Jump to content

సుభాష్ పిరాజీ సబ్నే

వికీపీడియా నుండి
సుభాష్ పిరాజీ సబ్నే

పదవీ కాలం
2014 – 2019
ముందు రావుసాహెబ్ అంతపుర్కర్
తరువాత రావుసాహెబ్ అంతపుర్కర్
నియోజకవర్గం డెగ్లూర్

పదవీ కాలం
1999 – 2009
ముందు అవినాష్ మధుకరరావు ఘాటే
తరువాత హన్మంత్ వెంకట్రావు పాటిల్
నియోజకవర్గం ముఖేడ్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ ప్రహార్ జనశక్తి పార్టీ (2024–)
ఇతర రాజకీయ పార్టీలు శివసేన, భారతీయ జనతా పార్టీ
నివాసం డెగ్లూర్, మహారాష్ట్ర
వృత్తి రాజకీయ నాయకుడు

సుభాష్ పిరాజీ సబ్నే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

సుభాష్ పిరాజీ సబ్నే 1984లో శివసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1995లో జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ముఖేడ్ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచాడు. ఆయన 1999లో జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అవినాష్ మధుకరరావు ఘాటేపై 5,353 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

సుభాష్ పిరాజీ సబ్నే 2004లో జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో డెగ్లూర్ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రాథోడ్ గోవింద్ మక్కాజీపై 1,216 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2009లో జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో డెగ్లూర్ శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రావుసాహెబ్ అంతపుర్కర్ చేతిలో 6011 ఓట్ల ఓడిపోయాడు.[3]

సుభాష్ పిరాజీ సబ్నే 2014లో జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో డెగ్లూర్ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రావుసాహెబ్ అంతపుర్కర్ పై 8,648 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2019లో జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో డెగ్లూర్ నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రావుసాహెబ్ అంతపుర్కర్ చేతిలో 22,433 ఓట్ల ఓడిపోయాడు.

సుభాష్ పిరాజీ సబ్నే 2021లో భారతీయ జనతా పార్టీలో చేరి[4][5] ఆ తరువాత 2021లో డెగ్లూర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జితేష్ అంతపుర్కర్ చేతిలో 41,933 ఓట్ల ఓడిపోయాడు.[6]

సుభాష్ పిరాజీ సబ్నే 2024 అక్టోబర్ 20న బీజేపీకి రాజీనామా చేసి ప్రహార్ జనశక్తి పార్టీ పార్టీలో[7] ఆ పార్టీ అభ్యర్థిగా 2024లో జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో డెగ్లూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి మూడోస్థానంలో నిలిచాడు.[8]

మూలాలు

[మార్చు]
  1. "Maharashtra Assembly Election Results 1999". Election Commission of India. Retrieved 16 November 2022.
  2. "Maharashtra Assembly Election Results 2004". Election Commission of India. Retrieved 16 November 2022.
  3. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  4. "BJP fields ex-Sena MLA for bypoll" (in Indian English). The Hindu. 3 October 2021. Archived from the original on 23 January 2025. Retrieved 23 January 2025.
  5. "Maharashtra: Former Shiv Sena MLA Subhash Sabne all set to join BJP". The Times of India. 4 October 2021. Archived from the original on 23 January 2025. Retrieved 23 January 2025.
  6. "Deglur assembly Bye Election 2021 Result". 2021. Archived from the original on 23 January 2025. Retrieved 23 January 2025.
  7. "Subhash Sabne: माजी आमदार सुभाष साबणेंनी भाजपला पक्षाला दिली सोडचिट्ठी; आज स्वराज्य पक्षात केला". 20 October 2024. Archived from the original on 23 January 2025. Retrieved 23 January 2025.
  8. "Maharastra Assembly Election Results 2024 - Deglur". Election Commission of India. 23 November 2024. Archived from the original on 16 December 2024. Retrieved 16 December 2024.