సి.పి.బ్రౌన్ పురస్కారం, 2019 సంవత్సరానికి రాష్ట్రపతి గౌరవ సర్టిఫికేట్, మహర్షి బాదరాయణ్ వ్యాస్ సమ్మాన్ ప్రదానం[1] కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
2017 ఆగస్టు 12న హైదరాబాదులో ఆచార్య రవ్వా శ్రీహరి పంచ సప్తతి మహోత్సవాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి (స్వతంత్ర బాధ్యతలు) బండారు దత్తాత్రేయ జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు.
యాదగిరి లక్ష్మీనృసింహ సంస్కృత విద్యాపీఠంలో సురవరం ప్రతాపరెడ్డి, ఎం.నరసింగరావుల సహాయంతో చేరాడు. కప్పగంతుల లక్ష్మణశాస్త్రి ఇతనికి గురువు. తరువాత హైదరాబాద్ లోని సీతారాంబాగ్‌లో కల సంస్కృత కళాశాలలో డి.ఓ.ఎల్, బి.ఓ.ఎల్. వ్యాకరణం చదివాడు. శఠకోప రామానుజాచార్యులు, ఖండవల్లి నరసింహశాస్త్రి, అమరవాది కృష్ణమాచార్యుల వద్ద మహాభాష్యాంతం వ్యాకరణం చదువుకున్నాడు. బి.ఓ.ఎల్. వ్యాకరణంలో పాసైన వెంటనే వివేకవర్ధిని కళాశాలలో తెలుగు పండితుడుగా చేశాడు. క్రమంగా బి.ఏ., తెలుగు పండిత శిక్షణ చేశాక, ఎం.ఏ. తెలుగు, సంస్కృతం చేశాడు.
రచనా ప్రక్రియలో మాత్రం తెలుగు రచనలకు పెద్దపీట వేసి 50 వరకు గ్రంథాలను వెలువరించాడు. సంస్కృతంలో 25 పుస్తకాలు రచించారు.పరిశోధన, సృజన, విమర్శ, అనువాదం, నిఘంటు నిర్మాణం వంటి రంగాల మీద తనదైన ముద్రవేశాడు. మూడు పదుల వయస్సులో వ్యాకరణ పదకోశ నిర్మాణం చేశాడు. పాణినీయ అష్టాధ్యాయి లాంటి కఠిన వ్యాకరణ గ్రంథానికి 2 వేల పేజీలలో వ్యాఖ్యానం సమకూర్చి వ్యాకరణాధ్యాయణాన్ని సులభతరం చేశాడు. [7]
మిత్రులు. కుటుంబ సభ్యులు, శిష్యులు, సాహితీ ప్రియులు కలిసి ఏర్పాటు చేసి సంస్కృతాంధ్రాలలో విశేష కృషిచేసిన సాహితీ వేత్తలకు వారికి జీవన సాఫల్య పురస్కారాన్ని అందిస్తున్నారు. వారిలో శలాక రఘునాథ శర్మ . నలిమెల భాస్కర్ (బహుభాషా పండితుడు, తెలంగాణా నిఘంటువు కూర్చారు) ఉన్నారు[7]
79 ఏళ్ల శ్రీహరి గుండెపోటుతో హైదరాబాదులోని మలక్‌పేటలో 2023, ఏప్రిల్ 21న మరణించాడు.[10][11] ఆయనకు భార్య అనంతలక్ష్మి, కుమారులు రమేశ్, శివకుమార్, పతంజలి ఉన్నారు.
↑ 3.03.1"బ్రౌన్ పురస్కారం-2013". pustakam.net/?p=15682. pustakam.net. Archived from the original on 2015-04-18. Retrieved 2015-04-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)