1984 తమిళనాడు శాసనసభ ఎన్నికలు
![]() | ||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||
మొత్తం 234 స్థానాలన్నింటికీ 118 seats needed for a majority | ||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Turnout | 73.47% | |||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||
![]() 1984 ఎన్నికల ఫలితాలు | ||||||||||||||||||||||||||||||||||
|
తమిళనాడు ఎనిమిదవ శాసనసభ ఎన్నికలు 1984 డిసెంబరు 24 న జరిగాయి. ఈ ఎన్నికలలో ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) విజయం సాధించి, MG రామచంద్రన్ (MGR) మూడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఇందిరాగాంధీ హత్య, ఎంజీఆర్ అనారోగ్యం, రాజీవ్‌గాంధీ జనాదరణ కారణంగా ఏర్పడిన సానుభూతి తరంగానికి ఎన్నికల విజయం ప్రధానంగా కారణమైంది. 1987లో పదవిలో ఉండగానే మరణించిన ఎంజీఆర్ పోటీ చేసిన చివరి ఎన్నికలు ఇదే. 1957 నుండి మరణించే వరకూ M. కరుణానిధి పోటీ చేయని ఏకైక ఎన్నికలు కూడా ఇదే. 2023 నాటికి, అధికార పార్టీ అధిక సీట్లు పొందిన చివరి ఎన్నికలు కూడా ఇవే.
నేపథ్యం
[మార్చు]1984 అక్టోబర్ 31న ఇందిరా గాంధీ హత్యకు గురైంది. అదే సమయంలో, MG రామచంద్రన్ మూత్రపిండ వైఫల్యంతో బాధపడుతూ న్యూయార్క్ నగరంలో ఆసుపత్రిలో చేరాడు. ఇందిత హత్య వెంటనే రాజీవ్ గాంధీ ప్రధాని పదవీ బాధ్యతలు స్వీకరించాడు. రాజీవ్ గాంధీ తన ప్రభుత్వానికి ప్రజల నుండి తాజా ఎన్నిక అవసరమని భావించి, సార్వత్రిక ఎన్నికల కోసం లోక్‌సభ పదవీకాలం ముగియడానికి ఒక సంవత్సరం ముందే సభను రద్దు చేశాడు. అదే సమయంలో, తమిళనాడు ముఖ్యమంత్రి, MGR, కాంగ్రెస్ సానుభూతి తరంగాన్ని ఉపయోగించుకోవడానికీ, తన ప్రజాదరణను కూడా పరీక్షించుకోడానికీ, పదవీకాలం ముగియడానికి ఒక సంవత్సరం ముందుగానే తమిళనాడు రాష్ట్ర శాసనసభను రద్దు చేయాలని సిఫార్సు చేశారు. భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర), ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం లు కూటమిగా ఏర్పడి ఈ రెండు ఎన్నికల్లో పోటీ చేశాయి. [1] [2]
సీట్ల కేటాయింపు
[మార్చు]"MGR ఫార్ములా" అనే పేరున్న సీట్ల కేటాయింపు పద్ధతిలో, ప్రాంతీయ పార్టీ 70% శాసనసభ స్థానాల్లో పోటీ చేయగా, జాతీయ పార్టీ 70% లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. MGR ముఖ్యమంత్రిగా ఉండగా మరణించడంతో అతను పోటీ చేసిన చివరి ఎన్నికలు ఇవే అయ్యాయి.
