Jump to content

కృష్ణ భగవాన్

వికీపీడియా నుండి
(కృష్ణభగవాన్‌ నుండి దారిమార్పు చెందింది)
కృష్ణ భగవాన్
జననం
మీనవల్లి పాపారావ్ చౌదరి

(1965-07-02) 1965 జూలై 2 (వయసు 59)
కైకవోలు,కాకినాడ జిల్లా]]
ఇతర పేర్లుకుట్ట
విద్యబి.కామ్
విద్యాసంస్థఅంబేద్కర్ కళాశాల, బాగ్ లింగంపల్లి, హైదరాబాదు
వృత్తినటుడు, రచయిత
క్రియాశీల సంవత్సరాలు1987 - ప్రస్తుతం
తల్లిదండ్రులుమీనవల్లి వీర్రాజు, లక్ష్మీకాంతం

కృష్ణ భగవాన్ తెలుగు చలనచిత్ర హాస్య నటుడు, రచయిత. ఇతని అసలు పేరు మీనవల్లి పాపారావు చౌదరి.[1] దర్శకుడు వంశీ తన మహర్షి చిత్రం ద్వారా ఈయనను తెలుగు చలన చిత్ర రంగానికి పరిచయం చేసాడు. జాన్ అప్పారావు 40 ప్లస్, మిస్టర్ గిరీశం (2009 )లాంటి చిత్రాలలో కథానాయకుడిగా నటించాడు.

నేపథ్యము

[మార్చు]

పాపారావు చౌదరి 1965, జూలై 2న తూర్పు గోదావరి జిల్లా, కైకవోలు గ్రామములో మీనవల్లి వీర్రాజు, లక్ష్మీకాంతం దంపతులకు జన్మించాడు. వీరిది ఉమ్మడి కుటుంబము. ఈయనకు ముగ్గురు సోదరులు. ఒక సోదరి. పెద్దన్న ఎం. బి. బి. ఎస్ చదివి డాక్టరుగా పనిచేస్తున్నాడు. ఆయన గాయకుడు, నాటకాలు కూడా వేసేవాడు. కృష్ణ భగవాన్ చిన్నతనంలో మిమిక్రీ చేసేవాడు. ఒకసారి వీళ్ళ అన్నయ్య వేస్తున్న నాటక బృందంలో నటించాల్సిన ఒకరు అందుబాటులో లేకపోవడంతో కృష్ణభగవాన్ కి అందులో అవకాశం వచ్చింది. అప్పటి నుంచి ఆయన నటనా ప్రస్థానం ప్రారంభమైంది.[2]

విద్యాభ్యాసం

[మార్చు]

ఇతడి ప్రాథమికవిద్యాభ్యాసము స్వగ్రామమైన కైకవోలులో పూర్తిచేసి పాఠశాల విద్యకోసం కాకినాడలో పూర్తిచేశాడు. ఇంటర్ విద్యను ఆండాలమ్మ కళాశాలలో పూర్తిచేసాడు. తర్వాత హైదరాబాదులో బాగ్ లింగంపల్లి లోని అంబేద్కర్ కళాశాల నుండి బీకాం పూర్తిచేశాడు. అటుపై చదవాలనే ఆశ ఉన్నా బి.కాంలోని అత్తెసరు మార్కుల కారణంగా ఏ కళాశాల అతడిని అనుమతివ్వని కారణంగా చదువు పట్ల ఆసక్తిని తగ్గించి నటనపై పెంచుకొన్నాడు.

నట జీవితం

[మార్చు]

పాఠశాలలో తన పెద్దన్న మంగరాజు బలవంతంపై పెండింగ్ ఫైల్ అనే నాటకంలో తొలిసారిగా పరంధామయ్య పాత్రను పోషించాడు. అటుపై నటనావకాశాల కోసం మద్రాసు చేరుకొన్నాడు. అక్కడ మిత్రబృందంతో కలిసి అప్పటి నటి అనూరాధ ఇంట్లోని మేడమీది గదిలో అద్దెకు ఉంటూ అవకాశాల కోసం ప్రయత్నించేవాడు. ఇంటిదగ్గరినుండి నెల నెలా డబ్బులు పంపిస్తుండటంతో బ్రతుకుతెరువు కోసం వేరే వృత్తిని చేసే పని తప్పింది. వంశీ దర్శకత్వంలో వచ్చిన మహర్షి సినిమాలో రెండో హీరోగా అవకాశం వచ్చింది. ఇందులో మొదటి హీరో మహర్షి రాఘవ. తర్వాత వచ్చిన ఏప్రిల్ 1 విడుదల చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించాడు. అంతేకాక ఆ చిత్ర రచనలో కూడా పాలుపంచుకున్నాడు.[2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఇతను తన పెద్దక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె. ప్రస్తుతము హైదరాబాదులో ఉన్నత విద్యను చదువుతున్నది.

