అట్టాడ అప్పల్నాయుడు
అట్టాడ అప్పల్నాయుడు ఉత్తరాంధ్రకు చెందిన కథా, నవలా రచయిత. ఇతడు విజయనగరం జిల్లా, కొమరాడ మండలం గుమడ గ్రామంలో 1953వ సంవత్సరం ఆగష్టు 23వ తేదీన జన్మించాడు.[1] కోటిపాం జిల్లాపరిషత్ హైస్కూలులో పదవ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ సమయంలో శ్రీకాకుళ సాయుధ పోరాటం వైపు ఆకర్షితుడయ్యాడు. జననాట్యమండలిలో పనిచేశాడు. పార్వతీపురంలో ఇంటర్‌మీడియెట్ చదివాడు. జంఝావతి రిజర్వాయర్ నిర్మాణంలో కూలీగా పనిచేశాడు. నాగావళి వారపత్రికలో పనిచేశాడు. తరువాత బ్యాంక్ ఉద్యోగం సంపాదించుకున్నాడు.
శ్రీకాకుళ సాహితి
[మార్చు]ఇతడు తన మిత్రులతో కలిసి శ్రీకాకుళ సాహితి అనే సంస్థను స్థాపించాడు. ప్రతి నెల సభలు, సమావేశాలు నిర్వహించాడు. జముకు అనే బులెటిన్‌ను ఈ సంస్థ తరఫున తీసుకువచ్చాడు. నాగావళి కథలు, వంశధార కథలు, జంఝావతి కథలు మొదలైన కథాసంకలనాలను సంస్థ తరఫున ప్రచురించాడు.
వీరి బహుళ నవల ఒక మహా ఉద్యమానంతర ప్రఙా జీవనాన్ని చక్కగా విశ్లేషించింది.
[మార్చు]ఇతడు 100కి పైగా కథలు, నాలుగు నవలలు, కొన్ని నాటికలు వ్రాశాడు.తొలి రోజులలో శ్రీకాకుళోద్యమానికి ఆకర్షితుడై విప్లవ కథకుడిగా పేరు సంపాదించాడు. ఇతని నాటకం మడిసెక్క అన్ని భారతీయభాషలలోకి అనువదించబడింది. వరీనియా అనే కలంపేరుతో కథలు వ్రాసేవాడు. ఇతని రచనలు సృజన, అరుణతార, అంకితం, ప్రజాసాహితి, ఇండియాటుడే, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, పుస్తకం, యువత మందస, విపుల, ఆహ్వానం, వార్త, నూతన, ప్రజాశక్తి, ఆంధ్రమాలిక, సుప్రభాతం, నవ్య, రచన, జముకు, నాగావళి, చినుకు, స్వాతి మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఇతని రచనలు సమగ్రంగా అట్టాడ అప్పల్నాయుడు సాహిత్యం అనే పేరుతో మూడు సంపుటాలలో వెలువడింది.
- అరణ్యపర్వం
- ఆకాశ కుసుమాలు
- ఊరచెరువు
- ఎంపిక
- ఒక పొట్టివాడు కొందరు పొడుగవాళ్ళు
- ఓ తోట కథ
- వేళ్ళు తెగిన..
- కొలతలు
- కో... బలి
- క్షతగాత్రగానం
- ఖండగుత్త
- గయిరమ్మ
- జీవనస్రవంతి
- జ్ఞానోదయం
- డోర్ డెలివరీ
- తల్లీ కూతుళ్లు
- నిషాదము
- నేను...నేనే
- నేల... తల్లి
- పంచాయితీ నుయ్యి
- పంట
- పందెపు తోట
- పర్య వ్యవస్థ
- పాలగదిల పరిశినాయుడి వొంశం
- పునరావాసం
- పువ్వులకొరడా
- పోడు... పోరు
- ప్రజాకోర్టు
- ప్రత్యామ్నాయం
- ప్రయాణం
- బంధాలూ-అనుబంధాలూ
- బతికి చెడిన దేశం
- బారికోడు
- బుగతోడు గూడుబండి
- బెల్లం
- భద్రయ్య
- భోషాణం
- మనమెప్పుడో...
- మమకారం
- మార్కెట్ వాల్యూ
- మిసెస్ పార్వతీ ఈశ్వర్ రావ్
- యానగాలి
- యుద్ధం
- యువ శక్తి
- రివాజు
- రెండుప్రశ్నలే...
- వరదపాలు
- వల్మీకం
- వాళ్లు
- వెదుకులాట
- షా
- సందిగ్ధాకాశం
- సాహసం సేయరా
- సూతకం కబురు
కథాసంపుటాలు
[మార్చు]- ఒక పొట్టివాడు...
- క్షతగాత్రగానం
- పోడు - పోరు
- ప్రత్యామ్నాయం
- బీల
నవలలు
[మార్చు]- పునరావాసం
- ఉత్కళం
- అనగనగా ఒక రాజద్రోహం
- నూకలిస్తాను
సంపాదకీయం
[మార్చు]పురస్కారాలు
[మార్చు]- రావిశాస్త్రి రచనా పురస్కారం
- కథాకోకిల పురస్కారం
- జ్యేష్ట లిటరరీ అవార్డు
- పులుపుల శివయ్య స్మారక అవార్డు
- విశాలసాహితి పురస్కారం
- అధికార భాషాసంఘం పురస్కారం
- పురిపండా అప్పలస్వామి స్పుర్తి పురస్కారం
- కళారత్న పురస్కారం
- ఆంధ్రప్రదేశ్ ఉగాది పురస్కారం
- కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ సత్కారం.[4]
- 2021: బహుళ నవలకు తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ పురస్కారం (తెలుగు విశ్వవిద్యాలయం, 2023)[5]
బాధ్యతలు
[మార్చు]- సాహిత్య అకాడమీ తెలుగువిభాగం సలహామండలి సభ్యులు
- కథానిలయం, శ్రీకాకుళం ట్రస్ట్ సభ్యులు
- ఉత్తరాంధ్ర రచయితల, కళాకారుల వేదిక ( ఉరకవే) అధక్షులు
బయటి లంకెలు
[మార్చు]- జైనీ, ప్రభాకర్. "సంపాదకీయం: కళింగ దేశ సాహితీ సమరాంగణాన." cineevaali.com. Archived from the original on 2023-12-24.
మూలాలు
[మార్చు]- ↑ లాంగుల్య (13 October 2010). "నవ్యనీరాజనం". నవ్యవీక్లీ: 27–29. Archived from the original on 20 మే 2012. Retrieved 20 December 2014.
- ↑ అట్ట్డాడ, అప్పల్నాయుడు. "అట్టాడ అప్పలనాయుడు కథలు". కథానిలయం. కథానిలయం. Archived from the original on 10 మార్చి 2016. Retrieved 20 December 2014.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (26 November 2018). "సిక్కోలులో 'కథ 2017' ఆవిష్కరణ". Archived from the original on 17 మార్చి 2020. Retrieved 17 March 2020.
- ↑ పెనుగొండ లక్ష్మీనారాయణ (జనవరి 2020). గుంటూరుసీమ సాహిత్యచరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ. pp. 283–284.
- ↑ "తెలుగు వర్సిటీ 2021 సాహితీ పురస్కారాలు". EENADU. 2023-10-13. Archived from the original on 2023-10-14. Retrieved 2023-10-20.