కోరాడ మహాదేవ శాస్త్రి
కోరాడ మహాదేవ శాస్త్రి | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | కోరాడ మహాదేవ శాస్త్రి 1921 |
మరణం | 2016 |
వృత్తి | రచయిత, భాషా శాస్త్రవేత్త, ఆచార్యులు అన్నామలై విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం |
పూర్వవిద్యార్థి | కలకత్తా విశ్వవిద్యాలయం, మద్రాసు విశ్వవిద్యాలయం |
విషయం | భాషా శాస్త్రంలో పరిశోధకులు |
జీవిత భాగస్వామి | శ్రీమతి కోరాడ సరస్వతి |
సంతానం | 3 కుమారులు, ఒక కుమార్తె |
కోరాడ మహాదేవ శాస్త్రి గారు భాషా శాస్త్రంలో పరిశోధకులు. 2011 కి గాను బ్రౌన్ పురస్కార గ్రహీత.[1]
జీవిత విశేషాలు
[మార్చు]కోరాడ మహాదేవ శాస్త్రిగారు 1921లో బందరులో జన్మించారు . 1944లో చెన్నపట్టణంలోని ప్రెసిడెన్సీ కళాశాలలో చరిత్ర, ఆర్థిక శాస్త్రాల్లో ఉన్నత విద్యనభ్యసించారు. కొంతకాలం సంబంధిత రంగాల్లో పరిశోధన చేశారు. 1952లో కలకత్తా విశ్వవిద్యాలయం లోని భాషా శాస్త్రవేత్త సునీతి కుమార్ చటర్జీ మార్గదర్శకత్వంలో, సుకుమార్ సేన్, క్షితీష్ చంద్ర చటర్జీల శిష్యరికంలో కంపారిటివ్ ఫిలోలజీలో ప్రథమునిగా ఉత్తీర్ణుడై బంగారు పతకం పొందారు. ఆయన ఆర్థశాస్త్రం, కంపారిటివ్ ఫిలోలజీ, తెలుగు (లిట్) లలో మూడు పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీలను చేశారు. 1961లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి డాక్టర్ సునీతి కుమార్ ఛటర్జీ మార్గదర్శకత్వంలో తెలుగు చారిత్రక వ్యాకరణంపై పరిశోధనచేశి డి.లిట్ పట్టాను పొందారు. అన్నామలై విశ్వవిద్యాలయ భాషాశాస్త్ర విభాగంలో అధ్యాపకునిగా 1958లో తమ వృత్తిని ప్రారంభించారు, తరువాత తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగంలో (1960-68), అనంతపురం శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా (1968-82) పనిచేసి పదవీవిరమణ చేశారు. 1976-78 కాలంలో ఆయన జర్మనీ కొలోన్ విశ్వవిద్యాలయంలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండాలజీలో విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేశారు.
సునీతి కుమార్ ఛటర్జీ, క్షితీష్ చంద్ర ఛటర్జీ, సుకుమార్ సెన్, మీనాక్షిసుందరం పిళ్ళై, నీలకంఠ శాస్త్రి వంటి అనుభవజ్ఞుల అధ్వర్యంలో శిక్షణ పొంది, అరవై సంవత్సరాలకు పైగా తమ కృషితో తెలుగు భాషకు, భాషాశాస్త్రానికి అమూల్యమైన కృషి చేశారు. 1971 లో ఉనికిలోకి వచ్చిన ద్రావిడ భాషాశాస్త్ర సంఘాన్ని స్థాపించడానికి ఉద్యమాన్ని ప్రారంభించిన ముగ్గురు వ్యక్తులలో అయన ఒకరు. మిగిలిన ఇద్దరు ప్రొఫెసర్ వి.ఐ. సుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్ ఆర్.సి. హిరేమత్ లు. వీరు ద్రావిడ భాషా సంఘం స్థాపనకు మార్గం సుగమం చేసిన ముగ్గురు ద్రవిడ భాషా శాస్త్రవేత్తలు.[2]. త్రివేండ్రంలోని ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ద్రావిడియన్ లింగ్విస్టిక్స్ కు గౌరవాధ్యక్షత వహించారు.