ప్రచారం
[మార్చు]ఎంజీ రామచంద్రన్ ఆస్పత్రికే పరిమితమయ్యాడు. ఇందిరా గాంధీ హత్యతో పాటు ఆసుపత్రిలో కోలుకుంటున్న ఎంజీఆర్ వీడియో కవరేజీని కలిపిఉ ప్రచారంలో ఉపయోగించుకున్నారు. ఈ వీడియో తమిళనాడు అంతటా ప్రదర్శించారు. రాజీవ్ గాంధీ తమిళనాడులో తుఫాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించాడు. ఇందిర హత్య, ఎంజీఆర్ అనారోగ్యం, రాజీవ్‌గాంధీ చరిష్మా సృష్టించిన సానుభూతితో కూటమి ఎన్నికల్లో విజయం సాధించింది. [1] [2] అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ అమెరికాలోని ఆస్పత్రిలో చేరడం, ఇందిరాగాంధీ హత్యకు గురికావడం వంటి కారణాలతో డీఎంకే అధినేత ఎం. కరుణానిధి ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు.[3]
సీట్ల కేటాయింపులు
[మార్చు]ఏఐఏడీఎంకే కూటమి
[మార్చు]నం. | పార్టీ | ఎన్నికల చిహ్నం | నాయకుడు | సీట్లు |
---|---|---|---|---|
1. | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం | ![]() |
MG రామచంద్రన్ | 155 |
2. | భారత జాతీయ కాంగ్రెస్ | ![]() |
ఎం.పళనియాండి | 73 |
3. | గాంధీ కామరాజ్ జాతీయ కాంగ్రెస్ | ![]() |
కుమారి అనంతన్ | 4 |
నం. | పార్టీ | ఎన్నికల చిహ్నం | నాయకుడు | సీట్లు |
---|---|---|---|---|
1. | ద్రవిడ మున్నేట్ర కజగం | ![]() |
ఎం.కరుణానిధి | 176 |
2. | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | ![]() |
పి.మాణికం | 17 |
3. | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | ![]() |
ఎ. నల్లశివన్ | 16 |
4. | జనతా పార్టీ | ![]() |
16 |
ఓటింగు, ఫలితాలు
[మార్చు]
- ↑ 1.0 1.1 G. Palanithurai (June 1991). Role Perception of the Legislators: A Case Study of Tamil Nadu. Stosius Inc/Advent Books Division. p. 27. ISBN 81-220-0227-7.
- ↑ 2.0 2.1 K. Mohandas (1992). MGR, the man and the myth. Panther Publishers. pp. 105–106. ISBN 978-81-85457-09-3.
- ↑ TN Elections 2011: DMK releases candidates list for 119 seats-Karunanidhi from Tiruvarur, Stalin fielded in Kolathur
Alliance/Party | Seats won | Change | Popular Vote | Vote % | Adj. %‡ | |
---|---|---|---|---|---|---|
AIADMK+ alliance | 195 | +29 | 1,16,81,221 | 53.9% | ||
AIADMK | 132 | +3 | 80,30,809 | 37.0% | 54.3% | |
INC | 61 | +30 | 35,29,708 | 16.3% | 54.5% | |
GKC | 2 | -4 | 1,20,704 | 0.6% | 40.4% | |
DMK+ alliance | 34 | -25 | 80,21,293 | 37.0% | ||
DMK | 24 | -13 | 63,62,770 | 29.3% | 40.8% | |
CPI(M) | 5 | -6 | 5,97,622 | 2.8% | 39.6% | |
JNP | 3 | +1 | 4,93,374 | 2.3% | 36.4% | |
CPI | 2 | -7 | 5,67,527 | 2.6% | 35.5% | |
Others | 5 | -4 | 19,83,959 | 9.1% | ||
IND | 4 | -4 | 16,19,921 | 7.5% | 7.9% | |
AKD | 1 | – | 47,212 | 0.7% | 57.2% | |
TNC | 0 | – | 152,315 | 0.7% | 34.9% | |
ICJ | 0 | – | 1,10,121 | 0.5% | 3.2% | |
BJP | 0 | – | 54,390 | 0.3% | 3.7% | |
Total | 234 | – | 2,16,86,473 | 100% | – |
ఎంజీఆర్ మూడో మంత్రివర్గం
[మార్చు]1984 డిసెంబరులో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత గవర్నరు, 1985 ఫిబ్రవరి 10 ఉదయం కొత్త ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా MG రామచంద్రన్‌ను నియమించారు. ముఖ్యమంత్రి 1985 ఫిబ్రవరి 14న మరో 16 మంది మంత్రులను నియమించారు.
