హాహాహూహూ
హాహాహూహూ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, కవిసామ్రాట్టు విశ్వనాథ సత్యనారాయణ రచించిన నవల. ఇది సోషియో ఫాంటసీ విభాగానికి సంబంధించిన నవల.
రచన నేపథ్యం
[మార్చు]హాహాహూహూ నవల రచనాకాలం 1952గా భావిస్తున్నట్టు గ్రంథకర్త కుమారుడు, నవల సంపాదకుడు, ప్రచురణకర్త విశ్వనాథ పావనిశాస్త్రి పేర్కొన్నారు. విశ్వనాథ సత్యనారాయణ ఆశువుగా చెప్తూండగా లిపిబద్ధమైన ఈ నవలను ఎవరు లిపిబద్ధం చేశారన్నది సమాచారం, ప్రథమ ముద్రణ సంవత్సరం తెలియదని పావనిశాస్త్రి తెలిపారు. ఈ నవల1982లో ఆంధ్రజ్యోతి - సచిత్ర వార పత్రికలో ధారావాహికగా వెలువడింది. ఈ పుస్తకం ఏడవ ముద్రణ 2006లో జరిగింది. 2013లో మరో ముద్రణ జరిగింది.[1]
ఇతివృత్తం
[మార్చు]లండనులోని "ట్రెఫాల్గర్ స్క్వేర్" వద్ద గుర్రపు తల, మనిషి శరీరంతో వింతజంతువు కనిపిస్తుంది. చేతికి కడియం, ఒంటికి దుస్తులు, ఎనిమిదడుగుల ఎత్తు ఉన్న ఆ విచిత్ర జీవి స్పృహలో ఉండదు. జంతు ప్రదర్శనశాలలో ఉంచిన ఆ వింతజంతువును చూసేందుకు తీర్థప్రజల్లా జనం తండోపతండాలుగా వస్తారు. మేలుకున్నాకా ఆ జంతువు మాట్లాడుతూండడం, నవ్వుతూండడంతో అందరూ ఆశ్చర్యపోతారు. ఆ జంతువు చివరకు ఓ పోలీస్ వద్ద తుపాకీ లాక్కోవడంతో భయమూ పొందుతారు. చివరకు ఆ జంతువు జంతువు కాదు, అది మాట్లాడుతున్న భాష సంస్కృతం అని తేలుతుంది.[2]
శైలి, శిల్పం
[మార్చు]ఉదాహరణలు
[మార్చు]ప్రాచుర్యం
[మార్చు]అనువాదాలు
[మార్చు]హాహాహూహూ నవలను ప్రముఖ విమర్శకుడు, అనువాదకుడు వెల్చేరు నారాయణరావు అదే పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. 1981లో "జర్నల్ ఆఫ్ సౌత్ ఏషియన్ లిటరేచర్"లో ప్రచురితమైంది.[3]
కన్నడంలో కూడ అష్టావధాని గణేశ భట్ట కొప్పలతోట అదే పేరుతో అనువదించాడు. అది"ఉత్థాన" మాసపత్రికలో 2023 ఏప్రిల్ నుంచి ప్రచురితమైంది.
విమర్శ రచనలు
[మార్చు]హార్స్ హెడెడ్ గాడ్స్ అండ్ వైట్ స్కిన్డ్ మెన్:ఎ సెకండ్ లుక్ ఎట్ హాహాహూహూ ఆఫ్ విశ్వనాథ సత్యనారాయణ శీర్షికన ప్రముఖ విమర్శకుడు, అనువాదకుడు వెల్చేరు నారాయణరావు 1981లో "జర్నల్ ఆఫ్ సౌత్ ఏషియన్ లిటరేచర్"లో విమర్శవ్యాసం ప్రచురితమైంది.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ హాహాహూహూ నవల(2013, శ్రీ విశ్వనాథ పబ్లికేషన్స్ ప్రచురణ)లో ఒకమాట శీర్షికన విశ్వనాథ పావనిశాస్త్రి నోట్
- ↑ హాహాహూహూ, స్నేహఫలము(2013, శ్రీ విశ్వనాథ పబ్లికేషన్స్ ప్రచురణ)
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2014-05-14. Retrieved 2014-01-15.