ఆయన పరిశోధక విద్యార్థిగా గావించిన కృషి 'హిస్టారికల్ గ్రామర్ అఫ్ తెలుగు' - తెలుగు చారిత్రక వ్యాకరణంగా రూపు దిద్దుకుంది. ఈ విశిష్ట గ్రంథాన్ని హరప్పా లిపిని అర్థవంతంగా చదివే ప్రయత్నాల్లో ఐరావతం మహదేవన్ వినియోగించుకున్నారు.[3]
శాస్త్రిగారి ప్రధాన రచనలలో హిస్టారికల్ గ్రామర్ ఆఫ్ తెలుగు, డిస్క్రిప్టివ్ గ్రామర్ అండ్ హ్యాండ్ బుక్ ఆఫ్ మోడరన్ తెలుగు, బాల ప్రౌఢ వ్యాకరణ దీపిక, తెలుగుదేశ్యవ్యుత్పత్తి నిఘంటువు, ఆంధ్ర వాంజ్ఞయ పరిచయము ముఖ్యమైనవి. అంతేకాకుండా వారు జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో అనేక విలువైన పరిశోధనా పత్రాలను ప్రచురించారు.
రచనలు
[మార్చు]- Historical Grammar of Telugu[4] (1969). ఈ తెలుగు చారిత్రక వ్యాకరణ గ్రంథంలో తెలుగు భాష ఆవిర్భవించినది మొదలుకొని భాషలోని వ్యాకరణాంశాలు కాలక్రమాన ఏవిధంగా మారుతూవచ్చాయో వివరించారు. సాహిత్యంలోని భాష నిర్దిష్టమైన పద్ధతిలో ఉంటుంది. కానీ శాసనాలలోని భాష వ్యావహారికభాషగా ఉండటంవల్ల, ఆయా కాలాల్లో ఉన్న పదజాలానికి దగ్గరగా ఉండటంవల్ల, భాషాశాస్త్రజ్ఞులకు అమూల్యమైంది . సా.శ. 6వ శతాబ్దంనాటి నుండి లభించిన వందలాదిశాసనాలు పరిశోధించి రచించిన గ్రంథమిది. ఈ ‘హిస్టారికల్ గ్రామర్ అఫ్ తెలుగు’ గ్రంథం ఆధారంగా 1995 లో ఐరావతం మహాదేవన్ అనే తమిళ పండితుడు సింధునాగరికతకాలంనాటి శాసనాలలో కనపడే ‘బాణం గుర్తు’ తెలుగు పదాల చివర ఉండే ‘అంబు’ ప్రత్యయానికి చిహ్నమని గుర్తించాడు. అంటే సింధునాగరికత కాలం నాటికే తెలుగుభాషారూపం ఉందని, తెలుగుభాషా ప్రాచీనతను సూచిస్తోందని పండితులు నిర్ధారించారు.
- Discriptive Grammar and Handbook of Modern Telugu[5] (1985) (ఆధునికాంధ్ర వర్ణనాత్మక వ్యాకరణం) జర్మనీలోని కొలోన్ విశ్వవిద్యాలయ ‘ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండోలజి’ వారి ఆహ్వానంపై 1976 విజిటింగ్ ప్రొఫెసర్ గా వెళ్ళినపుడు ఆధునిక తెలుగు భాషాస్వరూపాన్ని వివరిస్తూ, విదేశీయులు తెలుగు భాష నేర్చుకునేందుకు రచించారు.
- తెలుగు దేశ్యవ్యుత్పత్తి నిఘంటువు (2003)[6][7] ద్రావిడ విశ్వవిద్యాలయం (కుప్పం) వారి అభ్యర్థనమేరకు రచించారు. ఇందులో ఆయా దేశ్య పదాల మూలధాతుస్వరూపం నిరూపించబడింది. ఒక్కొక్క ధాతువునుండి ఎన్నెన్ని పదాలు ఏర్పడ్డాయో, అవన్నీ అకారాదిగా సాహిత్యంలోనూ, శాసనాల్లోను, వాటి ప్రయోగాలు వివరిస్తుంది- ఈ గ్రంథం.
