అపూర్వ సేన్‌గుప్తా
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | అపూర్వ కుమార్ సేన్‌గుప్తా | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | లక్నో, యునైటెడ్ ప్రావిన్సెస్, బ్రిటిషు భారతదేశం | 1939 ఆగస్టు 3|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 2013 సెప్టెంబరు 14 న్యూ ఢిల్లీ | (వయసు 74)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | Legbreak googly | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 89) | 1959 జనవరి 21 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo |
లెఫ్టినెంట్ జనరల్ అపూర్వ కుమార్ సేన్‌గుప్తా(1938 ఆగస్టు 3 - 2013 సెప్టెంబరు 14) 1959లో ఒక టెస్టు ఆడిన క్రికెటరు, భారతీయ సైనిక అధికారి. క్రిస్టోఫర్ మార్టిన్-జెంకిన్స్ ప్రకారం, అతను "చాలా మంచి ఆల్‌రౌండరు, రైట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్, లెగ్-బ్రేక్, గూగ్లీ బౌలరు, మంచి స్లిప్ ఫీల్డరు". [1]
క్రికెట్ కెరీర్
[మార్చు]సేన్‌గుప్తా తొలి టెస్ట్ మ్యాచ్ భారత క్రికెట్‌లో ఒక పెద్ద వివాదం మధ్యలో వచ్చింది. 1958–59లో వెస్టిండీస్‌తో జరిగిన మద్రాస్ టెస్టుకు కొన్ని రోజుల ముందు గులాం అహ్మద్ రిటైర్మెంట్ ప్రకటించాడు. విజయ్ మంజ్రేకర్ గాయం కారణంగా తప్పుకున్నాడు. జాసూ పటేల్, AG కృపాల్ సింగ్, మనోహర్ హార్దికర్, సేన్‌గుప్తా అందరినీ పరిగణనలోకి తీసుకునే గందరగోళ పరిస్థితికి దారితీసింది. కెప్టెన్ పాలీ ఉమ్రిగర్ హార్దికర్‌ను కోరుకున్నాడు కానీ అతను బొంబాయి నుండి మద్రాసుకు వెళ్లే చివరి విమానాన్ని అందుకోలేకపోయాడు. [2] ఉమ్రీగర్, స్టాండ్‌బైగా ఉన్న సేన్‌గుప్తాను తీసుకోవాలని అనుకున్నాడు. కానీ BCCI అధ్యక్షుడు RK పటేల్, జాసు పటేల్‌ను తీసుకోవాలని పట్టుబట్టడంతో, ఉమ్రీగర్ ఆ మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి రాజీనామా చేశాడు.[3][4] చివరికి సేన్‌గుప్తా, కృపాల్ సింగ్‌లు ఆడారు. నారీ కాంట్రాక్టర్ అస్వస్థతకు గురికావడంతో సేన్ గుప్తా ఇన్నింగ్సును ప్రారంభించాడు. అతను 1 పరుగు వద్ద వెస్ హాల్ వేసిన బౌన్సరులో రెండవ స్లిప్ వద్ద క్యాచ్ ఇచ్చాడు. రెండవ ఇన్నింగ్స్‌లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసాడు.
అతను ఆ సీజన్‌లో వెస్ట్ ఇండియన్ టూరింగ్ టీమ్‌పై సర్వీసెస్ తరఫున తన తొలి ఫస్ట్-క్లాస్ ఆట ఆడి, 32, 100 నాటౌట్ స్కోర్ చేశాడు. [5] డిక్కీ రత్నాగుర్ ప్రకారం, అతను గట్టి డిఫెన్సును, అద్భుతమైన స్వభావాన్నీ ప్రదర్శించాడు. అతను బంతిని మళ్ళించి, స్కోర్ చేసేవాడు. కవర్, ఎక్స్ట్రా కవర్ లలో డ్రైవ్ చేసాడు కానీ బలంగా కొట్తగలిగేవాడు కాదు. రెండవ ఇన్నింగ్స్‌లో, గార్ఫీల్డ్ సోబర్స్ వేసిన గూగ్లీని గుర్తించడానికి సేన్‌గుప్తా చాలా కష్టపడ్డాడు. అతను బౌలర్ ఎండ్‌లో రోహన్ కన్హై చేతిలో రనౌట్ అయ్యాడు. అంపైర్ బాపు జోషి సేన్‌గుప్తాను ముందు ఔట్ ఇచ్చాడు. కానీ తర్వాత, వికెట్లను పడేసినపుడు తన చేతిలో బంతి లేదని గ్రహించి కంహాయ్, తన అప్పీల్‌ను ఉపసంహరించుకున్నాడు. [6] సేన్‌గుప్తా 270 నిమిషాల్లో సెంచరీ పూర్తి చేశాడు. 16 మ్యాచ్‌ల సీజన్‌లో వెస్టిండీస్ ఇచ్చిన మూడు సెంచరీలలో ఇది ఒకటి.
రెండు నెలల తర్వాత అతను రంజీ ట్రోఫీలో తన మొదటి ప్రదర్శనలో ఢిల్లీకి వ్యతిరేకంగా 32 పరుగులకు 6 వికెట్లు తీసుకున్నాడు. [7] ఈ రెండు ప్రదర్శనలు అతనిని టెస్ట్ మ్యాచ్‌కు ఎంపిక చేయడానికి దారితీశాయి. పదేళ్లపాటు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో కొనసాగాడు. 1959-60 రంజీ ట్రోఫీ సెమీ-ఫైనల్‌లో బాంబేపై 146 నాటౌట్ స్కోరు అతని ఏకైక సెంచరీ. [8]
సేన్‌గుప్తా భారత సైన్యంలో అధికారిగా పనిచేసి, PVSM, AVSM మెడళ్ళు అందుకున్నాడు. సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్ (3 స్టార్) స్థాయికి ఎదిగాడు. అతను అమెరికా, కెనడాల్లో ఉన్న భారత దౌత్య కార్యాలయల్లో డిఫెన్స్ అటాచెగా కూడా పనిచేసాడు.
భారత సైన్యం నుండి పదవీ విరమణ చేసిన తర్వాత అతను, తన భార్య మీనా సేన్‌గుప్తాతో కలిసి న్యూఢిల్లీలో నివసించాడు. వారికి అమితాబ్, సురోజిత్ సేన్‌గుప్తా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సేన్‌గుప్తా 2013 సెప్టెంబరు 14 న న్యూఢిల్లీలోని R&R ఆసుపత్రిలో మరణించాడు.[9]
మూలాలు
[మార్చు]- ↑ Christopher Martin-Jenkins, Who's who of Test cricketers
- ↑ Dicky Rutnagur, Indian Cricket Field Annual, p.118
- ↑ Mihir Bose, A History of Indian Cricket, Andre-Deutsch (1990), pp. 213–214
- ↑ "4th Test, Chennai, Jan 21 – 26 1959, West Indies tour of India". ESPNcricinfo. Retrieved 4 March 2022.
- ↑ "Services XI v West Indians 1958-59". ESPNcricinfo. Retrieved 4 March 2022.
- ↑ Rutnagur, Indian Cricket Field Annual, 1959-60, p.52
- ↑ "Delhi v Services 1958-59". ESPNcricinfo. Retrieved 4 March 2022.
- ↑ "Services v Bombay 1959-60". ESPNcricinfo. Retrieved 4 March 2022.
- ↑ Obituary in the Times of India (accessed 3 August 2014)