆర్డెంట్ స్టీల్ లిమిటెడ్ కెంజుహర్ 45,000 250 పెల్లెట్ ఇండస్ట్రీస్

ఐ.పి.ఐ. టాటా, బైలెయిపద

[మార్చు]

ఐరన్ అండ్ స్టీల్ కంపనీ ఇండస్ట్రియల్ ప్రమోషన్, ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఆఫ్ ఒడిషా లిమిటెడ్ సహకారంతో బైలెయిపద వద్ద ఐ.పి.ఐ. టాటా పేరుతో స్పాంజ్ ఐరన్ కంపనీ స్థాపినడానికి ప్రణాళికలు చేస్తున్నారు. 35 కోట్ల ప్రాథమిక పెట్టుబడితో ఆరంభించనున్న ఈ సంస్థ దాదాపు 375 మందికి ఉపాధి కల్పిస్తుంది.

చార్జ్ క్రోం: బ్రహ్మణిపాల్

[మార్చు]

బ్రహ్మణిపాల్ వద్ద చార్జ్ క్రోం ఫ్యాక్టరీ ప్రారంభించబడింది. ఫ్యాక్టరీ కొరకు 412 కోట్లు పెట్టుబడి పెట్టబడింది. ఈ సంస్థ 400 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఖనిజ సంబంధిత బృహత్తర పరిశ్రమల స్థాపన కారణంగా కెందుజహర్, బార్బిల్, జోడాలలో చిన్నతరహ పరిశ్రమల అభివృద్ధికి మార్గం సుగమం చేసింది.

ఇంజనీరింగ్, మెటల్ ఆధారిత పరిశ్రమలు

[మార్చు]

జిల్లాలో 2,356 మిలియన్ల పెట్టుబడితో స్థాపించబడిన 53 చిన్నతరహా పరిశ్రమలు 274 మందికి ఉపాధి కల్పిస్తుంది.

  • ఉత్పత్తులు - ఆటోమొబైల్స్ స్పేర్ పార్ట్స్, ఫ్యాబ్రికన్ వర్క్స్ (స్టీల్ ఫర్నీచర్స్), అల్మిరాహ్, ట్రంక్స్, బాక్సులు, గ్రిల్స్, స్టీల్ మెటల్ ఉత్పత్తులు.

కెమికల్, అల్లాయ్డ్

[మార్చు]

48 పరిశ్రమలు అధికంగా కెందుజహర్, బార్బిల్, ఘసిపుర వద్ద స్థాపినచబడ్డాయి. 3079 మిలియన్ల పెట్టుబడితో స్థాపినబడిన ఈ పరిశ్రమలు 268 మంది ఉపాధి సౌకర్యం లభిస్తుంది.

  • ఉత్పత్తులు: అగర్బత్తి, మైనపు వత్తులు, బోర్ మెటల్, బ్యాటరీ ప్లేట్లు, లైం పౌడర్, వాషింగ్ పౌడర్, సోప్, స్ప్రై పెయింట్స్.

వ్యవసాయ - సముద్ర సంబంధిత పరిశ్రమలు

[మార్చు]

వ్యవసాయ - సముద్ర సంబంధిత పరిశ్రమలు కెయోంఝర్, ఝుంపురా, తెరా, ఎరెండై, సరకొల్ల. జిల్లాలో ఉన్న 242 పరిశ్రమలు దాదాపు 893 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ పరిశ్రమలకు పెట్టుబడి 8,698 మిలియనులు.

  • ఉత్పత్తులు రైసు మిల్లులు, గోధుమ, నూనె గింజలు, బేకరీ ఉత్పత్తులు.
  • జిల్లాలో పలు చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి.
పరిశ్రమ పేరు పరిశ్రల సంఖ్య పెట్టుబడి సిబ్బంది సంఖ్య ఉత్పత్తులు
Textile based industries 119 in Keonjhar,Anandapur, Champua Investment- 4.722 million rupees Employees- 494 Readymade garments,Tassar &cotton cloths
Power loom industry 01 at Jagannathpur, Keonjhar Investment-39,000 Employees- 05 160,000 rupees per annum.
Wood and forest industries 142 in Keonjhar, Anandapur Investment- 3.891 million rupees Employees- 607 Furnitures
Bricks manufactures stone crushing and other allied industries 06 Keonjhar and Anandapur Investment- 250,000 rupees; Employees- 117 Bricks,stone chips
Live stock leather industries 16 in Patna, Madhapur, Sananeuli, Chemana Investment- 401,000 rupees Employees- 77 Shoes,Chappals
Servicing and miscellaneous Industry 246 in Keonjhar, Anandapur, Joda-Barbil Investment- 3.935 million rupees Employees- 749 Bidies, paperbag, body building of vehicles.
Glass and ceramic based industry 130 in Keonjhar, Anandapur, Joda-Barbil; Investment- 4.904 million rupees Employees- 1861 Glass and ceramic products.[4]