- A Grammar of Western Bhojpuri (1954) అనే రచన మానవశాస్త్రవిభాగం (Anthropoloy Department), కలకత్తా తరఫున ప్రకటించినది. కొలంబియా విశ్వవిద్యాలము యునెస్కో (UNESCO) ప్రాజెక్టు నిర్వహణకై పంపిన ఇద్దరు మనస్తత్వవేత్తలతో పాటు భాషావేత్తగా శాస్త్రిగారిని కాశీ నగరమునకు దక్షిణముగానున్న జౌన్ పూర్ జిల్లాలో క్షేత్రకార్యము నకై (field work) పంపినప్పుడు సేకరించిన విషయవిశేషములే ఈ రచన.
- బాలప్రౌఢ వ్యాకరణదీపిక [8](1987) బాలప్రౌఢవ్యాకరణాల సూత్రాలను యథోచితంగా కలిపి, వాటిని భాషాశాస్త్రదృష్టితో సులభ వ్యావహారిక భాషలో రచించారు. బాల ప్రౌఢలు పటిష్ఠమైన రచనలు. సంస్కృతవ్యాకరణానుసారంగా రచింపబడినవి.
- ఆంధ్రవాఙ్మయ పరిచయము[9] (1985) బాలబాలికలను ఉద్దేశించి వ్రాసింది. ఇందులో ప్రాచీనాంధ్రకవుల ప్రసిద్ధపద్యాలు, గేయాలు, ఆంధ్రదేశాన్ని ఏలిన రాజులు, వారు ప్రోత్సహించిన కవులు, దీనికి పూర్వరంగంగా ఆంధ్రవాఙ్మయస్వరూపాన్ని సంగ్రహంగా పరిచయం చేశారు.
- శ్రీ కోరాడ రామకృష్ణయ్య శత జయంతి సాహితీ నీరాజనం[10] (1992) తండ్రి కీ. శే. కోరాడ రామకృష్ణయ్యగారి శతజయంతి సందర్భంలో స్మారకసంచికగా రూపొందించిన రచన. భాషాసమాలోచనం, సాహిత్యసమాలోచనం, సంస్కృతిసమాలోచనం అనే శీర్షికలకింద మొత్తం 120 ప్రామాణికమైన వ్యాసాలు ఈ గ్రంథంలో ఉన్నాయి.
- గాంధీ ఉవాచ[11] (1992) మహాత్మా గాంధీ తమ వైవిధ్యభరిత జీవితంలో భిన్న సందర్భాలలో పలికిన సూక్తులు ఏర్చి కూర్చి తెలుగు అనువాదంతో ప్రచురించారు. శాస్త్రిగారు 1946 నుండి 48 వరకు ఢిల్లీ లో FICCI రీసెర్చ్ ఆఫీసర్ గా ఉన్న సమయంలో గాంధీజీతో పాటు సాయంప్రార్థనలు, కరోల్ భాగ్ లోని నూలువడికే చ్ఛర్కాకేంద్రానికి స్వయంసేవకునిగా ఉన్నపుడు కలిగిన సన్నిహిత సంబంధం శాస్త్రిగారిని ఎంతగానో ప్రభావితం చేశాయి. గాంధీజీకి శాస్త్రిగారు అర్పించిన నివాళియే ఇది.
- భాష - సంస్కృతి [12](2014) భాషాచారిత్రకదృష్టితో రచించినగ్రంథం. సంస్కృతం నుండి ప్రాకృతం, ప్రాకృతం నుండి తెలుగులోనికి వచ్చిన పదాలు వైకృతాలు. ‘వైకృత పదావళి’ తెలుగుదేశ్యపదాల పుట్టుపూర్వోత్తరాలను వివరించే వ్యాసం. భాషలో కొన్ని ప్రత్యేకార్థాలను స్ఫురింపజేసే ధ్వనులను గురించి ‘శబ్దప్రతీకము’ వ్యాసంలోను, కాలక్రమంలో పదాలలో చిత్రవిచిత్రంగా జరిగే మార్పులు ‘శబ్దవైచిత్రి’ భాగంలోను చూపారు. ఇంకా భాషాశాస్త్రజ్ఞులు తమరచనలలో వాడే భాషావిన్యాసాలు, నన్నయాదుల కావ్యభాషకు వేరైన దేశికవితారీతులు మొదలైన వ్యాసాలు ఈ రచనలో ఉన్నాయి.
