Jump to content

జితేష్ అంతపుర్కర్

వికీపీడియా నుండి
జితేష్ రావుసాహెబ్ అంతపుర్కర్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2021-ప్రస్తుతం
ముందు రావుసాహెబ్ అంతపుర్కర్
నియోజకవర్గం డెగ్లూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1989-12-30) 1989 డిసెంబరు 30 (వయసు 35)
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (ఆగస్టు 2024-ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్ (2024 వరకు)
తల్లిదండ్రులు రావుసాహెబ్ అంతపుర్కర్
వృత్తి రాజకీయ నాయకుడు

జితేష్ అంతపుర్కర్ (జననం 30 డిసెంబర్ 1989) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2021 డెగ్లూర్ నియోజకవర్గంకు జరిగిన ఉపఎన్నికలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

జితేష్ అంతపుర్కర్ తన తండ్రి రావుసాహెబ్ అంతపుర్కర్ మరణాంతరం కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2021లో డెగ్లూర్ నియోజకవర్గంకు జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బిజెపి అభ్యర్థి సబ్నే సుభాష్ పిరాజీరావుపై 41933 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3]

జితేష్ అంతపుర్కర్ మహారాష్ట్ర శాసనమండలి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసినందుకు గాను 30 ఆగస్టు 2024న కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించబడ్డాడు.[4][5] ఆయన 31 ఆగష్టు 2024న ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[6]

జితేష్ అంతపుర్కర్ 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి నివృత్తి కాంబ్లేపై 42,999 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[7][8]

మూలాలు

[మార్చు]
  1. "Delgur Bypolls Results Highlights: Jitesh Antapurkar of Congress Wins Delgur Seat by Margin of 41933 Votes" (in ఇంగ్లీష్). 2 November 2021. Retrieved 25 October 2024.
  2. "Deglur Assembly bypoll 2021 Result". Election Commission of India. 2021. Archived from the original on 16 December 2024. Retrieved 16 December 2024.
  3. "Congress defeats BJP to win Deglur bypoll" (in ఇంగ్లీష్). The Indian Express. 3 November 2021. Archived from the original on 16 December 2024. Retrieved 16 December 2024.
  4. "Cong MLAs Siddique, Antapurkar expelled from party: MPCC chief Nana Patole". 30 August 2024. Retrieved 25 October 2024.
  5. The Telegraph (30 August 2024). "Congress expels MLAs Siddique and Antapurkar ahead of Maharashtra assembly polls". Retrieved 25 October 2024.
  6. "काँग्रेसचे माजी आमदार जितेश अंतापुरकरांचा भाजपमध्ये प्रवेश, देवेंद्र फडणवीस म्हणाले, अशोक चव्हा". 30 August 2024. Retrieved 25 October 2024.
  7. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  8. "Maharastra Assembly Election Results 2024 - Deglur". Election Commission of India. 23 November 2024. Archived from the original on 16 December 2024. Retrieved 16 December 2024.