డివిజన్లు

[మార్చు]
  • శుబ్దివిసిఒన్స్- 03, 1 ఆనందపుర్, 2 ఛంపూ, 3 ఖెందుఝర్
  • తాలూకాలు- 8
  • భ్లొచ్క్స్- 13: ఆనందపుర్, భన్స్పల్,ఛంపూ, ఘసిపుర, ఘత్గవన్, హరిచందంపుర్,హతదిహి, ఝుంపుర, ఝొద, కియో, పాట్నా,,శహర్పద,టెల్కొయి.
  • రెవెన్యూ వలయాలు- 50
  • గ్రామ పంచాయతీలకు- 286
  • సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో - 06
  • పోలీస్ స్టేషన్స్- 20
  • టౌన్స్- 06
  • పురపాలకాలు- 04: 1 ఆనందపుర్, 2 భర్బిల్, 3 ఖెందుఝర్, 4 ఝొద
  • ణ్.ఆ.ఛ్- 01
  • నివాసితులుగా విల్లగెస్- 2135
  • అగ్ని స్టేషన్లు- 05
  • జిల్లా జైలులో / స్పెషల్ జైల్ - 01
  • సబ్ జైళ్లలో- 02
  • వ్యవసాయ జిల్లాలు - 03
  • ఐసీడీఎస్ ప్రాజెక్ట్స్ 14
  • ట్రెజరీ / శుబ్ట్రేసుర్య్- 07
  • హ్Q.హొస్పిటల్ / హొస్పితల్స్- 04
  • కమ్యూనిటీ హెల్త్ సెంటర్ / ఊఘ్ఫ్ఛ్- 13
  • పబ్లిక్ హెల్త్ సెంటర్ - 81
  • సబ్ సెంటర్ (ఆరోగ్యం) - 316

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,802,777.[5]
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 264వ స్థానంలో ఉంది..[5]
1చ.కి.మీ జనసాంద్రత. 217 [5]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 15.42%.[5]
స్త్రీ పురుష నిష్పత్తి. 917 [5]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 69%.[5]
జాతియ సరాసరి (72%) కంటే.

జిల్లాలో షెడ్యూల్డ్ తెగలు 44.5%, షెడ్యూల్డ్ కులాలు 11.62%, అక్షరాస్యత 69.00%.[6] జిల్లాలో 3 ఉపవిభాగాలు ఉన్నాయి: ఆనందపూర్, చంపుయా, 10 తాలూకాలు.

భాషలు

[మార్చు]

ఈ ప్రాంతంలో అధికంగా ఒరియా భాష వాడుకలో ఉంది. భుంజిలా భాషను దాదాపు 7000 మంది ఆదివాసీలు మాట్లాడుతున్నారు.[7]

తెగలు

[మార్చు]

కెందుజహర్‌లోని

విషయం సంఖ్య
1981లో షెడ్యూల్డ్ తెగల సంఖ్య 4,99,657
అక్షరాస్యత 15.25%
1991లో షెడ్యూల్డ్ తెగల సంఖ్య 5,95,184 ( 24.89% )
1981-1991జనసంఖ్య అభివృద్ధి 11.90%
షెడ్యూల్డ్ తెగల సంఖ్య 46

జిల్లాలో షెడ్యూల్డ్ సంతతికి చెందిన 16 తెగలు ఉన్నాయి : బథుది, భుయన్, భుమిజ్, గోండి ప్రజలు, హో ప్రజలు, జూంగ్ ప్రజలు, ఖర్వర్, కిసాన్ (ట్రైబ్), కోల్హా, కోల్ (ప్రజలు), కోరా (తెగ), ముండా (ప్రజలు), ఒరఒన్, సంతల్, సఒర, సబర్, సౌంతి. 16 తెగలకు ప్రజలు 96.12% ఉన్నారు. జుయాంగులు అతి పురాతన ఆదిమవాసులుగా భావించబడుతున్నారు. అయినప్పటికీ వీరు మిలినవారి కంటే ఆధినిక జీవన సరళిని అనుసరిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికీ ఆదిమవాసి ప్రజలు నివసిస్తున్నారు. షెడ్యూల్డ్ తెగలకు చెందిన ప్రజలు అధికంగా కెందుజహర్ జిల్లాలో అధికంగా నివసిస్తున్నారు. ఆనందపూర్ ఉపవిభాగంలో స్వల్పంగా నివసిస్తున్నారు. షెడ్యూల్డ్ తెగలలో అత్యధికులు వ్యవసాయం, గనులు, క్వరీయింగ్, ఇతర సేవల మీద ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు గిరిజన తెగల ప్రజల అలవాట్లలో పలు మార్పులు తీసుకువస్తుంది.[2]