వ్యాసాలు
- “కావ్యభాషా పరిణామం సా.శ. 1100 -1599" , తెలుగుభాషాచరిత్ర, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి, 1974
- "మనభాష-సంస్కృతి", రెండవ ప్రపంచ తెలుగుమహాసభలు, కౌలాలంపూర్, మలేషియా, ఏప్రిల్ 1981
- "Sound Symbolism in Telugu", Conference proceedings, Linguistics Society of India, Calcutta, 1980
- "Spontaneous Aspirations in Telugu", Sri Venkateswara University Oriental Research Institute Journal, Tirupati, 1966
- "A Philological Study of Prakrit Inscriptions in Andhra", International Conference of Orientalists, New Delhi, 1965
- "The numeral noun 'one' in Telugu", Prof. Sukumar Sen Festschrift Volume, Indian Linguistics Journal, Calcutta University, 1965
- "Development of Verbal Forms in Modern Telugu", Suniti Kumar Chatterjee Festschrift Volume, Deccan College, Poona, 1964
- "Dialectical Variation in Eleventh Century Telugu", Tamil Culture, Vol. VI, No. 4, October 1957
- "Language of the Telugu Inscriptions of the 12th and 13th Centuries A.D.", Indian Linguistics Journal, Calcutta University, 1957
- "A Folk Tale in the Dialect of Western Bhojpuri", Linguistic Society of India, Vol XV, 1955
- "Intensive and Inclusive Compounds in Telugu", Indian Linguistics Journal, Calcutta University, 1954
- "Prakrit inscriptions in Buddhic Andhra", Bhasha-Samskruti, Saraswati Publications, 2014
వ్యక్తిగత జీవితం
[మార్చు]శాస్త్రిగారు, వారి సతీమణి సరస్వతిగారికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
మూలాలు
[మార్చు]- ↑ "శ్రీ ఖరనామ సంవత్సర బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డు గ్రహీతలు – ఈమాట" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-04-20. Retrieved 2020-06-19.
- ↑ A Monthly of Dravidian Linguistics Association of India, Vol 40 No. 11, Website: www.ijdl.org ; November 2016 '
- ↑ "2011 బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డు". పుస్తకం (in అమెరికన్ ఇంగ్లీష్). 2011-11-03. Retrieved 2020-06-19.
- ↑ Korada Mahadeva Sastri (1969). Historical Grammar Of Telugu.
- ↑ "Descriptive Grammar and Handbook of Modern Telugu". worldcat.org.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "తెలుగు దేశ్య వ్యుత్పత్తి నిఘంటువు". franklin.library.upenn.edu.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "తెలుగు దేశ్యవ్యుత్పత్తి నిఘంటువు". www.telugubooks.in (in ఇంగ్లీష్). Retrieved 2020-06-19.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "బాలప్రౌఢ వ్యాకరణదీపిక". worldcat.org.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "ఆంధ్రవాఙ్మయ పరిచయము". archive.org.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "శ్రీ కోరాడ రామకృష్ణయ్య శత జయంతి సాహితీ నీరాజనం". archive.org.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "గాంధీ ఉవాచ". archive.org.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "భాష - సంస్కృతి". archive.org.
{{cite web}}
: CS1 maint: url-status (link)
బయటి లంకెలు
[మార్చు]- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- CS1 maint: url-status
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- బ్రౌన్ పురస్కార గ్రహీతలు
- కృష్ణా జిల్లా భాషావేత్తలు
- కృష్ణా జిల్లా రచయితలు
- 2016 మరణాలు
- 1921 జననాలు
- భాషా శాస్త్రవేత్తలు