సి పి బ్రౌన్ పురస్కారం
అనువాదం, పరిశోధన, నిఘంటు నిర్మాణాల్లో తెలుగు జాతికి ఎనలేని సేవలందిచిన సి.పి. బ్రౌన్ స్మృత్యర్థం ఈ పురస్కారం నెలకొల్పబడింది. దీనిని తమ్మినేని యదుకుల భూషణ్ గారు నెలకొల్పారు. ప్రతి ఏట ఈ పురస్కారాన్ని (పదివేల నూట పదహారు రూపాయిలు) నవంబరు 24 వ తారీకు ఇస్మాయిల్ గారి సంస్మరణ సభలో ప్రదానం చేస్తారు. 2011 నుంచి ఈ పురస్కారాన్ని పాతిక వేలా నూట పదహార్లకి పెంచారు.
ఎంపిక పద్ధతి
[మార్చు]బ్రౌన్ పురస్కారం ఎంపికలో పాటించే పద్ధతులు.
1.బ్రౌన్ పురస్కారం అనువాదం,నిఘంటునిర్మాణం,పరిశోధనరంగాల్లో కృషి చేసిన పండితులకే.
2.ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క రంగంలో కృషి చేసిన పండితుణ్ణి గుర్తించి గౌరవిస్తారు.
3.గ్రంథానికి సరిపడా వ్యాసాలున్న పక్షంలో దేశి బుక్స్ తరపున గ్రంథాన్ని ప్రకటిస్తారు.
4.పురస్కార గ్రహీతలు ముందు ముందు తమకు నచ్చిన పండితుణ్ణి సూచించవచ్చు.
5.ఎంపికలో తుది నిర్ణయం ఐదుగురు సభ్యులున్న కమిటీదే.
పురస్కార గ్రహీతలు
[మార్చు]సంవత్సరం | రచయిత | పుస్తకం | సభా స్థలం | |
---|---|---|---|---|
2007 | దేశెట్టి కేశవ రావు | Tree, My Guru, ఇస్మాయిల్ "చెట్టు నా ఆదర్శం"కి ఆంగ్లానువాదం | కడప | |
2008 | జొన్నలగడ్డ వేంకటేశ్వర శాస్త్రి | J.P.L. గ్విన్ నిఘంటు నిర్మాణంలో సహ సంపాదకత్వం | హైదరాబాద్ | |
2009 | జెజ్జాల కృష్ణమోహన రావు | ఛందశ్శాస్త్రంపై పరిశోధన | న్యూజెర్సీ | |
2010 | దీవి సుబ్బారావు | కన్నడ వచనాలు - అనువాదం | హైదరాబాద్ | |
2011 | కోరాడ మహాదేవ శాస్త్రి | భాషా శాస్త్రంలో ఏడు దశాబ్దాల అవిరళ కృషి, పరిశోధన | చెన్న పట్నం | |
2012 | ఆలూరి భుజంగ రావు | చారిత్రక నవలా సాహిత్యం, తత్వ శాస్త్రం - అనువాదాలు | గుంటూరు | |
2013 | రవ్వా శ్రీహరి | భాషా శాస్త్రంలో కృషి,నిఘంటు నిర్మాణం, పరిశోధన | తిరుపతి | |
2014 | పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి | యావజ్జీవితం శాసన పరిశోధన | హైదరాబాద్ | |
2015 | యల్లపు ముకుంద రామారావు | దశాబ్ద కాలంగా వివిధ అనువాదాలు | హ్యూస్టన్ |
బయటి లింకులు
[మార్చు]- "ఈ మాట" ప్రకటన Archived 2009-01-08 at the Wayback Machine
- "సాక్షి" ప్రకటన
- "దట్స్ తెలుగు" ప్రకటన[permanent dead link]
- 2009 "ఈ మాట" ప్రకటన Archived 2010-01-16 at the Wayback Machine