Jump to content

37వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన

వికీపీడియా నుండి
37వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన
స్థలంతెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్‌ స్టేడియం), దోమల్‌గూడ, హైదరాబాద్‌
ప్రదేశంహైదరాబాద్‌
దేశంభారతదేశం
క్రియాశీల సంవత్సరాలు39
ప్రారంభించినది1985
ఇటీవలి2023
నిర్వహణహైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ
వెబ్‌సైటు
[1]

37వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన (హైదరాబాద్ బుక్ ఫెయిర్ - హెచ్‌బీఎఫ్‌) హైదరాబాదు, దోమల్‌గూడలోని తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్‌ స్టేడియం) ప్రాంగణంలో 2024 డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 29 వరకు జరిగింది.[1][2][3] 37వ బుక్ ఫెయిర్ లోగోను నవంబర్ 4న సోమాజీగూడలోని ప్రెస్​క్లబ్​లో విడుదల చేశారు.[4][5]

హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌లో ‘పుస్తక నడక స్కూల్‌ కార్యక్రమం’భాగంగా శ్రీసాయి రామ్‌ హైస్కూల్‌ (బండమైసమ్మ నగర్‌) పిల్లలతో కలిసి లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ నుంచి బుక్‌ ఫెయిర్‌ ప్రాంగణం వరకు నిర్వహించారు.[6]

ప్రారంభోత్సవం

[మార్చు]

హైదరాబాద్ బుక్​ ఫెయిర్​ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరై ప్రారంభించగా,[7] మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, నిర్వహణ సలహా కమిటీ సభ్యులు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం, సీనియర్‌ పాత్రికేయుడు కె. రామచంద్రమూర్తి, ఆచార్యులు రమా మేల్కోటే, శాసనమండలి సభ్యుడు బల్మూరి వెంకట్, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు యాకూబ్, ప్రధాన కార్యదర్శి ఆర్‌.శ్రీనివాస్‌(వాసు), కోశాధికారి పి.నారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు బాల్‌రెడ్డి పాల్గొన్నారు.[8]

37 ఏళ్ల హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శన చరిత్రలో బుక్‌ ఫెయిర్‌ ప్రారంభోత్సవానికి హాజరైన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అని బుక్‌ఫెయిర్‌ అధ్యక్షుడు, కవి యాకూబ్‌ తెలిపాడు.[9][10]

37వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన

నిర్వహణ

[మార్చు]

37వ జాతీయ పుస్తక ప్రదర్శన 347 స్టాల్స్‌లతో 2024 డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 29 వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12.00 నుంచి రాత్రి 9.00 గంటల వరకు నిర్వహించనున్నట్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు యాకూబ్ షేక్ ప్రకటించాడు. ఈ పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి దాశరధి కృష్ణమాచార్య పేరిట,[11] సభా కార్యక్రమాల వేదికను బోయి విజయభారతి, పుస్తకాల ఆవిష్కరణ వేదికను తోపుడుబండి సాధిక్ పేర్లతో రెండు వేదికలను ఏర్పాటు చేశారు. ఈ పుస్తక ప్రదర్శనలో విద్యార్థులకు, జర్నలిస్టులకు గుర్తింపు కార్డు చూపితే ఉచిత ప్రవేశం ఉంది.[12][13]

ఈ కార్యక్రమాలను పర్యవేక్షించటానికి, సూచనలు ఇవ్వటానికి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి, సలహాదారులుగా ఎమ్మెల్సీ ప్రో. కోదండరామ్, సీనియర్ ఎడిటర్ కె. రామచంద్రమూర్తి, ఆచార్య రామా మేల్కొటే సభ్యులుగా ఉన్నారు.[14]

సాంస్కృతిక కార్యక్రమాలు

[మార్చు]

తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత బుక్ ఫెయిర్ కు తెలంగాణ కళాభారతి స్టేడియాన్ని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఉచితంగా ఇవ్వడమే కాకుండా, ప్రతిరోజూ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూనే, పలు కార్యక్రమాల నిర్వహణకు కూడా నిధులు కేటాయిస్తుందని హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు కవి యాకూబ్‌ తెలిపారు.[15][16]