సస్కృతి

[మార్చు]

సంస్కృతి, సాంఘిక సంస్థలు

[మార్చు]

జిల్లా గ్రంథాలయం

[మార్చు]

1977 నుండి కెయోంఝర్‌ జిల్లాలో జిల్లా గ్రంథాలయం ఆరంభం అయింది. ఇది జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఉన్న రెడ్‌క్రాస్ భవనంలోని ఒక గదిలో ఆరంభం అయింది. ఇక్కడ 10,870 గ్రంథాలు ఉన్నాయి. సాహిత్య అకాడమీ పుస్తకాలు ఇక్కడ విక్రయినచబడుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ 200 పుస్తకాలు విక్రయించబడుతున్నాయి. గ్రంథాలయం ఉదయం 11గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరచి ఉంటుంది. గ్రంథాలయ సిబ్బంధికి ఆదివారం పనిదినంగానూ సోమవారం శలవుదినంగానూ ఉంది.

జిల్లామ్యూజియం

[మార్చు]

జిల్లా మ్యూజియం పాతపట్టణంలో ఉన్న బలదేఏవ్‌జ్యూ ఆలయప్రాంగణంలో ఉంది. కెందుజహర్ మరొకశాఖ మ్యూజియం మయూర్భంజ్ జిల్లాలోని ఖిచింగ్ వద్ద ఉంది. ఇది కెందుజహర్ " డిస్ట్రిక్ కల్చరల్ ఆఫీస్ " ఆధ్వర్యంలో పనిచేస్తుంది. నిధుల కొరత కారణంగా రెండు మ్య్యూజియాలు నిర్లక్ష్యానికి గురైయ్యాయి. జిల్లా మ్యూజియం, మ్యూజియం శాఖా మ్యూజియాలలో పలు పురాతన వస్తువులు భద్రపరచబడి ఉన్నాయి.

పర్యాటకం

[మార్చు]

కెందుజహర్ జిల్లా కేంద్రంలో సజహసిద్ధ వాతావరణంలో విష్ణు ఆలయం, జగన్నాథ్ ఆలయం, సిద్ధాజగన్నాథ్ ఉపాలయాలు, సిద్ధా కాళి, పంచబటి వంటి ఆకర్షణలు ఉన్నాయి. కెందుజహర్ నుండి సీతాబింజి 30కి.మీ దూరంలో ఉంది. సీతా నది తీరంలో ఉన్న సీతాబింజి వద్ద ఉన్న గుహలో రావణ్ చాయా పేరుతో ప్రఖ్యాతి చెందిన ఫ్రెస్కో చిత్రాలు ఉన్నాయి. రిములి నుండి 8 కి.మీ దూరంలో జాతీయ రహదారి 215 మార్గంలో అదుర్ఖొల్ వాద సహజసిద్ధమైన శివలింగం, ఒక జలపాతం ఉన్నాయి.

పర్యాటక ఆకర్షణలు

[మార్చు]

కెందుజహర్ జిల్లా ఖనిజ సంపద ప్రకృతి సౌందర్యంతో అలరారుతూ ఉంటుంది. జిల్లాలో మతాలయాలు, ఫ్రెస్కో పెయింటిగ్స్, జలపాతాలు, ప్రకృతి అందాలతో నిండిన వైవిధ్యమైన పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. కొండలలో ఎత్తైన ప్రదేశాలలో కనిపిస్తున్న గ్రామాలు, కిలకిలారావం చేస్తున్న పక్షులు ఈ ప్రాంత సౌందర్యాన్ని మరింత ఇనుమడిప చేస్తుంటాయి. నిరాడంబరమైన గిరిజన ప్రజలు ఉత్సాహంగా జరుపుకునే ఉత్సవాలు పర్యాటకులను ఆకర్షించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంటాయి.

