Jump to content

సురస

వికీపీడియా నుండి
సురస
సురస నోటిలో దూరి బయటకు వస్తున్న హనుమంతుడు. థాయ్‌ల్యాండ్, బ్యాంకాంక్ లోని టెంపుల్ ఆఫ్ ఎమరాల్డ్ బుద్ధ లో కుడ్య చిత్రం
సర్పాలకు తల్లి
తల్లిదండ్రులుదక్షుడు
పాఠ్యగ్రంథాలురామాయణం

సురస హిందూ పురాణాలలో కనిపించే దేవత. ఈమె సర్పాలకు తల్లిగా భావిస్తారు.[1] ఈమె గురించి బాగా ప్రాచుర్యంలో ఉన్న గాథ రామాయణంలోని, సుందర కాండలో కనిపిస్తుంది.

పురాణ గాథ

[మార్చు]

శ్రీరాముని భార్య సీతను వనవాసంలో ఉండగా రావణాసురుడు అపహరిస్తాడు. ఆమెను వెతుకుతూ రామలక్ష్మణుడు సుగ్రీవాది వానరసేనను, హనుమంతుని కలుస్తారు. రాముడు సుగ్రీవుని పీడిస్తున్న అతని అన్న వాలిని వధించి ప్రతిగా సీతను వెతకడంలో సహాయం చేయమని కోరతాడు. హనుమంతుడు లంకలో ఉన్న సీతను వెతకడానికి సముద్రాన్ని దాటి వెళుతుండగా మొదట పర్వతరాజు మైనాకుడు అతన్ని అడ్డగిస్తాడు. అతని ఆతిథ్యాన్ని స్వీకరించి హనుమ మరింత ముందుకు వెళతాడు. తర్వాత దేవతలు హనుమ యుక్తిని పరిశీలించడానికి పంపిన సురసను పంపుతారు. సురసను దాటి పోవడం కోసం హనుమ శరీరాన్ని పెంచుతూ పోతాడు. సురస కూడా తన శరీరాన్ని పెంచుకుంటూ పోతుంది. అప్పుడు హనుమ యుక్తితో సూక్ష్మరూపాన్ని ధరించి ఆమె నోటిలో దూరి వెంటనే తిరిగి వస్తాడు. హనుమంతుని బలం, తెలివి తేటలను చూసి సంతోషించి సురస అతన్ని దీవించి పంపుతుంది.

మూలాలు

[మార్చు]
  1. Mani, Vettam (1975). Puranic Encyclopaedia: A Comprehensive Dictionary With Special Reference to the Epic and Puranic Literature. Delhi: Motilal Banarsidass. p. 767. ISBN 0-8426-0822-2."
"https://te.wikipedia.org/w/index.php?title=సురస&oldid=4361384" నుండి వెలికితీశారు