పుస్తకావిష్కరణలు

[మార్చు]
  • ‘వికీపీడియా గురించి మీకు తెలుసా’ పుస్తక ఆవిష్కరణ
  • ‘శ్రీ శూద్రగంగ’ వచన రూప కావ్యం ఆవిష్కరణ
  • ‘మహాకవి దాశరథి’ పుస్తక ఆవిష్కరణ[17]
తేదీ పేరు రచన \ పబ్లిషర్స్ \ సంపాదకత్వం
డిసెంబర్ 20 నేడే చూడండి పవన్ సంతోష్ సూరంపూడి
సవారు సంగిశెట్టి శ్రీనివాస్
డిసెంబర్ 21 వెలుగు వైపుగా ధూపాటి ప్రభాకర్
మానవాళికి మహోదయం డి. పాపారావు
జీవ పరిణామం   ప్రొఫెసర్‌ కట్టా సత్యప్రసాద్‌
మ్రోయు తుమ్మెద కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ
భళా చిత్రకళా భారతీయ దృశ్యకళా చరిత్ర[18] నవతెలంగాణ పబ్లిషింగ్
స్త్రీ ఆధునిక కళాకారిణిగా శతాబ్దయానం-సమాజ ప్రతిబింబం[18] నవతెలంగాణ పబ్లిషింగ్
డిసెంబర్ 22 అంబేద్కరిజం అంటే ఏమిటి సమాంతర పుస్తకాల

ఆవిష్కరణ సభ

తిరుపతి బాలాజీ బౌద్ధ క్షేత్రమే
డాక్టర్ అంబేడ్కర్ అణగారిన కులాల భవిష్యత్తు
సంఘటిత స్త్రీ వాద కవిత్వం కన్నడ అనువాదం జేడీ పబ్లికేషన్స్
ఎర్రరంగు బురద నవల ఆంగ్లానువాదం
ఎర్రరంగు బురద నవల కన్నడ అనువాదం
'కథల లోగిలి' కథా సంకలనం లేఖిని రచయితల వేదిక
ది శూద్ర రెబెల్లియన్ కంచ ఐలయ్య షెపర్డ్
'బొడుసు తెలంగాణ కథ - 2023' కథా సంకలనం సంగిశెట్టి శ్రీనివాస్, వెల్డంది శ్రీధర్


పలు స్టాళ్లు

[మార్చు]

ప్రముఖుల సందర్శన

[మార్చు]

ముగింపు వేడుకలు

[మార్చు]

37వ హైదరాబాద్‌ జాతీయ పుస్తక ప్రదర్శన డిసెంబర్ 29న ముగిసింది. ఈ ముగింపు సభకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి, ఎమ్మెల్సీ ప్రో. కోదండరామ్, సీనియర్ జర్నలిస్ట్ కె. రామచంద్రమూర్తి హాజరై బుక్ ఫెయిర్ నిర్వాహకులను సత్కరించారు.[21][22] హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన మహోత్సవానికి 13 లక్షలమందికిపైగా వచ్చినట్లు బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు కవి యాకూబ్‌ తెలిపారు.[23][24]