కెందుఝర్

[మార్చు]

కెందుజహర్ జిల్లా కేంద్రం విష్ణాలయం, ప్రకృతి సహజ వాతావరణంలో బలదేవ్ జ్యూ, సిద్ధా జగన్నాథ్, సిద్ధా కాళీ, పంచబటి వంటి ఉపాలయాలకు ప్రఖ్యాతి చెందింది. జిల్లాలో బసచేసి సమీప ప్రాంతాలను సందర్శించడానికి ఇది చాలా అనువైన ప్రదేశం. ఇక్కడ నుండి కొలకత్తా 354 కి.మీ, సంబలపూర్ 230 కి.మీ, టాటా 174 కి.మీ, రూర్కెలా 217 కి.మీ, భువనేశ్వర్ 235 కి.మీ దూరంలో ఉంది.

దస్త్రం:MaaTariniTemple.jpg

ఘాట్గావ్'

[మార్చు]

కెందుజహర్ నుండి కటక్ వెళ్ళే మార్గంలో జాతీయరహదారి 215 కి.మీ దూరంలో ఘట్గావ్ ఉంది. ఇక్కడ ఉన్న గ్రామదేవత మాతా తరిన్ రాష్ట్రమంతటా గుర్తింపును పొందింది.

సితాబింజి

[మార్చు]

సితాబింజి సీతా నదీతీరంలో ఉంది. ఇక్కడ ఉన్న రావణ్ చాయా పేరుతో ఉన్న ఫ్రెస్కో పెయింటిగ్స్ ఆన్ రాక్ షెల్టర్ ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చాయి. ఇది సగం తెరచి ఉన్న గొడుగులా ఉంటుంది. ఇది జైపోర్- కెందుజహర్ రహదారిలో జిల్లాకేంద్రానికి 30 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడికి 5కి.మీ దూరంలో కత్రబెడా ఉంది.

బదఘగర జలపాతం

[మార్చు]

బదఘగర జలపాతం జాతీయరహదారి 6 మార్గంలో కెందుజహర్‌కు 9 కి.మీ దూరంలో ఉంది. ఈ జలపాతం 200 అడుగుల ఎత్తున ఉంది. కెందుజహర్ జిల్లాలో ఇది మనోహరమైన విహారకేంద్రంగా ఉంది.

Badaghagara Waterfall, Kendujhar

సనఘగర జలపాతం

[మార్చు]

సనఘగర జలపాతం కెందుజహర్ నుండి 6 కి.మీ దూరంలో జాతీయరహదారి 6 లో ఉంది. జలపాతం ఎత్తు 100 అడుగులు. ఈ ప్రాంతం విస్తీర్ణం 488 హెక్టార్లు. ఇక్కడ ఆకురాల్చే, ఇతర వృక్షాలతో కూడిన వృక్షాలు ఉన్నాయి. ప్రఖ్యాత సనఘగర జలపాతం నిరంతర జలప్రవాహం కలిగిన సెలఏరు నుండి జలాలు అందుకుంటుంది. ఈ ప్రాంతానికి ఈ జలపాత! సహసౌందర్యం తీసుకువస్తూ సంవత్సరమంతా పలువురు పర్యాటకులను ఆకర్షిస్తుంది. అసమానమైన కొండలతో కూడిన భూభాగం వి ఆకారంలో వంగిన లోయలు ఉన్నాయి. నిటారుగా ఉన్న కొండలతో నిండి ఉన్నాయి. జలపాతజలాలు మచ్చకందనా నలా ద్వారా బైతరణీ నదిలో సంగమిస్తున్నాయి.

Sanaghagara Waterfall in the Rainy Season, Kendujhar

ఝదేశ్వర్ ఆలయం

[మార్చు]

ఝదేశ్వర్ ఆలయం ప్రధానదైవం శివుడు. ఈ ఆలయం బైతరణీ నదీతీరంలో ఘసిపురా వద్ద ఉంది. మార్చి మాసంలో ఇక్కడ ప్రఖ్యాతమైన " బారుణి యాత్రా " ఉత్సవం నిర్వహించబడుతుంది.

దేవ్గావ్ కుషలేశ్వర్

[మార్చు]

దేవ్గావ్ కుషలేశ్వర్ ఆలయం ఆనందపూర్ వద్ద కుసెలి నదీతీరంలో ఉన్నాయి. కుషలేశ్వర్ ఆలయం కీ.పూ 900 లలో నిర్మించబడింది. ఇది ప్రముఖ యాత్రాస్థలంగా గుర్తించబడుతుంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో బౌద్ధమతం ప్రాబల్యం కలిగి ఉంది. ఇప్పటికీ ఇక్కడ " అబలోకితేశ్వర్ " పేరిట 5 అడుగుల బుద్ధుని శిల్పం ఉంది. ఇక్కడ పలు బుద్ధమతానికి చెందిన అవశేషాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న నదీతీరంలో ఉన్న రాతిగోడ కూడా ప్రత్యేకత కలిగి ఉంది. ఇలాంటి రాతి నిర్మాణం రాష్ట్రంలో ఇది రెండవది అని భావిస్తున్నారు.