అపఖ్యాతి

[మార్చు]

ఇతను ఒక ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవంలో మద్యం సేవించి, వేదిక నెక్కి కవి, విద్వాంసుడు, సహస్రావధాని గరికపాటి నరసింహారావును తూలనాడి అపఖ్యాతి పొందాడు[3][4][5]

నటించిన చిత్రాలు

[మార్చు]
సంవత్సరం చిత్రము పాత్ర ఇతర వివరములు
2018 మై డియర్ మార్తాండం
2017 2 కంట్రీస్
నేను లోకల్ కానిస్టేబుల్
2016 నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్
అరకు రోడ్ లో
2015 సౌఖ్యం[6]
2014 పాండవులు పాండవులు తుమ్మెద
అమృతం చందమామలో
అలా ఎలా?
పాఠశాల
2013 ఆడు మగాడ్రా బుజ్జీ
కెవ్వు కేక[7]
2012 జీనియస్
2011 వీడు తేడా
వనకన్య వండర్ వీరుడు
గ్రాడ్యుయేట్
2010 శక్తి(2010 సినిమా)
మనసారా
ఏమైంది ఈవేళ
సరదాగా కాసేపు
దేశద్రోహి నమిత కథానాయిక
2009 గోపి గోపిక గోదావరి జూలై 10, 2009 న విడుదలైనది.
పదహారేళ్ళ వయసు
మిస్టర్ గిరీశం
కుబేరులు కథానాయకుడు, హాస్య చిత్రము
2008 మిస్టర్ గిరీశం కథానాయకుడు
కింగ్ కోన వెంకట్
కంత్రీ అతిధి పాత్ర
దొంగ సచ్చినోళ్ళు రంభ హాస్య చిత్రము
బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ కథానాయకుడు హాస్య చిత్రము
జాన్ అప్పారావ్ 40 ప్లస్ తొలిసారి కథానాయకుడు గా పరిచయం ద్విపాత్రాభినయము, సిమ్రాన్ కథానాయిక
మంగతాయారు టిఫిన్ సెంటర్
నిండు పౌర్ణమి విడుదల కాలేదు
2007 భజంత్రీలు
ఆపరేషన్ దుర్యోధన
పెళ్ళైంది కానీ
మీ శ్రేయోభిలాషి
యమగోల మళ్ళీ మొదలైంది నారదుడు
టాస్
దుబాయ్ శీను పట్నాయక్ విజయవంతమైన చిత్రం
ఎవడైతే నాకేంటి
టాటా బిర్లా మధ్యలో లైలా బిర్లా హాస్య చిత్రము,విజయవంతమైన చిత్రం
అమ్మ చెప్పింది వంట వాడు
999 రూపాయలు మాత్రమే
2006 మాయాజాలం దయ్యం
రాఖీ మంత్రి గారి సహాయకుడు అతిధి పాత్ర
రాజబాబు
ఏవండోయ్ శ్రీవారు
2005 అందరివాడు
కాంచనమాల కేబుల్ టి.వి.
అల్లరి బుల్లోడు
అదిరిందయ్యా చంద్రం
ఎవడి గోల వాడిది కడప రెడ్డెమ్మ భర్త హాస్య చిత్రము,విజయవంతమైన చిత్రం
కొంచెం టచ్ లో ఉంటే చెపుతాను
2004 మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి గైడ్ దేవానంద్
ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి
సారీ నాకు పెళ్లైంది
శంఖారావం
సాంబ పశుపతి నౌకరు
వెంకీ రైలు ప్రయాణీకుడు
నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్
లీలామహల్ సెంటర్
ఆప్తుడు
మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు
చెప్పవే చిరుగాలి
ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు
Xట్రా
అందరూ దొంగలే దొరికితే
శంఖారావం
2003 లక్ష్మీనరసింహా పోలీస్ ఇన్స్ పెక్టర్
నీతో వస్తా
శ్రీరామచంద్రులు
దొంగరాముడు అండ్ పార్టీ
కబడ్డీ కబడ్డీ బోసు
ఔను..వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిట్టిబాబు విజయవంతమైన చిత్రం
1991 ఏప్రిల్ 1 విడుదల గోపీచంద్ చిత్ర రచయిత కూడా
1988 మహర్షి ఇన్స్ పెక్టర్ ప్రతాప్ మొదటి చిత్రం

మూలాలు

[మార్చు]
  1. వేమూరి, రాధాకృష్ణ. "ఓపెన హార్ట్‌ విత్ ఆర్కేలో నటుడు కృష్ణ భగవాన్". andhrajyothy.com. ఆంధ్రజ్యోతి. Archived from the original on 5 నవంబరు 2016. Retrieved 10 November 2016.
  2. 2.0 2.1 "నా నోటికి తొందరెక్కువ: 'మంచు' దెబ్బ వెనుక కథ! - alitho saradaga funny chat with krishna bhagwan and prudhvi raj". www.eenadu.net. Retrieved 2021-02-04.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-12-21. Retrieved 2011-08-16.
  4. http://www.youtube.com/watch?v=fVKoWXcFdt8
  5. http://www.youtube.com/watch?v=urETV5vr-8o
  6. మన తెలంగాణ, వార్తలు (25 October 2015). "అనుబంధాలు, ఆప్యాయతల సౌఖ్యం". Archived from the original on 2020-06-12. Retrieved 12 June 2020.
  7. "Kevvu Keka Movie Review, Rating". gulte.com. Retrieved 16 July 2019.

బయటి లింకులు

[మార్చు]