మూలాలు

[మార్చు]
  1. "బుక్‌‌ ఫెయిర్‌‌ ఒక జ్ఞాన సంపద". V6 Velugu. 18 December 2024. Archived from the original on 25 December 2024. Retrieved 25 December 2024.
  2. ETV Bharat News (4 November 2024). "పుస్తక ప్రియులకు గుడ్ న్యూస్ : హైదరాబాద్ బుక్ ఫెయిర్ తేదీలు ఖరారు - వారికి మాత్రం ఫ్రీ ఎంట్రీ". Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
  3. The Hindu (15 December 2024). "11-day Hyderabad Book Fair to begin on December 19" (in Indian English). Archived from the original on 19 December 2024. Retrieved 19 December 2024.
  4. Eenadu (4 November 2024). "హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శన తేదీలు ఖరారు.. లోగో ఆవిష్కరణ". Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
  5. "యువ 'కలం'..! ట్రెండ్‌ సెట్టర్స్‌గా యంగ్‌ రైటర్స్‌". 27 December 2024. Archived from the original on 5 January 2025. Retrieved 5 January 2025.
  6. "పుస్తకాలంటే నాగరికతను భవిష్యత్‌కు అందించేవి". Nava Telanagana. 23 December 2024. Archived from the original on 5 January 2025. Retrieved 5 January 2025.
  7. "హైదరాబాద్‌ : 37వ జాతీయ బుక్‌ఫెయిర్‌ ప్రారంభం ..భారీ సంఖ్యలో సందర్శకులు (ఫొటోలు)". 20 December 2024. Archived from the original on 5 January 2025. Retrieved 5 January 2025.
  8. NT News (20 December 2024). "బుక్‌ ఫెయిర్‌ ప్రారంభం". Archived from the original on 20 December 2024. Retrieved 20 December 2024.
  9. "అనుకూల చరిత్ర రాయించుకున్నారు!". Andhrajyothy. 20 December 2024. Archived from the original on 20 December 2024. Retrieved 20 December 2024.
  10. Sakshi (20 December 2024). "హైదరాబాద్‌ : 37 వ జాతీయ బుక్‌ఫెయిర్‌ ప్రారంభం ..భారీ సంఖ్యలో సందర్శకులు (ఫొటోలు)". Archived from the original on 20 December 2024. Retrieved 20 December 2024.
  11. "కొత్త పాఠకులు వస్తున్నారు." Andhrajyothy. 23 December 2024. Archived from the original on 5 January 2025. Retrieved 5 January 2025.
  12. Sakshi (14 December 2024). "డిసెంబ‌ర్ 19 నుంచి హైద‌రాబాద్ బుక్ ఫెయిర్". Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
  13. Hindustantimes Telugu (5 November 2024). "పుస్తక ప్రియులకు శుభవార్త.. ఈసారి హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ ప్రత్యేకతలు ఇవే!". Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
  14. ETV Bharat News (11 December 2024). "పుస్తక ప్రియులకు గుడ్​న్యూస్ ​ఈనెల 19 నుంచి హైదరాబాద్​లో బుక్​ఫెయిర్". Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024. {{cite news}}: zero width space character in |title= at position 22 (help)
  15. "పుస్త‌క‌మంటే జ్ఞానం..స‌ర్వ‌జ‌న నేస్తం -". 16 December 2024. Archived from the original on 5 January 2025. Retrieved 5 January 2025.
  16. "బుక్‌ ఫెయిర్‌లో ఆకట్టుకున్న పురాణపండ అదివో.. అల్లదివో.!". Prabha News. 22 December 2024. Archived from the original on 5 January 2025. Retrieved 5 January 2025.
  17. "దాశరథి కవిత్వాలు శక్తివంతమైనవి". NT News. 27 December 2024. Archived from the original on 5 January 2025. Retrieved 5 January 2025.
  18. 18.0 18.1 "బుక్‌ఫెయిర్‌లో బాలామణి రచనల ఆవిష్కరణ -". Nava Telanagana. 22 December 2024. Archived from the original on 5 January 2025. Retrieved 5 January 2025.
  19. 19.0 19.1 "బహుమతులుగా పుస్తకాలిద్దాం". Andhrajyothy. 29 December 2024. Archived from the original on 29 December 2024. Retrieved 29 December 2024.
  20. "పుస్తక పఠనంతో జ్ఞాన సముపార్జన". Eenadu. 22 December 2024. Archived from the original on 5 January 2025. Retrieved 5 January 2025.
  21. "పుస్తకానికి పట్టం". 29 December 2024. Archived from the original on 5 January 2025. Retrieved 5 January 2025.
  22. "పుస్తకాల జాత‌ర‌". Nava Telanagana. 14 December 2024. Archived from the original on 5 January 2025. Retrieved 5 January 2025.
  23. "మురిసిన పుస్తకం". Andhrajyothy. 30 December 2024. Archived from the original on 30 December 2024. Retrieved 30 December 2024.
  24. "అట్టహాసంగా ముగిసిన బుక్ ఫెయిర్". V6 Velugu. 30 December 2024. Archived from the original on 30 December 2024. Retrieved 30 December 2024.