హదగర్

[మార్చు]

హదగర్ వద్ద ఎత్తైన కొండల మద్య నుండి ప్రవహిస్తున్న సలంది నదికి ఆనకట్ట నిర్మించబడింది. జిల్లా కేంద్రం నుండి ఇది 119 కి.మీ దూరంలో, ఆనందపూర్ నుండి 35 కి.మీ దూరంలో ఉంది. ఆ భద్రక్, ఆనందపూర్ నుండి ఈ ప్రాంతానికి సులువుగా చేరుకోవచ్చు.

గొనసిక

[మార్చు]

గొనసిక పలు లోయలు, అరణ్యాలతో కూడిన కొండమద్య ఉన్న అందమైన ప్రదేశం. ఇక్కడ ఉన్న బ్రహ్మేశ్వర్ ఆలయం కారణంగా ఈ ప్రాంతం ప్రఖ్యాత యాత్రీక ప్రదేశంగా ఉంది. శివాలయం బైతరణీ నదీ తీరంలో ఉంది. బైతరణీ నది జన్మస్థలం కూడా ఇదే. నది కొంతదూరం ప్రవహించిన తరువాత నది కొండల కిందుగా ప్రవహిస్తుంది. ఇక్కడ నదిని గుప్తగంగ అని పిలుస్తారు. కొంతదూరం ప్రవహిచిన తరువాత నది గోవు ముఖాకారంలో శిలనుండి వెలుపలకు ప్రవహిస్తుంది. ఈ ప్రాంతం సౌందర్యం చూపరులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇది కెందుజహర్ నుండి 33 కి.మీ దూరంలో ఉంది. కెందుజహర్ నుండి 24 కి.మీ దూరం సాధారణ బసు ప్రయాణం చేసి చేరుకోవచ్చు. 9 కి.మీ దూరం పర్యాటకులు నడక ద్వారాగాని వాహనాల ద్వారాగాని చేరుకోవచ్చు. పర్యాటకులు కెందుజహర్‌లో బసచేసి ఇక్కడకు చేరుకోవచ్చు.

మురుగ మహాదేవ్

[మార్చు]

మురుగ మహాదేవ్ ఆలయం చంపుయా ఉపవిభాగంలోని తకురాని కొండల మద్య ప్రవహిస్తున్న నిరంతర జలప్రవాహం కలిగిన శెలయేరు సమీపంలో ఉంది. ఇది కెందుజహర్ నుండి 70కి.మీ దూరంలో ఉంది. కెందుజహర్ నుండి 64 కి.మీ దూరంలో ఉన్న బిలైపద వరకు బదులో చేరుకోవచ్చు. ఇక్కడ బసచేయడానికి సౌకర్యం లేదు. కెందుజహర్‌లో కాని ఇక్కడికి 11 కి.మీ దూరంలో ఉన్న జొడ వద్ద కాని పర్యాటకులు బస చేయవచ్చు.

అసూర్ఖోల్

[మార్చు]

అసూర్ఖోల్ వద్ద సహజమైన శివలింగం, జలపాతం ఉన్నాయి.ఇది రిములి నుండి 8 కి.మీ దూరంలో ఉంది. ఇది జాతీయరహదారి -215 మార్గంలో ఉంది.

హందిభంగ

[మార్చు]

హందిభంగ అద్భుతమైన జలపాతం. జలపాతం ఎత్తు 200 అడుగులు. అందమైన ప్రకృతిదృశ్యాలు దట్టమైన అరణ్యం మద్య ఉన్న ఈ జలపాతం పలువురు పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడి నుండి 50 కి.మీ దూరంలో కెందుజహర్ ఉంది. కెందుజహర్ నుండి 45 కి.మీ దూరంలో ఉన్న కాలిమతికి సర్వీసు బసుద్వారా చేరుకుని అక్కడి నుండి 5 కి.మీ దూరం ఇతర వాహన సదుపాయాలు వెతకాలి. పర్యాటకులు బసచేయడానికి కెందుజహర్ (50), జోడా (30), బార్బిల్ (42) లలో బదచేయవచ్చు.

