Jump to content

చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ప్రస్తుతం ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి
ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించిన జైపాల్ రెడ్డి

తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. కొత్తగా చేపట్టిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ వల్ల ఈ లోక్‌సభ నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది. ఇంతకు పూర్వం ఇది హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉండేది.తెలంగాణాలోని 33 జిల్లాలలో జిల్లా కేంద్రము కాని పార్లమెంటు రెండు స్థానాలు చేవెళ్ళ, జహీరాబాదు. 2019 లో జరిగిన 17 వ లోక్‌సభ ఎన్నికల్లో గడ్డం రంజిత్‌రెడ్డి గెలుపొందాడు.2024 లో జరిగిన 18వ లోకసభ ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపొందాడు.

దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములు

[మార్చు]
  1. మహేశ్వరం శాసనసభ నియోజకవర్గం
  2. రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గం
  3. శేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం
  4. చేవెళ్ళ శాసనసభ నియోజకవర్గం
  5. పరిగి శాసనసభ నియోజకవర్గం
  6. వికారాబాదు శాసనసభ నియోజకవర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
  7. తాండూర్ శాసనసభ నియోజకవర్గం

ప్రతినిధులు

[మార్చు]

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున బద్దం బాల్‌రెడ్డి పోటీ చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున 2004లో మిర్యాలగూడ లోక్‌సభ నుండి విజయం సాధించిన ఎస్.జైపాల్ రెడ్డి పోటీలో ఉన్నాడు.[1]

సంవత్సరం రిజర్వేషన్ గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు
2009[2] జనరల్ సూదిని జైపాల్ రెడ్డి కాంగ్రెస్ 4,20,807 ఎ.పి.జితేందర్ రెడ్డి టీడీపీ 402275
2014[3] జనరల్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ 435077 పట్లోళ్ల కార్తీక్ రెడ్డి కాంగ్రెస్ 362054
2019 [4] జనరల్ జి.రంజిత్ రెడ్డి టీఆర్ఎస్ 528148 కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ 513831
2024[5][6] జనరల్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ 809882 జి.రంజిత్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 636985

2024 ఎన్నికలు

[మార్చు]

చేవెళ్ల పార్లమెంటు స్థానానికి 64 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఏప్రిల్ 26వ తేదీన జరిగిన నామినేషన్ల పరిశీలనలో 18 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 46మంది అభ్యర్థులు నామినేషన్లను జిల్లా ఎన్నికల అధికారి శశాంక ఆమోదించారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు సమయానికి ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో బరిలో 43 మంది అభ్యర్థులు నిలిచారు.[7][8]

2024 లో జరిగిన 18వ లోకసభ ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపొందాడు.[9]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (13 April 2024). "పట్టు నిలపాలని.. పాగా వేయాలని." Archived from the original on 13 April 2024. Retrieved 13 April 2024.
  2. "Constituency Wise Detailed Results" (PDF). Election Commission of India. p. 196. Archived from the original (PDF) on 11 August 2014. Retrieved 30 April 2014.
  3. "Constituencywise-All Candidates". Election Commission of India. Archived from the original on 17 May 2014.
  4. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  5. "2024 Indian general election", Wikipedia (in ఇంగ్లీష్), 2024-06-05, retrieved 2024-06-05
  6. Andhrajyothy (5 June 2024). "కమల 'వికాసం'". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  7. EENADU (30 April 2024). "4 స్థానాలు.. 140 మంది అభ్యర్థులు". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.
  8. Andhrajyothy (30 April 2024). "ముగిసిన నామినేషన్ల ఘట్టం". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.
  9. ABN (2024-06-05). "కమల 'వికాసం'". Andhrajyothy Telugu News. Retrieved 2024-06-05.