జానకి మంత్రివర్గం
[మార్చు]S.no | పేరు | హోదా | పార్టీ | |
---|---|---|---|---|
ముఖ్యమంత్రి | ||||
1. | వీఎన్ జానకి | ముఖ్యమంత్రి | ఏఐఏడీఎంకే | |
కేబినెట్ మంత్రులు | ||||
2. | RM వీరప్పన్ | స్థానిక పరిపాలన మంత్రి | ఏఐఏడీఎంకే | |
3. | పియు షణ్ముగం | ఆరోగ్య శాఖ మంత్రి | ||
4. | సి. పొన్నయన్ | విద్య, న్యాయ శాఖ మంత్రి | ||
5. | S. ముత్తుసామి | రవాణా శాఖ మంత్రి | ||
6. | వివి స్వామినాథన్ | పర్యాటక, నిషేధం, విద్యుత్ శాఖ మంత్రి | ||
7. | T. రామసామి | వాణిజ్య పన్నుల శాఖ మంత్రి | ||
8. | ఎ. అరుణాచలం | ఆది ద్రావిడర్ సంక్షేమ శాఖ మంత్రి |
ఎంజీఆర్ మరణానంతరం వీఆర్ నెడుంచెజియన్ తాత్కాలిక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. కానీ, ఒక వారం తర్వాత, MGR భార్య జానకి ముఖ్యమంత్రిగా, RM వీరప్పన్ నేతృత్వంలోని పార్టీ మెజారిటీ మద్దతు ఇచ్చింది. ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. సభలో మెజారిటీ మద్దతు నిరూపించుకునేందుకు గవర్నర్, జానకీ రామచంద్రన్‌కు 30 రోజుల సమయం ఇచ్చారు. కొత్త ముఖ్యమంత్రి కావడానికి ఆమె సొంత పార్టీకి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు జె. జయలలితకు మద్దతు ఇవ్వడం వల్ల ఇది సమస్యగా మారింది. 234 మంది ఉన్న సభలో జానకికి కేవలం 105 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది, ఎందుకంటే వీఆర్ నేదుంచెజియన్ 10 మంది మద్దతుదారులు తటస్థంగా ఉండి ఓటింగ్‌ను బహిష్కరించారు.
ఓటింగ్ రోజున, స్పీకర్ పిహెచ్ పాండియన్, సభను కించపరిచే విధంగా ప్రవర్తించిన కారణంగా ప్రతిపక్ష పార్టీ డిఎంకెకు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు, ఎఐఎడిఎంకె (జయలలిత వర్గం) కి చెందిన 15 మంది ఎమ్మెల్యేలనూ ఎమ్మెల్యే పదవుల నుండి అనర్హులుగా ప్రకటించి, సభలో 199 మంది సభ్యులు మాత్రమే ఉన్నందున విశ్వాసానికి 100 మంది ఉంటే సరిపోతుందని చెప్పాడు.
మౌఖిక ఓటింగు ప్రారంభానికి ముందు, సభలో హింస చెలరేగింది, స్పీకర్ గాయపడ్డాడు. నెత్తురోడుతున్న తలతోనే అతను, జానకి 105 మంది ఎమ్మెల్యేలతో మెజారిటీ నిరూపించుకుందని ప్రకటించి వెంటనే సభను వాయిదా వేశాడు. అనంతరం సభ్యులను బయటకు పంపించారు.
అనుమానాస్పద వాతావరణంలో జరిగిన ఈ ఓటింగ్‌ను ఆమోదించడానికి రాష్ట్ర గవర్నర్ నిరాకరించాడు. శాసనసభను రద్దు చేసి, తాజా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశాడు. కేంద్ర ప్రభుత్వం సిఫార్సును ఆ ఆమోదించింది, రాష్ట్రపతి శాసనసభను రద్దు చేశారు.