గిండిచఘగి జలపాతం

[మార్చు]

గిండిచఘగి జలపాతం ప్రబలమైన అద్భుతమైన చిన్న జలపాతం. ఇది 50 అడుగుల ఎత్తున ఉంది. ఇది ముదల నదిమీద దట్టమైన అరణ్యాల మద్య ఉంది. శీతాకాలంలో ఇది మంచి విహారకేంద్రంగా ఉంటుంది. ఇది కెందుజహర్ నుండి 65కి.మీ దూరంలో ఉంది. ఇక్కడికి 5 కి.మీ దూరంలో ఉన్న హరిచందనపూర్ వద్ద పర్యాటకులు బసచేయడానికి వసతి ఉంది. ఘటగావ్ వద్ద తరిని యాత్రానివాస్, పర్యాటకం డిపార్ట్మెంటు వారి పాంతశాల ఉన్నాయి.

కందధర్

[మార్చు]

కందధర్ ఒక ఆకర్షణీయమైన జలపాతం. జలపాతం ఎత్తు 500 అడుగులు. పచ్చని అడవుల మద్య ఉన్న ఈ జలపాత స్నానం చక్కటి అనుభూతిని ఇస్తుంది. ఇది పొగలాగా కనిపిస్తుంది కనుక దీనిని స్మోకింగ్ వాటర్ ఫాల్ అంటారు. ఇది విహారానికి అనువైనది. కెందుజహర్ నుండి 60 కి.మీ దూరంలో ఉన్న ఈ ప్రదేశానికి 40 కి.మీ దూరం బసు ప్రయాణంలో చేరుకుని తరువాత జీప్ ద్వారా చేరుకోవచ్చు.

రాజనగర్

[మార్చు]

రాజనగర్ ఇది కెందుజహర్ రాజు శిథిలమైన ప్రదేశం. ఇక్కడ రఘునాథ్ జా మాథా దభిబబన్, చడై కుదూర్ ఆలయాలు ఉన్నాయి. ఇక్కడకు వివిధ ప్రాంతాల నుండి వివిధ పక్షులు వస్తుంటాయి. ఇది కెందుజహర్ నుండి 27 కి.మీ దూరంలో ఉంది. పర్యాటకులు ఇక్కడకు బాడుగ వాహనాల ద్వారా చేరుకోవచ్చు.

కంజిపాణి

[మార్చు]

కంజిపాణి కెందుజహర్ నుండి 30కి.మీ దూరంలో ఉంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు 0 డిగ్రీలకు చేరుకుంటుంది. ఇక్కడ ఆసమయంలో మంచుకురుస్తుందని భావిస్తున్నారు. అందమైన ప్రకృతి దృశ్యాలు, పచ్చని పసరిక బయళ్ళు, వన్యమృగాలు ఉన్న ఈ ప్రదేశం పర్యాటకులను చక్కటి అనుభూతిని ఇస్తుంది. ఇక్కడికి కెందుజహర్, పల్లహర నుండి దినసరి బసు సర్వీసు లభిస్తుంది.

పొడసింగిడి

[మార్చు]

పొడసింగిడి వద్ద గడచండి, చక్రతీర్ధా ఉన్నాయి.

గడచండి

[మార్చు]

గడచండి వద్ద ప్రబల చండీ ఆలయం ఉంది. ఆనందపూర్ లోని బౌలా పర్వతాలలో జిరంతరంగా ప్రవహించే శెలయేరు ఉంది. ఇక్కడ కొండ మీద ఒక గుహ ఉంది.

చక్రతీర్ధ

[మార్చు]

చక్రతీర్ధ చక్కని విహారకేంద్రం. ఇక్కడ పచ్చని అరణ్యం, అందమైన జలపాతం, శివాలయం ఉన్నాయి. ఈ జలపాతం నిరంతరంగా ప్రవహిస్తుంది. ఇక్కడ ఆలయాన్ని సన్యాసి బాబా నిర్వహిస్తుంటాడు. ఇక్కడ ఒక అందమైన తోట ఉంది. తోటలో బాబా పెంచిన నిమ్మ, బొప్పాయి, అరటి, స్ట్రాబెర్రీ పండ్లచెట్లు ఉన్నాయి. కెందుజహర్ నుండి ఇది 97 కి.మీ దూరంలో ఉంది.

