Jump to content

షేక్ సాదిక్ అలీ

వికీపీడియా నుండి
షేక్ సాదిక్ అలీ
వ్యక్తిగత వివరాలు
జననం(1963-07-03)1963 జూలై 3
కల్లూరు, ఖమ్మం జిల్లా, తెలంగాణ
మరణం2024 నవంబరు 7(2024-11-07) (వయసు 61)
హైదరాబాద్‌, తెలంగాణ
జీవిత భాగస్వామిఉష
వృత్తి
  • జర్నలిస్ట్
  • సామజిక సేవకుడు
మారుపేరుతోపుడు బండి సాదిక్

షేక్ సాదిక్ అలీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన జర్నలిస్ట్, సామజిక సేవకుడు. ఆయన తోపుడు బండిపై తెలుగు సాహిత్యాన్ని ఇంటింటికి పరిచయం చేసే వినూత్న ఉద్యమాన్ని 2014లో ప్రారంభించాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

షేక్ సాదిక్ అలీ 1963 జూలై 3న తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, కల్లూరు గ్రామంలో జన్మించాడు. ఆయన ఖమ్మం ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ కళాశాలలో డిగ్రీ ఆ తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేశాడు.

తోపుడు బండి ఉద్యమం

[మార్చు]

షేక్ సాదిక్ అలీ ఇంటింటికీ తెలుగు సాహిత్యాన్ని పరిచయం చేసే లక్ష్యంతో 2014లో "తోపుడు బండి" ("ట్రాలీ కార్ట్") అనే ఒక ప్రత్యేకమైన ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఆయన చేసిన ఈ ప్రయత్నం సాహిత్యాభిమానులలో విపరీతమైన ఆదరణ పొంది "పల్లెకు ప్రేమతో" అనే పేరుతో ప్రయాణాన్ని చేపట్టి పుస్తకాలతో నిండిన బండితో 100 రోజుల్లో 1,000 కిలోమీటర్లు ప్రయాణించి, పఠనం & అక్షరాస్యతను ప్రోత్సహించాడు.[2] షేక్ సాదిక్ అలీ తోపుడు బండి ఫౌండేషన్ ద్వారా ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని మారుమూల గ్రామాల్లో 150కి పైగా గ్రంథాలయాలను నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించి తద్వారా అనేక ఇతర లైబ్రరీలకు పుస్తకాల పంపిణీని కూడా సులభతరం చేసి ఈ ప్రాంతాలలో సాహిత్యానికి ప్రాప్యతను గణనీయంగా పెంచాడు.

షేక్ సాదిక్ అలీ పేద పిల్లలకు సాయం చేసేందుకు తోపుడుబండి ఫౌండేషన్‌ను స్థాపించి ఫౌండేషన్‌ ద్వారా విరాళాలు సేకరించి వేలాదిమంది పేద పిల్లలకు ఉచితంగా పుస్తకాలు, స్కూల్‌ యూనిఫామ్స్‌, పాఠశాలలకు ఫర్నిచర్‌ సమకూర్చాడు. ఆయన కొవిడ్ సమయంలో పేద విద్యార్థులకు సెల్‌ఫోన్లను ఉచితంగా అందించి వారి విద్యాభివృద్ధికి తోడ్పడ్డాడు.

మరణం

[మార్చు]

షేక్ సాదిక్ అలీకి ఛాతీ నొప్పితో రావడంతో ఆయన ఖమ్మంలోని ఓ ఆసుపత్రిలో చేరగా, పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ 2024 నవంబర్ 7న మరణించాడు. ఆయనకు భార్య ఉష ఉన్నారు. ఆమె తెలంగాణ వ్యవసాయశాఖలో జాయింట్‌ డైరెక్టర్‌గా పని చేస్తుంది.[3][4][5]

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (9 November 2024). "సాదిక్ అంటే... నిరంతర చలనం". Andhrajyothy Telugu News. Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.
  2. NT News (27 August 2021). "'తోపుడు బండి' సేవలు అభినందనీయం". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.
  3. Andhrajyothy (8 November 2024). "తోపుడు బండి సాదిక్‌ అలీ కన్నుమూత". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.
  4. NT News (8 November 2024). "పుస్తకాల బండి ఆగిపోయింది". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.
  5. Prajasakti (8 November 2024). "తోపుడుబండి సాధిక్‌ కన్నుమూత". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.