Jump to content

టెస్ట్ క్రికెట్

వికీపీడియా నుండి

టెస్టు క్రికెట్ అనబడే ఈ ఫార్మాట్ క్రికెట్ క్రీడలో అత్యంత పొడవైన, ఎంతో ప్రధాన్యత కలిగిన ఫార్మాట్.[1] దీనిని ప్రస్తుతం ఐదు రోజుల పాటు అడుతారు. 11 మంది ఆటగాళ్ళలో రెండు జట్లు నాలుగు ఇన్నింగ్స్ మ్యాచ్ ఆడతాయి.ఒక్కో రోజుని మూడు భాగాలుగా విభజిస్తారు. ఒక రోజులో మొత్తం ఆరు గంటల పాటు ఆట కొనసాగుతుంది. 20 నిముషాల టీ విరామం, 40 నిముషాల భోజన విరామం ఉంటాయి.కేవలం టెస్ట్ హోదా కలిగిన జట్టులు మాత్రమే ఈ ఫార్మాట్ని ఆడగలవు. మొదటి అధికారికంగా గుర్తించబడిన టెస్ట్ మ్యాచ్ 1877 మార్చి 15 న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) లో జరిగింది.ఆస్ట్రేలియా 45 పరుగుల తేడాతో విజయం సాధించింది.సాధారణంగా ఈ ఫార్మాట్ని ఎర్ర బంతితో సుర్యోదయ సమయాల్లో మాత్రమే అడేవారు అయితే అక్టోబరు 2012 లో, ICC టెస్ట్ మ్యాచ్లకు ఆట రోజులు, రోజు / రాత్రి టెస్ట్ మ్యాచ్లకు అనుమతినిచ్చింది. 2015 నవంబరు 1 న అడిలైడ్ ఓవెల్, అడిలైడ్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య మొదటి రోజు / రాత్రి ఆట జరిగింది.[2][3]

టెస్ట్ హోదా

[మార్చు]

టెస్ట్ మ్యాలు క్రికెట్‌లో అత్యధిక స్థాయి రకం. అయితే, సంఖ్యాపరంగా, వారి డేటా ఫస్ట్-క్లాస్ క్రికెట్లో భాగం. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించిన ప్రకారం "టెస్ట్ హోదా"తో జాతీయ ప్రాతినిధ్య జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగుతాయి. 2017 జూన్ నాటికి, పన్నెండు జాతీయ జట్లకు టెస్టు హోదా ఉంది. 2017 జూన్ 22 న ఈ హోదా పొందిన ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్లు కూడా ఈ పన్నెండులో భాగం.[4] 2006, 2011 ల మధ్య పేలవమైన ప్రదర్శనల కారణంగా జింబాబ్వే టెస్ట్ హోదాను కోల్పోయింది. మళ్ళీ 2011 ఆగస్టులో తిరిగి ఈ హోదా పొందింది.[5]

ప్రస్తుతం టెస్ట్ హోదా కలిగిన జట్లు

[మార్చు]

ప్రస్తుతం పన్నెండు టెస్ట్ పురుషుల జట్లు ఉన్నాయి. ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఐర్లాండ్ దేశాల మినహా అన్ని జట్లు వ్యక్తిగత, స్వతంత్ర దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ దేశాల లేదా దేశాల సమూహంపై టెస్ట్ హోదాను ప్రదానం చేస్తుంది.

  1.  ఇంగ్లాండు ఇంగ్లాండ్ (15 మార్చి 1877)
  2.  ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా (15 మార్చి 1877)
  3.  South Africa దక్షిణాఫ్రికా (12 మార్చి 1889)
  4.  వెస్ట్ ఇండీస్ వెస్ట్ ఇండీస్ (23 జూన్ 1928)
  5.  New Zealand న్యూజిలాండ్ (10 జనవరి 1930)
  6.  India భారతదేశం (25 జూన్ 1932)
  7.  Pakistan పాకిస్తాన్ (16 అక్టోబరు 1952)
  8.  శ్రీలంక శ్రీలంక (17 ఫిబ్రవరి 1982)
  9.  జింబాబ్వే జింబాబ్వే (18 అక్టోబరు 1992)
  10.  బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ (10 నవంబరు 2000)
  11.  Ireland ఐర్లాండ్ (11 మే 2018)
  12.  ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ (14 జూన్ 2018)

పూర్వపు చరిత్ర

[మార్చు]

పూర్వం టెస్ట్ క్రిక్రెట్ ఆట సమయం నిర్దిస్టంగా ఉండేది కాదు, ఆటా యొక్క నియమాలు కూడా వేరుగా ఉండేవి. అయితే సమయానుసారం వాటిని మార్పు చెస్తూ ప్రస్తుతం ఈ ఫార్మాట్ ను అయిదు రోజులు గాను మర్చారు.

ప్రస్తుత ఆట సమయాలు

[మార్చు]

టెస్ట్ క్రికెట్ లో ప్రామాణికంగా రోజు రెండు గంటలతో కూడిన మూడు సెషన్లను ఉంటాయి, సెషన్ల మధ్య భోజనాలు 40 నిముషాల పాటు, టీ కోసం 20 నిమిషాల మధ్య విరామాలు ఉంటాయి.

  • మొదటి భాగం: 11am – 1 pm
  • రెండో భాగం: 1:40 pm – 3:40 pm
  • మూడో భాగం: 4 pm – 6 pm

ఏదేమైనప్పటికీ సెషన్ల, విరామాల కొన్నిసార్లు పరిస్థితులలో మార్పు చెందుతాయి. చెడు వాతావరణం లేదా ఇన్నింగ్స్ యొక్క మార్పు ఒక షెడ్యూల్ బ్రేక్కు దగ్గరగా ఉంటే, విరామం తక్షణమే తీసుకోబడుతుంది. సమయం నష్టం జరిగితే, ఉదాహరణకు వాతావరణం కారణంగా, సెషన్ కోల్పోయిన సమయాన్ని సర్దుబాటు చేయవచ్చు. బ్యాటింగ్ జట్టు తొమ్మిది వికెట్లు పూర్తయిన సమయానికి టీ బ్రేక్లో ఉంటే, అప్పుడు విరామం 30 నిముషాలు వరకు ఆలస్యం అవ్వవచ్చు లేదా జట్టు అంతా ఆలవుట్ అవ్వచ్చు. ఆ రోజు ఆటలో 90 ఓవర్లు బౌల్ చేయబడనప్పుడు (ప్రతికూల వాతావరణం కోసం ఏదైనా తగ్గింపుకు లోబడి) అంపైర్ల చివరి సెషన్ 30 నిముషాల వరకు (5 వ రోజు మినహా) విస్తరించవచ్చు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "bbc". BBC.
  2. "icc". Archived from the original on 2015-06-30. Retrieved 2018-04-23.
  3. Rundell, Michael (2006) (2006). Dictionary of Cricket. books.google.com/books?id=6Vu9cih3u1kC&lpg=PT336&ots=Kqt2KVkwoK&dq=%22dictionary%20of%20cricket%22%20test&pg=PT336#v=onepage&q=%22dictionary%20of%20cricket%22%20test&f=false. ISBN 978-0-7136-7915-1.{{cite book}}: CS1 maint: location (link) CS1 maint: location missing publisher (link) CS1 maint: numeric names: authors list (link)
  4. "BBC".
  5. "VOA".