భీమకుండ్

[మార్చు]

భీమకుండ్ బైతరణీ నదిలోని సహజసిద్ధమైన అందమైన సరోవరం. ఇది కెందుజహర్, మయూర్భంజ్ సరిహద్దులో ఉంది. ఇది కెందుజహర్ నుండి 100 కి.మీ దూరంలో ఉంది. ఈ సరోవరం ఒకదాని పైన ఒకటిగా నుండి రెండు జలపాతాలు ప్రవహిస్తున్నాయి. వీటిలో ఒకటి భీమ రెండవది పాండవ. పాండవులు ఇక్కడ స్నానం చేసారు కనుక వీటికీ పేరు వచ్చిందని భావిస్తున్నారు.

.

వృక్షజాలం, జంతుజాలం

[మార్చు]

అరణ్యం

[మార్చు]

కెందుజహర్‌లో విభాగాలను అనుసరించి అరణ్యాల వర్గీకరణ.

వర్గీకరణ వైశాల్యం
అభయారణ్యం 18,33.02
డెమార్క్డ్ సురక్షిత అరణ్యం 6,48.41
అండిమార్క్డ్ అరణ్యం 43.41
అంరిజర్వ్డ్ అరణ్యం 0.24
టోటల్ 25,25.08

జిల్లాలో మొత్తంగా 30% భూభాగంలో అరణ్యం ఉంది. జిల్లాలోని అభ్యారణ్యాలలో ఇరుకైన లోయలు, నిటారైన పర్వతాలు ఉన్నాయి. సాలవృక్షాలు అధికంగా ఉన్న వెడల్పని లోయలను అభయారణ్యంలో చేర్చలేదు..

  • డ్రై వుడ్ అరణ్యం : ఇది బౌలలో కొంత భాగం, అటెయీ, కలపత్, సంతోష్‌పూర్, బరబ్యాంక్.
  • ఓపెన్ గ్రాసీ డ్రై " షోరియా రోబస్టా " అరణ్యం:- ఇది కొండచరియలో మట్టి వ్యవసాయానికి అనుకూలంగా లేక పలుచని పొరగా ఉన్న ప్రదేశాలలో ఇది అధికంగా ఉంటుంది.
  • హైలెవల్ ప్లాట్యూ సాల్:- చదునైన లోయలలో ఈ రకమైన అరణ్యం ఉంటుంది. ఇది కెయాంఝర్ ప్రత్యేకత.
  • మాయిస్ట్ హిల్ సాల్  :- కెయోంఝర్‌లోని సిద్ధమఠ్, కరో మండలాలలో ఈ తరహా అరణ్యాలు ఉంటాయి.
  • వెల్లీ సాల్ ఇది సిద్ధమఠ్, కరో మండలాలలో ఈ తరహా అరణ్యాలు ఉంటాయి.
  • శాంతల్ సాల్ సాధారణంగా తీరప్రాంత సాల్‌ను శాంతల్ సాల్ అంటారు. ఇది అధికంగా బౌల, సంతోష్‌పుర్ మండలాలలో ఉంది. ఈ సాలవేక్షాలు అధికంగా అసన్, కురం జాతికి చెందినవి.

వన్యమృగాలు

[మార్చు]
  • పులులు:- పులులు రెబన, కలపత్ మండలాలలో ఉన్నాయి. పూలుల సంఖ్య మాత్రం కచ్చితంగా తెలియలేదు.
  • చిరుత పులులు :- కలరపత్ర బఘ సంతోష్‌పుర్, అటెయి, కలపత్, రెబన, బరబంక అభయారణ్యాలలో కనిపిస్తుంటాయి. అరణ్యానికి సమీపంలో పలు గ్రామాలు ఉన్నందున గ్రామస్థులు

తమ నివాసలోని పెంపుడు జంతువులను చంపుతున్నాయని తరచుగా ఫిర్యాదు చేస్తుంటారు.

  • ఏనుగులు :- ఏనుగులు తరచుగా చిన్న మందలుగా తిరుగుతుంటాయి. ఇవి బౌల, కలపత్, రెబన, అతెయి, ఒక్కోసారి సిద్ధమఠ, కరో అభయారణ్యాలలో కనిపిస్తుంటాయి.

ఏనుగు మందలు తరచుగా ప్రదేశం విడిచి వేరొక ప్రదేశానికి తరలి పోతుంటాయి. అయినప్పటికీ బౌలా, అటెయి, రెబనా, కలపత్‌లలో తరచుగా కనిపిస్తుంటాయి. ఏనుగులు తరచుగా సమీప గ్రామాలలో ఉన్న గ్రాస్థుల పంటలను ధ్వంసం చేయడం, గునులున్న ప్రదేశంలో ఆందోళన రేకెత్తించడం, అరణ్యపు అంచులలో ఉన్న గ్రాస్థుల గృహాలను ధ్వంసం చేయడం వంటి సమస్యలను సృష్టిస్తుంటాయి.

