ఎ.జి. కృపాల్ సింగ్
దస్త్రం:AG Kripal Singh.jpg | ||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | అమృత్‌సర్ గోవింద్‌సింగ్ కృపాల్ సింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | మద్రాసు, మద్రాసు రాష్ట్రం | 1933 ఆగస్టు 6|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 1987 జూలై 22 చెన్నై | (వయసు 53)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | ఎ.జి. రామ్‌సింగ్ (తండ్రి) ఎ.జి. మిల్ఖా సింగ్ (సోదరుడు) అర్జన్ కృపాల్ సింగ్ (కుమారుడు) | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 75) | 1955 నవంబరు 19 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1964 అక్టోబరు 27 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 23 March 2018 |
అమృత్‌సర్ గోవింద్‌సింగ్ కృపాల్ సింగ్ (1933 ఆగష్టు 6 - 1987 జూలై 22) భారతీయ టెస్ట్ క్రికెట్ ఆటగాడు .
జీవితం, వృత్తి
[మార్చు]కృపాల్ సింగ్ ప్రముఖ క్రికెట్ కుటుంబానికి చెందినవాడు. అతని సోదరుడు మిల్కా సింగ్ టెస్టు క్రికెటరు. తండ్రి AG రామ్ సింగ్, మరొక సోదరుడు, ఇద్దరు కుమారులు, అతని కుమార్తె, మేనల్లుడు అందరూ ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడారు. అతను అటాకింగ్ బ్యాట్స్‌మన్, ఉపయోగకరమైన ఆఫ్ స్పిన్ బౌలర్.
1954-55లో రంజీ ట్రోఫీని మద్రాస్ గెలుచుకోవడంలో కృపాల్ సింగ్ ప్రముఖ పాత్ర పోషించాడు. 636 పరుగులు చేసి 13 వికెట్లు తీసుకున్నాడు. బెంగాల్‌తో జరిగిన సెమీ-ఫైనల్‌లో అతను 98 ,97 పరుగులు చేశాడు - రెండో ఇన్నింగ్స్‌లో జట్టు మొత్తం 139 పరుగులకు ఆలౌట్ కాగా, ఇందులో ఎవరూ రెండంకెల స్కోరు సాధించలేదు. రెండవ ఇన్నింగ్స్‌లో కృపాల్ 18 పరుగులకు 4 వికెట్లు తీసుకున్నాడు. [1] కృపాల్‌కు ఫైనల్ సమయంలో విశ్వవిద్యాలయ పరీక్షలు ఉండగా, విశ్వవిద్యాలయం వాటిని వాయిదా వేసింది. హోల్కర్‌తో జరిగిన ఫైనల్‌లో అతను 75, 91 పరుగులు చేసి, ఏడు వికెట్లు సాధించి జట్టు విజయంలో కీలకమయ్యాడు. అంతకు ముందు సీజన్‌లో అతను ట్రావెన్‌కోర్-కొచ్చిన్‌పై తన కెరీర్‌లో అత్యుత్తమ స్కోరు 208 పరుగులు చేశాడు.
తదుపరి సీజన్‌లో న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపికై, తొలి మ్యాచ్‌లో 100* పరుగులు చేశాడు. అది అతని ఏకైక టెస్టు సెంచరీగా మిగిలిపోయింది. 1958-59లో వెస్టిండీస్‌పై 53 పరుగులతో పాటు మరో రెండు అర్ధశతకాలు సాధించాడు.
కృపాల్ 1959లో ఇంగ్లండ్‌లో పర్యటించారు. అతను లాంకషైర్‌పై 178 పరుగులు చేశాడు. ఒక టెస్టులో ఆడి, 41 పరుగులు చేశాడు. వేలి గాయం కారణంగా ఆ సీరీస్‌లో సరిగా ఆడలేకపోయాడు. అతను సెలెక్టర్ల దృష్టిలోనే ఉన్నప్పటికీ, ఆ తర్వాత అతని టెస్ట్ ప్రదర్శనలు అంత బాగాలేవు. 1961-62లో మూడు టెస్టులు, 1963-64లో రెండు టెస్టులు, అన్నీ ఇంగ్లండ్‌పైనే, ఆడాడు. 1961-62లో జరిగిన మూడో టెస్టులో టెస్టు క్రికెట్‌లో తన తొలి వికెట్ తీశాడు. అతను దీనికి ముందు తొమ్మిది ఇన్నింగ్స్‌లు, పది టెస్టుల్లో 588 బంతులు బౌలింగ్ చేశాడు. ఏ బౌలరు కూడా అతని తొలి వికెట్ కోసం ఇన్ని బంతులు వేయలేదు. అదే టెస్టులో, అతను సుభాష్ గుప్తే కెరీర్‌కు ముగింపు పలికిన కుంభకోణంలో చిక్కుకున్నాడు.
1963-64లో ఒక టెస్ట్ మ్యాచ్‌లో చాలా మంది ఇంగ్లీష్ ఆటగాళ్ళు గాయాలతో గానీ అనారోగ్యంతో గానీ ఉన్నపుడూ కృపాల్ వారి స్థానంలో ఫీల్డింగ్ చేసేవాడు. కెరీర్ చివరిలో కృపాల్ బౌలర్‌గా మారాడు. అతను మొట్టమొదటి దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో తమిళనాడుకు, సౌత్ జోన్‌కూ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
జన్మతః సిక్కుగా జన్మించాడు గానీ అతని టెస్ట్ మ్యాచ్‌ల కాలంలో, కృపాల్ ఒక క్రిస్టియన్ అమ్మాయిని ప్రేమించి, ఆమెను పెళ్ళి చేసుకోవడానికి మతం మార్చుకున్నాడు. అతని గడ్డం గీసుకుని, జుట్టు కత్తిరించుకున్నాడు. [2]
కృపాల్ 53 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో మరణించాడు. మరణించే సమయానికి అతను జాతీయ సెలెక్టర్‌గా ఉన్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Madras v Bengal 1954-55". CricketArchive. Retrieved 23 March 2018.
- ↑ "The Hindu : Magazine / Columns : A lot in a name". www.hindu.com. Archived from the original on 10 October 2006. Retrieved 17 January 2022.