Jump to content

వేం నరేందర్ రెడ్డి

వికీపీడియా నుండి
వేం నరేందర్ రెడ్డి
వేం నరేందర్ రెడ్డి


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2004 - 2009
నియోజకవర్గం మహబూబాబాద్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1960 డిసెంబర్ 26
అర్పనపల్లి కేసముద్రం మండలం, మహబూబాబాదు జిల్లా, తెలంగాణ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు చెన్న కృష్ణరెడ్డి
జీవిత భాగస్వామి విజయలక్ష్మి
సంతానం కృష్ణ కీర్తన్

వేం నరేందర్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహబూబాబాద్ నియోజకవర్గం 2004 - 2009 ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.[1]

ఆయనను 2024 జనవరి 20న తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా నియమించింది.[2][3][4]

జననం, విద్యాభ్యాసం

[మార్చు]

వేం నరేందర్ రెడ్డి 1960లో తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు జిల్లా, కేసముద్రం మండలం, అర్పనపల్లి గ్రామంలో జన్మించాడు. ఆయన వరంగల్ సి.కె.ఎం కాలేజీ నుండి బిఎ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

వేం నరేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో మహబూబాబాద్ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. మహబూబాబాద్ నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గాల పురార్విభజనలో భాగంగా 2009లో జరిగిన ఎన్నికల్లో ఎస్టీకి రిజర్వ్‌ కావడంతో ఆయన 2010లో పశ్చిమ వరంగల్ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. వేం నరేందర్ రెడ్డి 2015లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీ కోటా స్థానాయికి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[5]

వేం నరేందర్ రెడ్డి 2015లో ఓటుకు నోటు కేసు తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన 2017 అక్టోబరు 29లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన 2021 జూన్ 26లో తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[6] ఆయనను 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ  కన్వీనర్‌గా కాంగ్రెస్ పార్టీ నియమించింది.[7]

వేం నరేందర్ రెడ్డిని 2024 జనవరి 20న తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారాల ప్రధాన సలహాదారుగా నియమించింది.[8][9][10][11] ఆయనను  2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో మార్చి 31న చేవెళ్ల లోక్‌సభ ఇన్‌చార్జ్‌గా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ ప్రకటించింది.[12]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (15 October 2016). "అభివృద్ధి బాటలో మానుకోట". Archived from the original on 19 December 2021. Retrieved 19 December 2021.
  2. Sakshi (21 January 2024). "ప్రభుత్వ సలహాదారుల నియామకం". Archived from the original on 21 January 2024. Retrieved 21 January 2024.
  3. "Revanth Reddy appoints close aides as Goverment Advisors" (in Indian English). The Hindu. 21 January 2024. Archived from the original on 26 December 2024. Retrieved 26 December 2024.
  4. "ముఖ్యమంత్రి సలహాదారుడిగా వేంనరేందర్‌ రెడ్డి.. క్యాబినెట్‌ హోదా". NT News. 21 January 2024. Archived from the original on 26 December 2024. Retrieved 26 December 2024.
  5. Sakshi (24 May 2015). "నలుగురు కావలెను!". Archived from the original on 10 జనవరి 2022. Retrieved 10 January 2022.
  6. Namasthe Telangana (26 June 2021). "టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి నియామ‌కం". Namasthe Telangana. Archived from the original on 26 June 2021. Retrieved 26 June 2021.
  7. HMTV (18 November 2023). "కాంగ్రెస్ లో చేరిన విజయశాంతికి కీలక పదవి..!". Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.
  8. Sakshi (21 January 2024). "ప్రభుత్వ సలహాదారుల నియామకం". Archived from the original on 21 January 2024. Retrieved 21 January 2024.
  9. Eenadu (22 January 2024). "సీఎం సలహాదారుగా వేం నరేందర్‌రెడ్డి". Archived from the original on 22 January 2024. Retrieved 22 January 2024.
  10. Eenadu (22 January 2024). "వ్యూహకర్తను వరించిన పదవి". EENADU. Archived from the original on 22 January 2024. Retrieved 22 January 2024.
  11. Sakshi (22 January 2024). "'వేం'కు సముచిత స్థానం". Archived from the original on 22 January 2024. Retrieved 22 January 2024.
  12. Andhrajyothy (31 March 2024). "లోక్‌సభ నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లను ప్రకటించిన కాంగ్రెస్.. హైదరాబాద్‌కు ఎవరంటే." Archived from the original on 31 March 2024. Retrieved 31 March 2024.