  • బర్రెలు (గయల) :- గయాల్ మందలు కలపత్, రెబనా అభయారణ్యాలలో కనిపిస్తుంటాయి. బర్రెల మందలు తరచుగా ధేన్‌కనల్ సమీపంలో ఉన్న గ్రామాలలో కనిపిస్తుంటాయి.
  • సంబర :- కొండలలోని అరణ్యాలలో, కలపత్ రెబనా అభయారణ్యాలలో తరచుగా సంబారాలు కనిపిస్తుంటాయి. చుక్కల జింకలు (హరిణాలు), బార్కింగ్ జింకలు (కుర్తా) మరుయు అడవి పందులు (బర్హా)లు జిల్లా అంతటా కనిపిస్తుంటాయి.
  • కోతులు (హను, పతి) :- పెరిఫెరీ లోని లోయలలో ఉన్న అరణ్యాలలో కోతులు కనిపిస్తూ ఉంటాయి. అడవి కుక్కల వంటివి (బలియా కుకురా)!ఉన్నట్లు తెలియనప్పటికీ ఎలుగుబంట్లు (భలు) ఈ ప్రాంతంలో అధికంగా కనిపిస్తుంటాయి. ఎలుగుబంటు కొరకడం, ఇతర విపత్తులు వంటి ఫిర్యాదులు ఈ ప్రాంతంలో తరచుగా వినిపిస్తుంటాయి. సాధారణంగా ఎలుగుబంట్లు బ్రీడింగ్ సమయం, మహులా, మామిడి పండే మండు వేసవిలో ఎలుగుబంట్లు ప్రమాదకరంగా ప్రవర్తింస్తుంటాయి. [1]

రాజకీయాలు

[మార్చు]

అసెంబ్లీ నియోజకవర్గాలు

[మార్చు]

The following is the 6 Vidhan sabha constituencies[8][9] of Kendujhar district and the elected members[10] of that area

క్ర.సం నియోజకవర్గం రిజర్వేషను పరిధి 14 వ శాసనసభ సభ్యులు పార్టీ
20 తెల్కొయి షెడ్యూల్డ్ తెగలు హరిశ్చంద్రపూర్, తెల్కొయి, బంస్పాల్ (పార్ట్) ప్రేమానందా నాయక్ బి.జె.డి
21 ఘసిపుర లేదు ఘసిపురా, ఘటగయాన్, ఆనంద్పూర్ (భాగం) బద్రినారాయణ్ పత్రా బి.జె.డి
22 ఆనందపూర్ షెడ్యూల్డ్ కులాలు ఆనంద్పూర్ (ఎం),హతదిహి, ఆనంద్పూర్ (భాగం) భాగీరధీ సేథీ బి.జె.పి
23 పాట్నా షెడ్యూల్డ్ తెగలు పాట్నా, సహర్పద, ఝుంపురా (భాగం) , Champua (part) హృషీకేష్ నాయక్ బి.జె.డి
24 కెయాంఝర్ షెడ్యూల్డ్ తెగలు కెయాంఝర్ (ఎం), కెయాంఝర్, ఝుంపురా (భాగం) , Bansapal (Part) సుబర్న నాయక్ బి.జె.డి
25 చంపుయా లేదు జొడా (ఎం), బార్బిల్ (ఎం), జొడా, చంపుయా (భాగం) జితు పాట్నాయక్ స్వతంత్ర

మూలాలు

[మార్చు]
  1. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 11 December 2009. Archived from the original on 27 అక్టోబరు 2011. Retrieved 17 September 2011.
  2. 2.0 2.1 kendujhar.nic.in
  3. 3.0 3.1 Ministry of Panchayati Raj (8 September 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 5 ఏప్రిల్ 2012. Retrieved 27 September 2011.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2014-10-16.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 30 September 2011.
  6. http://www.censusindia.gov.in/2011-prov-results/data_files/orissa/Data%20Sheet-%20Orissa-Provisional.pdf
  7. M. Paul Lewis, ed. (2009). "Bhunjia: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 30 September 2011.
  8. Assembly Constituencies and their EXtent
  9. Seats of Odisha
  10. "List of Member in Fourteenth Assembly". ws.ori.nic.in. Archived from the original on 2 మే 2007. Retrieved 19 February 2013. MEMBER NAME

వెలుపలి లింకులు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]