Jump to content

బ్యాంకు

వికీపీడియా నుండి
(బ్యాంక్ నుండి దారిమార్పు చెందింది)
1694లో స్థాపించబడిన బాంక్ ఆఫ్ ఇంగ్లాండు


బ్యాంకు అనేది ఒక ఆర్ధిక సంస్థ, ఇక్కడ వినియోగదారులు డబ్బును సురక్షితంగా దాచుకోవచ్చు లేదా రుణం తీసుకోవచ్చు. బ్యాంకులు తమ డబ్బు నిల్వను పెంచుకోవడానికి డబ్బును పెట్టుబడి పెడతాయి. బ్యాంకు చట్టాల ద్వారా నియంత్రించబడుతుంది. బ్యాంక్ చట్టాలు వేర్వేరు దేశాలలో విభిన్నంగా ఉంటాయి. బ్యాంకులో పనిచేసే వారిని బ్యాంక్ ఉద్యోగులు అంటారు. వినియోగదారులు బ్యాంకులో డబ్బును సురక్షితంగా దాచుకోవడంతో పాటు దాచుకున్న డబ్బుకు వడ్డీని పొందవచ్చు. బ్యాంకులు కస్టమర్లకు రుణాలు ఇస్తాయి, ఆ డబ్బును తరువాత సమయంలో వడ్డీతో సహా తిరిగి బ్యాంకుకు చెల్లించాలి. వినియోగదారులు రుణాలు పొందడానికి సెక్యూరిటీగా ఏదైనా తనఖా పెట్టవలసివుంటుంది. బ్యాంకు నుండి రుణాలు పొందిన వారు తిరిగి సొమ్ము చెల్లింకపోయినట్లయితే తనఖా పెట్టిన వాటిని జప్తు చేసుకుంటుంది. ఇల్లు లేదా అపార్ట్మెంట్ కొనడానికి ఉద్యోగస్తులకు వ్యక్తిగత తనఖా ద్వారా తక్కువ వడ్డీకే బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. బ్యాంకులు తమ వద్ద వినియోగదారులు దాచుకున్న డిపాజిట్ డబ్బుకి తక్కువ వడ్డీ ఇచ్చి, డబ్బు అవసరమైన ప్యాపారస్తులకు లేదా రైతులకు పెట్టుబడుల కొరకు అప్పుగా అధిక వడ్డీకి ఇస్తాయి, తద్వారా బ్యాంకులు ఆదాయం పొందుతాయి. వినియోగదారులు పొదుపు చేసి ఆదాయం పొందుటకు బ్యాంకులు బాగా ఉపయోగపడుతున్నాయి. వినియోగదారులు తమ డబ్బును ఒక చోట నుంచి మరొక చోటకి మార్పు చేసుకొనుటకు బ్యాంకులు సహకరిస్తాయి. అవసరమైనప్పుడు ఒకరి ఖాతా నుండి మరొకరి ఖాతాకు డబ్బును మార్పు చేసుకొనుటలో బ్యాంకులు సహకరిస్తాయి. ఆన్‌లైన్ ద్వారా జరిగే లావాదేవీలకు బ్యాంకులు ముఖ్య పాత్ర వహిస్తాయి. నాణేలు, నోట్ల మార్పిడికి బ్యాంకులు సహకరిస్తాయి. చాలా దేశాలలో బ్యాంకుల నియమాలను ప్రభుత్వం చట్టాల ద్వారా వ్యవహరిస్తుంది. సర్దుబాటు చేస్తుంది. కొన్ని బ్యాంకులు అంతర్జాతీయ కరెన్సీ ట్రేడింగ్‌తో వ్యవహరిస్తాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=బ్యాంకు&oldid=3271127" నుండి వెలికితీశారు